Latest

నేను స్టాలిన్ కొడుకుని.. బెదిరింపులకు భయపడను: ఉదయనిధి
నటి త్రిషపై కామెంట్స్ చేశారంటూ తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేసి, ఆపై విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం తన తండ్రి స్టాలిన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఉదయనిధి 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తాను భయపడనని అన్నారు. 'నేను కలైంజర్ మనవడిని, ఎంకే స్టాలిన్ కొడుకుని, DMK కార్యకర్తను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. రైతుల కోసం ఒక్కసారి కాదు.. అవసరమైతే వందసార్లు అరెస్ట్ అవ్వడానికైనా సిద్ధమే. ప్రజాసేవను ఎలాంటి అణచివేత ఆపలేదు' అని తన పోస్టులో రాశారు.
పొలిటికల్ ఎంట్రీపై అభిజీత్ దీప్కే ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారా అని అడగ్గా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ రాజకీయ భావజాలాలను పక్కనబెట్టి, మన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే అంశాలపై పోరాడటం వల్లే తమ ఉద్యమం సక్సెస్ అయిందన్నారు. ప్రస్తుతం ఇండియాకు కావాల్సింది పొలిటికల్ పార్టీ కాదని, బలమైన ప్రజా ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు.

TVK తొలి బడ్జెట్.. ఎవరీ మేరీ విల్సన్?
తమిళనాడు అసెంబ్లీలో అధికార టీవీకే(తమిళగ వెట్రి కళగం) తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చదివారు. బి.టెక్, ఎంబీఏ అనంతరం హైదరాబాద్ జేఎన్‌టీయూ నుంచి మేనేజ్‌మెంట్ సైన్స్‌లో పీహెచ్‌డీ పొందిన వ్యక్తి ఆయన. జెప్పియార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్. 2025 జూన్‌లో టీవీకేలో చేరి, రాధాకృష్ణన్‌నగర్ నుంచి పోటీ చేశారు. డీఎంకే ఎమ్మెల్యే జె.జాన్ ఎబెనేజర్‌ను 49,668 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈరోజు బంగారం కొనొచ్చా? షాకింగ్ రేట్స్ ఇవే!
హైదరాబాద్‌లో బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,750 పెరిగి రూ.1,45,750 కి చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,600 పెరిగి రూ.1,33,600 వద్దకు చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,09,310 గా నమోదైంది. కాబట్టి జ్యువెలరీ షాపింగ్ కి వెళ్లేముందు లేటెస్ట్ మార్కెట్ రేట్స్ ఒకసారి రీచెక్ చేసుకోవడం బెటర్.

పెళ్ళైన మహిళలకు 8 గ్రా. బంగారం, పట్టుచీర.. అసెంబ్లీలో ప్రకటన
తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్‌కు ఫైనాన్స్ మినిస్టర్ మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళల వెల్ఫేర్‌కు ప్రయారిటీ ఇస్తూ కొత్త పథకాలను ప్రకటించారు. పెళ్ళైన మహిళలకు 8 గ్రాముల గోల్డ్ కాయిన్, పట్టుచీర అందించే ప్రత్యేక స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.812 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు భరోసా కల్పించడం, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
పేదవాడి ప్రాణానికి విలువ లేదా?
తిరుపతి ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసులు (55) అనారోగ్యంగా ఉండడంతో మంగళవారం రాత్రి 9:30 గంటలకు రుయా హాస్పిటల్ తీసుకొచ్చారు. బెడ్లు ఖాళీ లేవని చెప్పి అరగంట బయటే ఉంచడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సెక్యూరిటీ, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహమ్మద్ ఖదీర్‌బాబుకు ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారం’
నాలుగు దక్షిణాది భాషల్లో ఏటా ఒక్కో భాషా సాహితీకారుణ్ని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ అందిస్తున్న ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారాన్ని’ ఈసారి తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు అందుకోనున్నారు. భారతీయ సాహిత్యానికి ఖదీర్‌బాబు చేసిన సేవకు ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఫెస్టివల్ డైరెక్టర్ సతీష్ చప్పరికె ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులో ఆగస్టు 20–23వ తేదీల మధ్య నిర్వహిస్తున్న బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఈ పురస్కారాన్ని అందిస్తారు.

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. ఆ కాలేజీలపై కేసు
TG: HYDRA కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు హైడ్రా పేరును మిస్‌యూజ్ చేస్తూ ఫేక్ ఫైర్ NOC డాక్యుమెంట్స్‌ను క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు పంపినట్లు విచారణలో తేలింది. ఫైర్ NOCపై ఉన్న సంతకాలు ఫేక్ అని గుర్తించిన అధికారులు, ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చీకట్లో 4 కిలోమీటర్లు నడిచిన గర్భిణి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టెంకబుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి శాంతికి అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఊరికి రోడ్డు సౌకర్యం లేక వాహనాలు గ్రామానికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు చీకట్లోనే సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులో ఆమెను 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ కృష్ణాపురం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో శృంగవరపుకోట ఆసుపత్రికి తీసుకెళ్లారు.

LPG గ్యాస్ వాడేవారికి, ఖర్చు తగ్గించే ఆప్షన్ వచ్చేసింది!
ఇక పెద్ద గ్యాస్ సిలిండర్ అవసరం లేని వారికి 5 కిలోల ‘చోటూ’ LPG సిలిండర్ అందుబాటులోకి వచ్చింది. స్టూడెంట్స్, రెంట్ ఇళ్లలో ఉండేవారు, చిన్న కుటుంబాలు, తక్కువ గ్యాస్ వాడే వారికీ ఇది మంచి ఆప్షన్. ఈ సిలిండర్ కోసం ఆధార్, రేషన్ కార్డ్ వంటి ఐడీ ప్రూఫ్స్‌తో పొందవచ్చు. <a href="https://www.bharatpetroleum.in/our-businesses/bharatgas/bharatgas-mini">భారత్ గ్యాస్,</a> <a href="https://iocl.com/pages/chhotu-gas-cylinder">ఇండేన్,</a> <a href="https://www.hindustanpetroleum.com/pages/free-trade-lpg">HP గ్యాస్</a> డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఫస్ట్ టైమ్ సిలిండర్, రెగ్యులేటర్ కలిపి ఆర్డర్ చేసేవారికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ఖర్చు అవుతుంది. రీఫిల్ రేటు సిటీ, ఊరుని బట్టి మారుతుంది.
పార్లమెంట్ ఎదుట విపక్షాల మార్చ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నిరసనగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రేరణ స్థల్‌లోని గాంధీ విగ్రహం నుంచి మార్చ్ చేస్తూ నినాదాలు చేశారు. CJP నిరసనకారులపై పోలీసు లాఠీ ఛార్జ్, అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీపై నిరసన తెలిపారు.
బస్సులో మహిళకు గుండెపోటు
కర్ణాటకలోని తుమకూరు–మధుగిరి మార్గంలో వెళ్తున్న బస్సులో ఒక మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. డ్రైవర్ ఆలస్యం చేయకుండా బుస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో టైమ్‌కి డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించగలిగారు. దీంతో ఆవిడ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులంతా డ్రైవర్ రియల్ హీరో అంటున్నారు.

CM ఫారిన్ టూర్‌కి కోర్టు గ్రీన్ సిగ్నల్
TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో పర్మిషన్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతించింది. రూ.లక్ష బాండ్‌తోపాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. టూర్ వివరాలు, అక్కడ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు అందజేయాలని చెప్పింది.

కల్తీ మసాలాల తయారీపై స్పెషల్ ఫోకస్.. 3 కేసులు నమోదు
TG: కల్తీ మసాలా ఇన్‌గ్రిడియెంట్స్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. నిందితులపై BNS సెక్షన్ 110 కింద కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో నమోదైన 3 కేసులను SIT దర్యాప్తు చేస్తుంది. మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. టాక్సిక్ కెమికల్స్, సింథటిక్ పౌడర్లతో నాసిరకం మసాలాలు తయారు చేసి అమ్ముతున్న గ్యాంగ్‌పై ఇంటర్‌స్టేట్ నెట్‌వర్క్ ఫోకస్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

YSRCP లీడర్ ఇంట్లో బీహార్ ఈడీ ఆఫీసర్స్ రైడ్స్?
TG: HYD నగరంలో ఈడీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. YSRCP లీడర్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. హైదరాబాద్, వైజాగ్‌లోని ఐదు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. రూ.3,000 కోట్ల చిట్‌ఫండ్స్ స్కామ్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కేసుకు సంబంధించి బిహార్‌కు చెందిన ఈడీ టీమ్ ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తల్లీకూతుళ్లపై హిందూ రక్షాదళ్ దాడి
యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్‌లో దీప, ఆమె తల్లి సుమనలపై కొందరు దాడి చేశారు. వారు ఓ ఆవును ఇంటికి తీసుకెళ్తుండగా హిందూ రక్షాదళ్‌కు చెందిన సప్నా అగర్వాల్ తదితరులు వాళ్లని ఆపి, ఆవును దొంగిలించినట్టు అనుమానించి తిట్టి, కొట్టారు. తాము పశువులు పెంచే కుటుంబమని బాధితులు చెప్పినా నమ్మలేదు. పోలీసులు వచ్చి వారిని విడిపించారు. దీప ఫిర్యాదు మేరకు సప్నా అగర్వాల్‌తోపాటు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆవును గోశాలకు తరలించారు.

'రామాయణ' డ్రెస్‌లపై డిజైనర్ల క్లారిటీ!
'రామాయణ' సినిమాలో సాయిపల్లవి, లారా దత్తాల డ్రెస్‌లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దీనిపై కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా స్పందించారు. 'త్రేతాయుగంలో ఎలాంటి బట్టలు వేసుకునేవారో కచ్చితమైన ఆధారాల్లేవు. ఇప్పటి యూత్‌కి ఈ కథ బాగా కనెక్ట్ అవ్వాలనే ఇలా డిజైన్ చేశాం. కేవలం వాళ్ల లుక్స్ మాత్రమే చూడకుండా, ఆ పాత్రల్లోని ఎమోషన్స్‌ను అర్థం చేసుకోండి' అని చెబుతున్నారు.
'Infotainment' వార్తలు
మారిన కాలానికి అనుగుణంగా మనం మారకపోతే వెనకబడిపోతామని BRS అధ్యక్షుడు KTR అన్నారు. రాయిటర్స్ సర్వే ప్రకారం, 18 నుంచి 24 ఏళ్ల యువత 56 శాతానికి పైగా వార్తలను, పేపర్లు లేదా TVల ద్వారా కాకుండా, సోషల్ మీడియా (Instagram Reels, WhatsApp, FB) లో వస్తున్న 'ఇన్ఫోటైన్మెంట్' (Information + Entertainment) రూపంలోనే పొందుతున్నారని ఆయన తెలిపారు.

ఉధయనిధి కామెంట్స్‌పై.. నటి ఖుష్బూ రియాక్ట్
ఉధయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై నటి ఖుష్బూ స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. మహిళలను కించపరిచే, జెండర్ డిస్క్రిమినేషన్‌ను ఎంకరేజ్ చేసే వ్యాఖ్యలు గతంలో కూడా డీఎంకేలో చూశానని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఉధయనిధి నుంచి ఇలాంటి అసభ్యకర కామెంట్స్ ఊహించలేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని ఖుష్బూ తప్పుబట్టారు.

Bye-bye to cold water!
చల్లని WATER నీళ్ల కంటే నార్మల్ WATER (రూమ్ టెంపరేచర్) తాగడమే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదంతో పాటు డాక్టర్లు కూడా చెప్తున్నారు. నార్మల్ WATER తాగితే శరీరంలోకి త్వరగా ఇంకిపోయి, కణాలకు వెంటనే హైడ్రేషన్ ను ఇస్తాయి. ఇది జీర్ణక్రియను పెంచడమే కాకుండా, మెటబాలిజాన్ని వేగవంతం చేసి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా హెల్ప్ అవుతాయి.

మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్!
AIతో వస్తున్న 'డీప్‌ఫేక్' ఫోటోలు, వీడియోలు చూసి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు. తన ప్రమేయం లేకుండా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అస్సలు సరికాదని మండిపడ్డారు. నా ఫేస్‌ను వాడుతూ ఇలాంటి నకిలీ కంటెంట్ క్రియేట్ చేయడం, షేర్ చేయడం చట్ట ప్రకారం నేరం. ఇప్పటికైనా ఈ పనులు ఆపకపోతే సీరియస్ legal action తీసుకుంటాను, అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.