Latest

ప్రజలు సుభిక్షంగా ఉండాలి: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని CM రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన మహా వరుణయాగంలో CM సతీసమేతంగా పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరియాలని యాగంలో ప్రార్థనలు చేశారు. అనంతరం నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించి నీటి నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రీసర్వేతో భూరికార్డుల ప్రక్షాళన: చంద్రబాబు
AP: సుపరిపాలన అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డులను ప్రక్షాళన చేసేందుకు రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఆయన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. 2027 నాటికి రీసర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Google Searchకి ముందు సైట్లు ఎలా వెతికేవాళ్లు? 👀
Google Search రాకముందు ఇంటర్నెట్‌లో ఏం చేసేవాళ్లు? ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే చాలు. కానీ అప్పట్లో పరిస్థితి వేరుగా ఉండేది. Yahoo Directory, AltaVista, Lycos లాంటి సెర్చ్ సైట్లలో వెతికేవాళ్లు. కొన్ని విషయాలు తెలియకపోతే ఫోరమ్స్, ఈమెయిల్ గ్రూప్స్, చాట్ రూమ్స్‌లో ఇతరులను అడిగేవాళ్లు. నచ్చిన వెబ్‌సైట్లను బుక్‌మార్క్స్‌లో దాచుకుని మళ్లీ వాటినే తెరిచేవాళ్లు. అంటే అప్పట్లో ఇంటర్నెట్‌లో సమాచారం కావాలంటే కాస్త ఓపికగా వెతకాల్సిందే. Google వచ్చాక ఈ పని చాలా సింపుల్ అయిపోయింది!

స్టూడెంట్స్‌పై దాడి ఎందుకు చేస్తున్నారు?: అభిజిత్ దీప్కే
జార్ఖండ్‌లో ప్టోటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేయడంపై CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ పార్టీలు నిరసనలు చేస్తున్నపుడు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు కనిపించవని, మరి స్టూడెంట్స్ నిరసనలపై పదేపదే ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!
సముద్రంలో ఎటు వెళ్లాలో మ్యాప్ లేకుండానే తాబేళ్లు ఎలా తెలుసుకుంటాయో తెలుసా? వాటికి భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్‌ను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ మాగ్నెటిక్ సంకేతాలను ఉపయోగించి సముద్రంలో దిశను గుర్తించడంతో పాటు, దూరంగా ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణించగలవు. కొన్ని రీసెర్చ్‌ల ప్రకారం, తాబేళ్లు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు వాసన వంటి ఇతర సంకేతాలను కూడా ఉపయోగించవచ్చు. అంటే GPS లేకపోయినా.. ప్రకృతే వాటికి నావిగేషన్ సిస్టమ్‌లా పనిచేస్తుందన్నమాట అనుకోండి!

క్యాన్సర్‌పై కొత్త CRISPR ప్రయోగం! 🧬
క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రత్యేక మార్పులను టార్గెట్ చేసే కొత్త CRISPR ఎంజైమ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. ఈ ఎంజైమ్ క్యాన్సర్ కణాల DNAను దెబ్బతీయగల సామర్థ్యాన్ని చూపించినట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. అయినా, క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసే కొత్త ట్రీట్‌మెంట్‌లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది మనుషుల్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత సేఫ్ అనేది తెలియాలంటే ఇంకా రీసెర్చ్ అవసరం.

దైవ నామాలను ఎగతాళి చేయొద్దు: పవన్ కల్యాణ్
AP: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కుతూ చేసే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను రాజకీయాల కోసం పేరడీలుగా మారుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. నెల్లూరులో జరిగిన ఘటనలో ఆపోజిషన్ పార్టీ గోవింద నామాలను పేరడీగా వాడి భక్తుల మనోభావాలను కించపరిచారని అన్నారు. ఇలాంటి వాటిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ కేడర్‌ను ఆదేశించారు. దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను కామెడీకి వాడొద్దని సూచించారు.

2026లో ఉన్నా.. మళ్లీ 2016కి వెళ్లిపోయారా?
2026 వచ్చేసింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలామంది మళ్లీ 2016 రోజుల్లోకి వెళ్లిపోతున్నారు! 😂 “2026 is the new 2016” అంటూ నాస్టాల్జియా ట్రెండ్ మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లో పాపులర్ అయిన Snapchat Filters, పాటలు, ఫ్యాషన్, మీమ్స్, ఛాలెంజ్‌లను Gen Z మళ్లీ షేర్ చేస్తోంది. అప్పటి ఇంటర్నెట్ కల్చర్‌ను గుర్తు చేసుకుంటూ పాత ఫొటోలు, జ్ఞాపకాలను కూడా పోస్టు చేస్తున్నారు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. 2016 నాటి ఆ ఓల్డ్ ఇంటర్నెట్ వైబ్‌కు మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదన్నమాట! ❤️

మిస్సింగ్ కేస్‌లో షాకింగ్ ట్విస్ట్?
AP: కృష్ణా జిల్లా పెడనలో ఇద్దరు మైనర్ గర్ల్స్ మిస్సింగ్ కేస్ సంచలనంగా మారింది. ఈ కేసులో శ్యామ్ కిరణ్, సిద్ధు అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 6న కనిపించకుండాపోయిన బాలికలు మరుసటి రోజు ఇంటికి రాగా, వాళ్లపై రేప్ జరిగిందని తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

ఉద్యోగాల కోసం గడ్డి, మట్టి తింటూ ఆందోళన!
కేరళలో టీచర్ ఎగ్జామ్స్ పాసైన క్యాండిడేట్స్ చేస్తున్న నిరసన పెద్దదిగా మారింది. పీఎస్సీ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయినా జాబ్స్ ఇవ్వడం లేదని లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్ ర్యాంకర్లు 35 రోజులుగా సెక్రటేరియట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. గడ్డి, మట్టి తింటూ వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వెంటనే అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని, ర్యాంక్ లిస్ట్ టైమ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

ఇండియా నిరసనలపై పాక్ యువకుడి లేఖ!
ఇండియాలో నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై యువత చేస్తున్న పోరాటంపై పాకిస్తాన్‌కు చెందిన యంగ్ యాక్టివిస్ట్ ఎహ్‌తేషమ్ హసన్ స్పందించారు. CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు లాహోర్ నుంచి ఒక లెటర్ రాశారు. తమ దేశంలో కూడా సేమ్ ఎగ్జామ్ స్కామ్‌లు, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని అందులో చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా ఇండియా Gen Z చేస్తున్న ఈ నిరసనలు లాహోర్ యువతకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల సరిహద్దులు వేరైనా యువత పోరాటం ఒకటేనంటూ ఆ లెటర్ లో ఉంది

భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త మలుపు..?
కొంతకాలంగా టెన్షన్‌లో ఉన్న భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ సెట్ అవుతాయా? బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ సోమవారం భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదితో సమావేశమయ్యారు. రెండు దేశాల సంబంధాలను మెరుగుపరచడానికి అనుకూల వాతావరణం అవసరమని ఆయన చెప్పారు. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండటం, ఆమెను తిరిగి అప్పగించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ ఇంకా కీలక అంశంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఏ దిశగా వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్!
తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, దాదాపు 73,95,954 ఓట్లను ఆఫీసర్స్ డిలీట్ చేశారు. ఇప్పటివరకు 78.14% డిజిటలైజేషన్ పూర్తి కాగా, యాదాద్రి జిల్లా 94.30% తో ఫస్ట్ ప్లేస్‌లో, హైదరాబాద్ 58.58% తో లాస్ట్ పొజిషన్‌లో ఉన్నాయి. ఈ నెల 12న CEO అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనుండగా, ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేసి, అక్టోబర్ 19న ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయనున్నారు.

భారత్‌లో తగ్గేదేలే అంటున్న సింహాల సంఖ్య!🦁
ఆగస్టు 10న "World Lion Day" సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు! గత పదేళ్ల కాలంలో మనదేశంలో ఆసియా సింహాల (Asiatic Lions) సంఖ్య 523 నుంచి ఏకంగా 891కి పెరిగినట్లు ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని గిర్ అడవులతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, అటవీ అధికారులు అందించిన అద్భుతమైన సహకారంతోనే ఈ గొప్ప సాధన సాధ్యమైందని చెప్పారు.

నీట్ రీ-ఎగ్జామ్‌లో మార్కులు తగ్గాయని స్టూడెంట్ సూసైడ్!
AP: తిరుపతి ఎస్వీ నగర్‌కు చెందిన నీట్ స్టూడెంట్ సాయి మేఘన రీసెంట్‌గా సూసైడ్ చేసుకుంది. ఫస్ట్ నీట్ ఎగ్జామ్‌లో ఆమెకు 499 మార్కులు వచ్చాయి. అయితే పేపర్ లీక్ వల్ల మళ్లీ కండక్ట్ చేసిన సెకండ్ ఎగ్జామ్‌లో మార్కులు 390కి తగ్గిపోవడంతో డిప్రెషన్ అయి చనిపోయింది. ఈ విషయం లేట్‌గా బయటపడింది. ఆమె దశదిన కర్మ రోజూ SFI నేతలు ఫ్యామిలీని పరామర్శించి, బాధిత కుటుంబానికి కోటి రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాట వినాలి: రాహుల్
జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాట వినాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మీద జరిగిన దాడిని ఆయన ఖండించారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. పోలీసులు జార్ఖండ్ విద్యార్థుల మీద జరిపిన దాడి సరైనది కాదని అన్నారు.
పెద్ద సుదర్శన్ సభలో 'బలగం' కొమురమ్మ పాట!
TG: 'బలగం' ఫేమ్ కొమురమ్మ పెద్ద సుదర్శన్ గారి సంతాప సభలో పాల్గొన్నారు. ఆయనతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ సభలో పాట రూపంలో చెప్పారు. "ఎక్కడికి వెళ్తివయ్యా అన్న" అంటూ కొమురమ్మ పాడిన పాట అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

పీఎం, హోంమంత్రి..ఇద్దరూ పార్లమెంట్‌కు రాలేదు: రాహుల్
ఢిల్లీలో సీజేపీ నిరసనకారులు, విద్యార్థులపై పోలీసులు జరిపిన కాల్పులకు హోంమంత్రి అమిత్‌షా బాధ్యత తీసుకుంటారా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇవాళ పీఎం కానీ, హోంమంత్రి కానీ పార్లమెంట్‌కు రాలేదన్నారు. దీని మీద హోంమంత్రి ఇచ్చే సమాధానం కన్నా, ఆయన ఆదేశాలతోనే పెలెట్ గన్స్ వాడారన్న విషయం తెలియడం ముఖ్యమని అన్నారు. అలా ఆదేశాలివ్వడం వెనుక ఆయన ఉద్దేశమేంటో తెలియాలన్నారు.

GTA 6 Gamersకి గుడ్ న్యూస్! 🎮
గేమింగ్ లవర్స్, మీ వెయిటింగ్ దాదాపు ముగింపుకి వచ్చేసింది! రాక్‌స్టార్ గేమ్స్ నుంచి గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 కి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ 'స్పెషల్ ఎక్స్‌టెండెడ్ లుక్' ఆగస్టు 27న అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది. అయితే ఈసారి యూట్యూబ్ కంటే 6 గంటల ముందే నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో దీన్ని ప్రత్యేకంగా స్ట్రీమ్ చేయనున్నారు. ఇక నవంబర్ 19న ప్లేస్టేషన్ 5 మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్‌లలో ఈ ప్రతిష్టాత్మక గేమ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. గేమింగ్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ కాబోతోంది !
17 రోజులుగా రాంచీలో విద్యార్థుల ఆందోళనలు
రాంచీలో ఝార్ఖండ్ విధానసభ బయట JPSC-JSSC అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు. JSSC-CGL పరీక్షలో అక్రమాలపై స్వతంత్ర CBI విచారణ చేయాలని, JPSC, JSSC రెండింటిలోనూ మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు 17 రోజులుగా సాగుతున్నాయి. 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రీలిమ్స్, JSSC-CGL, ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లు, OMR షీట్ల లీక్ జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ప్యానెల్ ద్వారా స్వతంత్ర విచారణ చేయాలని కోరుతున్నారు.

ఐదేళ్లు ప్రేమించి.. మర్డర్ చేసిన ప్రియుడు!
AP: పల్నాడు జిల్లా కారెంపూడు దగ్గర ఒక దారుణం జరిగింది. హసీనా అనే అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్న బాలసైదు అనే యువకుడు చాకుతో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బాడీ మీద పెట్రోల్ పోసి తగలేశాడు. హసీనాకి కొత్తగా జాబ్ రావడంతో తనను కేర్ చేయడం లేదని, ఈ మర్డర్ చేసినట్లు తెలిసింది. హసీనా మిస్సింగ్ అని ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడంతో సెర్చ్ చేసిన పోలీసులు.. కాలువ గట్టు దగ్గర సగం కాలిన బాడీని కనుగొన్నారు. విచారణలో బాలసైదు తనే చంపేసినట్లు ఒప్పుకున్నాడు.