Latest

Rupee ₹95 దగ్గరే ఉండొచ్చా..?
News· 5 Aug 2026

Rupee ₹95 దగ్గరే ఉండొచ్చా..?

ఇండియాలోకి బిలియన్ల డాలర్లు వస్తున్నా.. రూపాయి ఎందుకు స్ట్రాంగ్ అవ్వట్లేదు..? 👀 జూలైలో విదేశీ ఇన్వెస్టర్లు ఐదు నెలల తర్వాత ఇండియన్ షేర్లలో నెట్ బయ్యర్స్‌గా మారారు. RBI తీసుకున్న చర్యలతో $40 బిలియన్లకు పైగా ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చినా, రూపాయి ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6% బలహీనపడింది. 36 మంది స్ట్రాటజిస్టులతో చేసిన Reuters పోల్ ప్రకారం మూడు నెలల్లో డాలర్‌కు రూపాయి సుమారు ₹95.25 వద్ద ఉండొచ్చని అంచనా.

8 మంది స్టార్ హీరోల కేమియోలు!
Cinema· 5 Aug 2026

8 మంది స్టార్ హీరోల కేమియోలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పార్ట్ వన్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లతో సందడి చేసిన నెల్సన్, ఈసారి సీక్వెల్‌లో కేమియోల సంఖ్యను పెంచబోతున్నారట. మొదట్లో నలుగురు స్టార్లు కనిపిస్తారనే టాక్ రాగా, ఆ సంఖ్య ఏకంగా ఎనిమిదికి చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ కోసం ఎనిమిది మంది స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారనే వార్తలతో, ఆ స్టార్లు ఎవరై ఉంటారని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

నాలుగేళ్ల కొడుకుపై తండ్రి అమానుషం
Crime· 5 Aug 2026

నాలుగేళ్ల కొడుకుపై తండ్రి అమానుషం

TG: హైదరాబాద్ నగరం గుడిమల్కాపూర్‌కు చెందిన సల్మాన్‌కు కొంతకాలంగా తన భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలో నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌ తలను పిల్లర్‌కు బలంగా కొట్టి, పైకి ఎత్తి నేలపై పడేసి, లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించాడు. ఉదయం 7:29 గంటలకు సమాచారం ఇచ్చినా పోలీసులు గంట తర్వాత అక్కడికి వచ్చినట్టు స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ.. హాజరైన నారా లోకేశ్
Sports· 5 Aug 2026

పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ.. హాజరైన నారా లోకేశ్

AP: విశాఖపట్నంలోని ఆరిలోవ ఏరియాలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రెస్టీజియస్‌గా ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. అకాడమీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది బాలికలు క్రీడల్లో సత్తా చాటుతూ రాష్ట్రం, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

షేక్ హసీనా ఢిల్లీ స్పీచ్‌తో మాకు సంబంధం లేదు: భారత ప్రభుత్వం
World· 5 Aug 2026

షేక్ హసీనా ఢిల్లీ స్పీచ్‌తో మాకు సంబంధం లేదు: భారత ప్రభుత్వం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో వర్చువల్‌గా మాట్లాడబోతున్నారు.. కానీ భారత ప్రభుత్వం మాత్రం “మాకు సంబంధం లేదు” అంటోంది! 👀 ఈరోజు (ఆగస్టు 5) జరిగే ఈ కార్యక్రమాన్ని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. హసీనా పాల్గొనడంపై బంగ్లాదేశ్ ఇండియాను వివరణ కోరగా, ఈ ఈవెంట్‌కు ప్రభుత్వం స్పాన్సర్ కాదని, అధికారిక సంస్థలతో కూడా సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

మిడ్‌డే మీల్స్‌లో నాసిరకం ఫుడ్.. నెటిజన్స్ విమర్శలు!
Viral· 5 Aug 2026

మిడ్‌డే మీల్స్‌లో నాసిరకం ఫుడ్.. నెటిజన్స్ విమర్శలు!

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో మిడ్‌డే మీల్స్‌లో పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నీళ్లలా పలుచగా ఉన్న కూరతో పాటు కాలిపోయిన చపాతీలు వడ్డిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రతపై విమర్శలు వస్తున్నాయి. వైరల్ వీడియో ఆథెంటిసిటీని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఘటనపై విచారణ జరిపి, వాస్తవాలు తేలిన తర్వాత అధికారులు యాక్షన్ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వైద్యుడా.. రాక్షసుడా?
News· 5 Aug 2026

వైద్యుడా.. రాక్షసుడా?

చిత్తూరు జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో బాధితుల బంధువులు వైద్యం చేయమని కోరారు. డాక్టర్ 'వైద్యం చేయను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీన్ని బాధితులు ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది. రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఆత్మహత్యతో సమానం.. నీళ్లు అయిన తాగండి- సోనమ్
Education· 5 Aug 2026

ఇది ఆత్మహత్యతో సమానం.. నీళ్లు అయిన తాగండి- సోనమ్

జార్ఖండ్‌లోని రాంచిలో JPSC, JSSC పోటీ పరీక్షల లీకేజీలపై విద్యార్థి నేత దేవేంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 26 ఏళ్లుగా ఇక్కడ పేపర్లు లీక్ అవుతుండటంతో, నీళ్లు కూడా తీసుకోక ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆయనను పరామర్శించి, వాటర్ తీసుకోవాలని కోరారు. వాంగ్‌చుక్ రిక్వెస్ట్‌తో నీళ్లు తాగేందుకు దేవేంద్రనాథ్ ఒప్పుకున్నా, ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పన్నీర్ కాదు.. వెజిటబుల్ ఫ్యాట్!
Health· 5 Aug 2026

పన్నీర్ కాదు.. వెజిటబుల్ ఫ్యాట్!

ఫుడ్ సేఫ్టీ నిబంధనల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లలో 'అనలాగ్ పన్నీర్' వాడకాన్ని సంవత్సరం బ్యాన్ చేసింది. పాలతో కాకుండా వెజిటబుల్ ఫ్యాట్‌తో తయారు చేసే ఈ పన్నీర్ హెల్త్‌కి మంచిది కాదని ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్ బోర్డులు, మెనూ కార్డుల్లో 'అనలాగ్ పన్నీర్' వాడుతున్నామని రాయాలని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ రూల్స్ పాటించకపోవడంతో ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

నేను స్టాలిన్ కొడుకుని.. బెదిరింపులకు భయపడను: ఉదయనిధి
Politics· 5 Aug 2026

నేను స్టాలిన్ కొడుకుని.. బెదిరింపులకు భయపడను: ఉదయనిధి

నటి త్రిషపై కామెంట్స్‌ చేశారంటూ తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేసి, ఆపై విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం తన తండ్రి స్టాలిన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఉదయనిధి 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తాను భయపడనని అన్నారు. 'నేను కలైంజర్ మనవడిని, ఎంకే స్టాలిన్ కొడుకుని, DMK కార్యకర్తను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. రైతుల కోసం ఒక్కసారి కాదు.. అవసరమైతే వందసార్లు అరెస్ట్ అవ్వడానికైనా సిద్ధమే. ప్రజాసేవను ఎలాంటి అణచివేత ఆపలేదు' అని తన పోస్టులో రాశారు.

పొలిటికల్ ఎంట్రీపై అభిజీత్ దీప్కే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Politics· 5 Aug 2026

పొలిటికల్ ఎంట్రీపై అభిజీత్ దీప్కే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారా అని అడగ్గా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ రాజకీయ భావజాలాలను పక్కనబెట్టి, మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అంశాలపై పోరాడటం వల్లే తమ ఉద్యమం సక్సెస్ అయిందన్నారు. ప్రస్తుతం ఇండియాకు కావాల్సింది పొలిటికల్ పార్టీ కాదని, బలమైన ప్రజా ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు.

TVK తొలి బడ్జెట్.. ఎవరీ మేరీ విల్సన్?
India· 5 Aug 2026

TVK తొలి బడ్జెట్.. ఎవరీ మేరీ విల్సన్?

తమిళనాడు అసెంబ్లీలో అధికార టీవీకే(తమిళగ వెట్రి కళగం) తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చదివారు. బి.టెక్, ఎంబీఏ అనంతరం హైదరాబాద్ జేఎన్‌టీయూ నుంచి మేనేజ్‌మెంట్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందిన వ్యక్తి ఆయన. జెప్పియార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్. 2025 జూన్‌లో టీవీకేలో చేరి, రాధాకృష్ణన్‌నగర్ నుంచి పోటీ చేశారు. డీఎంకే ఎమ్మెల్యే జె.జాన్ ఎబెనేజర్‌ను 49,668 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈరోజు బంగారం కొనొచ్చా? షాకింగ్ రేట్స్ ఇవే!
Business· 5 Aug 2026

ఈరోజు బంగారం కొనొచ్చా? షాకింగ్ రేట్స్ ఇవే!

హైదరాబాద్‌లో బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,750 పెరిగి రూ.1,45,750 కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,600 పెరిగి రూ.1,33,600 వద్దకు చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,09,310 గా నమోదైంది. కాబట్టి జ్యువెలరీ షాపింగ్ కి వెళ్లేముందు లేటెస్ట్ మార్కెట్ రేట్స్ ఒకసారి రీచెక్ చేసుకోవడం బెటర్.

పెళ్ళైన మహిళలకు 8 గ్రా. బంగారం, పట్టుచీర.. అసెంబ్లీలో ప్రకటన
News· 5 Aug 2026

పెళ్ళైన మహిళలకు 8 గ్రా. బంగారం, పట్టుచీర.. అసెంబ్లీలో ప్రకటన

తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఫైనాన్షియల్‌ ఇయర్‌కు ఫైనాన్స్ మినిస్టర్ మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళల వెల్ఫేర్‌కు ప్రయారిటీ ఇస్తూ కొత్త పథకాలను ప్రకటించారు. పెళ్ళైన మహిళలకు 8 గ్రాముల గోల్డ్ కాయిన్, పట్టుచీర అందించే ప్రత్యేక స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.812 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు భరోసా కల్పించడం, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

పేదవాడి ప్రాణానికి విలువ లేదా?
News· 5 Aug 2026

పేదవాడి ప్రాణానికి విలువ లేదా?

తిరుపతి ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసులు (55) అనారోగ్యంగా ఉండడంతో మంగళవారం రాత్రి 9:30 గంటలకు రుయా హాస్పిటల్ తీసుకొచ్చారు. బెడ్లు ఖాళీ లేవని చెప్పి అరగంట బయటే ఉంచడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సెక్యూరిటీ, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహమ్మద్ ఖదీర్‌బాబుకు ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారం’
Infotainment· 5 Aug 2026

మహమ్మద్ ఖదీర్‌బాబుకు ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారం’

నాలుగు దక్షిణాది భాషల్లో ఏటా ఒక్కో భాషా సాహితీకారుణ్ని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ అందిస్తున్న ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారాన్ని’ ఈసారి తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు అందుకోనున్నారు. భారతీయ సాహిత్యానికి ఖదీర్‌బాబు చేసిన సేవకు ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఫెస్టివల్‌ డైరెక్టర్‌ సతీష్‌ చప్పరికె ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులో ఆగస్టు 20–23వ తేదీల మధ్య నిర్వహిస్తున్న బుక్‌బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఈ పురస్కారాన్ని అందిస్తారు.

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. ఆ కాలేజీలపై కేసు
Crime· 5 Aug 2026

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. ఆ కాలేజీలపై కేసు

TG: HYDRA కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు హైడ్రా పేరును మిస్‌యూజ్ చేస్తూ ఫేక్ ఫైర్ NOC డాక్యుమెంట్స్‌ను క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు పంపినట్లు విచారణలో తేలింది. ఫైర్ NOCపై ఉన్న సంతకాలు ఫేక్ అని గుర్తించిన అధికారులు, ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చీకట్లో 4 కిలోమీటర్లు నడిచిన గర్భిణి
News· 5 Aug 2026

చీకట్లో 4 కిలోమీటర్లు నడిచిన గర్భిణి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టెంకబుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి శాంతికి అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఊరికి రోడ్డు సౌకర్యం లేక వాహనాలు గ్రామానికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు చీకట్లోనే సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో ఆమెను 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ కృష్ణాపురం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో శృంగవరపుకోట ఆసుపత్రికి తీసుకెళ్లారు.

LPG గ్యాస్ వాడేవారికి, ఖర్చు తగ్గించే ఆప్షన్ వచ్చేసింది!
Infotainment· 5 Aug 2026

LPG గ్యాస్ వాడేవారికి, ఖర్చు తగ్గించే ఆప్షన్ వచ్చేసింది!

ఇక పెద్ద గ్యాస్ సిలిండర్ అవసరం లేని వారికి 5 కిలోల ‘చోటూ’ LPG సిలిండర్ అందుబాటులోకి వచ్చింది. స్టూడెంట్స్, రెంట్ ఇళ్లలో ఉండేవారు, చిన్న కుటుంబాలు, తక్కువ గ్యాస్ వాడే వారికీ ఇది మంచి ఆప్షన్. ఈ సిలిండర్ కోసం ఆధార్, రేషన్ కార్డ్ వంటి ఐడీ ప్రూఫ్స్‌తో పొందవచ్చు. <a href="https://www.bharatpetroleum.in/our-businesses/bharatgas/bharatgas-mini">భారత్ గ్యాస్,</a> <a href="https://iocl.com/pages/chhotu-gas-cylinder">ఇండేన్,</a> <a href="https://www.hindustanpetroleum.com/pages/free-trade-lpg">HP గ్యాస్</a> డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఫస్ట్ టైమ్ సిలిండర్, రెగ్యులేటర్ కలిపి ఆర్డర్ చేసేవారికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ఖర్చు అవుతుంది. రీఫిల్ రేటు సిటీ, ఊరుని బట్టి మారుతుంది.

పార్లమెంట్ ఎదుట విపక్షాల మార్చ్
India· 5 Aug 2026

పార్లమెంట్ ఎదుట విపక్షాల మార్చ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నిరసనగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రేరణ స్థల్‌లోని గాంధీ విగ్రహం నుంచి మార్చ్ చేస్తూ నినాదాలు చేశారు. CJP నిరసనకారులపై పోలీసు లాఠీ ఛార్జ్, అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీపై నిరసన తెలిపారు.

బస్సులో మహిళకు గుండెపోటు
News· 5 Aug 2026

బస్సులో మహిళకు గుండెపోటు

కర్ణాటకలోని తుమకూరు–మధుగిరి మార్గంలో వెళ్తున్న బస్సులో ఒక మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. డ్రైవర్ ఆలస్యం చేయకుండా బుస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో టైమ్‌కి డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించగలిగారు. దీంతో ఆవిడ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులంతా డ్రైవర్ రియల్ హీరో అంటున్నారు.