Latest

ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కోమటిరెడ్డి
TG· 8 Aug 2026

ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కోమటిరెడ్డి

TG: వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వైపు రైతులను మళ్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండలో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రానున్న రెండు, మూడు నెలల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.

మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
Cinema· 8 Aug 2026

మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్' సీక్వెల్‌గా 'మైఖేల్ 2' రాబోతుంది. 2026 చివరిలో లేదా 2027 మొదట్లో షూటింగ్ ప్రారంభం కానుందని ప్రొడక్షన్ హౌస్ చైర్మన్ ఆడమ్ ఫోగెల్సన్ తెలిపారు. పార్ట్ వన్ సమయంలో తీసిన కొన్ని భారీ మ్యూజికల్ సీన్లను ఈ సీక్వెల్‌లో ఉపయోగించనున్నారు. ఈ సినిమాను 2027 చివర్లో లేదా 2028లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

గోళ్లపై చేపల డిజైన్ల ట్రెండ్..
Viral· 8 Aug 2026

గోళ్లపై చేపల డిజైన్ల ట్రెండ్..

ఫ్యాషన్ ప్రపంచంలో రోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. లేటెస్ట్‌గా బ్యూటీ లవర్స్‌ని 'సర్డీన్ నెయిల్స్' అనే నెయిల్ ఆర్ట్ ఆకట్టుకుంటుంది. గోళ్లపై చిన్న వెండి రంగు చేపలు, నిమ్మకాయలు, ఆలీవ్ డిజైన్లను వేసుకోవడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత. మెడిటరేనియన్ సమ్మర్ ఫీల్ ఇచ్చే ఈ నెయిల్ ఆర్ట్, యూరోపియన్ స్టైల్‌ని ఇష్టపడేవారికి బాగా నచ్చేస్తుంది. నెటిజన్లు తమ గోళ్లకు ఈ చేపల డిజైన్లను వేసుకుని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

రేపు వైన్స్ బంద్
TG· 8 Aug 2026

రేపు వైన్స్ బంద్

TG: బోనాల పండగ సందర్భంగా ప్రజాశాంతి, భద్రత దృష్ట్యా హైదరాబాద్ నగరం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ప్రజలు ఈ ఆదేశాలను గౌరవించి, పోలీసుశాఖకు సహకరించి, బోనాల పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది.

ఆహారం కోసం వెళ్లిన కొండచిలువ.. ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి?
Viral· 8 Aug 2026

ఆహారం కోసం వెళ్లిన కొండచిలువ.. ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి?

పెరూలో ఎలక్ట్రిక్ పోల్‌పై ఉన్న పక్షులను వేటాడేందుకు వెళ్లిన కొండచిలువకు హైటెన్షన్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. పక్షులను వేటాడేందుకు ఎలక్ట్రిక్ పోల్‌ ఎక్కిన కొండచిలువకు ఎలక్ట్రిక్ తీగలను తాకినట్లు తెలుస్తోంది. దింతో కొద్దిసేపు ఆ ఏరియాలో పవర్ సప్లై ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.

థియేటర్లలో కొత్త రచ్చ!
Cinema· 8 Aug 2026

థియేటర్లలో కొత్త రచ్చ!

ఇటీవల థియేటర్లలో పక్కన కూర్చుని రన్నింగ్ కామెంట్రీ చెప్పేవాళ్ల గోల ఎక్కువైపోతోందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. 'స్పైడర్ మ్యాన్' సినిమా చూస్తుండగా పక్కవాడికి సీన్ బై సీన్ స్టోరీ చెప్పిన ఒకరిని మిగతా జనాలు బయటకు లాగి కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. హోమ్ థియేటర్ లాగా థియేటర్లను వాడుకుంటూ పక్కవాళ్ల మూడ్‌ను పాడుచేస్తున్నారని, ట్రైలర్స్ టైమ్‌లో ఎంతైనా మాట్లాడండి కానీ సినిమా మొదలయ్యాక మాత్రం కామ్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి
Politics· 8 Aug 2026

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి

TG: సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత BRSకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే BRS నేతలు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరమవుతాయని, గత ప్రభుత్వం కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే 12లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పదేళ్ల పాలనలో పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించలేదని ఫైరయ్యారు.

iThrive CEO ముగ్ధా ప్రధాన్ వైరల్..
News· 8 Aug 2026

iThrive CEO ముగ్ధా ప్రధాన్ వైరల్..

iThrive సంస్థ CEO ముగ్ధా ప్రధాన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశంలో రోడ్లు, పరిసరాలు చెత్తగా ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యలను పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రధానిని కలిస్తే చెంపదెబ్బ కొడతానంటూ ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

సైబర్ క్రైం బాధితులకు రూ.98.89 లక్షలు రికవరీ
TG· 8 Aug 2026

సైబర్ క్రైం బాధితులకు రూ.98.89 లక్షలు రికవరీ

TG: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూలైలో 70 FIRలు నమోదు చేశారు. 15 రాష్ట్రాల ట్రేడింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ తదితర కేసులపై 49 మందిని అరెస్టు చేశారు. 38 ప్రధాన కేసుల్లో బాధితులు రూ.13.87 కోట్లు నష్టపోగా, అందులో రూ.98.89 లక్షలు రీఫండ్ చేశారు. జోనల్ సైబర్ సెల్స్ 2,059 NCRP పిటిషన్లు తీసుకుని 298 FIRలు నమోదు చేశాయి. సైబర్ పెట్రోల్‌లో 128 ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ తొలగించారు.

‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి ప్రోత్సాహం
Politics· 8 Aug 2026

‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి ప్రోత్సాహం

AP: ‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, పవర్ బ్యాంక్‌తో పాటు దిల్లీకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లను అందించారు. రాజమహేంద్రవరం క్యాంప్ ఆఫీస్‌లో జెస్సీ, ఆమె పేరెంట్స్‌ను ఇన్వైట్ చేసి కిట్‌ను ఇచ్చారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు. పదో తరగతి చదువుతూనే ‘శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ ప్రతి స్టూడెంట్‌కు స్ఫూర్తి అని మంత్రి అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి దుర్గేష్‌కు జెస్సీ కృతజ్ఞతలు తెలిపారు.

బాలీవుడ్‌లో హీరోయిన్లదే రాజ్యమా!
Cinema· 8 Aug 2026

బాలీవుడ్‌లో హీరోయిన్లదే రాజ్యమా!

ఈమధ్య బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. కేవలం హీరోల చుట్టూనే కాకుండా, హీరోయిన్లు లీడ్ రోల్స్ చేసే యాక్షన్, థ్రిల్లర్ సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా హీరోనా, హీరోయిన్ అని చూడకుండా మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. థియేటర్లే కాకుండా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రిస్క్‌ను తగ్గిస్తుండటంతో, రాబోయే రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు మరింత పెరగనున్నాయి.

కొరియన్ ఆత్మతో వరుణ్ తేజ్ రచ్చ..
Cinema· 8 Aug 2026

కొరియన్ ఆత్మతో వరుణ్ తేజ్ రచ్చ..

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఒక పల్లెటూరి యువకుడి శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించడం అనే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ తేజ్ నటన, మేకోవర్ బాగుండగా, కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్విస్తున్నారు.

FAKE or FACT..మనిషి కుక్కలా మారిపోయాడా?
Viral· 8 Aug 2026

FAKE or FACT..మనిషి కుక్కలా మారిపోయాడా?

26 ఏళ్ల జపాన్ మిలియనీర్ ‘జాసో’ కుక్కగా మారిపోయాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం ఆయన ₹220 కోట్లు ఖర్చు చేసి సర్జరీలు చేయించుకున్నాడని అంటున్నారు. దీని మీద చాలా చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మనిషిని కుక్కగా మార్చే సర్జరీ అసాధ్యమని వైద్యులు అంటున్నారు. అందుకోసం వందల కోట్లు ఖర్చు చేయడం ఉట్టి పుకారు మాత్రమే అంటున్నారు. కాబట్టి ఈ వార్త FAKE.

ఫైవ్‌స్టార్ హోటళ్లలో Expire అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌
News· 8 Aug 2026

ఫైవ్‌స్టార్ హోటళ్లలో Expire అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌

బెంగళూరులోని ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ (FSDA) అధికారులు ఇన్‌స్పెక్షన్స్‌ చేసి ఫుడ్ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్‌పైరైనా ఫుడ్‌ను స్టోర్ చేయడం, స్టాండర్డ్ లేని స్టోరేజ్‌ను వాడడం గుర్తించారు. మొత్తం 250 కిలోల మీట్, 207 కిలోల వెజిటబుల్స్, 32 లీటర్ల ఎక్స్‌పైరైనా మిల్క్, 3 కిలోల బేకరీ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లలిత్ అశోక్, షాంగ్రి-లా, ఫోర్ సీజన్స్, రాడిసన్ బ్లూ వంటి హోటళ్లలో అధికారులు వీటిని గుర్తించారు.

బోనం ఎత్తిన నిహారిక కొణిదెల!
News· 8 Aug 2026

బోనం ఎత్తిన నిహారిక కొణిదెల!

హైదరాబాద్ లో బోనాల పండుగ వేడుకల్లో నటి, నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఆమె, సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీస్సులు అందించారు. బోనం ఎత్తుకున్న నిహారిక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాశీ ఖన్నా అసలు ప్లాన్ ఇదే!
Cinema· 8 Aug 2026

రాశీ ఖన్నా అసలు ప్లాన్ ఇదే!

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతోనే 'ధర్మన్' సినిమాకు వెంటనే 'ఓకే' చెప్పానని తెలిపారు. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకే తక్కువ సినిమాలు చేసినా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు. కేవలం నటిగానే కాకుండా, రాబోయే రోజుల్లో సినిమాలు నిర్మించే (ప్రొడక్షన్) ఆలోచన కూడా ఉందన్నారు.

క్లాస్‌రూమ్‌లో విద్యార్థి డ్రగ్స్!
News· 8 Aug 2026

క్లాస్‌రూమ్‌లో విద్యార్థి డ్రగ్స్!

మహారాష్ట్రలోని ఠాణేలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లోనే డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ అవ్వడంతో ఠాణే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఏ పాఠశాలకు చెందినదో, అందులో ఉన్న విద్యార్థి ఎవరో గుర్తించేందుకు విచారణ వేగవంతం చేశారు. వీడియో నిజమైనదేనా కాదా అనే చర్చ జరుగుతుండగా, మరోపక్క పాఠశాలల్లో పిల్లల భద్రత, పర్యవేక్షణ ఎంతవరకు ఉందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

మూసీ ప్రాజెక్టుపై మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు
Legal· 8 Aug 2026

మూసీ ప్రాజెక్టుపై మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌కు నోటీసులు

TG: హైదరాబాద్ మూసీ రివర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను వెంటనే ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ RDO ఆఫీసర్స్ నోటీసులిచ్చారు. అపార్ట్‌మెంట్‌ను తొలగించకుండానే మూసీ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ఓనర్లు గుర్తుచేశారు. మళ్లీ నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, తీర్పు వచ్చే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని MROకు లీగల్ నోటీసులు పంపించామన్నారు. కాంపెన్సేషన్‌పై క్లారిటీ వచ్చే వరకు ఖాళీ చేయమని రెసిడెంట్స్ తేల్చిచెప్పారు.

పెళ్లైన నాలుగు నెలలకే విషాదం
AP· 8 Aug 2026

పెళ్లైన నాలుగు నెలలకే విషాదం

AP: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ PS పరిధిలోని అయోధ్యనగర్‌లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన చంద్రకళ(24)కు ఈ ఏడాది ఏప్రిల్‌లో దేవేంద్రతో వివాహం జరిగింది. భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితుడి ఫోన్‌తో ఇంటికి చేరుకున్న భర్త.. తలుపులు వేసి ఉండటాన్ని గమనించి, చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సెక్షన్ 22Aతో భూయజమానులకు ఇబ్బంది
Infotainment· 8 Aug 2026

సెక్షన్ 22Aతో భూయజమానులకు ఇబ్బంది

రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద ప్రభుత్వం, ఎండోమెంట్, వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ సర్ప్లస్ భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ప్రైవేట్ భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ జాబితాలోని సర్వే నంబర్లపై సేల్, గిఫ్ట్, తనఖా డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయడం లేదు. చాలా చోట్ల మొత్తం సర్వే నంబర్‌ను జాబితాలో పెట్టడంతో లీగల్ పట్టా భూములు, లేఅవుట్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు ఈ జాబితాలో చేరిపోయాయి.

E20పై భారీ ఉద్యమం చేస్తాం: రాహుల్ గాంధీ
Politics· 8 Aug 2026

E20పై భారీ ఉద్యమం చేస్తాం: రాహుల్ గాంధీ

E20 ఫ్యూయల్ అంశంపై భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, తాము ప్రస్తావించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. E20 ఫ్యూయల్ ప్రజల కార్లు, స్కూటర్లను డ్యామేజ్ చేయడంతో పాటు వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి నేరుగా డబ్బులు దోచుకుంటున్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ 'X'లో స్పష్టం చేశారు.