Latest

ఫ్లెక్సీలతో భూ నిర్వాసితుల నిరసన
Local· 15 Aug 2026

ఫ్లెక్సీలతో భూ నిర్వాసితుల నిరసన

TG: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో భూ నిర్వాసితులు నిరసన తెలిపారు.2016 పుష్కరాల తరుణంలో రోడ్డు విస్తరణలో తమ ఇళ్ళను, స్ధలాలను కోల్పోయిన సుమారు 60 కుటుంబాలు దీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికి వచ్చి బాధితుల పరిస్థితిని గమనించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ గ్రామానికి రావాలంటూ చంద్రాల గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రాణాలు పోతున్నా పరిహారం చెల్లించడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య వేడుకల్లో చిన్నారుల సందడి
Local· 15 Aug 2026

స్వాతంత్ర్య వేడుకల్లో చిన్నారుల సందడి

TG: వరంగల్ జిల్లా పరకాల ఎంపీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, భారతమాత తదితరుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశ స్వాతంత్ర్య ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వేషధారణల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి. రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హైకోర్టుల్లో 30 శాతం జడ్జి పోస్టులు ఖాళీ
National· 15 Aug 2026

హైకోర్టుల్లో 30 శాతం జడ్జి పోస్టులు ఖాళీ

దేశంలో ఉన్న హైకోర్టు జడ్జి పోస్టుల్లో 30 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,122 పోస్టుల్లో జూలై నాటికి 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే భారీగా వర్క్ లోడ్‌తో న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. హైకోర్టుల్లో 60 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సగం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 52 ఖాళీలు ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో 31, పంజాబ్-హర్యానా హైకోర్టులో 30 ఖాళీలు ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి: చల్లా ధర్మారెడ్డి
TG· 15 Aug 2026

బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి: చల్లా ధర్మారెడ్డి

TG: బీఆర్‌ఎస్‌ హయాంలో పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలలకు రంగులు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని వరంగల్ జిల్లా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పరకాల పట్టణానికి కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ఎమ్మెల్యే ప్రజలకు చూపించాలని సవాల్‌ విసిరారు. పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..? 🤔
Technology· 15 Aug 2026

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..? 🤔

ఒక పుస్తకం చదువుతుంటే.. "ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేశాడు?" అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇక నుంచి గూగుల్‌లో వెతకాల్సిన అవసరం లేకపోవచ్చు. కొత్తగా వస్తున్న AI Book Companion టూల్స్‌తో పుస్తకాన్నే నేరుగా ప్రశ్నించొచ్చు. క్యారెక్టర్ల గురించి, కథలోని సంఘటనలు, హిస్టరీ లేదా కష్టమైన కాన్సెప్ట్స్ గురించి అడిగితే.. అదే పుస్తకంలోని సమాచారంతో AI సమాధానం చెబుతుంది. ఇప్పటికే Amazon Kindle, Audible, ElevenLabs లాంటి కంపెనీలు ఇలాంటి ఫీచర్లను తీసుకొచ్చాయి. ఇక డౌట్ వస్తే.. పుస్తకమే మీతో మాట్లాడుతుంది.

పరకాలలో 16న సీఎం పర్యటన
TG· 15 Aug 2026

పరకాలలో 16న సీఎం పర్యటన

TG: హనుమకొండ జిల్లా పరకాలలో 16న సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వివిధ ర్యాంకులకు చెందిన వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 45 మంది ఎస్‌ఐలతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. హెలిప్యాడ్‌, సభా ప్రాంగణం, సీఎం రాకపోకల మార్గాలు, వీఐపీ ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు
TG· 15 Aug 2026

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు

TG: భువనగిరి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ కార్డులు అందిస్తోందన్నారు.

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖
Technology· 15 Aug 2026

AI వీడియో నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? 🤖

AIతో తయారైన వీడియోలు నిజమైనవిగా కనిపించడంతో వాటిని గుర్తించడం అంత ఈజీ కాదు. ముఖం, పెదవుల కదలికలు, చేతులు, నీడలు, వెలుతురు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా వింతగా ఉందా చూడాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో, మొదట ఎవరు పోస్ట్ చేశారో చెక్ చేయాలి. రివర్స్ సెర్చ్‌తో వీడియో పాతదా, వేరే సందర్భంలోనిదా తెలుసుకోవచ్చు. కంటెంట్ క్రెడెన్షియల్స్ లేదా SynthID ఉంటే వీడియో మూలం, ఎలా రూపొందిందనే వివరాలను కూడా చెక్ చేయొచ్చు. అయితే ఏ ఒక్క టూల్ కూడా 100% ఖచ్చితంగా చెప్పదు. అందుకే నమ్మకమైన సోర్సెస్‌తో క్రాస్‌చెక్ చేయడం మంచిది.

తిరంగా యాత్రలో అస్వస్థతకు గురైన చిన్నారులు
Current Affairs· 15 Aug 2026

తిరంగా యాత్రలో అస్వస్థతకు గురైన చిన్నారులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సింగ్రౌలి జిల్లా చిత్రంగి వద్ద తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు చిత్రంగి మార్కెట్ చేరుకోవడానికి సుమారు 6 కి.మీ. నడిచారు. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి రాధాసింగ్ కోసం గంటసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత మరో 1.5 కి.మీ. నడిచారు. దీంతో 12 మంది కళ్లు తిరిగి కిందపడ్డారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఏర్పాట్లలో నిర్లక్ష్యం లేదని, మార్గంలో చాలా చోట్ల నీరు అందించామని చెప్పారు.

🤖 AI ఎన్నికలనే ప్రభావితం చేయగలదా?
Technology· 15 Aug 2026

🤖 AI ఎన్నికలనే ప్రభావితం చేయగలదా?

AI ఇప్పుడు ఎన్నికలను ప్రభావితం చేసేంత శక్తివంతంగా మారిందా? 👀 ఒక నాయకుడు చెప్పని మాటను చెప్పినట్టు చూపించే డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు, తప్పుడు వార్తలను AI వేగంగా తయారు చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయగలదు. ఎన్నికల సమయంలో ఇవి ఓటర్లలో గందరగోళం, తప్పుడు అభిప్రాయాలను కలిగించొచ్చు. అయితే AI ఎన్నికల ఫలితాలను మార్చేస్తోందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కంటెంట్‌ను వేగంగా వ్యాప్తి చేయడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతోంది. అందుకే వైరల్ కంటెంట్‌ను నమ్మే ముందు మూలం, తేదీ చెక్ చేయడం ముఖ్యం.

Terror Groupతో సంబంధం..బెంగాల్ యువకుడి అరెస్ట్
Crime· 15 Aug 2026

Terror Groupతో సంబంధం..బెంగాల్ యువకుడి అరెస్ట్

అఫ్గానిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న‌ Terror Groupతో సంబంధం ఉన్న అసఫూల్ మాలిక్‌ అనే యువకుణ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిది పశ్చిమబెంగాల్‌. అతను ఏడాదిగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలోని ఓ టెక్‌ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(TTP) సభ్యుడితో కలిసి ఆ సంస్థలో చేరడానికి అతను ట్రై చేస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై వివరాలు అందడంతో అతడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

కృష్ణా నది దగ్గర టెన్షన్ టెన్షన్!
AP· 15 Aug 2026

కృష్ణా నది దగ్గర టెన్షన్ టెన్షన్!

AP: విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణలంకకు చెందిన గౌతమ్‌, జాషువా, తేజ అనే ముగ్గురు యువకులు కృష్ణా రివర్‌లో స్విమ్మింగ్ కోసం వెళ్లి మిస్ అయ్యారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు, ఆఫీసర్స్ వెంటనే స్పాట్‌కి రీచ్ అయ్యారు. మిస్ అయిన యంగ్ బాయ్స్ కోసం ఎక్స్పర్ట్ స్విమ్మర్స్‌తో రివర్‌లో సెర్చ్ ఆపరేషన్ రన్ చేస్తున్నారు.

నెక్స్ట్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్?
National· 15 Aug 2026

నెక్స్ట్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్?

80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో రామ్‌దేవ్ బాబా ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై కామెంట్స్ చేశారు. దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాలు, గవర్నమెంట్ జాబ్ రిక్రూట్‌మెంట్లలో జరుగుతున్న అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లలో సౌకర్యాలు లేకపోవడాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్స్ వల్ల స్టూడెంట్స్ రోడ్లపైకి వస్తున్నారని, ఎడ్యుకేషన్ అండ్ రిక్రూట్‌మెంట్ సిస్టమ్‌ను వెంటనే రీఫార్మ్ చేయాలని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రొటెస్ట్స్ జరిగే అవకాశం ఉందని అన్నారు.

BCI చైర్మన్ నుంచి క్షమాపణ కోరిన NALSAR స్టూడెంట్స్
Current Affairs· 15 Aug 2026

BCI చైర్మన్ నుంచి క్షమాపణ కోరిన NALSAR స్టూడెంట్స్

CJI Justice ‌సూర్యకాంత్‌ను తమ కాన్వగేషన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకించిన NALSAR University of Law (హైదరాబాద్) స్టూడెంట్స్‌ను ఎన్‌రోల్ చేయవద్దని BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన ఆ ఆర్డర్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే విద్యార్థులు, ఫ్యాకల్టీపై మిశ్రా చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ఆయన BCI అధికారిక లెటర్‌హెడ్ వాడటం గురించి వివరణ ఇవ్వాలని అడిగారు.

భారత్ చిప్స్ తయారీపై ఎందుకు ఫోకస్ పెడుతోంది?
Technology· 15 Aug 2026

భారత్ చిప్స్ తయారీపై ఎందుకు ఫోకస్ పెడుతోంది?

మన ఫోన్లు, కార్లు, ఏఐ, శాటిలైట్లు ఇలా ఎన్నో టెక్నాలజీలకు సెమీకండక్టర్ చిప్స్ చాలా కీలకం. ప్రస్తుతం వీటి కోసం భారత్ ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే దేశంలోనే చిప్స్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త సెమీకండక్టర్ ప్లాంట్లకు అనుమతులు ఇవ్వడంతో పాటు, ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. దీని వల్ల భవిష్యత్తులో చిప్స్ సరఫరాలో భారత్ మరింత బలపడటమే కాకుండా, కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అస్వస్థత
AP· 15 Aug 2026

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అస్వస్థత

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తీవ్ర జ్వరం వచ్చింది. రాజమండ్రిలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన ఆయన ప్రోగ్రాంని మధ్యలోనే రద్దు చేసుకుని సతీమణితో కలిసి హైదరాబాద్‌కి బయల్దేరారు. జ్వరం తీవ్రం కావడంతో రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఆయనకు ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.

హఫీజ్‌పేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
TG· 15 Aug 2026

హఫీజ్‌పేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

TG: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ(PAC) చైర్మన్ అరెకపూడి గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.

కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జయరాం
AP· 15 Aug 2026

కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జయరాం

AP: అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే పోస్టర్!
Entertainment· 15 Aug 2026

‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే పోస్టర్!

'Independence Day' సందర్భంగా ‘ఫౌజీ’ మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల్లో తుపాకులు, రక్తంతో తడిసిన బట్టలతో కనిపించడం వల్ల సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. మహాత్మా గాంధీ పాత్ర కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి సైనికుడి స్ఫూర్తికి వందనం అంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. డిసెంబర్ 3న ఈ మూవీ రిలీజ్ కానుంది.

దేశంలో సరైన నాయకత్వం లోపించింది: కేటీఆర్
Current Affairs· 15 Aug 2026

దేశంలో సరైన నాయకత్వం లోపించింది: కేటీఆర్

TG: ‘అన్నీ ఉన్న మన దేశంలో సరైన నాయకత్వం లోపించింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మనం నియంతృత్వ దేశాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకోవాలని సూచించారు. దేశం ఇంకా ఎన్నో సమస్యలతో నిండి ఉందన్నారు. తన కూతురి గురించి వివరిస్తూ తన కుమార్తెను ఇక్కడే చదువుకోమని అడిగితే, అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయని ప్రశ్నిస్తోందని వివరించారు. మనం శ్రీలంక కంటే మెరుగైన స్థితిలో లేమని వివరించారు.

సోనియా గాంధీ వైఖరిపై BJP ఫైర్?
National· 15 Aug 2026

సోనియా గాంధీ వైఖరిపై BJP ఫైర్?

80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ ఆఫీస్‌లో జరిగిన వేడుకల్లో 'వందేమాతరం' ఫుల్ సాంగ్ ప్లే చేయడంపై BJP, కాంగ్రెస్ మధ్య హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాట పాడుతున్న టైమ్‌లో సోనియా గాంధీ దానిని ఆపడానికి ట్రై చేశారని BJP లీడర్లు ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఖండించింది. చాలాసేపటి నుంచి నిల్చుని ఉన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే కోసం సోనియా గాంధీ చైర్ తెమ్మని మాత్రమే చెప్పారని, పాటను ఆపే ఉద్దేశం కాంగ్రెస్‌కి లేదని స్పష్టం చేసింది.