Latest

Appleను ఇండియాలోనే కట్టిపడేయడానికి కొత్త ట్యాక్స్ ప్లాన్..
Technology· 4 Aug 2026

Appleను ఇండియాలోనే కట్టిపడేయడానికి కొత్త ట్యాక్స్ ప్లాన్..

విదేశీ కంపెనీలు తమ మెషినరీని ఇండియాలోని కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్స్‌కు ఇచ్చి ప్రొడక్ట్స్ తయారు చేయించినప్పుడు లభించే ట్యాక్స్ మినహాయింపును 2041 వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. Apple కంపెనీ కూడా గతంలో ఈ ట్యాక్స్ రూల్స్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రిలీఫ్ అమల్లోకి వస్తే యాపిల్‌తో పాటు ఇతర విదేశీ కంపెనీలు కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్‌ను మరింత పెంచే అవకాశం ఉంది

'దూకుడు' ఈజ్ బ్యాక్.. మహేష్ ఫ్యాన్స్ రెడీనా?
Cinema· 4 Aug 2026

'దూకుడు' ఈజ్ బ్యాక్.. మహేష్ ఫ్యాన్స్ రెడీనా?

మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్..! బ్లాక్‌బస్టర్ హిట్ 'దూకుడు' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ రీ-రిలీజ్ అవుతోంది, దీనికి ట్రైలర్ కూడా వచ్చేసింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్-కామెడీ అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్ . ఈసారి బిగ్ స్క్రీన్‌పై మహేష్ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.

LIC Share ఒక్కరోజే 9% పైగా Down.. అసలేం జరిగింది?
Politics· 4 Aug 2026

LIC Share ఒక్కరోజే 9% పైగా Down.. అసలేం జరిగింది?

కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో 6.5% వరకు అమ్మేందుకు ఆఫర్ ఫర్ సేల్(OFS) తీసుకొచ్చింది. ఒక్కో షేర్‌కు ₹382 ఫ్లోర్ ప్రైస్ పెట్టగా, ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ ₹428.50తో పోలిస్తే ఇది దాదాపు 11% తక్కువ. దీంతో LIC షేర్‌పై సెల్లింగ్ ప్రెజర్ పెరిగి, ఒక దశలో స్టాక్ 9.26% వరకు పడిపోయింది. ఈ సేల్ పూర్తిగా జరిగితే ప్రభుత్వానికి దాదాపు ₹31,400 కోట్లు రావొచ్చని అంచనా. LICలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ పెంచేందుకు కూడా ఈ సేల్ ఉపయోగపడనుంది.

రివెంజ్ విత్ మర్డర్.. టీచర్‌ను అతి కిరాతకంగా చంపిన సైకో!
Crime· 4 Aug 2026

రివెంజ్ విత్ మర్డర్.. టీచర్‌ను అతి కిరాతకంగా చంపిన సైకో!

హరియాణాలోని ఫరీదాబాద్‌ సరస్వతి స్కూల్లో పనిచేస్తున్న సంధ్య (29) అనే టీచర్‌ను అమిత్ (21) అనే యువకుడు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. పాఠశాల గేటు వద్ద కేవలం 30 సెకండ్లలోనే 27 సార్లు దారుణంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ ను కూడా బెదిరించి, అక్కడి నుండి బైక్‌పై పారిపోయాడు. గతంలో సంధ్య అతనిపై వేధింపుల కేసు పెట్టడంతో క్షమాపణ చెప్పిన నిందితుడు, మనసులో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడు. పోలీసులు అతడిని కేవలం రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు.

AP ప్రభుత్వం షాకింగ్ డెసిషన్!
Politics· 4 Aug 2026

AP ప్రభుత్వం షాకింగ్ డెసిషన్!

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ DGP A.B. వెంకటేశ్వరరావు సెక్యూరిటీని AP ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆయనకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ కార్, భద్రతా సిబ్బందిని తొలగిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇతర మాజీ పోలీస్ అధికారులకు సెక్యూరిటీ కొనసాగుతుండగా, A.B.V కి మాత్రం సెక్యూరిటీ రద్దు చేయడం పెద్ద చర్చగా మారింది. 2014-19 మధ్య TDP ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఈమధ్యే ప్రభుత్వ నిర్ణయాలపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. దాంతో పొలిటికల్ కారణాల వల్లే భద్రత తీసేశారనే టాక్ మొదలైంది.

🌍 ప్రపంచ వేదికపై విజయవాడ విద్యార్థి..
Technology· 4 Aug 2026

🌍 ప్రపంచ వేదికపై విజయవాడ విద్యార్థి..

విజయవాడ విద్యార్థి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు! బ్లూమింగ్‌డేల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి నరేన్ తుమ్మల.. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సింపోజియంలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా క్వాంటమ్ కంప్యూటింగ్‌పై తన రీసెర్చ్‌ను ప్రెజెంట్ చేశాడు. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్లలో వచ్చే ఎరర్లను ఎలా తగ్గించొచ్చో వివరించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

🧠 పిల్లల స్ట్రెస్‌కు అసలు కారణం ఎగ్జామ్స్ కాదట!
Politics· 4 Aug 2026

🧠 పిల్లల స్ట్రెస్‌కు అసలు కారణం ఎగ్జామ్స్ కాదట!

"పిల్లలకు స్ట్రెస్ అంటే ఎగ్జామ్సే కారణం" అనుకుంటున్నారా? కొత్త స్టడీ మాత్రం వేరే విషయం చెబుతోంది. బెంగళూరులో వేలాది కౌన్సెలింగ్ సెషన్ల ఆధారంగా చేసిన ఈ స్టడీలో, పరీక్షల కంటే ఇంట్లోని గొడవల వల్లే ఎక్కువ మంది విద్యార్థులు సహాయం కోరినట్టు తేలింది. Anxiety ఇప్పటికీ టాప్‌లో ఉండగా, 16–18 ఏళ్ల విద్యార్థుల్లో సెల్ఫ్-హార్మ్ ఆలోచనలు కూడా ఎక్కువగా కనిపించాయి. సింపుల్‌గా చెప్పాలంటే... పిల్లల స్ట్రెస్‌కు ఎగ్జామ్స్ మాత్రమే కాదు, ఇంట్లో జరిగే విషయాలు కూడా కారణమవుతున్నాయి.

Alarm మోగగానే Snooze కొడుతున్నారా..?
Education· 4 Aug 2026

Alarm మోగగానే Snooze కొడుతున్నారా..?

అలారం మోగింది.. “ఇంకో 5 మినిట్స్” అంటూ స్నూజ్ కొడుతున్నారా..? 😴 ఒక్కసారి కాదు.. మళ్లీ మళ్లీ స్నూజ్ చేస్తుంటే నిద్ర పదే పదే డిస్టర్బ్ అవుతుంది. దీంతో లేచిన తర్వాత కూడా మత్తుగా, ఫ్రెష్‌గా లేనట్టు అనిపించొచ్చు. అయితే స్నూజ్ చేయడం ప్రతి ఒక్కరికీ హానికరమే అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. రెగ్యులర్‌గా సరిపడా నిద్రపోవడం, ప్రతిరోజూ ఒకే టైమ్‌కు లేవడం బెటర్. అలారం రోజూ మీతో “ఇంకో 5 మినిట్స్” యుద్ధం చేస్తుంటే.. అసలు మీ స్లీప్ టైమ్‌నే చెక్ చేయాల్సిన టైమ్ కావచ్చు!

ఇక బ్లైండ్ పీపుల్ కూడా చూడగలరు- ఎలాన్ మస్క్
Technology· 4 Aug 2026

ఇక బ్లైండ్ పీపుల్ కూడా చూడగలరు- ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ తన కంపెనీ 'న్యూరాలింక్' ద్వారా కంటి చూపు లేని వారి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పారు. నెక్స్ట్ 6 నుండి 12 మంత్స్‌లో బ్లైండ్ పీపుల్ కోసం కొత్త విజన్ ఇంప్లాంట్స్ టెస్ట్ చేయబోతున్నారు. బ్రెయిన్‌లోని చూపుకి సంబంధించిన పార్ట్‌కి డైరెక్ట్‌గా సిగ్నల్స్ పంపడం వల్ల, కంప్లీట్‌గా చూపు లేని వాళ్ళు కూడా మళ్ళీ చూడగలుగుతారు. ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీతో ఇన్ఫ్రారెడ్, ఆల్ట్రావయోలెట్ కిరణాలు కూడా చూడవచ్చని, ఇది ఒక 'సూపర్‌పవర్' లాగా పనిచేస్తుందని మస్క్ చెప్పారు.

నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరో!
Cinema· 4 Aug 2026

నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరో!

నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ మూవీ పూజా సెరెమొనీలో పాల్గొన్న నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. తన కెరియర్ స్టార్ట్ అవ్వకముందు నుంచే నితిన్ తనకు మంచి ఫ్రెండ్ అని, 'జయం', 'ఇష్క్' వంటి లవ్ స్టోరీలతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు. మురళీ కాంత్ దేవసోత్ డైరెక్షన్‌లో దీప్తి గంట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ చాలా స్పెషల్‌గా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలిపారు.

PM మోదీ వీడియో డిలీట్.. మెటాకి కేంద్రం షాక్!
Politics· 4 Aug 2026

PM మోదీ వీడియో డిలీట్.. మెటాకి కేంద్రం షాక్!

PM నరేంద్ర మోదీ వీడియో పోస్ట్‌ను ఫేస్‌బుక్ డిలీట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆటోమేటిక్ ఫిల్టర్ల వల్ల ఈ మిస్టేక్ జరిగిందని మెటా చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌పై గవర్నమెంట్ సాటిస్‌ఫై అవ్వలేదు. దీంతో మెటా పబ్లిక్ పాలసీ హెడ్ జో కాఫ్నస్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ టెక్నికల్ టీమ్‌ను నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసలు సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, యూజర్ల డేటా ప్రైవసీపై ఎలాంటి సెక్యూరిటీ యాక్షన్స్ తీసుకుంటున్నారో క్లియర్‌గా చెప్పాలని ఆర్డర్స్ పాస్ చేసింది.

పట్టపగలే షాకింగ్ మర్డర్!
Crime· 4 Aug 2026

పట్టపగలే షాకింగ్ మర్డర్!

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో పట్టపగలే ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. పాత కక్షల వల్ల ఆమేర్ (35) అనే వ్యక్తిపై సుమన్ అనే అతడు కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమేర్‌ను ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లగా, అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు.

ప్రపంచంలోని డేంజరస్ అగ్నిపర్వతం మళ్లీ యాక్టివ్ 🌋
Viral· 4 Aug 2026

ప్రపంచంలోని డేంజరస్ అగ్నిపర్వతం మళ్లీ యాక్టివ్ 🌋

సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్, డేంజరస్ అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో (Fuego) మళ్లీ పేలింది. లావా, బూడిద, మంటల్లా వేడిగా ఉండే గ్యాస్‌లు కిందికి దూసుకొస్తుండటంతో రెండు గ్రామాల ప్రజలను సేఫ్ ప్లేస్‌లకు తరలించారు. దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు స్కూల్స్‌కు సెలవులు ఇచ్చి, ఎవరూ అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇంకా భారీగా బూడిద గాలిలో వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు.

మళ్లీ YSRCPలోకి విజయసాయిరెడ్డి?
Politics· 4 Aug 2026

మళ్లీ YSRCPలోకి విజయసాయిరెడ్డి?

AP: రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకు హఠాత్తుగా దూరమైన YSRCP మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మరోసారి జగన్‌తో కలవబోతున్నారా? ఈ టాపిక్ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల విజయసాయిరెడ్డి సిగ్నల్ ఇవ్వడంతోపాటు సొంతంగా డిజిటల్ మీడియా వేదికను రెడీ చేసుకుంటుండటంతో ఆయన రీ-ఎంట్రీ ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఆయన మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే వస్తారనే టాక్ నడుస్తోంది.

ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌పై కన్వరియాల దాడి
India· 4 Aug 2026

ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌పై కన్వరియాల దాడి

లక్నోలో చారక్ క్రాసింగ్ వద్ద ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌పై కన్వరియాలు దాడి చేసిన ఘటన కలకలంగా మారింది. వ్యాన్‌లో నర్సరీ నుంచి 5-6 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు. మూడు మోటార్‌సైకిళ్లపై ఆరుగురు కాన్వరియాలు వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ చిన్నగా డ్యాష్ ఇచ్చారు. వాళ్లు డ్రైవర్‌ను దూషించి, వ్యాన్ వెనుక అద్దం, సైడ్ మిర్రర్లు పగలగొట్టారు. పిల్లలు భయపడగా, ఆలస్యమై ఓ అమ్మాయి టెస్ట్ కూడా మిస్ అయింది. పోలీసులు సీసీటీవీ, నంబర్ ప్లేట్ల ద్వారా వాళ్లని గుర్తించి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

August 12న పగలే చీకటి..?
Politics· 4 Aug 2026

August 12న పగలే చీకటి..?

పట్టపగలే సూర్యుడు కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది..? 🌑😳 ఆగస్టు 12, 2026న టోటల్ సోలార్ ఎక్లిప్స్ జరగనుంది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ సహా కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేసే అద్భుతమైన వ్యూ కనిపించనుంది. ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పార్షియల్ ఎక్లిప్స్ కనిపిస్తుంది. ఈ అరుదైన ఈవెంట్‌ను చూడటానికి ఇప్పటికే స్కైవాచర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సూర్యుడిని డైరెక్ట్‌గా చూడకుండా సర్టిఫైడ్ ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించడం తప్పనిసరి.

ఆయిల్ ప్రైస్ ఒక్కరోజులో 5% Down⛽
World· 4 Aug 2026

ఆయిల్ ప్రైస్ ఒక్కరోజులో 5% Down⛽

మిడిల్ ఈస్ట్‌లో ఒక్క అనౌన్స్‌మెంట్.. ఆయిల్ ధరల్లో భారీ మార్పు! ⛽📉 ఇరాన్‌పై దాడులను ప్రస్తుతానికి ఆపుతున్నట్లు ట్రంప్ చెప్పడంతో సోమవారం గ్లోబల్ ఆయిల్ ధరలు దాదాపు 5% పడిపోయాయి. మంగళవారం మాత్రం కొంత రికవరీ కనిపించింది. బ్రెంట్ క్రూడ్ సుమారు $84.75 దగ్గర ట్రేడ్ అయింది. US–Iran మధ్య టెన్షన్ తగ్గితే ఆయిల్ సప్లైపై ఉన్న భయం తగ్గొచ్చనే ఆశ మార్కెట్స్‌లో కనిపిస్తోంది. కానీ హోర్ముజ్ పరిస్థితి ఇంకా క్లియర్ కాకపోవడంతో ఆయిల్ మార్కెట్ ఫుల్‌గా రిలాక్స్ కాలేదు.

FAKE or FACT..RSS యూనిఫాం మారబోతుందా?
Viral· 4 Aug 2026

FAKE or FACT..RSS యూనిఫాం మారబోతుందా?

RSS(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సభ్యుల యూనిఫాం మారబోతుందని, Gen Z కోసం బ్యాగీ ప్యాంట్లు, క్యాప్స్, టీ-షర్టులు వేసుకుంటున్నారని ఓ వార్త నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది నిజమేనా? కాదు. ఈ పోస్ట్ ‘The Fauxy’ అనే సెటైరికల్ వెబ్‌సైట్ నుంచి వచ్చింది. వాళ్లు నకిలీ, సరదా వార్తలు రాయడంలో ఫేమస్. ఇది కూడా అలాంటిదే! RSS ఇప్పటికీ తమ సంప్రదాయ యూనిఫాంనే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది FAKE.

గాజా పీస్ ప్లాన్ ఒకవైపు.. గ్రౌండ్‌లో అటాక్స్ మరోవైపు!
Politics· 4 Aug 2026

గాజా పీస్ ప్లాన్ ఒకవైపు.. గ్రౌండ్‌లో అటాక్స్ మరోవైపు!

పీస్ డీల్ ముందుకు వెళ్తోందంటున్నారు.. కానీ గాజాలో పరిస్థితి మాత్రం వేరేలా ఉందా? హమాస్‌ను నిరాయుధం చేసి యుద్ధాన్ని ముగించే ప్లాన్‌ ముందుకు వెళ్తోందని ట్రంప్ చెబుతున్నా, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన దాడుల్లో 18 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు Reuters తెలిపింది. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ముందుగా ఆయుధాలు వదలాలని అంటుండగా, హమాస్ ఇజ్రాయెల్ ముందుగా దాడులు ఆపి వెనక్కి వెళ్లాలని చెబుతోంది. అంటే పీస్ ప్లాన్ ఉన్నా.. “ఫస్ట్ ఎవరు?” అన్న దగ్గరే పెద్ద సమస్య కొనసాగుతోంది.

📈 ఏపీ వృద్ధి తెలంగాణ కంటే ఎక్కువ: చంద్రబాబు
Politics· 4 Aug 2026

📈 ఏపీ వృద్ధి తెలంగాణ కంటే ఎక్కువ: చంద్రబాబు

AP Economy గురించి CM చంద్రబాబు నాయుడు డేటా రిలీజ్ చేశారు. 2024–26లో ఏపీ growth rate 11.3% గా నమోదై తెలంగాణ 10.7% కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.2019–24లో AP Growth 13.5% నుంచి 10.3%కి పడిపోయిందని చంద్రబాబు చెప్పారు. అమరావతికి ₹10,000 కోట్లు, పోలవరానికి ₹8,300 కోట్లు ఇచ్చి Investors నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చామని అన్నారు. ఈ నంబర్స్‌పై ఇప్పుడు AP రాజకీయాలు హీట్ ఎక్కేలా ఉన్నాయి.

ఆ రెండు రోజులు హరీశ్ రావు ఎక్కడున్నారు- మహేష్ కుమార్ గౌడ్
Politics· 4 Aug 2026

ఆ రెండు రోజులు హరీశ్ రావు ఎక్కడున్నారు- మహేష్ కుమార్ గౌడ్

TG: రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు 'క్షుద్ర పూజలు' చేస్తున్నారని TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అరుంధతి సినిమా తరహాలో తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ఆలయాల్లో పూజలు నిర్వహించారని, తమ వద్ద పక్కా Proofs ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 2, జూలై 23 తేదీల్లో హరీశ్ రావు ఎక్కడున్నారో క్లారిటీ ఇవ్వాలని, రాజకీయ స్వార్థం కోసమే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.