Latest

రీ సర్వేతో భూవివాదాలకు చెక్
TG· 29 Jul 2026

రీ సర్వేతో భూవివాదాలకు చెక్

తెలంగాణలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి దశలో 2,240 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామసభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో అధికారులు అందుబాటులో ఉండి సందేహాలు నివృత్తి చేయాలని, కలెక్టర్లు వారానికోసారి పురోగతిని సమీక్షించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతికతతో ప్రతి భూమికి కచ్చితమైన హద్దులు గుర్తించి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు.

హైడ్రా ఆగదు.. కబ్జాదారుల ఆటలు ఇక సాగవు
TG· 29 Jul 2026

హైడ్రా ఆగదు.. కబ్జాదారుల ఆటలు ఇక సాగవు

TG: హైడ్రా కమిషనర్ AV.రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి స్పందించారు. హైడ్రా పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంట, N కన్వెన్షన్ వంటి ఆక్రమణలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. HYDRAA తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. కోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎల్‌నినో కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్
AP· 29 Jul 2026

ఎల్‌నినో కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్

AP: ఎల్ నినో ప్రభావం ఏడాది పొడవునా కొనసాగే అవకాశముందని CM చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు అవగాహన తదితరాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. రైతులు వేసే ప్రతి పంటకు తప్పనిసరిగా బీమా నమోదు చేయాలని, ఎక్కడైనా లోపం జరిగితే కలెక్టర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఎల్ నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

CJP రెండు రోజుల్లో రెండు వార్నింగ్స్ !
News· 28 Jul 2026

CJP రెండు రోజుల్లో రెండు వార్నింగ్స్ !

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేస్తున్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) గ్రూప్ గవర్నమెంట్‌కు 2 రోజుల్లో 2 వార్నింగ్స్ ఇచ్చింది. ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్, యాక్టివిస్టులపై ఎలాంటి పోలీస్ యాక్షన్ లేదా ప్రతీకార చర్యలు తీసుకున్నా, తమ ఆందోళనను మళ్లీ రీస్టార్ట్ చేస్తామని సిజేపి హెచ్చరించింది. పీస్‌ఫుల్ ప్రొటెస్టర్స్‌పై అణచివేత ఆపాలని, డిటైన్ చేసిన వారిని ఇమీడియట్‌గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది.

జపాన్ కుమామోటో రాష్ట్రంలో భారీ భూ కంపం !
World· 28 Jul 2026

జపాన్ కుమామోటో రాష్ట్రంలో భారీ భూ కంపం !

జపాన్‌లోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో 7.1 మాగ్నిట్యూడ్‌తో సంభవించిన భయంకర భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ భారీ షాక్ వల్ల పలు బిల్డింగ్స్, ఐకానిక్ కుమామోటో క్యాసిల్ గోడలు కొలాప్స్ అవ్వడమే కాకుండా 50 మందికి పైగా గాయపడ్డారు. ఓ షాపింగ్ మాల్ పార్షియల్‌గా కొలాప్స్ అయి కొందరు ట్రాప్ అయ్యారని ఏజెన్సీలు వెల్లడించాయి. ముందుగా సునామీ అలర్ట్ జారీ చేసినా తర్వాత విత్‌డ్రా చేశారు. పవర్ కట్, రాకపోకలు స్తంభించడంతో గవర్నమెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీని ఫీల్డ్‌లోకి దింపింది.

లోక్ సభ డిస్కషన్స్ లో జెన్ జీ లాంగ్వేజ్ !
Politics· 28 Jul 2026

లోక్ సభ డిస్కషన్స్ లో జెన్ జీ లాంగ్వేజ్ !

పేపర్ లీక్ డిబేట్ టైమ్‌లో లోక్‌సభలో 'డిలూలు' 'క్లాక్ ఇట్' వంటి జెన్ జీ స్లాంగ్ వర్డ్స్ హల్‌చల్ చేశాయి. పోస్ట్ ఆఫీస్ యాక్ట్, పేపర్ లీక్ ఇష్యూస్‌పై డిస్కషన్ సమయంలో కాంగ్రెస్ ఎంపీ కృతి దేవి శర్మ మాట్లాడుతూ... ఎన్‌డీఏ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ పేరుతో 'డిలూలు' (భ్రమల్లో) బతుకుతోందని, కాంగ్రెస్ దాన్ని ఎప్పటికప్పుడు 'క్లాక్ ఇట్' (ఎండగడుతూ) చేస్తోందని కామెంట్ చేశారు. యంగ్ జనరేషన్ లాంగ్వేజ్ పార్లమెంట్‌లో వినిపించడంతో ఇది అటు ఎంపీల దృష్టిని, ఇటు సోషల్ మీడియా అటెన్షన్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

గోమూత్రంపై బీజేపి నేత కామెంట్స్ పై ప్రియాంక ఫైర్ !
Politics· 28 Jul 2026

గోమూత్రంపై బీజేపి నేత కామెంట్స్ పై ప్రియాంక ఫైర్ !

ఐఐటీ ప్రొఫెసర్‌ను ఉద్దేశించి బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన 'గోమూత్ర నిపుణుడు' (Cow Urine Expert) కామెంట్స్ పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. విద్యాసంస్థల్లో సైంటిఫిక్ టెంపర్‌ను ప్రోత్సహించాల్సింది పోయి, రీసెర్చర్లను, ప్రొఫెసర్లను ఇలా ఇన్సల్ట్ చేయడం దారుణం అని ఆమె విమర్శించారు. అయితే, తన కామెంట్స్‌ను సమర్థించుకున్న అనురాగ్ ఠాకూర్, సాంప్రదాయ జ్ఞానాన్ని, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్‌ను తక్కువ చేసి మాట్లాడటం కాంగ్రెస్ మైండ్‌సెట్‌కు నిదర్శనమని కౌంటర్ ఇచ్చారు.

సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు !
News· 28 Jul 2026

సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు !

విశాఖలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. సుమారు 32 కిలోమీటర్ల దూరం సాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొనడానికి దాదాపు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. కొండపైకి దాదాపు 50 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. భక్తుల రష్ దృష్ట్యా ఇవాళ,రేపు ఆర్జిత సేవలను బంద్ చేశారు. అలాగే కొండపైకి ప్రవేటు వెహికల్స్ ను నిరాకరించారు. ఈ వేడుక సందర్భంగా 221 స్కూళ్లకు సెలవు ఇచ్చారు.

గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్-విశాఖలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ !
AP· 28 Jul 2026

గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్-విశాఖలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ !

విశాఖలో గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ కష్టాలను పెంచింది. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడున్నర గంటల పాటు వాహనాలను అనుమతించక పోవడం తో ఏం జరిగిందో తెలీక వాహన దారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు గిరిప్రదక్షిన కొనసాగించడానికి బాగా ఇబ్బంది పడ్డారు. సత్యం జంక్షన్ నుంచి మద్దిల పాలెం వరకూ గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తడంతో విశాఖ నగరం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది.

నాట్ జస్ట్  ఇర్ఫాన్  మహమ్మద్ ఇర్ఫాన్ !
News· 28 Jul 2026

నాట్ జస్ట్ ఇర్ఫాన్ మహమ్మద్ ఇర్ఫాన్ !

తన పేరు కేవలం ఇర్ఫాన్ కాదని, మహమ్మద్ ఇర్ఫాన్ అని గర్వంగా చెప్పుకుంటాననీ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (NCHRO) ఢిల్లీ స్టేట్ సెక్రటరీ అంటున్నారు. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో మాట్లాడిన ఆయన, గతంలో భయంతో తన పేరును కేవలం 'ఇర్ఫాన్' అని మాత్రమే చెప్పానని, కానీ రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులతో పూర్తి ధైర్యం వచ్చిందని, ఇకపై తన పూర్తి ముస్లిం ఐడెంటిటీతోనే ధైర్యంగా నిజాలు మాట్లాడతానని స్పష్టం చేశారు.

రేపిస్టులను ప్రొటెక్ట్ చేసే వ్యక్తికి మంత్రి పదవా?
Politics· 28 Jul 2026

రేపిస్టులను ప్రొటెక్ట్ చేసే వ్యక్తికి మంత్రి పదవా?

బిల్కిస్ బాను కేసులో నిందితుల విడుదలను సమర్థించిన ప్రహ్లాద్ జోషిని కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా అపాయింట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రేపిస్టులను ప్రొటెక్ట్ చేసే వ్యక్తినే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా మోదీ ప్రభుత్వం ఎంచుకుందని వారు విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన మంత్రి జోషి, ప్రియాంక గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ కాల్పుల్లో  మహిళ చెవికి తీవ్ర గాయం !
News· 28 Jul 2026

జంతర్ మంతర్ కాల్పుల్లో మహిళ చెవికి తీవ్ర గాయం !

జులై 20న జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన ఫైరింగ్‌లో తనకు గాయాలయ్యాయని గురుగ్రామ్‌కు చెందిన నూతన్ అనే మహిళ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆర్‌ఎమ్‌ఎల్ (RML) హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ రిపోర్ట్, ఆమె కుడి చెవికి 'గన్‌షాట్ ఇంజ్యూరీ' (Gunshot Injury) అయినట్లు కన్ఫర్మ్ చేసింది. తనపై సెక్యూరిటీ బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, ఈ ఇన్సిడెంట్ వల్ల తన చెవి తీవ్రంగా దెబ్బతిందని ఆమె కంప్లయింట్ చేశారు.

స్టూడెంట్స్  కోసం వెడితే కస్టోడియల్ టార్చర్ !
Politics· 28 Jul 2026

స్టూడెంట్స్ కోసం వెడితే కస్టోడియల్ టార్చర్ !

ఢిల్లీ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో తనపై కస్టోడియల్ వయొలెన్స్ జరిగిందని ఆరోపించిన లాయర్ మాణిక్ గుప్తా, జస్టిస్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్‌కు లీగల్ హెల్ప్ అందించేందుకు వెళ్లిన తనను పోలీసులు అక్రమంగా డిటైన్ చేసి, టార్చర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్‌పై ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరిపించి, బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోవడంతో పాటు తనకు ప్రొటెక్షన్ కల్పించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

SIR ప్రాసెస్ పై పెరుగుతున్న విమర్శలు !
News· 28 Jul 2026

SIR ప్రాసెస్ పై పెరుగుతున్న విమర్శలు !

హైదరాబాద్‌లో ఓటర్ లిస్ట్ స్పెషల్ రివిజన్ (SIR) ప్రాసెస్ మీద 'ది వైర్' పబ్లిష్ చేసిన ఆర్టికల్ పలు ఆందోళనలను రైజ్ చేసింది. లిస్ట్ నుంచి పేర్లు డిలీట్ అయిన నార్మల్ పబ్లిక్, తమ ఓటు హక్కును రికవర్ చేసుకోవడానికి టైమ్, ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారని రైటర్ సి. యామిని కృష్ణ హైలైట్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్ల ఫీల్డ్-లెవెల్ వెరిఫికేషన్ వల్ల ఎలిజిబుల్ ఓటర్లు తమ ఓటు హక్కును లూజ్ అయ్యే రిస్క్ ఉందని ఆమె క్రిటిసైజ్ చేశారు.

కూరగాయల స్టోరేజ్ కి  స్మాల్ టిప్స్ !
General· 28 Jul 2026

కూరగాయల స్టోరేజ్ కి స్మాల్ టిప్స్ !

కూరగాయలు ఎన్నాళ్లు స్టోర్ చేయవచ్చో తెలుసా? ఫ్రిజ్ లేదా గది ఉష్ణోగ్రతను బట్టి పండ్లు, కూరగాయల తాజాదనం ఆధారపడి ఉంటుంది. ఆపిల్స్, సిట్రస్ ఫలాలు, రూట్ కూరగాయలు కొన్ని వారాల పాటు నిల్వ ఉంటే... ఆకుకూరలు, బెర్రీలు, వంకాయ వంటివి వారం రోజుల్లోపే పాడవుతాయి. అయితే టమోటాలు, అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. పండ్లు, కూరగాయలకు తడి తగలకుండా పొడిగా ఉంచడం ద్వారా వాటిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

ప్లాస్టిక్ పెల్లెట్ గన్స్ వాడినది నిజమే !
News· 28 Jul 2026

ప్లాస్టిక్ పెల్లెట్ గన్స్ వాడినది నిజమే !

పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులపై ప్లాస్టిక్ పెల్లెట్లు ప్రయోగించాలని డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ఆదేశించారని పోలీస్ డైరీ (GD) ఆధారంగా వెల్లడైంది. ప్రారంభంలో పెల్లెట్లు వాడలేదని ఢిల్లీ పోలీసులు ఖండించినప్పటికీ, అర్ధరాత్రి ఎంట్రీతో నిజం బయటపడింది. RAF బలగాలు జరిపిన ఈ కాల్పుల్లో పలువురు ప్రదర్శనకారులు, ఒక విలేకరి తీవ్రంగా గాయపడగా, ఒక యువకుడు కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.

సఫాయీ కార్మికుల మరణాల సంఖ్య పై కేంద్రం లెక్కలు తప్పు !
News· 28 Jul 2026

సఫాయీ కార్మికుల మరణాల సంఖ్య పై కేంద్రం లెక్కలు తప్పు !

దేశవ్యాప్తంగా మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల్లో పని చేస్తూ 332 మంది చనిపోయారని కేంద్రం చెబుతున్న సంఖ్య అవాస్తవమని రియల్ గా 593 మంది చనిపోయారని సఫాయి కరంచారీ ఆందోళన్ వెల్లడించింది. ఈ ఏడాదే ఇంతమంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనలో ప్రభుత్వం విఫలమైందని, ప్రధాని మోదీ వైఫల్యాన్ని అంగీకరించాలని డిమాండ్ చేసిందని ది వైర్ కథనం తెలిపింది.

బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి
News· 28 Jul 2026

బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత, మాజీ మంత్రి 'నానక్ రామ్ భుర్జీ' అనుమానాస్పద స్థితిలో మరణించారు. లక్నోలోని ఎమ్మెల్యేల నివాస భవనం ఏడో అంతస్తు నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా కొద్దిసేపటికే చనిపోయారు. ప్రమాదవశాత్తు కింద పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం పంపారు.

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
News· 28 Jul 2026

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

TG: హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నేడు, రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు
India· 28 Jul 2026

PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు

PoKలో ఎన్నికలను బహిష్కరిద్దామని నిరసనలు చేస్తున్నవారిపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 24 గంటల్లో 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. ఈ వివరాలను పూర్తిగా ధృవీకరించలేదు. ప్రస్తుతం PoKలో భారీ భద్రత, ఇంటర్నెట్ ఆంక్షల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

టీమిండియా కోచ్ పదవికి ర్యాన్ రాజీనామా
Sports· 28 Jul 2026

టీమిండియా కోచ్ పదవికి ర్యాన్ రాజీనామా

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమ్ అసిస్టెంట్ కోచ్‌ 'ర్యాన్ టెన్ డస్కటే' తన పదవికి రాజీనామా చేశాడు. తనకు సరైన బాధ్యతలు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రాహుల్ ద్రవిడ్ వెళ్లాక ర్యాన్ ఈ టీమ్‌లోకి వచ్చాడు. ఫీల్డింగ్ కోచ్‌గా అనుకున్న అసిస్టెంట్ కోచ్‌గానే మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన 2027 IPL లో KKR టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో చేరబోతున్నాడు.