Latest
ఇరుముడి వెనుక 3 కారణాలు
హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న నెక్స్ట్ మూవీ 'ఇరుముడి'. yesterday ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి 'ఇరుముడి' అని టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ రివీల్ చేశారు. సినిమాలో ఇద్దరి మధ్య ఉండే బంధం లేదా రెండు ముడులు అనే కాన్సెప్ట్‌తో ఈ పేరు పెట్టామన్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్, అయ్యప్ప భక్తి, ఒక క్రైమ్ మిస్టరీ అనే మూడు లేయర్స్ సినిమాలో ఉంటాయని, థియేటర్లలో ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.

మియాపూర్ సర్కిల్–48లో జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యటన
TG: మియాపూర్ సర్కిల్–48 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి రోడ్డుపై క్లీనింగ్ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. యుబిడి బృందంతో కలిసి హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి, మైత్రీనగర్ పార్కులను చెక్ చేసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్థానికులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో మాట్లాడి, పౌర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంకల్పం ముందు..వైకల్యం ఎంత!
సంకల్పం అనే బలం ముందు వైకల్యం ఎంత అని నిరూపించింది బిహార్‌లోని కటిహార్‌కు చెందిన 13 ఏళ్ల లక్ష్మి. రెండు చేతులు లేని తను తన కాలి వేళ్ల మధ్య పెన్ను పట్టుకొని రాయడం నేర్చుకుంది. చదువు మీద ఇష్టంతో హసన్‌గంజ్ ప్రఖండంలోని స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. తనే తన పనులు సొంతంగా చేసుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు కూలీ పని చేసి ఆమెను చదివిస్తున్నారు. టీచర్ కావాలన్నది లక్ష్మి కల. ఆరోగ్య శాఖ ఆమెకు 100% దివ్యాంగత్వ సర్టిఫికెట్ ఇచ్చింది. సామాజిక సంక్షేమ శాఖ తనకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
జంతర్ మంతర్ సీజన్–2
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన CJP మరో నిరసనకు సిద్ధమవుతోంది. విద్య, ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’ చేపట్టనున్నట్లు తెలిపారు. దీనినే ‘జంతర్ మంతర్ సీజన్–2’గా తెలియజేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.

US సిటిజన్‌షిప్ కష్టమే.. ట్రంప్ కొత్త ఆర్డర్!
US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బర్త్ సిటిజన్‌షిప్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. బర్త్ టూరిజమ్‌ను ఆపడానికి మరియు అమెరికాలో పుట్టే పిల్లలకు ఇచ్చే పౌరసత్వాన్ని తగ్గించడానికి రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సైన్ చేశారు. ముఖ్యంగా డెలివరీ కోసం అమెరికా వెళ్లే వాళ్లను కంట్రీలోకి రాకుండా బ్యాన్ చేసేలా రూల్స్ పెట్టారు. రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ రిజెక్ట్ చేసినా, ట్రంప్ మళ్లీ ఈ రూల్స్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫారిన్ కంట్రీస్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వాళ్లు షాక్ లో ఉన్నారు.

గ్రామంలో షాకింగ్ సీన్.. వాగులో క్షుద్రపూజలు
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. నల్లకోడి, నిమ్మకాయలు, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ వంటి వస్తువులు అక్కడ కనిపించాయి. గురువారం ఉదయం వాగువద్దకు వెళ్లిన స్థానికులు విషయాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో వారిలో భయాందోళన నెలకొంది. అదేవిధంగా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలోనూ రోడ్డుపై ముగ్గు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.
జేబులో కొత్త ఫోన్.. ఒక్కసారిగా బ్లాస్ట్!
గ్రేటర్ నోయిడాలో జేబులో ఉన్న కొత్త మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అవ్వడంతో యువకుడికి పెద్ద గాయాలయ్యాయి. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో అక్కడ భయాందోళన నెలకొంది. పేలుడుకి గాయపడిన యువకుడిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, మొబైల్ పేలడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త మొబైల్ ఫోన్ కొన్నపుడు బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి. Be Careful!

రాజ్యసభలో ‘లుంగీవాలా’ కామెంట్స్
కేరళకు చెందిన సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అని పిలిచారన్న ఆరోపణ రాజ్యసభలో కలకలంగా మారింది. దీనిపై బ్రిట్టాస్ ప్రత్యేక అధికార ఉల్లంఘన(ప్రివిలేజ్) నోటీస్ ఫైల్ చేశారు. రాజ్యసభలో ఇన్‌కమ్ టాక్స్(అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్-2026పై స్టాట్యూటరీ రిజల్యూషన్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇలా జరిగిందని బ్రిట్టాస్ తెలిపారు. ఆ టైంలో ఆయన ధోతి వేసుకున్నారు. సుష్మితా దేవ్ తనను ‘లుంగీవాలా’ అని పిలిచారని, ఇది దక్షిణ భారతీయులు, మలయాళీల సంస్కృతిని అవమానించడమే అని ఆయన అన్నారు.

నటి షకీలాకు సర్జరీ
నటి షకీలా రీసెంట్‌గా మెడ నొప్పితో బాధపడుతూ రూ.3 లక్షలు ఖర్చు చేసి మేజర్ నెక్ సర్జరీ చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్కువగా ఫోన్ వాడటం వల్లే తన మెడకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు. ప్రజెంట్ బెడ్ మీద నుంచి లేవాలన్నా, ఫుడ్ తినాలన్నా వేరేవాళ్ల హెల్ప్ కావాల్సి వస్తోందని చెప్పారు. ఫోన్ అవసరమైనంత వరకే వాడాలని, ఎక్కువుగా వాడితే తనలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఫ్యాన్స్‌కి జాగ్రత్త చెప్పారు.
అబిడ్స్‌లో సినీ ప్రొడ్యూసర్ కారు బీభత్సం
TG: హైదరాబాద్ అబిడ్స్‌లో సినీ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది. గాయాలైన మహిళను ఫామిలీ మెంబెర్స్ దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ ఖర్చుల కోసం ప్రొడ్యూసర్‌ను కలవగా, కారు తనదేనని చెప్పినప్పటికీ డబ్బులు ఇవ్వనని చెప్పినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TV యాడ్స్ గోవిందా.. Influencers వీడియోలతోనే పండగ!
పండగల షాపింగ్ కోసం Gen-Z యూత్ అంతా సోషల్ మీడియా వైపే చూస్తున్నారు. ఏదైనా కొనే ముందు దాదాపు 34శాతం మంది ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లలో ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్ల వీడియోలు చూసే డిసిషన్ తీసుకుంటున్నారట. టీవీల్లో, పేపర్లలో వచ్చే మామూలు యాడ్స్ కంటే వీళ్ల కంటెంట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానే తమ బిజినెస్‌ను పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి.

నిరుద్యోగులకు న్యాయం చేయాలని వినతి
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో మూడు జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో 7,112 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడినా మేడ్చల్, యాదాద్రిభువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు చూపించలేదని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

‘రాజధాని లేకపోతే ఏమీ చేయలేం’.. చంద్రబాబు కీలక కామెంట్స్
AP: సింగపూర్ మోడల్‌తో అమరావతిని కడుతున్నామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్‌తో పాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం స్టార్ట్ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాజధాని లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, రైతుల త్యాగాల వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్కూల్‌కు
TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్‌నగర్ గ్రామస్థులకు వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల చదువు సమస్యగా మారింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులతో పాటు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో మరో పది మంది చిన్నారులకు కూడా అక్కడే బోధన అందిస్తున్నారు. ఉపాధ్యాయుడు రత్నపాల్ గ్రామస్థుల సహాయంతో వాగు దాటి పాఠశాలకు చేరుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.

ఇదీ ప్రధాని మోదీ '56 ఇంచీల ఛాతి' కథ
'56 ఇంచీల ఛాతి' ఈ మోదీ డైలాగ్ మోదీని విమర్శించే అస్త్రంలా కూడా మారింది. ఆ నేపథ్యం ఏంటంటే.. 2014 జనవరి 23న మోదీ(అప్పుడు గుజరాత్ సీఎం) UP గొరఖ్‌పూర్లో ఎన్నికల ర్యాలీ చేశారు. అంతకంటే ముందు మోదీని నాటి యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ "UPని గుజరాత్ లా మార్చలేరు" అన్నారు. దానికి మోదీ కౌంటర్గా "గుజరాత్‌లా అభివృద్ధి చేయాలంటే 56 ఇంచీల ఛాతి ఉండాలి" అన్నారు. ఈ కామెంట్ మోదీని పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసేందుకు బీజేపీ లీడర్లూ, విమర్శించేందుకు ప్రత్యర్థులూ వాడుతూ '56 ఇంచీల ఛాతి'ని పొలిటికల్ స్లోగన్ చేసేశారు.
రైలు ప్రయాణంలో విత్తనాల వర్షం..
ఆహారం, నీళ్లు లేక అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయని, ఓ యువకుడు ట్రైన్‌లో ప్రయాణిస్తూ దారి పొడవునా పండ్ల విత్తనాలు చల్లుకుంటూ వెళ్లాడు. భవిష్యత్తులో అవి పెద్ద చెట్లయి జంతువులకు సరిపడా పండ్లు, ఆహారం ఇస్తాయని ఇలా చేశాడు.<br>పర్యావరణాన్ని, జంతువులను కాపాడేందుకు ఆ యువకుడు చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

జ్యువెలరీ కొంటున్నారా? అయితే ఈ రేట్స్ చూడాల్సిందే!
శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడంతో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. గురువారం కూడా గోల్డ్ రేట్స్ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి రూ.1,42,200గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారంపై రూ.210 పెరిగి రూ.1,16,350కి చేరింది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్‌లో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి జ్యువెలరీ కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

శివాజీ విగ్రహంపై చెప్పు.. మహిళపై దాడి
పుణేలో శివాజీ విగ్రహంపై చెప్పు విసిరిందన్న ఆరోపణలతో ఓ మహిళపై స్థానికులు అటాక్ చేశారు. మహిళ ముఖంపై ఇంకు పోసి చుట్టుముట్టి దాడి చేశారు. విగ్రహాలు తమకు తిండిపెట్టవంటూ ఆమె చెప్పు విసిరినట్లు స్థానికులు ఆరోపించారు. తరువాత ఆమెను పోలీసులకు అప్పగించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ముస్లిం మహిళ అంటూ ప్రచారం జరిగింది. ఇన్వెస్టిగేషన్‌లో ఆమెను హిందూ మహిళ ఆశ్విని డాగ్డేగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

విసిగిపోయి రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు
TG: కొమురంభీమ్ జిల్లా పెంచికల్పేట మండలం బొంబాయిగూడాలో వర్షపునీరు, బురదతో రోడ్లు అధ్వానంగా మారడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నాగపురివాడలో రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోడ్లపై రోజుల తరబడి బురదనీరు నిలవడంతో దుర్వాసన వస్తోందని, రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. విసిగిపోయిన కాలనీవాసులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
దెయ్యాలు, దేవుళ్ల పేరిట భయం భయం!
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో అనారోగ్యంతో పిల్లలు చనిపోతుంటే, అది దేవుడి కోపం వల్లేనని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకోవైపు మహారాష్ట్ర గిరిజన హాస్టల్‌లో ఒక అమ్మాయి వింతగా ప్రవర్తించడంతో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. డాక్టర్లు అది 'మాస్ హిస్టేరియా' అనే మానసిక సమస్య అని చెప్పినా వినకుండా, దెయ్యాల భయంతో వందలాది మంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి.
పార్లమెంటు ఆవరణలో కోతి బొమ్మలతో నిరసన
పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు టెడ్డీ బేర్లతో కొత్తరకం నిరసన తెలిపారు. కోతిబొమ్మల్ని చేతిలో పట్టుకొని "56 ఇంచీల చిన్న కోతి.. సభలోకి త్వరగా రావాలి(56 ఇంచ్ కా చోటా బందర్.. జల్దీ ఆవో సదన్ కె అందర్) అని నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీ ఛార్జ్ పై సమాధానం చెప్పాల్సివస్తుందని పార్లమెంటుకే రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆగస్ట్ 13(ఇవాళ) పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా నేతృత్వంలో ఈ నిరసనకు దిగారు.