Latest

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!
Local· 2d ago

డిజాస్టర్ అవగాహన.. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు శిక్షణ!

బాపట్ల జిల్లా వేమూరు మండలం తెల్లవారి గ్రామంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన సెషన్ నిర్వహించారు. పెరవల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, కార్డ్ సిబ్బంది ఎం.శ్రీనివాసరావు, పి.సురేఖ, ఆర్.అనిత విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. విపత్తులు వచ్చినప్పుడు ఎలా రక్షించుకోవాలో పీపీటీ ద్వారా నేర్పించారు. కార్డ్ సంస్థ ఇప్పటికే 5 మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం
TG· 2d ago

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం

TG: కరీంనగర్ జిల్లాలో బస్సుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు బావిలోకి పడకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని బయటపడ్డారు.

స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు
Education· 2d ago

స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు పొడిగింపు

కేంద్ర విద్యాశాఖ నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(NMMSS) 2026-27 అకడమిక్ సంవత్సరానికి అప్లికేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ <a href="https://scholarships.gov.in/">పోర్టల్</a> ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 9వ క్లాసులో కొత్తగా లక్ష మంది మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. 10, 11, 12వ క్లాసుల్లో ప్రోగ్రెస్ ఆధారంగా రెన్యూవల్ చేస్తారు. ఒక్కో స్టూడెంట్‌కి ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

నీట్ ప్రొటెస్టర్స్ సక్సెస్: కేసులన్నీ క్లోస్!
National· 2d ago

నీట్ ప్రొటెస్టర్స్ సక్సెస్: కేసులన్నీ క్లోస్!

నీట్ 2026 ప్రొటెస్టర్లపై ఉన్న అన్ని FIRలను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టేసింది. జంతర్ మంతర్ నిరసనల టైమ్‌లో దేశవ్యాప్తంగా నమోదైన పాత కేసులను రద్దు చేయడంతో పాటు, ఫ్యూచర్‌లో కొత్తగా ఎలాంటి కేసులు పెట్టకూడదని ఆర్డర్ వేసింది. అలాగే, నీట్ బాధితుల ఫ్యామిలీస్‌కి 90 రోజుల్లోగా కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. లీగల్ పోరాటంలో తమ డిమాండ్స్ అన్నీ నెరవేరడంతో బాధితులకు కంప్లీట్ జస్టిస్ దక్కిందని CJP లాయర్ రత్నసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు.

పాకాలలో అరుదైన వైట్-ఐడ్ బజార్డ్ సందడి!
Local· 2d ago

పాకాలలో అరుదైన వైట్-ఐడ్ బజార్డ్ సందడి!

పాకాలకు కొత్త చుట్టం వచ్చింది. దక్షిణాసియాలో అక్కడక్కడ కనిపించే అరుదైన పక్షి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల పార్కులో కనిపించింది. అదే వైట్-ఐడ్ బజార్డ్. బుధవారం ఈ జువైనైల్ పక్షిని సందర్శకులు గుర్తించారు. ఎకో టూరిజం వాచర్ జయప్రకాష్ ఫోన్‌లో ఫొటో తీశారు. గోధుమ కళ్లు, తెల్లని నుదురు - ఇవి ఈ చిన్న బర్డ్ స్పెషల్ ఐడెంటిటీ! ఇది మిడతలు, బల్లులు, కప్పలు తింటుంది. పాకాల ఎకో టూరిజం ఇప్పుడు బర్డ్ వాచర్స్ హాట్‌స్పాట్ గా అభివృద్ధి అవుతోంది. పర్యావరణాన్ని కాపాడితే ఇలాంటి సర్‌ప్రైజెస్ ఎన్నో చూడొచ్చు.

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు
Jobs· 2d ago

ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. APలో 917, తెలంగాణలో 419 ఖాళీలు

ఇండియా పోస్ట్‌లో (GDS, BPM, ABPM) 25,000+ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10th క్లాస్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18–40 ఏళ్లు మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 లోపు చేసుకోవాలి. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఈనెల 21తో ముగుస్తాయి. మేల్ జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. SC/ST/PwD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. సెలెక్షన్ 10th క్లాస్ (SSC) మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://www.indiapost.gov.in/gdsonlineengagement">Click </a>చేయండి.

రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. మీరే ఇవ్వాలి CM సారూ!
TG· 2d ago

రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. మీరే ఇవ్వాలి CM సారూ!

TG: సిద్ధిపేటలోని శ్రీకృప ఫార్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధను వీడియో ద్వారా తెలిపారు. ఫీజులు చెల్లించకపోవడంతో 30 మందిక సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. తమకు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ఈ పోస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.

18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?
Local· 2d ago

18 ఎకరాల సర్కారు భూమి... HC చెప్పినా సర్వే చేయరా?

అధికారులు హై కోర్టు చెప్పినా వినట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో విద్యానగర్ పంచాయతీ పరిధిలోని 18 ఎకరాల సర్కారు భూమి కబ్జాకు గురైంది. హైకోర్టు 3 కేసుల్లో (WP 1169, 6059, 5706) ఆ భూమి సర్కారుదేనని స్పష్టం చేసింది. రెవెన్యూ అధికారులు మాత్రం ఒక్క కేసునే సర్వే చేసి ఆగిపోయారు. మిగిలిన భూమిని సర్వే చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ’’ఇంతకీ మిగిలిన 17 ఎకరాల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కబ్జాదారులతో ఏమైనా కుమ్మక్కు అయ్యారా‘‘అని వారు ప్రశ్నిస్తున్నారు.

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్
Local· 2d ago

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేసిన TGB మేనేజర్

జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని ఉట్కూర్‌లో ఇటీవల మరణించిన లక్ష్మీదేవి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగరాజ్, ఆ చెక్కును నామినీ నర్సింహకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.టి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, శిరీష పాల్గొన్నారు. ఇది పీఎంజెజెబివై పథకం కింద మంజూరైన బీమా. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరితే ఇలాంటి హెల్ప్ వస్తుందని మేనేజర్ చెప్పారు.

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Local· 2d ago

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

TG: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేసులపై జరుగుతున్న విచారణలను కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన ఆయన ఓటర్ల వివరాలు, బీఎల్‌ఓల పరిశీలన, సంబంధిత ఆధారాలు, రికార్డులను తనిఖీ చేశారు. అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
Local· 2d ago

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని శాలెం ఎం.బి. చర్చిని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్‌తో మాట్లాడి చర్చి, క్రిస్టియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవుల సంక్షేమం, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన అభివృద్ధి పనులకు తన ఎమ్మెల్యే నిధుల నుంచి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చర్చి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

లెజెండరీ కర్నాటిక్ సింగర్ రోల్‌లో రష్మిక!
Entertainment· 2d ago

లెజెండరీ కర్నాటిక్ సింగర్ రోల్‌లో రష్మిక!

లెజెండరీ కర్నాటిక్ సింగర్, భారతరత్న M.S. సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక మందన్నతో చర్చలు జరుగుతున్నాయి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రీ-ప్రొడక్షన్, రీసెర్చ్ వర్క్ వేగంగా సాగుతోంది. మొదట సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు వినిపించినా, ప్రస్తుతం రష్మికనే ఈ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్‌కి ఫ్రంట్‌రన్నర్‌గా నిలిచింది. డిస్కషన్స్ పాజిటివ్‌గా ఉన్నాయని, త్వరలోనే ఫుల్ కాస్ట్, క్రూ, షూటింగ్ షెడ్యూల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టీమ్ సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి.

420 అడుగుల భారీ ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ నిరసన
Local· 2d ago

420 అడుగుల భారీ ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ నిరసన

TG: హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ కూడలి వరకు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

‘Toxic’ సినిమాకు మహేష్‌బాబు కొడుకు ఇచ్చిన రేటింగ్?
Entertainment· 2d ago

‘Toxic’ సినిమాకు మహేష్‌బాబు కొడుకు ఇచ్చిన రేటింగ్?

హీరో Mahesh Babu కొడుకు Gautam Ghattamaneni Letterboxd అకౌంట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఇందులో అతను 400కి పైగా సినిమాలు లాగ్ చేశాడు. ఇటీవల యష్ నటించిన ‘Toxic’ సినిమాకు 0.5/5 స్టార్స్ ఇచ్చాడు. అలాగే తన తండ్రి సినిమాల్లో ‘పోకిరి’, ‘నేనొక్కడినే’ సినిమాలకు 5 స్టార్స్, ‘బ్రహ్మోత్సవం’ 1 స్టార్, ‘నిజం’, ‘వంశీ’ సినిమాలకు 2 స్టార్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ అకౌంట్ డిసేబుల్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

అవ్వకు CM విజయ్ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్!
Viral· 2d ago

అవ్వకు CM విజయ్ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్!

తమిళనాడు CM విజయ్ సేలంలో ఓ వృద్ధురాలిని కలసి సర్‌ప్రైజ్ చేశారు. మేట్టూరు డ్యామ్‌ విజిట్ తర్వాత ఓ రైతు ఇంటి దగ్గర ఆగిన విజయ్.. చెల్లం అనే వృద్ధురాలితో కాసేపు మాట్లాడారు. ఆమె ఆరోగ్యం, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత తాను పెట్టుకున్న Dior సన్‌గ్లాసెస్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మొదట ఆమె ఫస్ట్‌లో తీసుకోడానికి మొహమాటపడినా విజయ్ స్వయంగా ఆమెకు పెట్టారు. ఈ క్యూట్ మూమెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెరిగిన ధరలు తగ్గించాలి.. సత్తుపల్లిలో ఆందోళన
Local· 2d ago

పెరిగిన ధరలు తగ్గించాలి.. సత్తుపల్లిలో ఆందోళన

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బుధవారం నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతోందని ఆరోపించారు. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

కల్వకుర్తిలో వైఎస్సార్ వర్ధంతి.. ఘన నివాళులు
Local· 2d ago

కల్వకుర్తిలో వైఎస్సార్ వర్ధంతి.. ఘన నివాళులు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.

గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు
Local· 2d ago

గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుత్తి పట్టణం, గుత్తి ఆర్‌ఎస్‌లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని రైతులు, పేదలు, విద్య, వైద్యం, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.

ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ..!
Local· 2d ago

ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ..!

హైదరాబాద్‌లో ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారధి జీవి వెన్నెల గద్దర్ హాజరై, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పత్రిక ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని, అందరి ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె అన్నారు. "ఇది ప్రజల గొంతు కావాలి" అంటూ పత్రిక యాజమాన్యానికి సూచించారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. కొత్తగూడెంలో నిరసన
Local· 2d ago

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. కొత్తగూడెంలో నిరసన

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అంబేద్కర్ సెంటర్‌లో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతంగా పొందుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ తప్పకుండా హాజరుకావాలని డిమాండ్ చేశారు.

ఆస్పత్రిలో సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు
Local· 2d ago

ఆస్పత్రిలో సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు

TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సౌకర్యాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం ఆరోపించారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నా, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేవని అన్నారు. పేషెంట్ల చిట్టీలు రాసే విషయంలో పరిచయాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.