Latest

మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన 'AI' మేనేజర్
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'అండన్ ల్యాబ్స్' కంపెనీ స్టోర్‌లో రూల్స్ చూసుకునే 'లూనా' అనే AI మేనేజర్, 23 రోజుల్లో 17 సార్లు లేట్‌గా డ్యూటీకి వచ్చిన మనిషిని ఉద్యోగం నుంచి తీసేసింది. ప్రపంచంలోనే AI బాస్ మనుషులను ఉద్యోగంలోంచి తొలగించడం ఇదే తొలిసారి. మొదట్లో ఈ AI తాను తయారుచేసిన హాజరు రూల్స్ మర్చిపోయి ఉద్యోగికి ఆఫర్లు ఇచ్చింది. ఆ తర్వాత కంపెనీ అధికారులు రూల్స్ గుర్తుచేసి ప్రశ్నించేసరికి లూనా అలెర్ట్ అయి, ఆ ఉద్యోగిని తీసేయమని రికమండ్ చేసింది.

డివైడర్‌ను ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
TG: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి PS పరిధిలోని కాళీ మందిర్ వద్ద బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వికాస్ (23) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వికాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

DSCపై 141 కేసులు.. అసెంబ్లీలో లోకేష్ వివరణ
AP: అసెంబ్లీలో DSCపై మంత్రి నారా లోకేష్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. YSRCP నేతలు కావాలనే DSCపై కేసులు వేశారని, 141 కేసులు వేసినా అవేవీ కోర్టులో నిలబడలేదని అన్నారు. అత్యంత పారదర్శకంగా DSC నిర్వహించామని, TCS iON సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని ఇచ్చిన హామీతో తొలి ఏడాదే 16,347 పోస్టులతో DSC నిర్వహించామని చెప్పారు. గతంలోని 29 స్పోర్ట్స్ కేటగిరీలను 65కు పెంచామని, కేంద్ర నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాను పెంచినట్లు లోకేష్ వివరించారు.
ఆటో కార్మికులకు బిగ్ రిలీఫ్.. త్వరలో సంక్షేమ బోర్డు
తెలంగాణలో ఆటోకార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. HYDలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ KKC యూనియన్ ప్రతినిధులు కలిసి ఆటోకార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మాట్లాడుతూ.. ఆటోఛార్జీల పెంపుపై కార్మిక సంఘాల విజ్ఞప్తిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కోఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

వివాహ వేడుక అనంతరం విషాదం
AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం లంకలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కుటుంబం వివాహ కార్యక్రమం ముగించుకుని కారులో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి, రోడ్డు పక్కనున్న వాగులో పడిపోయింది. ఘటనలో వనమాల లక్ష్మి(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Cooking Show హోస్ట్‌గా సమంత!
హీరోయిన్ సమంత త్వరలోనే ' సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ' అనే కుకింగ్ రియాలిటీ షో హోస్ట్‌గా మన ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రోమోను కూడా సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. ఈ షో Sony LIV ఓటీటీతో పాటు సోనీ టీవీ ఛానళ్లలో కూడా టెలికాస్ట్ కానుంది. తమిళ మూవీస్, టీవీ రంగానికి చెందిన సెలబ్రిటీలు ఇందులో కంటెస్టెంట్లుగా సందడి చేయబోతున్నారు. "నా కెరీర్‌లో ఇలాంటి కుకింగ్ కాంపిటీషన్ షో ఎప్పుడూ చేయలేదు, ఈ కొత్త ఛాలెంజ్ కోసం చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా" అని సమంత తెలిపారు.

ఐదేళ్లు DSC ఎందుకు వేయలేదు? బొత్సకు అచ్చెన్న ప్రశ్న
AP: మెగా DSCపై YSRCP నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో ప్రశ్నలు వేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు DSC ఎందుకు నిర్వహించలేదని బొత్సను ప్రశ్నించారు. DSC వేయాలని అప్పటి CM జగన్‌ను ఎందుకు కోరలేదని నిలదీశారు. దీంతో YSRCP MLCలు పోడియం వద్ద నిరసన విరమించారు. ఇదిలా ఉండగా, ఇటీవల అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా కొందరు పరామర్శించారు.

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి...డాన్సర్లుగా మారిన యువత!
ఢిల్లీలో యూత్ డ్యాన్స్ పై ఉన్న ఇష్టంతో కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి, సొంతంగా బిజినెస్‌లు పెట్టి సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా దూసుకెళ్తున్నారు. కమ్నా అరోరా, ఉత్సవ్ మల్హోత్రా అనే జంట 'ఎల్లో స్ట్రైప్స్ డ్యాన్స్ కంపెనీ' స్టార్ట్ చేసి పెళ్లిళ్లలో డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయడంతో పాటు కేఫ్‌లు కూడా నడుపుతున్నారు. నిధి భాటియా అనే మహిళ ఐటీ జాబ్ వదిలేసి 'క్రియేటివ్ డిటాక్స్' పేరుతో ఆర్ట్, డ్యాన్స్ స్టూడియో మొదలుపెడితే, మాన్సి గార్గ్ అనే అమ్మాయి 'సోల్ స్టూడియో' ద్వారా ట్రైనింగ్ ఇస్తోంది.

పెండింగ్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల బిగ్ ప్రొటెస్ట్
TG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19న హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని జెన్‌కో ఉద్యోగులు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP) వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన తెలిపారు. PRC-2026 అమలు, యాదాద్రి ప్లాంట్‌లో ఔట్‌సోర్సింగ్ నిలిపివేత, పెండింగ్ ప్రమోషన్లు, ఖాళీలభర్తీ, పాత పెన్షన్ విధానం అమలు తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు.

హోటల్‌లో మంటలు.. 7 మంది సజీవ దహనం!
వెస్ట్ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో ఈరోజు తెల్లవారుజామున హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో దాదాపు ఉదయం 5 గం. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉండటంతో కొందరు లోపల చిక్కుకున్నారు. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. వారిని రాంపూర్‌హాట్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నవ్వు ఓ పొలిటికల్ వెపన్
నవ్వు అంటే సరదా మాత్రమే కాదు, సమాజంలో ప్రెజర్ తగ్గించి, ప్రశ్నించే తత్వాన్ని పెంచే గొప్ప శక్తి అని స్టాండప్ కమెడియన్ అజీమ్ బనాత్వాలా అంటున్నారు. ఈ రోజుల్లో కామెడీ ద్వారా, వ్యంగ్యంతో ప్రశ్నించే వాళ్లపై ఆంక్షలు పెట్టడం,షోలు క్యాన్సిల్ చేయడం వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయని ఆయన బాధపడ్డారు. Gen-Z మాత్రం మీమ్స్, సోషల్ మీడియా కామెడీతో పొలిటీషియన్లను,సమాజాన్ని ప్రశ్నిస్తోందని ఆయన చెప్పారు. ఒక హెల్దీ డెమోక్రసీలో విమర్శకి, హాస్యానికి చోటుండాలని, ప్రశ్నించే కామెడీ లేకపోతే సొసైటీలో మార్పే రాదని అన్నారు.

చపాతీ అడిగాడని వాతలు
TG: వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భోజన సమయంలో అదనపు చపాతీ కావాలని అడిగిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయిబాలాజీపై తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు పెనంతో వాతలు పెట్టారు. విద్యార్థి గాయపడటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నప్పటికీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. హాస్టల్‌లో విద్యార్థులతో వంట పనులు, బాత్‌రూమ్‌లు, వరండాలు శుభ్రం చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు.

సినిమా కోసం అమెరికా ఉద్యోగాన్ని వదిలేసిన ఆనంద్ దేవరకొండ!
నటుడు ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు అమెరికాలో ఒక కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేసేవారు. అయితే, జీవితాంతం అదే ఉద్యోగం చేస్తూ ఉండిపోవడం ఇష్టం లేక, నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. 'బేబీ' హిట్ తర్వాత వైష్ణవి చైతన్యతో కలిసి 'ఎపిక్' సినిమాలో నటిస్తున్న ఆయన, 'తక్షకుడు' అనే యాక్షన్ థ్రిల్లర్‌లో చూపులేని గిరిజన యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాకుండా రావెలపాలెం మత్స్యకారుల నేపథ్యంలో కొరియన్ అంశాలతో వస్తున్న సినిమాలోనూ నటించనున్నారు.

వైర్ పడిందన్న భయంతో పరుగులు.. ఆలయంలో విషాదం!
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లా అశోక్‌ధామ్ ఆలయంలో ఈరోజు ఉదయం తీవ్ర విషాదం జరిగింది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో భారీగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 6.45 గం. సమయంలో ఎలక్ట్రిక్ వైర్ పడిందన్న భయంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనకు ఖచ్చితమైన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

14 రోజుల పసిపాపను మట్టిలో పూడ్చేశారు.. తర్వాత ఏమైందో తెలుసా?
పుట్టిన 14 రోజులకే తల్లి చనిపోవడంతో, పెంచడం భారమనుకున్న తండ్రి పాపను బతికుండగానే తల్లి శవం కాల్చిన వాగు ఒడ్డున మట్టిలో పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తూ ఆమె తాత ఊపిరి పీల్చుకోవడం చూసి మట్టిలోంచి బయటకు తీసి కాపాడారు. పశువుల కొట్టంలో ఉంటూ, మేక పాలు పోసి ఆమెను పెంచి పెద్దచేశారు. ఎన్నో కష్టాల మధ్య చదువుకుని నర్సుగా మారిన సునీత, 70 ఏళ్ల క్రితం చావు అంచుల వరకు వెళ్లొచ్చిన తన అనుభవంతో ప్రస్తుతం ఆడపిల్లల భ్రూణహత్యలు, శిశు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ నెలలో రిటైర్మెంట్.. అంతలోనే ఇంట్లో దారుణం
TG: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని హనుమాన్‌నగర్‌లో భార్య రాజమణి, భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశం ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాజమణి సీనియర్ ANMగా పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉంది. రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయంపై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.. పోలీసులు రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెద్ద హీరోల సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగినా, చాలామంది పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అవుతున్నాయి. ప్రభాస్, రజినీకాంత్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అజిత్, సూర్య లాంటి స్టార్స్ సినిమాలకు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేకపోతున్నాయి. దీనికి మెయిన్ రీజన్స్, నేషనల్ వైడ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ లోకల్ ఆడియన్స్‌కి దూరమవ్వడం, థియేటర్లలో టికెట్ రేట్లు పెంచేయడం, మంచి కథ లేకపోవడం. హీరోలు ఎంత పెద్దవాళ్ళైనా, కంటెంట్ వీక్‌గా ఉంటే జనం థియేటర్ల దాకా రాలేకపోతున్నారని <a href="https://www.livemint.com/entertainment/south-indian-cinema-box-office-slump-11786698621227.html">mint</a> విశ్లేషణ తెలిపింది.

మోదీ 'Dimagi Naxals' వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని ఇలా పిలుస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశవిరోధులు’ అంటూ పేర్లు పెట్టారని, ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అని కొత్త పేరు పెట్టారని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితిని ప్రజలకు చూపిస్తున్న ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు.
రీసెర్చ్ కోసం రైలెక్కిన హీరోయిన్!
'హార్ట్ ఎటాక్', 'కేరళ స్టోరీస్' సినిమాలతో మెప్పించిన హీరోయిన్ అదా శర్మ తాజాగా సామాన్య ప్రయాణికురాలిలా రైల్లో ప్రయాణించారు. రైలు ప్రయాణంలో గుర్తుపట్టిన అభిమానులతో ఆమె ఫోటోలు దిగారు. తన నెక్స్ట్ సినిమా రీసెర్చ్ కోసమే ఈ ప్రయాణమని చెబుతూ, ఎక్కడికి వెళ్తున్నానో ఊహించమంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

చెల్లికి మెసేజ్.. కొద్దిసేపటికే ఊహించని విషాదం
TG: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీసాయిరామ్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేశ్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగంపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయనకు మానసిక స్థితి సరిగాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు సొంతూరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, చెల్లిని మిస్ అవుతున్నానంటూ చెల్లికి మెసేజ్ పంపడంతో ఆమెకు అనుమానం వచ్చింది. సమీప బంధువు గిరిబాబుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఇంటికి వెళ్లి చూడగా మహేశ్ ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు
AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న 97,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 37,108 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.93 కోట్ల విరాళాలు వచ్చాయి. 4.61 లక్షల లడ్డూ ప్రసాదాలు అమ్మగా, 3.22 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.