Latest

మహాత్మా గాంధీకి ఒక గుడి కట్టారా? ఎక్కడా?
General· 10 Aug 2026

మహాత్మా గాంధీకి ఒక గుడి కట్టారా? ఎక్కడా?

AP:శ్రీకాకుళంలో ఒక పాత పార్క్‌ను లోకల్స్ అంతా కలిసి ‘గాంధీ మందిరం ఫ్రీడమ్ ఫైటర్స్ స్మృతి వనం’గా మార్చేశారు. 50 సెంట్ల స్థలంలో ప్రజల డొనేషన్లతో నిర్మించిన ఈ స్పేస్‌లో గాంధీజీతో పాటు మన ఫ్రీడమ్ ఫైటర్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి. రోజూ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వందేమాతరం పాడుతుంటారు. ఈ ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌తో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. పాత పార్క్‌ను ఇలా మార్చడం నెక్స్ట్ లెవెల్ కదా!

ప్రశ్న రావణ్‌కు రిటైర్డ్ IPS సునీల్ కుమార్ సపోర్ట్!
AP· 10 Aug 2026

ప్రశ్న రావణ్‌కు రిటైర్డ్ IPS సునీల్ కుమార్ సపోర్ట్!

AP: రిటైర్డ్ IPS ఆఫీసర్ <a href="https://x.com/PV_Sunil_Kumar/status/2086749933248643295?s=20">PV. సునీల్ కుమార్</a> నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న 'ప్రశ్న రావణ్'ను ఈ రోజు కలిశారు. నిజాయితీగా సమాజం వైపు నిలబడే వాళ్లకు సపోర్ట్ ఇవ్వడం తన బాధ్యత అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జైల్లో ఉన్న రావణ్ చాలా ధైర్యంగా ఉన్నాడని, అతను బయటకొచ్చాక డబుల్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్ చూడవచ్చని చెప్పారు. ఈ మేరకు కలసి మాట్లాడిన విషయాన్ని పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఇది లాఠీచార్జ్ కాదు: రాంచీ డీఎస్పీ
National· 10 Aug 2026

ఇది లాఠీచార్జ్ కాదు: రాంచీ డీఎస్పీ

జార్ఖండ్‌లో విద్యార్థుల మీద ఎలాంటి బలప్రయోగం చేయలేదని నగర డీఎస్పీ అజయ్ ఆర్య మీడియాతో చెప్పారు. గుంపును అదుపు చేయడానికి పోలీసులు వాళ్లను వెనక్కి నెట్టాల్సి వచ్చిందని, దీన్ని లాఠీచార్జీ అని చెప్పలేమని అన్నారు. నిరసనకారులపై ఎలాంటి బలప్రయోగం చేయవద్దని పోలీసులకు కఠినమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. అయినా కొందరు నిరసనకారులు గాయపడ్డార, ఒకరికి పోలీసు లాఠీతో తలపై దెబ్బ తగిలిందన్నారు.

యాక్షన్, లవ్.. నయనతార డబుల్ ధమాకా!
Cinema· 10 Aug 2026

యాక్షన్, లవ్.. నయనతార డబుల్ ధమాకా!

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'టాక్సిక్', 'హాయ్' మూవీస్ కేవలం 48 గంటల గ్యాప్‌లో థియేటర్లలోకి రానున్నాయి. యశ్ కాంబోలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న మాస్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' ఆగస్టు 26న, అలాగే యంగ్ హీరో కవిన్‌తో చేసిన 'హాయ్' మూవీ ఆగస్టు 28న రిలీజ్ కానున్నాయి. సాధారణంగా మూవీ ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈసారి మాత్రం రెండు సినిమాల ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు.

వర్షాల కోసం CM రేవంత్ యాగం!
Politics· 10 Aug 2026

వర్షాల కోసం CM రేవంత్ యాగం!

TG: రాష్ట్రవ్యాప్తంగా బాగా వర్షాలు పడాలని తెలంగాణ గవర్నమెంట్ వరుణయాగం నిర్వహించింది. నాగార్జునసాగర్ విజయ్ విహార్‌లో జరిగిన ఈ పూజల్లో CM రేవంత్ రెడ్డి దంపతులు పార్టిసిపేట్ చేశారు. యాదగిరిగుట్ట వేద పండితులు 11 హోమగుండాలు, 108 మంది రుత్వికులతో ఈ యాగాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ ఈవెంట్‌లో మినిస్టర్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖలతో పాటు పలువురు MPలు, MLAలు అటండ్ అయ్యారు

జార్ఖండ్ అసెంబ్లీ వాయిదా
National· 10 Aug 2026

జార్ఖండ్ అసెంబ్లీ వాయిదా

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించాలని ప్రయ్నతించినవాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీద వాటర్ క్యానెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. పోలీసులు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.

దొంగతనానికి వచ్చాడనుకొని..యువకుడి హత్య
Crime· 10 Aug 2026

దొంగతనానికి వచ్చాడనుకొని..యువకుడి హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాహిబాబాద్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఓ యువకుడు(17) హత్యకు గురయ్యాడు. అతను ఇనుప రాడ్లు దొంగిలించడానికి వచ్చాడని అనుమానించి సెక్యూరిటీ గార్డు అతణ్ని తుపాకీతో కాల్చాడు. అయితే అతను తన కొత్త మొబైల్‌తో రీల్ తీయడానికి వెళ్లాడని కుటుంబసభ్యులు అంటున్నారు. గార్డు వివేక్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

27 ఏళ్లకే మార్కెట్‌లోకి ఎంట్రీ..
Finance· 10 Aug 2026

27 ఏళ్లకే మార్కెట్‌లోకి ఎంట్రీ..

కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో యావరేజ్‌గా 29 ఏళ్లకు ఇన్వెస్టింగ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేవాళ్లు. కానీ ఎన్ఎస్ఈ(NSE) తాజా రిపోర్ట్ ప్రకారం, ఇప్పుడు ఆ వయసు 27 ఏళ్లకు తగ్గింది. దీనికి కారణం ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో వచ్చిన మైండ్‌సెట్ మార్పే! గత జనరేషన్ దాచుకోగా మిగిలిన డబ్బులనే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. యంగ్ ఇన్వెస్టర్స్ మొదటే ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాతే మిగిలినవి ఖర్చు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయడంలో ఇదొక కొత్త మార్పు.

కేరళ చర్చీలో రెండు వర్గాల ఘర్షణ
National· 10 Aug 2026

కేరళ చర్చీలో రెండు వర్గాల ఘర్షణ

కేరళలోని ఎర్నాకులం జిల్లా మువట్టుపుళా సమీపంలోని పిరమడం సెయింట్ జాన్స్ బెత్లెహెమ్ చర్చిలో మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చి, జాకబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చి సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆర్థడాక్స్ సభ్యులు ప్రేయర్ చేసేందుకు చర్చిలోకి రాగా, జాకబైట్ కంట్రోల్లో ఉన్న చర్చి సభ్యులు వ్యతిరేకించారు. రెండు వర్గాలు వేర్వేరు కోర్టు ఆదేశాలను చూపించి వాగ్వాదానికి దిగాయి. పోలీసులు వచ్చి చర్చిని మూసేశారు.

దేవేంద్ర మహతో..జార్ఖండ్ నిరసనల్లో కీ రోల్ ఆయనదే!
National· 10 Aug 2026

దేవేంద్ర మహతో..జార్ఖండ్ నిరసనల్లో కీ రోల్ ఆయనదే!

జార్ఖండ్ విద్యార్థుల నిరసనలో దేవేంద్ర మహతోది కీ రోల్. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఆయన నీరసంతోనే ఇవాళ జరిగిన ‘విధాన్‌సభ ఘేరావ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 33 ఏళ్ల వయసున్న ఆయన రాంచీ జిల్లా రాహే బ్లాక్ కాపీడీహ్ గ్రామానికి చెందినవారు. డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ యూనివర్సిటీ నుంచి సంస్కృతం, కుర్మాలీ, ట్రైబల్ లాంగ్వేజెస్‌లో PG చేశారు. 2015 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ స్కాలర్‌షిప్‌లు, పేపర్ లీక్‌లు, రిజర్వేషన్ సమస్యలపై పోరాడుతున్నారు.

ఢిల్లీ పరిస్థితి మరోసారి జార్ఖండ్‌లో..
National· 10 Aug 2026

ఢిల్లీ పరిస్థితి మరోసారి జార్ఖండ్‌లో..

ఢిల్లీలో CJP నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌లాగే జార్ఖండ్‌లోనూ నిరసన తెలుపుతున్న నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిపై వాటర్ క్యానెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారు విధానసభను ముట్టడించకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ అడ్డుకుంటున్నారు. ఈ దాడుల్లో విద్యార్థులు గాయపడుతున్నారు.

కంపెనీ ఇచ్చే ఉచిత ఇన్సూరెన్స్‌ని నమ్ముకుంటే కష్టమే!
Finance· 10 Aug 2026

కంపెనీ ఇచ్చే ఉచిత ఇన్సూరెన్స్‌ని నమ్ముకుంటే కష్టమే!

చాలామంది కంపెనీలు ఉచితంగా ఇచ్చే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (GTL) ఉంది కదా అని కూల్ అయిపోతారు. కానీ అది అసలు సరిపోదు! మీరు ఏడాదికి ₹50 లక్షలు సంపాదిస్తే, కంపెనీ కేవలం ₹30 లక్షల కవర్ ఇచ్చిందనుకోండి.. ఏమైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి ఆ డబ్బులు దేనికి సరిపోవు. పైగా ఈ ఇన్సూరెన్స్ మీరు ఆ కంపెనీలో ఉన్నంతవరకే పనిచేస్తుంది. జాబ్ మారితే అట్టే పోతుంది! అందుకే సొంతంగా ఒక టర్మ్ ప్లాన్ ఉండటం మస్ట్. అలాగే ఆఫీస్ రికార్డ్స్‌లో మీ నామినీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా!

యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్
Politics· 10 Aug 2026

యాదాద్రి కొండల్లో 10,000 ఏళ్ల నాటి సీక్రెట్

TG: యాదాద్రి ఇంద్రపాలనగరంలో 'మట్టి ఫౌండేషన్' రీసెర్చర్స్ శంకరంగుట్ట దగ్గర 10,000 ఏళ్ల కిందటి రాతి గుహలు, రెడ్ పెయింటింగ్స్, పాతకాలపు పాత్రలు, ఐవరీ గాజులను గుర్తించారు. ఓపెన్ కొండపైన ఉన్నా ఆ పెయింటింగ్స్ పాడవకుండా ఇప్పటికీ సజీవంగా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు
India· 10 Aug 2026

పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్‌లో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు. వాళ్లను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

జార్ఖండ్ స్టూడెంట్స్‌‌పై పోలీసుల లాఠీఛార్జ్
India· 10 Aug 2026

జార్ఖండ్ స్టూడెంట్స్‌‌పై పోలీసుల లాఠీఛార్జ్

పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్ విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ‘విధానసభ ఘేరావ్’ మార్చ్‌ చేపడుతున్నారు. అసెంబ్లీ సమీపంలో బారికేడ్‌లను దాటడానికి ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

RMP చేసిన తప్పు..విద్యార్థిని బలి!
News· 10 Aug 2026

RMP చేసిన తప్పు..విద్యార్థిని బలి!

TG: ఖమ్మం జిల్లా బాస్వాపురంలో కస్తూరిబా స్కూల్‌లో 8th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయికి ఫీవర్ రావడంతో పేరెంట్స్ లోకల్ RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే ఆ RMP డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగానే పాపకు ఊపిరాడక కండిషన్ సీరియస్ అయింది. వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా, ECG తీసిన డాక్టర్లు పాప చనిపోయినట్లు చెప్పారు. RMP డాక్టర్ మద్యం మత్తులో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది. తండ్రి కంప్లైంట్‌తో పోలీసులు కేసు బుక్ చేసి పారిపోయిన RMP డాక్టర్ కోసం వెతుకుతున్నారు.

వంటగ్యాస్‌ కొరత..ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు జనం
India· 10 Aug 2026

వంటగ్యాస్‌ కొరత..ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు జనం

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ ప్రభావంతో దేశంలో వంటగ్యాస్‌ కొరత తీవ్రమైంది. సిలిండర్ల ధరలు పెరగడం, సప్లై ఆలస్యం కారణంగా చాలామంది ఇండక్షన్‌ స్టవ్‌ల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇండక్షన్‌ స్టవ్‌ల డిమాండ్‌ పెరగడంతో ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో కూడా స్టాక్‌ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రకారం ఇండక్షన్‌ కుక్‌టాప్‌ల విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్‌ స్టవ్‌లను ప్రోత్సహించాలని యోచిస్తోంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ!
News· 10 Aug 2026

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ!

TG:దివంగత లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో ఆయన వైఫ్ పెద్ది స్వప్న చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ మీటింగ్‌కి KTR, హరీష్ రావులతో పాటు పలువురు పొలిటికల్ లీడర్స్, కేడర్ అటెండ్ అయి ఆయన పిక్చర్‌కి నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డితో ఉన్న మెమొరీస్‌ని రీకాల్ చేసుకుంటూ, ఈ కష్టసమయంలో వారి ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో లీడర్స్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ పార్టిసిపేట్ చేశారు.

రాంచీ ప్రొటెస్ట్ సిట్యువేషన్ హీటెక్కింది!
Politics· 10 Aug 2026

రాంచీ ప్రొటెస్ట్ సిట్యువేషన్ హీటెక్కింది!

జార్ఖండ్ రాజధాని రాంచీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఉద్రిక్తంగా మారింది. ఎగ్జామ్స్ లో జరిగిన అక్రమాలపై ఆగ్రహంతో అసెంబ్లీ ముట్టడికి వేలాది మంది స్టూడెంట్స్ బయలుదేరారు. పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను నెట్టేసి మరీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. గత 17 రోజులుగా JSSC-CGL ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి, CBI ఎంక్వైరీ వేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు వస్తున్న క్రౌడ్‌ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ క్యానన్లు వాడటంతో సిట్యువేషన్ ఇంకా హీటెక్కింది. దీంతో అక్కడ భారీగా సెక్యూరిటీ పెంచారు.

నటిపై బాలీవుడ్ డైరెక్టర్ అత్యాచారం
Cinema· 10 Aug 2026

నటిపై బాలీవుడ్ డైరెక్టర్ అత్యాచారం

73 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్‌మేకర్ షకీల్ నూరానీని ముంబైలోని మాల్వాణి పోలీసులు అరెస్టు చేశారు. 2016లో సినిమా అవకాశం కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, మందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగికంగా వేధించారని 33 ఏళ్ల నటి కంప్లైంట్ చేసింది. ఆ ఇన్సిడెంట్‌ను వీడియో తీసి, అది చూపించి బెదిరించి మళ్లీ మళ్లీ దాడి చేశారని ఆరోపించింది. పోలీసులు ఆయన్ని కస్టడీలో ఉంచారు.

వరల్డ్ నెంబర్ వన్‌ని ఓడించిన ఇండియన్ గర్ల్ 🏸
Politics· 10 Aug 2026

వరల్డ్ నెంబర్ వన్‌ని ఓడించిన ఇండియన్ గర్ల్ 🏸

అస్సాం రాష్ట్రం గౌహతికి చెందిన 26 ఏళ్ల అష్మిత చలిహ కొరియా మాస్టర్స్ సూపర్ 300 టైటిల్ గెలుచుకుని రికార్డ్ సృష్టించింది! ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఈమెనే. కొన్ని నెలల క్రితమే తీవ్ర గాయం నుంచి కోలుకుని గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన అష్మిత.. ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ చైనా ప్లేయర్ హాన్ కియాన్ జిపై 21-14, 21-24, 21-14తో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ రేంజ్ ఫైట్ ఇచ్చి మన ఇండియన్ బ్యాడ్మింటన్‌కి కొత్త హోప్‌గా మారింది!