Latest
ఒంగోలులో TDP vs జనసేన!
AP: ఒంగోలులో TDP, జనసేన నాయకుల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. TDP MLA దామచర్ల జనార్దన్‌రావుకు మాజీ మంత్రి, జనసేన లీడర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. "ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు" అని తేల్చి చెప్పారు. "TDPకి కేవలం ఓట్లు వేయడానికే మా జనసేన కార్యకర్తలు పనికొస్తారా?" అని ప్రశ్నించిన ఆయన, వారి కోసం దేనికైనా సిద్ధమని మాట్లాడారు. పొత్తులో ఉన్నా అన్యాయం జరుగుతోందని, జనసేన కార్యకర్తలకు తాను ఎల్లవేళలా సపోర్ట్‌గా ఉంటానని జనసేన లీడర్ బాలినేని ప్రకటించారు.
చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిద్ధలగండి చెరువు సమీపంలో ఏనుగులున్నాయని, వీఆర్ కాలనీ, వేములవాడ, కోటకడపల్లి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయ్యగారిపల్లి, పులిగోనపల్లి, నెరబైలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త తీర్మానం
తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా సరికొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ఇకపై విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, పబ్లిక్ సంస్థలు తమ అధికారిక కార్యక్రమాల్లో మొదట రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ పాడాలని రూల్ ఫ్రేమ్ చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టారు. 1970 నుంచి తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పాటనే మొదటగా పాడే సంప్రదాయం ఉందని గుర్తు చేశారు.
పాక్ బాక్సర్‌ను ఓడించిన కథ- మోదీ రియాక్షన్?
పాకిస్థాన్ బాక్సర్‌ను ఓడించినప్పటి సరదా ఎక్స్ పీరియన్స్ ని ఇండియన్ హెవీవేట్ బాక్సర్ నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. "నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేందర్, నీ ప్రధాని పేరు కూడా నరేంద్రనే నాకు ఈ నరేంద్ర అనే పేరు వింటేనే భయమేస్తోంది" అని ఆ పాక్ బాక్సర్ తనతో అన్నట్లు చెప్పడంతో మోదీ ఒక్కసారిగా నవ్వేశారు. ఈ మధ్య 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్స్ సాధించిన అథ్లెట్లకు ప్రధాని మోదీ తన ఇంట్లో ఆతిథ్యమిచ్చి ప్రత్యేకంగా అభినందించారు.
జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల్లో Spider Man
‘రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మాటలు వినడం లేదు. అందుకే నేను ఝార్ఖండ్‌కు వచ్చాను. ప్రభుత్వం విద్యార్థులకు ఏమీ చేయాలని అనుకోవడం లేదు’. స్పైడర్‌మ్యాన్ మీడియాతో చెప్పిన మాటలివి. జార్ఖండ్‌లో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనకారులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేపడుతున్నారు. ఇందులో Spider Man మాస్క్ ధరించిన ఒక నిరసనకారుడు మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.

వర్షం..మీ కాళ్లకు శత్రువు అవుతోంది! 🦠
తెలంగాణలో గత రెండేళ్లలో లెప్టోస్పైరోసిస్ కేసులు ఏకంగా 125 రెట్లు పెరిగాయ్! వర్షం నీళ్లలో, బురదలో ఉండే బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వస్తుంది. కాలికి చిన్న గాయం ఉన్నా, పగుళ్లున్నా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఎక్కువవుతుంది. ఫీవర్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే కిడ్నీ, లివర్ దెబ్బతినే సీరియస్ ప్రమాదం ఉంది. వర్షంలో తడిచిన కాళ్లను వెంటనే క్లీన్‌గా, డ్రైగా ఉంచుకోవాలంటున్నారు.
జార్ఖండ్‌లో విద్యార్థులపై వాటర్ కేనాన్ల ప్రయోగం
జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు ర్యాలీగా కదిలిన వారు బారికేడ్లు దాటి ముట్టడి చేయాలని ప్రయత్నించగా, పోలీసులు వాటర్ కేనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లాలని విద్యార్థులు యత్నించారు. పోలీసులు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

CJIని రావొద్దంటూ లా స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్!
హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేకి CJI సూర్య కాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలవవద్దంటూ 450 మంది స్టూడెంట్స్ విసికి లేఖ రాశారు. ఇటీవల నీట్ ప్రొటెస్ట్‌లో పోలీస్ దాడులపై పిటిషన్ విచారిస్తూ "వీడియోలు చూపిస్తూ మా టైమ్ వేస్ట్ చేయకండి" అని CJI చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. విద్యార్థుల హక్కులను పట్టించుకోని వారి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోలేమని చెప్పారు. వివాదం నేపథ్యంలో ఈసారి అసలు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
‘విధానసభ ఘేరావ్’లో పాల్గొన్న దేవేంద్ర నాథ్ మహ్తో
జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వైపు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహ్తో మాట్లాడుతూ ‘నేను నిరాహారదీక్షలో ఉన్నా ఇక్కడికి వచ్చాను. వాళ్లు మమ్మల్ని ఆపలేరు’ అని చెప్పారు. 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, ప్రభుత్వం తమ డిమాండ్లను తప్పక అంగీకరించాలని’ అన్నారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు రాజేశ్వరరావు కన్నుమూత
TG: హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజేశ్వరరావు(75) మున్సూరాబాద్‌లోని స్వగృహంలో అకస్మాత్తుగా మృతి చెందారు. 1951లో తాడిపత్రి సమీపంలో జన్మించిన ఆయన 1976 నుంచి విశాలాంధ్ర ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో తొలి కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారిగా 36 ఎగ్జిబిషన్లకు సేవలందించారు. ప్రగతి పబ్లికేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదంలో కాలు, చేయి కోల్పోయినా సాహితీ సేవలు కొనసాగించారు.
తెలంగాణపై ఫరియా ఎమోషనల్ కామెంట్స్!
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. 'తెలంగాణ ప్రజలు అందరినీ ఆప్యాయంగా ఆదరిస్తారు, అందరితో కలిసిమెలిసి జీవిస్తారు. ఇది నిజంగా చాలా గ్రేట్' ఇలానే ఉండాలి అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఈ స్టేట్‌మెంట్ తెలంగాణ మనుషుల లవింగ్ నేచర్ మరియు కల్చర్‌కి ఉన్న యూనిక్‌నెస్ ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

MRF టైర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(NAPS) కింద MRF టైర్స్ లిమిటెడ్ అప్రెంటిస్ ట్రైనీ (మెషిన్ ఆపరేటర్) పోస్టుల కోసం <a href="https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8j6PuzhcyhIKk8_OesMO9I7msNcacEiJ2WkarhwrX0A7vBw/viewform">ఆన్‌లైన్</a>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళే లాస్ట్ డేట్. ITI, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చేసిన 2024, 2025, 2026 పాస్‌అవుట్స్ అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న మగవాళ్లు, కనీసం 5.3 అడుగుల ఎత్తు, 45 నుంచి 85 కిలోల బరువు ఉండాలి. నెలకు రూ.19,000 వేల జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

బస్సు బోల్తా..29 మందికి గాయాలు
జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శకుంతల ఫ్లైఓవర్‌పై స్టూడెంట్స్‌తో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. రాత్రి జరిగిన ఈ ఘటనలో 29 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. వాళ్లని వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎంతంటే!
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం నాటికి కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటుపై ₹380 తగ్గడంతో ప్రస్తుతం ₹1,51,970 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై ₹350 తగ్గి ₹1,39,300కి చేరగా, 18 క్యారెట్ల గోల్డ్ రేటు ₹280 తగ్గి ₹1,13,980 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ మారుతుంటాయి కాబట్టి, నగల షాపింగ్ చేసేముందు ఒకసారి లేటెస్ట్ రేట్స్ రీ-చెక్ చేసుకోవడం మంచిది.

శాంతియుత సమావేశాన్ని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన
AP: విశాఖపట్నంలో డేటా సెంటర్ల వ్యతిరేక శాంతియుత సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన అని HRF(Human Rights Forum) తెలిపింది. గ్రీన్ విశాఖ సభ్యులు భగత్ సింగ్ విగ్రహం వద్ద డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాలపై శాంతియుతంగా సమావేశమైనప్పుడు పోలీసులు వారిని చెదరగొట్టడం దారుణమని ఓ ప్రకటనలో వివరించారు. తర్లువాడలో భూములు కోల్పోయినవారిని కలవకుండా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, ఆన్‌లైన్ విమర్శలు తొలగించడాన్ని హెచ్‌ఆర్‌ఎఫ్ ఖండిస్తున్నట్టు తెలిపింది.

‘హుషారు పిట్టలు’ ట్రైలర్ విడుదల
యూత్‌ఫుల్ కథాంశంతో వస్తోన్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. అన్షు, వాసవి గణేషన్ జోడీగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు డైరెక్టర్. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజవుతోంది. ట్రైలర్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం వంటి అంశాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు.

హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు
2024 జూన్‌లో అభిమానిని హత్య చేసిన హీరో దర్శన్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రేణుకాస్వామిని బట్టలు విప్పి, కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టినట్టు అప్రూవర్‌గా మారిన A-14 (దర్శన్ అనుచరుడు) ప్రదోష్ తెలిపాడు. పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులు తిడుతూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టినట్టు వివరించాడు. పవిత్ర గౌడను రప్పించి, ఆమె చేత రేణుకాస్వామిని చెప్పుతో కొట్టించినట్టు చెప్పాడు. స్పృహతప్పి పడిపోయిన రేణుకాస్వామి ఛాతీపై నిలబడి అతణ్ని తొక్కేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు.
‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’..RSS లీడర్ అరెస్ట్
‘మహిళలు రేప్‌ని ఇష్టపడతారు’ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన RSS లీడర్ టీజీ మోహన్‌దాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలకు రేప్ అంటే ఇష్టమని, దాన్ని ఎంజాయ్ చేసే అమ్మాయిలూ ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు. తనకు అధికారం ఉండుంటే ఢిల్లీలోని నిరసనకారులపై కర్ఫ్యూ విధించేవాడినని, మాట వినకపోతే కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చేవాడినని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని కేరళలో ఆయనపై కేసు నమోదైంది. మట్టంచేరి సమీపంలోని కూవప్పాడమ్‌లో ఇంట్లో నుంచి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

PNBలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు <a href="https://ibpsreg.ibps.in/pnbjul26/">ఆన్‌లైన్</a>లో అప్లై చేసుకోండి. చివరి తేదీ ఆగస్టు 16. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 ఉన్నాయి. డిగ్రీ పూర్తయి, 20-30 సంవత్సరాల వయసున్నవారు అర్హులు. రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాష టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సాలరీ నెలకు ₹48,480 నుంచి మొదలవుతుంది.

గూగుల్ అసిస్టెంట్‌కి ఫైనల్ గుడ్‌బై? 👋
మన ఫోన్లలో ఇన్నేళ్లుగా ఉన్న గూగుల్ అసిస్టెంట్‌కి ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనా? 👀 గూగుల్ తన పాత గూగుల్ అసిస్టెంట్‌ను సెప్టెంబర్ 4, 2026 నుంచి పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతోంది. దాని స్థానంలో జెమినీని ప్రధాన AI అసిస్టెంట్‌గా తీసుకురానుంది. అంటే వాయిస్ కమాండ్స్, ప్రశ్నలు లాంటి పనుల్లో మనం ఇన్నాళ్లు వాడిన అసిస్టెంట్ స్థానాన్ని ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్ AI తీసుకోనుంది. గూగుల్ అసిస్టెంట్ నుంచి జెమినీకి ఈ మార్పుతో ఫోన్ అసిస్టెంట్స్ కూడా పూర్తిగా ఏఐ యుగంలోకి వెళ్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఫ్యామిలీ హెల్త్ టెస్ట్‌లతో ముందస్తు గుండె జబ్బుల నుంచి రక్షణ
కుటుంబంలో ఒకరికి ఫ్యామిలియల్ హైపర్‌కొలెస్టరోలెమియా(FH) అనే వ్యాధి ఉన్నట్లు తేలితే, ఆ కుటుంబ సభ్యులందరినీ స్క్రీనింగ్ చేయడం వల్ల ముందస్తు గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. FH అనేది జన్యుపరమైన జబ్బు. పుట్టుకతోనే ప్రమాదకర స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం దీని లక్షణం. దీని గురించి తెలుసుకున్న తర్వాత వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలను పరీక్షించడం ద్వారా ముందస్తు గుండె జబ్బులను నివారించొచ్చని అంటున్నారు.