Latest

మూన్‌కి గ్రాండ్ స్మాష్: ఖగోళంలో అల్టిమేట్ క్రాష్ అలర్ట్!
Infotainment· 1 Aug 2026

మూన్‌కి గ్రాండ్ స్మాష్: ఖగోళంలో అల్టిమేట్ క్రాష్ అలర్ట్!

అమెరికాకు చెందిన 'స్పేస్‌ఎక్స్' రాకెట్ శకలం ఐదు రోజుల్లో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టబోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ శకలం 4,500 కేజీల బరువు, 12 మీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. గంటకు 8,700 కిలోమీటర్ల తీవ్ర వేగంతో చంద్రుడిని తాకే అవకాశం ఉందని వెల్లడించారు. బలమైన తాకిడి వల్ల చంద్రుడిపై గుంత ఏర్పడటంతో పాటు భారీగా ధూళి, శకలాలు పైకి ఎగిసిపడనున్నాయి. అంతరిక్షంలో జరగబోయే ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ పరిశోధకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు
Crime· 1 Aug 2026

కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు

AP: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీకి ఉంచిన రూ.60 వేల నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. సచివాలయం-1 పరిధిలో పింఛన్ల పంపిణీ కోసం అధికారులు బ్యాంకు నుంచి రూ.10.70 లక్షలు డ్రా చేసి కార్యాలయ బీరువాలో భద్రపరిచారు. శనివారం ఉదయం పంపిణీకి ముందు నగదు లెక్కించగా రూ.60 వేల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్యాలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సచివాలయ సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి నగదు ఎలా మాయమైందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బంగారం ధరలు ఈరోజు ఎంత తగ్గాయంటే?
Business· 1 Aug 2026

బంగారం ధరలు ఈరోజు ఎంత తగ్గాయంటే?

గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,44,220కి చేరింది. అలాగే ఆర్నమెంటల్ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.350 తగ్గి రూ.1,32,200గా ఉంది. అయితే బంగారం రేట్లు ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతుంటాయి కాబట్టి షాపింగ్ చేసేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

అతివేగంతో షాప్‌లోకి దూసుకెళ్లిన కారు
Crime· 1 Aug 2026

అతివేగంతో షాప్‌లోకి దూసుకెళ్లిన కారు

TG: నల్గొండ పట్టణంలోని రహమత్‌నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణం మూసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.

పాకిస్థాన్‌పై భారత్ ఫైర్!🔥
World· 1 Aug 2026

పాకిస్థాన్‌పై భారత్ ఫైర్!🔥

PoKలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పుడు పాకిస్థాన్‌పై ప్రపంచం ఫోకస్ పెట్టాలని భారత్ అంటోంది. 🇮🇳 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనలు చేస్తున్న ప్రజలపై అక్కడి అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని భారత్ ఫైర్ అయింది. ప్రజల వాయిస్‌ను బలవంతంగా ఆపేస్తున్నారని, వారి హక్కులను కూడా పట్టించుకోవడం లేదని భారత్ అంటోంది. PoKలో పాకిస్థాన్ చేస్తున్న చర్యలను ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా గమనించాలని కోరింది. దీంతో ఇప్పటికే హీట్‌లో ఉన్న PoK ఇష్యూ ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంట్లోని బాత్రూమ్‌లే ప్రమాదకరమా?
Infotainment· 1 Aug 2026

ఇంట్లోని బాత్రూమ్‌లే ప్రమాదకరమా?

ఫ్రీ-స్టాండింగ్ బాత్‌టబ్‌లు, జారే మెరిసే టైల్స్, ఎత్తుగా ఉండే టాయిలెట్ సీట్ల వంటి తప్పుడు డిజైన్లతో, 65 ఏళ్లు దాటిన పెద్దవాళ్లు కిందపడి గాయపడటమే వాళ్ల మరణాలకి కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఎక్కువగా ఇంట్లోని బాత్రూమ్‌లలోనే జరుగుతున్నాయి. వీటి నుండి వృద్ధులను కాపాడుకోవడానికి బాత్రూమ్‌లలో పట్టుకోవడానికి 'గ్రాబ్ బార్స్' ఏర్పాటు చేయడం, జారకుండా ఉండే మ్యాట్ టైల్స్ వాడటం మంచిది. శరీరానికి తగినట్లుగా ఉండే టాయిలెట్లను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

అంబేద్కర్ వారసత్వం అందరిది: అభిజీత్ దిప్కే
Politics· 1 Aug 2026

అంబేద్కర్ వారసత్వం అందరిది: అభిజీత్ దిప్కే

నేషనల్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ వారసత్వం ఏ ఒక్క వర్గానికే పరిమితం కాదన్నారు. ప్రస్తుత భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్కరికీ "జై భీమ్" నినాదం చెందుతుందని అభిజీత్ దిప్కే అన్నారు.

లంచం తీసుకుంటూ బుక్కైన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి
Crime· 1 Aug 2026

లంచం తీసుకుంటూ బుక్కైన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి

TG: హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసే రంజీత్ కుమార్, అతడి భార్యపై CBI లంచం కేసు నమోదు చేసింది. మంచిరేవులకు చెందిన రాఘవేంద్ర అనే టీచర్ బ్యాంకు లోన్ కోసం తన పేరుపై ఉన్న నకిలీ పాన్ కార్డును తీసేయాలని దరఖాస్తు చేశాడు. ఆ పని పూర్తి కావాలంటే 4 వేల రూపాయలు ఇవ్వాలని రంజీత్ డిమాండ్ చేశాడు. ఫోన్‌పే ద్వారా తన భార్య అకౌంట్‌కు ఆ డబ్బులు వేయించుకున్నాడు. ఇలాగే ఇతను వేరే వాళ్ల దగ్గర కూడా ఆన్‌లైన్‌లో లంచాలు తీసుకుని ఉంటాడని CBI అధికారులు అనుమానిస్తున్నారు.

'రష్మిక'కు ఏమైంది!
Cinema· 1 Aug 2026

'రష్మిక'కు ఏమైంది!

సినిమా షూటింగ్‌లతో పాటు వరుస అడ్వర్టైజ్మెంట్లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్‌తో బిజీగా ఉండే నటి రష్మిక, ఇటీవల తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, 'నేషనల్ క్రష్'గా వెలుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోదీని మించిన నాయకుడు లేడు: పవన్ కల్యాణ్
AP· 1 Aug 2026

మోదీని మించిన నాయకుడు లేడు: పవన్ కల్యాణ్

AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి కొందరు చెడ్డగా మాట్లాడటం తనకు బాధగా అనిపించిందన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. ఆయన విదేశీ శత్రువులతోపాటు దేశంలో ఉండే శత్రువులతోనూ పోరాడాల్సి వస్తోందన్నారు. మోదీని మించిన నాయకుడు లేడు..రాబోడు అని పవన్ కల్యాణ్ పొగిడారు.

మ్యాన్‌హోల్ ఘటన.. ఇంకా దొరకని బాలయ్య
TG· 1 Aug 2026

మ్యాన్‌హోల్ ఘటన.. ఇంకా దొరకని బాలయ్య

TG: హైదరాబాద్ హఫీజ్‌పేట్ వైశాలీనగర్ <a href="https://www.theclearcutnews.com/n/dEoT7aN">మ్యాన్‌హోల్‌లో</a> కొట్టుకుపోయిన బాలయ్య కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. GHMC, SDRF, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 450 మంది సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరు ముత్తంగి వరకు రోబోటిక్ టెక్నాలజీతో నాలాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు బాలయ్య నిజంగా నాలాలో పడిపోయాడా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యల సందర్భంగా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నాలాలను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు.

శ్మశానానికి రైల్వే పట్టాలు అడ్డు.. గ్రామస్తులు ఆందోళన
News· 1 Aug 2026

శ్మశానానికి రైల్వే పట్టాలు అడ్డు.. గ్రామస్తులు ఆందోళన

AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేక గ్రామ ప్రజలు రైల్వే పట్టాలు దాటి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ప్రాణాలను పణంగా పెట్టి రైల్వే లైన్ దాటాల్సివస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

‘ముఖ్యమంత్రి పవన్‌’..కేంద్రం మంత్రి టంగ్ స్లిప్
AP· 1 Aug 2026

‘ముఖ్యమంత్రి పవన్‌’..కేంద్రం మంత్రి టంగ్ స్లిప్

AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభోపన్యాసం చేశారు. అయితే స్పీచ్ మధ్యలో ఆయన ‘ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..ఉప ముఖ్యమంత్రి నారా..’ అని అనడంతో కలకలం రేగింది. జనం నుంచి స్పందన రావడంతో వెంటనే సర్దుకొని ఆయన ‘ముఖ్యమంత్రి చంద్రబాబు..ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్’ అని సరిచేసుకొని తన ప్రసంగం కొనసాగించారు.

గోదావరి ఉగ్రరూపం.. గ్రామాలు జలదిగ్బంధం
TG· 1 Aug 2026

గోదావరి ఉగ్రరూపం.. గ్రామాలు జలదిగ్బంధం

TG: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.60 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి ప్రభావంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంతెనలు నీటమునగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IBPSలో 11,403 ఉద్యోగాలు
Jobs· 1 Aug 2026

IBPSలో 11,403 ఉద్యోగాలు

IBPS 11,403 బ్యాంక్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 వేకెన్సీలున్నాయి. ఈరోజు నుంచి <a href="https://ibpsreg.ibps.in/csaxvijul26/">అప్లికేషన్స్</a> ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్‌లో ప్రిలిమ్స్, డిసెంబర్‌లో మెయిన్స్ జరగనున్నాయి. నెలవారీ జీతం రూ.24 వేల నుంచి రూ.64 వేల వరకు ఉంటుంది. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. అప్లికేషన్ ఫీజు SC/STలకు రూ.175, ఇతరులకు రూ.850గా నిర్ణయించారు.

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు
Crime· 1 Aug 2026

స్కెచ్ వేసి చివరికి బుక్కయ్యాడు

TG: కరీంనగర్‌లో భూవివాదంలో ప్రత్యర్థిని <a href="https://www.theclearcutnews.com/n/5YvSyTa">ఇరికించేందుకు</a> గంజాయి కేసు సృష్టించిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భూతగాదాలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయించేందుకు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి దుకాణంలో ఉంచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 370 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. గంజాయి, 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ACP విజయ్‌కుమార్ తెలిపారు.

హాస్టల్‌లో విద్యార్థినుల గొంతు కోసే ప్రయత్నం
Crime· 1 Aug 2026

హాస్టల్‌లో విద్యార్థినుల గొంతు కోసే ప్రయత్నం

AP: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్‌లో నిద్రపోతున్న సుస్మిత, సోఫియా అనే ఇద్దరు విద్యార్థినుల గొంతును మరో అమ్మాయి బ్లేడుతో కోసే ప్రయత్నం చేయగా, వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనను దాచిపెట్టి, హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన వార్డెన్ నల్లమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ
AP· 1 Aug 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘రంగ్ దే బసంతి’కి 20 ఏళ్లు - విద్యార్థి పోరాటాలు!
Cinema· 1 Aug 2026

‘రంగ్ దే బసంతి’కి 20 ఏళ్లు - విద్యార్థి పోరాటాలు!

ఇటీవల నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై GenZ విద్యార్థులు చేసిన పోరాటాలు చూస్తే, సరిగ్గా 20 ఏళ్ల ముందు వచ్చిన ‘రంగ్ దే బసంతి’(2006) సినిమానే కళ్లముందు కనిపించింది.ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ ఊరికే రావు, అన్యాయం జరిగినప్పుడు నిలదీయడమే నిజమైన విప్లవం అని ఈ సినిమా తెలియజేస్తోంది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఎలుగెత్తిన నినాదాలు, పాడిన 'ఖూన్ చలా' పాటలు, వ్యవస్థలోని అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై నేటి యువతలో ఎంత ఆక్రోశం ఉందో, నాటి భగత్ సింగ్, ఆజాద్ ల పోరాట స్ఫూర్తిని గుర్తుచేశాయి.

లహావుల్ లోయలో హైదరాబాద్ బైకర్ అదృశ్యం
News· 1 Aug 2026

లహావుల్ లోయలో హైదరాబాద్ బైకర్ అదృశ్యం

హైదరాబాద్‌కు చెందిన అనిల్ మార్ల(42) లహావుల్ లోయలో బైక్‌పై వెళ్తూ కనిపించకుండా పోయాడు. జూలై 19 నుంచి అతడి ఆచూకీ లేదు. అనిల్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు 'సుమ్దో మోడ్ 3' దగ్గర లోయలో పడింది. పోలీసులు, SDRF బృందాలు డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు. ఘటనా స్థలంలో బైక్ భాగాలు, హెల్మెట్, ఫోన్ దొరికాయి. నదీ ప్రవాహంలో అనిల్ కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త దొరికే వరకు గాలింపు చర్యలు ఆపవద్దని అనిల్ భార్య సుమిత కోరింది. ప్రస్తుతం వెతుకులాట కొనసాగుతోంది.

లోకల్, సర్పంచ్ ఎన్నికలపై EC క్లారిటీ
Politics· 1 Aug 2026

లోకల్, సర్పంచ్ ఎన్నికలపై EC క్లారిటీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ ఎలెక్షన్స్ ఏర్పాట్లుపై EC పనులను వేగవంతం చేసింది. ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో ఎలెక్షన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశమౌతున్నారు. ముందుగా ZPTC, MPTC ఎన్నికల తరువాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఎలెక్షన్స్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలెక్షన్ ఆఫీసర్స్‌తో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్లుకు సిద్ధమవుతున్నాయి.