Latest

66 రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ
AP· 10 Aug 2026

66 రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ

AP: కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జానూ) జూన్ 6న మిస్సయ్యింది. తన వెంట వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి వచ్చి చనిపోయింది. జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. మరో కుక్క పిల్లను తెచ్చుకున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు దానికి ‘జాను’ అని పేరుపెట్టారు. తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్ళిపోయారని భావిస్తున్న తల్లి భవాని కుమార్తె ఆచూకీ చెప్పాలని వేడుకుంటోంది.

ఏడు గంటల్లో 130 మందిని కరిచిన కుక్క
India· 10 Aug 2026

ఏడు గంటల్లో 130 మందిని కరిచిన కుక్క

మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఓ వీధి కుక్క భయంకరంగా ప్రవర్తించింది. సందీప్ హోటల్ నుంచి ఖడక్‌పాడా వరకు ఏడు గంటల్లో సుమారు 125 నుంచి 130 మందిని కరిచింది. వీళ్లంతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో ఎక్కువ మంది చికన్‌ఘర్, గోద్రేజ్ హిల్, ఆధర్వాడి, రేతి బందర్ ప్రాంతాలకు చెందినవారు. స్థానిక పోలీసులు, కల్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీధి కుక్కను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

కీళ్ల ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
Health· 10 Aug 2026

కీళ్ల ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!

కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు ఒమేగా-3 ఉండే సాల్మన్ చేపలు, పసుపు, బాదం లాంటి గింజలు, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు, అలాగే బెర్రీ పండ్లు తింటే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు రోజూ సరిపడా నీళ్లు తాగడం, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచి, నొప్పుల నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు.

రోజూ వాల్‌నట్స్.. ఆరోగ్యానికి మేలు!
Health· 10 Aug 2026

రోజూ వాల్‌నట్స్.. ఆరోగ్యానికి మేలు!

రోజూ వాల్‌నట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో గుడ్ ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఆకలిని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి రోజుకి 4-5 వాల్‌నట్ ముక్కలను ఓట్స్, పెరుగు లేదా సలాడ్‌లో వేసుకుని తినాలని అంటున్నారు.

నేషనల్ హైవేపై యాక్సిడెంట్
Crime· 9 Aug 2026

నేషనల్ హైవేపై యాక్సిడెంట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల నేషనల్ హైవేపై కారు, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కల్వకుర్తి వైపు నుంచి తెనాలికి వెళ్తున్న కారు, నిడమనూరు నుంచి పెబ్బేరు వైపు పెళ్లిచూపులకు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టోల్‌గేట్ వద్ద తనిఖీలు.. షాకింగ్ ట్విస్ట్
Crime· 9 Aug 2026

టోల్‌గేట్ వద్ద తనిఖీలు.. షాకింగ్ ట్విస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని దాకమర్రి జొన్నాడ టోల్‌గేట్ వద్ద గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి వస్తున్న ఓ కారులో లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్, భీమిలి పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో లిక్విడ్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు, ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కారును సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివాసీల రక్షణకు ముందుంటాం: కవిత
Politics· 9 Aug 2026

ఆదివాసీల రక్షణకు ముందుంటాం: కవిత

TG ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ITDAల్లో అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఉద్యోగంలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఆదివాసీ వీరులకు నివాళులర్పించారు. వారి ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. జనాభా లెక్కల్లో ఆదివాసీల అసలైన కులం పేరుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.

ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు భరోసా
AP· 9 Aug 2026

ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు భరోసా

AP: రాజమహేంద్రవరం ఘటనలో మెడికో ప్రియాంక మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని CM చంద్రబాబు తెలిపారు. ఆమె మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి శిక్షపడేలా చూడాలని CM సూచించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

నకిలీ ఐడీలతో 25 పెళ్లిళ్లు
India· 9 Aug 2026

నకిలీ ఐడీలతో 25 పెళ్లిళ్లు

UPలోని BJP MLA అల్లుడు నకిలీ గుర్తింపు కార్డులతో 25మంది మహిళలను వివాహం చేసుకున్న ఘటన కలకలం రేపింది. సేవతా నియోజకవర్గ MLA జ్ఞాన్ తివారీ కుమార్తె ప్రజ్ఞను 2024లో ప్రకార్ త్రివేదితో వివాహం చేశారు. అయితే అతడి అసలు వ్యవహారం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. పలు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లు, నకిలీ IDలతో యువతులను పెళ్లి చేసుకుని, వారి కుటుంబాల నుంచి డబ్బు, నగలతో పరారయ్యేవాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో MLA తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకార్‌తోపాటు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.

SIపై అనుచిత ప్రవర్తన.. YCP నేతకు రిమాండ్
Politics· 9 Aug 2026

SIపై అనుచిత ప్రవర్తన.. YCP నేతకు రిమాండ్

AP: మహిళా SIపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో YCP నేత చింతాడ రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో YS జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తులో ఉన్న మహిళా SIను చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు YCP నేతలు చుట్టుముట్టి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు.

వింత ఘటన.. మొసలికి పూజలు చేసిన భక్తులు
TG· 9 Aug 2026

వింత ఘటన.. మొసలికి పూజలు చేసిన భక్తులు

TG : జోగులాంబగద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరదనీటిలో ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. మొసలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్న భక్తులు మొసలిని వరుణ దేవుని వాహనంగా భావించి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అధికారులు మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.

వైజాగ్‌లో బన్నీ AAA.. గ్రాండ్ ఓపెనింగ్
Cinema· 9 Aug 2026

వైజాగ్‌లో బన్నీ AAA.. గ్రాండ్ ఓపెనింగ్

AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక AAA సినిమాస్ విశాఖ ఇనార్బిట్ మాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బన్నీ.. తన తొలి సినిమా గంగోత్రి షూటింగ్ సమయంలో ఇక్కడ గడిపిన రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నటుడిగా ప్రయాణం ప్రారంభించిన నగరంలో సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో తన కల నిజమైనట్లుగా ఉందన్నారు.

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్
AP· 9 Aug 2026

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్

AP: రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు మాజీ MP మార్గాని భరత్ తెలిపారు. ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటన తర్వాత నిందితులపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌కల్యాణ్, ఇతరులెవరూ పరామర్శించలేదని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఆమె కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

సోమశిలకు వెళ్లే టూరిస్టులకు గుడ్‌న్యూస్
TG· 9 Aug 2026

సోమశిలకు వెళ్లే టూరిస్టులకు గుడ్‌న్యూస్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గడంతో వేసవిలో నిలిచిపోయిన బోటింగ్ సేవలను, ప్రస్తుతం వరద జలాలతో నీటిమట్టం పెరగడంతో ఆదివారం నుంచి పునఃప్రారంభించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ బోటింగ్ సేవలను ప్రారంభించారు. సోమశిలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నదిలో బోటింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలని సూచించారు.

సూర్యలంకకు వెళ్తుండగా ఊహించని విషాదం
AP· 9 Aug 2026

సూర్యలంకకు వెళ్తుండగా ఊహించని విషాదం

AP: గుంటూరు బైపాస్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ DCP సిరీనా బేగం కుమార్తె హఫీఫా మృతి చెందారు. హఫీఫా మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైపాస్‌ సమీపంలో రేషన్‌ సరఫరా లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హఫీఫాను వెంటనే సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం
AP· 9 Aug 2026

కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం

AP: రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 65రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో జూన్‌ 6న చిన్నారి కనిపించకుండా పోయింది. పోలీసులు, SDRF, NDRF బృందాలు గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారం దొరకలేదు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మూడురోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మృతి చెందింది. కూతురు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు మరో కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని దానికి జాను అని పేరు పెట్టుకున్నారు.

కొడుకు టార్చర్ భరించలేక.. తండ్రి షాకింగ్ డెసిషన్
Crime· 9 Aug 2026

కొడుకు టార్చర్ భరించలేక.. తండ్రి షాకింగ్ డెసిషన్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట PS పరిధిలో కొడుకుపై గొడ్డలితో దాడిచేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కపేటకు చెందిన రాఘవరెడ్డి, కుమారుడు రాజేందర్‌ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధింపులకు గురిచేసేవాడని వెల్లడించారు. ఆగస్టు 8న తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరగగా రాజేందర్‌, తండ్రిపై దాడి చేయడంతో తీవ్రంగా విసిగిపోయిన రాఘవరెడ్డి, నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో దాడిచేశాడు. గాయపడిన రాజేందర్‌ను వరంగల్‌ MGM ఆస్పత్రికి తరలించారు.

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి
AP· 9 Aug 2026

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి

AP: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందారు. బ్రెయిన్‌‌డెడ్‌ కావడంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యంమత్తులో ఉన్న సూరవరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను రాజమహేంద్రవరంలో కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కిమ్స్‌లో చికిత్స అందించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సమాజానికి తిరిగి ఇవ్వాలి: హరీశ్‌ రావు
TG· 9 Aug 2026

సమాజానికి తిరిగి ఇవ్వాలి: హరీశ్‌ రావు

TG: నాకు సమాజం ఏం చేసిందని అడిగేవాళ్లే కానీ, మేము సమాజానికి ఏం చేయగలమని ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా రూ.1,000 చొప్పున పక్కనపెట్టి రూ.10లక్షల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమని ప్రశంసించారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేశారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న సొసైటీ సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

లాల్ దర్వాజాలో వైభవంగా బోనాలు..
News· 9 Aug 2026

లాల్ దర్వాజాలో వైభవంగా బోనాలు..

TG : హైదరాబాద్‌లోని లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళి బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఉదయం నుంచే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, సీపీ సజ్జనార్ వచ్చారు. ఒకవైపు భక్తులు క్యూ లైన్లలో రద్దీగా ఉండగా, ఇంకోవైపు పోతురాజుల డాన్సులు ఆకట్టుకున్నాయి.

భార్యను హతమార్చి.. భర్త షాకింగ్ డెసిషన్
Crime· 9 Aug 2026

భార్యను హతమార్చి.. భర్త షాకింగ్ డెసిషన్

AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడుకి చెందిన లక్ష్మణ్‌రావు(32)కు, శ్యామల(30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ దివ్యాంగులు. ఇంట్లో శ్యామల మృతి చెందగా, లక్ష్మణ్‌రావు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన ఫోన్‌లోని సెల్ఫీ వీడియోను గుర్తించారు. తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆమెను తరచూ గుర్తు చేసుకుంటున్నానని, ఆమె వద్దకు వెళ్లాలనుకుంటున్నానని వీడియోలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను మరణిస్తే భార్య అనాథ అవుతుందనే హత్య చేసినట్లు వీడియోలో పేర్కొన్నాడు.