Latest
రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి
సౌత్ రష్యాలోని ఓ బీచ్‌పై డ్రోన్ ఎటాక్ జరగడంతో ముగ్గురు పిల్లలతోపాటు ఏడుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం 40 మంది గాయపడగా, వారిలో 17 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. దాడి వెనుక ఉక్రెయిన్ ఉందని క్రాస్నోడార్ ప్రాంత గవర్నర్ వెనియామిన్ కొండ్రాత్యేవ్ ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. పౌరులపై కావాలనే దాడులు చేయడం లేదని ఇరు దేశాలు చెబుతున్నాయి. దాడికి ముందు ఎలాంటి సైరన్లు మోగలేదని స్థానికులు, టూరిస్టులు మీడియాకు తెలిపారు.

ఫైబర్ : జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు
ఆరోగ్యంగా ఉండడానికి పీచు పదార్థం (ఫైబర్) ఎంతో అవసరం. ఓట్స్, చియా సీడ్స్, పప్పు ధాన్యాలు, నల్ల శనగలు, పెసర్లు, బ్రాకోలీతో పాటు జామ, యాపిల్, బేరి వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువును అదుపులో ఉంచడానికి, కడుపు నిండినట్లు అనిపించి అతిగా తినకుండా సహాయపడుతుంది. ఫైబర్ ఉన్న ఆహారాన్ని రోజువారీ ఆహారంలో తీసుకోని ఆరోగ్యంగా ఉండండి.

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక
AP: మార్కాపురం జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో అప్పుల భారంతో మనస్తాపానికి గురైన రైతు కోడావత్ పెద్ద రామయ్య (46) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు ఎకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన ఆయనకు గత కొన్నేళ్లుగా పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర అప్పులు అయ్యాయి. మనస్తాపంతో గత నెల 23న పొలం వద్ద పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎంత సమయం నిద్రపోతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి!
రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి, సహనం తగ్గిపోతాయి. అంతేకాకుండా ఏకాగ్రత తగ్గడం, కండరాల రికవరీ మందగించడం, గాయపడే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 8 గంటలు నిద్రపోతే శరీరానికి కావాల్సినంత బలం, పూర్తి ఎనర్జీ లభిస్తాయి. ఇది కండరాల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా రోగనిరోధక శక్తిని శక్తివంతంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి 8 గంటల నిద్ర చాలా అవసరం.
విన్‌ఫాస్ట్ కారులో లోపాలు.. రీఫండ్ కోసం కస్టమర్ డిమాండ్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని షోరూంలో రూ.25 లక్షలకు కొన్న విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారులో లోపాలున్నాయని కస్టమర్ నల్లం ఫణి కుమార్ రాజా ఆరోపించారు. ఏసీ డ్రెయిన్ పైపు డిజైన్ లోపం వల్ల నీరు కార్పెట్ కింద నిలిచి ఫ్లోర్ తడిసిపోయిందని తెలిపారు. సర్వీస్ సెంటర్ ఇష్యూను పూర్తిగా సాల్వ్ చేయలేదని, కంపెనీకి చాలాసార్లు కంప్లైంట్ చేసినా రెస్పాండ్ కాలేదన్నారు.. కారును వెనక్కి తీసుకుని డబ్బును రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తానని అన్నారు.

ChatGPT Phone వస్తుందా..?
చాట్‌జీపీటీని ఫోన్‌లో వాడుతున్నాం... రేపు చాట్‌జీపీటీ కోసమే ప్రత్యేక డివైస్ వస్తుందా..? 👀🤖 OpenAI తన ఏఐ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు “ఫ్యామిలీ ఆఫ్ డివైసెస్” తయారు చేస్తోందని కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ చెప్పారు. అది స్మార్ట్ స్పీకరా, వేరబుల్ డివైసా అనే విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. కానీ కొత్త డివైసెస్ త్వరలో వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో కంప్యూటర్లతో చేసే చాలా పనులు టైపింగ్ కంటే వాయిస్ ద్వారానే జరుగుతాయని ఆయన భావిస్తున్నారు.

బెండకాయతో ఆరోగ్యానికి లాభాలు..
బెండకాయ రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, పోషకాల నిలయం కూడా. ఇందులో విటమిన్ A, C, ఫైబర్ ఉండటంతో కంటి చూపు, చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి. జీర్ణక్రియకు తోడ్పడి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని వ్యాధులకు చికిత్స కాదని, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని సూచిస్తున్నారు.

అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలి: ఉత్తమ్
తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా సాధించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరునెలల్లో అనుమతులు పొందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్ర ప్రాజెక్టులకు అనుకూల అవకాశాలు కల్పించిందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను సరిదిద్ది మళ్లీ సమర్పించాలని తెలిపారు.

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ డ్వాక్రా మహిళలకు భారీ ఊరటనిచ్చింది. CM ఆదేశాల మేరకు జూలై 1 నుంచి తీసుకున్న రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఫీజులతో పాటు డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో, పాస్‌బుక్ అప్‌డేషన్, ఏసీహెచ్ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను రద్దు చేసింది. అలాగే రూ.5లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును 13శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. రాష్ట్రంలో ఈ బ్యాంకు పరిధిలో సుమారు 3 లక్షల డ్వాక్రా సంఘాలు, 30లక్షల మంది మహిళలు ఉండగా, ఈ నిర్ణయంతో వారికి ఆర్థిక ఉపశమనం లభించనుంది.

పుట్టినగడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి
తెలంగాణ అభివృద్ధిలో NRIలు భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన 19వ ఆట మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానం అందుబాటులో ఉందన్నారు. ప్రవాసులు తమ విజ్ఞానం, అనుభవాన్ని సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు మరింత వేగంగా డిజిటల్ సేవలు
తెలంగాణలో ప్రజలకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు మీ సేవ కేంద్రాలను ఆధునీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిజిటల్ ఇండియా–వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై సమీక్షించారు.

ఎల్‌నినో ఎఫెక్ట్.. ముందస్తు చర్యలకు CM సూచనలు
AP: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎల్‌నినో ప్రభావం, రిజర్వాయర్లలో నీటి లభ్యతను నిరంతరం అంచనా వేయాలని సూచించారు. కృష్ణా బేసిన్‌కు వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని, పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

అత్యాధునిక వైద్యంలో నిమ్స్ కొత్త చరిత్ర
TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి రోబోటిక్ సర్జరీల్లో మరో చారిత్రక ఘనత సాధించింది. రోబోటిక్ సర్జరీ సేవలు ప్రారంభించిన మూడేళ్లలోనే 1000 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రికార్డు సృష్టించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సలను నిమ్స్‌లో ఎక్కువ శాతం మంది పేదలకు ఆరోగ్యశ్రీ, CMRF పథకాల ద్వారా ఉచితంగా అందించారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ విజయాన్ని సాధించింది.
సూర్య-జ్యోతిక ఫోటోషూట్!
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికల లేటెస్ట్ ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' మేగజైన్ కవర్ షూట్ కోసం ఈ క్యూట్ జోడీ రకరకాల ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో చాలా ఫోజులిచ్చారు. షూటింగ్ బిహైండ్ ద సీన్స్ విజువల్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇస్రోలో రాజీనామాలు.. ఆందోళన అవసరమా?
ఇటీవల ఓ YouTube ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా. మైల్స్వామి అన్నాదురై, ఇస్రోలో రాజీనామాలను ప్రతికూలంగా చూడొద్దన్నారు. ప్రైవేట్ స్పేస్ కంపెనీలు, స్టార్టప్‌ల పెరుగుదలతో శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఇస్రోలో కఠిన శిక్షణ పొందిన చాలామంది బయటకు వెళ్లి సొంత సంస్థలు స్థాపిస్తూ, అదే నైపుణ్యాన్ని దేశ ప్రైవేట్ స్పేస్ రంగానికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోటీ పెరగడమే కాదు, భారత స్పేస్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతోందని అన్నారు.
యువత వైరల్ ప్రొటెస్ట్!
సోషల్ మీడియాలో కొందరు యువకులు డ్రైనేజీ సమస్యలు, పాడైపోయిన రోడ్లు, ఆసుపత్రుల్లో డాక్టర్లు మరియు స్కూళ్లలో టీచర్లు లేకపోవడంపై వినూత్నంగా నిరసన తెలిపారు. పాటలు పాడుతూ, సరదాగా డ్యాన్స్ చేస్తూ "కిధర్ హై" (ఎక్కడున్నారు?) అంటూ లోకల్ ఇష్యూస్‌ని హైలైట్ చేశారు. చెత్తకుప్పలు, గుంతల రోడ్ల ముందే పర్ఫార్మెన్స్ చేస్తూ అధికారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్ అప్రోచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తల్లిపాలతో కలిగే బెనిఫిట్స్ ఇవే!
మదర్ ఫీడింగ్ వల్ల పిల్లలకు లైఫ్‌లాంగ్ వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎక్స్‌పర్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. తల్లి పాలు తాగడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇందులోని DHA, ARA వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్, IQ లెవెల్స్ బాగా పెరుగుతాయి. చిన్నప్పుడే ఒబేసిటీ రాకుండా ప్రాపర్ గ్రోత్ ఉండటంతో పాటు ఫ్యూచర్‌లో ఆస్తమా, టైప్-1 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మ-పాప మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరిగి పిల్లల మెంటల్ హెల్త్‌కి ఎంతగానో హెల్ప్ అవుతుంది.

2029లో ఓటింగ్ పవర్ Gen Z చేతుల్లోకి..?
2029 Electionsలో అసలు Game Changers Gen Zనేనా..? 👀 ఇండియాలో 2029 లోక్‌సభ ఎన్నికల టైమ్‌కి జెన్ జీ దేశంలోనే అతిపెద్ద అడల్ట్ జనరేషన్‌గా మారనుందని అంచనాలు చెబుతున్నాయి. 18–32 ఏళ్ల మధ్య ఉన్న జెన్ జీ జనాభా దాదాపు 38 కోట్లు ఉండొచ్చని, ఇది 2029లో ఓటు వేయడానికి అర్హులైన వారిలో దాదాపు నలుగురిలో ఒకరికి సమానమని NDTV తెలిపింది. అదే సమయంలో మిలీనియల్స్ సుమారు 35.7 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే 2029లో జాబ్స్, ఎడ్యుకేషన్, ఏఐ, డిజిటల్ రైట్స్ లాంటి యూత్ ఇష్యూస్ పొలిటికల్ పార్టీలకు మరింత ఇంపార్టెంట్ కావచ్చు.

సిస్టమ్ అంతా అతన్నే కాపాడింది- రెజ్లర్ వినేష్ ఫోగట్
లైంగిక వేధింపుల కేసులో WFI మాజీ చీఫ్ బ్రజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్ <a href="https://x.com/Phogat_Vinesh/status/2084179633893961951?s=20">వినేష్ ఫోగట్</a>, వ్యవస్థ అంతా ఆయనను కాపాడటానికే పనిచేసిందని ఆరోపించారు. అధికార బలంతో ఎంతోమంది బాధితులను భయపెట్టారని, అయినా తాము వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై త్వరలోనే పైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు.

AIపై హరారి హెచ్చరిక
ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత <a href="https://en.wikipedia.org/wiki/Yuval_Noah_Harari">యువాల్ నోవా హరారి</a> ఇటీవల AI భవిష్యత్‌పై జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. AI ఇక కేవలం టూల్ కాదు.. సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏజెంట్‌గా మారుతోందన్నారు. ఇది భాష, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే AI Safety, కఠిన నియంత్రణలు, నిజాన్ని గుర్తించే సామర్థ్యంపై ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

వర్కవుట్స్ బంద్.. రెస్ట్ మోడ్‌లో రష్మిక!
హీరోయిన్ <a href="https://www.instagram.com/p/DblEDJIiQ3l/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==">రష్మిక</a> మందన్నా వరుసగా మూడోసారి గాయపడి సోషల్ మీడియా వేదికగా ఒక అప్‌డేట్ షేర్ చేశారు. 'మైసా' సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తూ ఆమె కుడి హిప్ టెండన్ దెబ్బతిన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక, డాక్టర్ల సలహా మేరకు వర్కవుట్స్, రన్నింగ్‌కు దూరంగా ఉంటూ కాస్త రెస్ట్ మోడ్‌లో ఉన్నానని చెప్పారు. ఫ్యాన్స్ ఎవరూ కంగారు పడొద్దని, త్వరలోనే ఫుల్ రికవరీతో తిరిగి వస్తానని ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులకు ధైర్యం చెప్పారు.