← Back to news

CM ఫారిన్ టూర్‌కి కోర్టు గ్రీన్ సిగ్నల్

By విశీ· 5 Aug 2026
CM ఫారిన్ టూర్‌కి కోర్టు గ్రీన్ సిగ్నల్

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో పర్మిషన్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతించింది. రూ.లక్ష బాండ్‌తోపాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. టూర్ వివరాలు, అక్కడ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు అందజేయాలని చెప్పింది.

More in TG