Latest

Royal Enfield పై ‘సైరాబాను'
హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమా ‘సైరాబాను’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఇందులో ఆది సంప్రదాయ తెల్లటి దుస్తులు, రుద్రాక్ష మాలలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతుండగా, వెనుక హిజాబ్ ధరించిన హీరోయిన్ బంధవి శ్రీధర్ కూర్చుని ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా ఒక ఆసక్తికరమైన హిందూ-ముస్లిం ప్రేమకథలా అనిపిస్తోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ దేశభక్తి పాటలు ఎపుడైనా విన్నారా?
మన దేశ గొప్పతనాన్ని చాటిచెప్పే పాటల గురించి సినీ నటులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'పూరబ్ ఔర్ పశ్చిమ్' సినిమాలోని 'భారత్ కా రహనేవాలా హూన్' పాట విదేశీయుల విమర్శలకు సరైన సమాధానమని దర్శకుడు అనిల్ శర్మ అన్నారు. 'క్రాంతి' సినిమాలోని 'చనా జోర్ గరమ్' పాట దేశభక్తికి ఒక అందమైన రూపమని దర్శకుడు కునాల్ కోహ్లీ తెలిపారు. అలాగే 'గురుస్ ఆఫ్ పీస్' పాటలో భారతీయ ఏకత్వం కనిపించిందని గుల్షన్ దేవయ్య చెప్పగా, 'రోజా'లోని 'భారత్ హుమ్‌కో జాన్ సే ప్యారా హై' పాట ప్రతి ఒక్కరిలో దేశ భావనను పెంచుతుందని సింగర్ షాన్ అన్నారు.

2013 ముజఫర్‌నగర్ అల్లర్లు..నిందితులను వదిలేస్తే ఎలా?
2013 ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో 10 మంది బీజేపీ నాయకులు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీకి ప్రత్యేక కోర్టు రిలీఫ్ ఇచ్చింది. దీనిపై సోషల్‌మీడియాలో నిరసన వ్యక్తమవుతోంది. హిందూ జాట్‌లు, ముస్లింల మధ్య జరిగిన మతపరమైన హింసను ఆ ప్రాంతవాసులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. సుమారు 65 మంది దాకా మరణించగా, 50,000 మందికి పైగా ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ఇళ్లు, దుకాణాలు తగలబడ్డాయి. ఇంత దారుణమైన హింసలో నిందితులుగా ఉన్నవాళ్లను కోర్టు ఇలా వదిలేయడం సరికాదని అంటున్నారు.

వెయిట్ లాస్ డ్రగ్స్ సేల్స్‌పై తెలంగాణ DCA బిగ్ యాక్షన్!
TG: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) స్పెషల్ డ్రైవ్‌లో 43 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మౌంజారో, ఓజెంపిక్ వంటి వెయిట్ లాస్ డ్రగ్స్ అమ్మడమే దీనికి కారణం. మార్కెట్‌లో ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్‌కు డిమాండ్ పెరగడంతో ఫేక్ డ్రగ్స్ సేల్స్ అండ్ నిబంధనల ఉల్లంఘనలు చెక్ చేయడానికి అధికారులు ఈ ఇన్స్‌పెక్షన్స్ నిర్వహించారు. నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

విశాఖలో RPF డాగ్ ఫైరింగ్ స్టంట్!
విశాఖపట్నం రైల్వే స్టేడియంలో జరిగిన 80వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) డాగ్స్ చేసిన స్టంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సాత్‌కోస్ట్ రైల్వే జోన్ నిర్వహించిన ఈ ఈవెంట్‌లో ఒక RPF డాగ్ ఫైర్ రింగ్ గుండా దూకి చేసిన స్టంట్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్యాసింజర్స్ సెక్యూరిటీ కోసం ఈ డాగ్స్‌కు ఇచ్చే ట్రైనింగ్ అండ్ స్కిల్స్ చూసి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా క్లాప్స్ కొట్టారు. RPF టీమ్ చూపించిన ఈ పెర్ఫార్మెన్స్‌పై అందరూ ప్రశంసలు కురిపించారు.
శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్ జామ్
AP: శనివారం ఇండిపెన్‌డెన్స్ డే, ఆదివారం సెలవు కావడంతో శ్రీశైల దేవస్థానానికి భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో దోమలపెంట నుంచి లింగాలగట్టు వరకు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. లింగాలగట్టు నుంచి శ్రీశైలం ఎంట్రెన్స్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు బండ్లు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
శ్రీవిష్ణు కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1990 కాలంలో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ అండ్ యాక్షన్ సినిమా. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, ముక్కు అవినాష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
పొలంలో జాతీయ జెండాను ఎగరేసిన కూలీలు
TG: మహబూబాబాద్ జిల్లా అనంతారం శివారులో అడిదల వీరభధ్రం అనే కౌలు రైతు వరిపొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. పొలంలో కూలీలు జాతీయ జెండాను ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించిన పాడారు. వర్షాలు కురువాలని కోరుతూ, కోలాటం వేస్తూ పాటలు పాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని ఒకరికొకరు తినిపించకున్నారు.
జాతీయ జెండాతో ముఖం తుడుచుకున్న బండి సంజయ్?
TG: హైదరాబాద్‌లోని BJP స్టేట్ ఆఫీస్‌లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ వివాదంలో చిక్కుకున్నారు. వేడుకల్లో ఆయన తన మెడలో ఉన్న త్రివర్ణ కండువాతో ముఖం తుడుచుకున్నట్లున్న వీడియో వైరల్ అవుతోంది. జాతీయ జెండాను ఆయన అగౌరవపరిచారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఫ్రీ బస్సుకు సంవత్సరం పూర్తి.. మహిళలతో CM జర్నీ
AP: కూటమి ప్రభుత్వం ప్రెస్టీజియస్‌గా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఫ్రీ బస్సు పథకానికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో జర్నీ చేశారు. వివిధ జిల్లాల మహిళలతో మాట్లాడి పథకం ద్వారా కలుగుతున్న బెనిఫిట్స్ అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ నెలకు రూ.4 వేలు ఆదా అవుతోందని సీఎంకు తెలిపారు. మహిళల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై సీఎం అడిగి తెలుసుకున్నారు.

మహిళలపై హింస..ఏడాదికి రూ.4.6 లక్షల కోట్ల నష్టం
మహిళలపై జరుగుతున్న హింస దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం వేస్తోంది. మే 2026లో విడుదలైన NCRB ‘క్రైమ్ ఇన్ ఇండియా 2024’ రిపోర్ట్ ప్రకారం, మహిళలపై నేరాల కేసులు 4,41,534 నమోదయ్యాయి. ప్రతి 71 సెకన్లకు ఒక FIR నమోదైంది. 2014 నుంచి ఈ కేసులు 30% పైగా పెరిగాయి. మహిళల ఏడాది సంపాదన సుమారు రూ.లక్ష అనుకున్నా, ఈ హింస కారణంగా కోల్పోయిన ఉత్పాదకత రూ.2.3 నుంచి 4.6 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇది మన GDPలో 0.8% నుంచి 1.6% వరకు ఉంటుంది.

దేశ మేలు కోసం పోరాటాలు ఆగకూడదు!
మైసూరుకు చెందిన 99 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు YC రేవణ్ణ నేటి యువతకు ముఖ్యమైన <a href="https://indianexpress.com/article/india/movements-for-nations-good-must-not-stop-99-year-old-freedom-fighter-to-gen-z-10833954/">సందేశం</a> ఇచ్చారు. 1942లో 15 ఏళ్ల వయసులో పాఠశాల కిటికీ నుంచి దూకి, స్నేహితులతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. దేవరాజ్ అర్స్, ఎస్. నిజలింగప్ప, ఎం.ఎన్. జోయిస్ (మైసూర్ సింహం) వంటి అప్పటి నాయకులు స్వాతంత్య్రం గొప్పతనాన్ని తెలియజేసి తమను ఎంతో ప్రేరేపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. దేశానికి మేలు చేసే ఉద్యమాలు ఎప్పుడూ ఆగిపోకూడదని ఆయన అన్నారు.

అంకితభావంతో సేవ చేస్తారని..నిందితులను వదిలేసిన కోర్టు
2013 ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో 10 మంది బీజేపీ నాయకులు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీకి ప్రత్యేక కోర్టు రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్, ఎమ్మెల్సీ అశోక్ కటారియా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హరేంద్ర మాలిక్, మరికొందరు నేతలకు కేసు వావస్ తీసుకునేందుకు అనుమతిచ్చింది. కేసులో నిందితులుగా మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి ఉన్నారు. కేసు ఉపసంహరించుకుంటే నిందితులు అంకితభావంతో ప్రజాసేవ చేయగలుతారు అని కోర్టు తెలిపింది.

విజయ్ ‘రణబాలి’ పోస్టర్!
'Independence Day' సందర్భంగా విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా పోస్టర్ విడుదల చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 1854–1878 నాటి రాయలసీమ బ్రిటిష్ పోరాటం ఆధారంగా ఈ సినిమా వస్తోంది. పోస్టర్‌లో విజయ్ ఒంటిపై గాయాలు, రక్తం, మట్టి మరకలతో కనిపిస్తున్నారు. భుజంపై ఉన్న జాతీయ జెండా రక్తపు మరకలతో త్యాగాన్ని గుర్తుచేస్తోంది. ఇందులో రష్మిక మందన్న, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

జెన్ జీపై ప్రేమ ఉంటే యువతకు మంత్రి పదవులివ్వాలి: బండి
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, BRS పాలనల్లో పెద్దగా తేడా లేదని విమర్శించారు. ప్రజలు కొనుగోలు చేసిన భూములు, పరిశ్రమల స్థలాలు, గతంలో ప్రభుత్వం వేలం వేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. జెన్‌జీపై కాంగ్రెస్‌కు నిజంగా ప్రేమ ఉంటే యువతకు మంత్రి పదవులు, MLC అవకాశాలు కల్పించాలని ఆయన సవాల్ చేశారు.

మోదీ స్పీచ్‌లో ‘సప్తధార’.. ఆ ఏడు సూత్రాలేంటి?
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ‘శక్తి కీ సప్తధారా’ పేరుతో Manufacturing, Agriculture, Technology, Defence, Gati Shakti, Green Energy వంటి రంగాల అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కోటి మంది యువతకు AI ట్రైనింగ్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌కు ఫ్రీ ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తామని ప్రకటించారు.
ఒక్క స్టూడెంట్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
AP: ఒక్క స్టూడెంట్ కోసం పిఠాపురం మున్సిపాలిటీలోని భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేశారు. అక్కడ ఒకే ఒక బాలుడు చదువుతున్నాడు. అతని కోసం టీచర్ నాగేశ్వరరావు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి 30 మంది అతిథులు, ఇతర పిల్లలు హాజరయ్యారు. నిజంగా ఇలాంటి టీచర్‌కు హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే అని అందరూ అంటున్నారు.

బావిలో మోటారు రిపేర్..విషవాయువు పీల్చి నలుగురు మృతి
బిహార్‌లోని గయా జిల్లాలో బావిలో మోటారు రిపేర్ చేస్తూ విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. చామరి మాంఝీ, అతని కుమారుడు దిల్‌చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులకు ఆదేశించారు.

ఫ్లెక్సీ కడుతుండగా షాకింగ్ విషాదం
AP: తిరుపతి జిల్లా పుత్తూరు శ్రీద్రౌపదీదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్యానర్ కడుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. పుత్తూరుకు చెందిన ప్రాణ స్నేహితులు గోకుల్(19), ఎ.విఘ్నేష్(19) బ్యానర్ ఏర్పాటు చేసేందుకు రెండంతస్తుల భవనంపైకి ఎక్కారు. బ్యానర్ కడుతున్న సమయంలో సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్రేమ్ తగలడంతో విఘ్నేష్‌కు కరెంట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన గోకుల్ కూడా షాక్‌కు గురై కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
తిరంగా యాత్రకి దేవేంద్రనాథ్ మహతోకి నో పర్మిషన్?
జార్ఖండ్ విద్యార్థుల హక్కుల కోసం దేవేంద్రనాథ్ మహతో గత 15 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. రాంచీలో స్టూడెంట్స్ నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ఆయన ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ నుంచి బయటకు రాకుండా 50 మందికి పైగా పోలీస్ ఆఫీసర్లు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా.. టీచర్ టాలెంట్!
TG: ఇండిపెండెన్స్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డ్రాయింగ్ టీచర్ రజనీకాంత్ తన ప్రతిభను చాటారు. కేవలం 2.6 సె.మీ. ఎత్తు, ఒక సెంటీమీటర్ వెడల్పు ఉన్న చాక్‌పీస్‌పై జాతీయ జెండాను మూడు గంటలు కస్టపడి డిజైన్ చేశారు. అలాగే మైక్రో సైజులో ‘Happy Independence Day’, ‘I Love India’ అక్షరాలతో పాటు నాలుగు జాతీయ పతాకాలను చాక్‌పీస్ ముక్కలతో తయారు చేసి దేశభక్తిని చాటుకున్నారు.