Latest

బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి
News· 28 Jul 2026

బీజేపీ మాజీ మంత్రి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత, మాజీ మంత్రి 'నానక్ రామ్ భుర్జీ' అనుమానాస్పద స్థితిలో మరణించారు. లక్నోలోని ఎమ్మెల్యేల నివాస భవనం ఏడో అంతస్తు నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా కొద్దిసేపటికే చనిపోయారు. ప్రమాదవశాత్తు కింద పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం పంపారు.

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం
News· 28 Jul 2026

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

TG: హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నేడు, రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు
India· 28 Jul 2026

PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు

PoKలో ఎన్నికలను బహిష్కరిద్దామని నిరసనలు చేస్తున్నవారిపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 24 గంటల్లో 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. ఈ వివరాలను పూర్తిగా ధృవీకరించలేదు. ప్రస్తుతం PoKలో భారీ భద్రత, ఇంటర్నెట్ ఆంక్షల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

టీమిండియా కోచ్ పదవికి ర్యాన్ రాజీనామా
Sports· 28 Jul 2026

టీమిండియా కోచ్ పదవికి ర్యాన్ రాజీనామా

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమ్ అసిస్టెంట్ కోచ్‌ 'ర్యాన్ టెన్ డస్కటే' తన పదవికి రాజీనామా చేశాడు. తనకు సరైన బాధ్యతలు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రాహుల్ ద్రవిడ్ వెళ్లాక ర్యాన్ ఈ టీమ్‌లోకి వచ్చాడు. ఫీల్డింగ్ కోచ్‌గా అనుకున్న అసిస్టెంట్ కోచ్‌గానే మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన 2027 IPL లో KKR టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో చేరబోతున్నాడు.

గాయపడిన విద్యార్థినిపై ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావన
Politics· 28 Jul 2026

గాయపడిన విద్యార్థినిపై ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావన

పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న దిల్లీ విద్యార్థిని అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ఇటీవల రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు వెళ్లి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని ఆమె తెలిపారు. రాజకీయ నాయకులు తన కుమార్తెను పదేపదే సందర్శిస్తుండటం వల్ల విద్యార్థిని తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రియాంక గాంధీ సభలో అన్నారు. 'దీనిపై అమిత్‌ షా సమాధానం చెప్పాలి. పేపర్ లీక్ చేసి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’ అని లోక్‌సభలో మండిపడ్డారు.

‘ముందు ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మాట్లాడండి’
Politics· 28 Jul 2026

‘ముందు ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మాట్లాడండి’

TG: ‘ముందు ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మాట్లాడండి’ అంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల భారం ప్రస్తుతం రాష్ట్రంపై ఉందని అన్నారు. కృష్ణయ్య పదేపదే తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నిస్తున్నారు కానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బకాయిలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఉండదని స్పష్టం చేశారు.

దావణగెరెలో దారుణం..టిప్పర్ ట్రక్‌ ప్రమాదంతో మృతి
Crime· 28 Jul 2026

దావణగెరెలో దారుణం..టిప్పర్ ట్రక్‌ ప్రమాదంతో మృతి

కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో దారుణం జరిగటింది. సరస్వతి నగర్‌కు చెందిన మంజునాథ్‌(50) తన ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోతుండగా, వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ట్రక్‌ ఆయన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ఎల్ సాల్వడార్‌లో బయటపడ్డ పురాతన సమాధి
World· 28 Jul 2026

ఎల్ సాల్వడార్‌లో బయటపడ్డ పురాతన సమాధి

ఎల్ సాల్వడార్ దేశంలో రెండు వేల ఏళ్ల నాటి పాత సమాధిని పురావస్తు శాఖ వాళ్లు బయటకు తీశారు. 850BC కాలం నాటి ఈ సమాధిలో ఒక మనిషి స్కల్, తాబేలు ఆకారంలో ఉన్న కుండ దొరికాయి. స్కెలిటన్ బోర్లా పడుకున్నట్లుగా ఉంది. దీని వయసు తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్, ఆడ మగ తేల్చేందుకు DNA టెస్టులు చేస్తున్నారు. 1970లలో కూడా ఇదే దేశంలో ఇలాంటి రకమైన 33 మంది అస్థిపంజరాలు దొరికాయి.

సోషల్ మీడియా సంస్థలకు పార్లమెంటరీ కమిటీ పిలుపు
News· 28 Jul 2026

సోషల్ మీడియా సంస్థలకు పార్లమెంటరీ కమిటీ పిలుపు

సోషల్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నియంత్రణపై చర్చకు ప్రధాన సోషల్ మీడియా సంస్థలను, కేంద్ర ప్రభుత్వ అధికారులను పార్లమెంటరీ కమిటీ ఆగస్టు 3న జరిగే సమావేశానికి ఆహ్వానించింది. యూసర్ ప్రైవసీ, సెక్యూరిటీ, ప్రజా శాంతిభద్రతలకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలు ఎలా నిర్వహిస్తున్నాయనే విషయంపై ఇందులో చర్చించనున్నారు. NEET-UG పేపర్ లీక్ నిరసనల ప్రచారంలో CJP సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరుగుతుండటం గమనించాల్సిన విషయం.

ఇకపై కోర్టు విచారణల వీడియోలు వాడలేం!
India· 28 Jul 2026

ఇకపై కోర్టు విచారణల వీడియోలు వాడలేం!

సోషల్ మీడియాలో కోర్టు విచారణల వీడియోలు వాడటంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. పర్మిషన్ లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేయడాన్ని నిషేధించింది. వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్‌లోడ్ లేదా రీ-పోస్ట్ చేయడం నేరమని తెలిపింది. కోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా దాచడం, ప్రసారం చేయడాన్ని కూడా నిలిపివేసింది. అయితే మీడియా సంస్థలకు మినహాయింపు ఇచ్చింది.

Anti-Paper Leak బిల్లులో ఏమేం కొత్త రూల్స్
Education· 28 Jul 2026

Anti-Paper Leak బిల్లులో ఏమేం కొత్త రూల్స్

"పేపర్ లీక్ చేస్తే ఏమవుతుంది?" అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. కొత్త బిల్లు ప్రకారం.. వ్యక్తిగతంగా పేపర్ లీక్‌లో దొరికితే 5 నుంచి 10 ఏళ్ల జైలు, ₹50 లక్షల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ లేదా మాఫియాలకు అయితే ₹10 కోట్ల వరకు ఫైన్ విధించొచ్చు. అంతేకాదు.. కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండకుండా 2 నెలల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, Special Task Force (STF) ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు.

ఇండియా గవర్నమెంట్ హాస్పిటల్ పై జర్మన్ ట్రావెలర్ ప్రశంసలు
Health· 28 Jul 2026

ఇండియా గవర్నమెంట్ హాస్పిటల్ పై జర్మన్ ట్రావెలర్ ప్రశంసలు

వరల్డ్ ట్రావెల్ 'డేవిడ్ నెబెల్' అనే జర్మన్ ఇండియన్ హెల్త్ సిస్టమ్‌ను బాగా మెచ్చుకున్నాడు. రీసెంట్‌గా తలనొప్పి వస్తే సూరత్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతనికి మలేరియా, డెంగ్యూ టెస్టులు ఫ్రీగా చేశారు. అన్నీ నార్మల్ వచ్చాయి. ఫార్నెర్ కి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడం చాలా గొప్ప విషయం అని అతను చెప్పాడు.

Anti-Paper Leak Bill అంటే ఏంటి?
Education· 28 Jul 2026

Anti-Paper Leak Bill అంటే ఏంటి?

NEET పేపర్ లీక్ తర్వాత దేశమంతా ఒక్కటే డిమాండ్ వినిపించింది.. "పేపర్ లీక్‌లకు శాశ్వతంగా చెక్ పెట్టండి!" విద్యార్థుల ఆందోళనలు, వరుస వివాదాల తర్వాత కేంద్రం ఇప్పుడు Anti-Paper Leak Bill-2026 తీసుకొచ్చింది. ఇది పూర్తిగా కొత్త చట్టం కాదు. 2024లో తీసుకొచ్చిన Anti-Paper Leak చట్టాన్నే మరింత స్ట్రాంగ్ చేసే సవరణ బిల్లు ఇది. పేపర్ లీక్‌లకు గట్టి చెక్ పెట్టడం, తప్పు చేసిన వాళ్లకు కఠిన శిక్షలు విధించడం, ఎగ్జామ్ సిస్టమ్‌పై విద్యార్థుల్లో మళ్లీ నమ్మకం తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని కేంద్రం చెబుతోంది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో ఏపీకి చెందిన అజయ్ బాబుకు 'సిల్వర్' మెడల్
Sports· 28 Jul 2026

వెయిట్‌లిఫ్టింగ్‌లో ఏపీకి చెందిన అజయ్ బాబుకు 'సిల్వర్' మెడల్

AP: కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు సిల్వర్ మెడల్ సాధించాడు. అజయ్ బాబు స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ 331 కేజీలతో గోల్డ్ మెడల్ గెలుచుకోగా, ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కేజీలతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఈ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం.

విజయ్ Sofa Model సీఎం: ఉదయనిధి స్టాలిన్
Politics· 28 Jul 2026

విజయ్ Sofa Model సీఎం: ఉదయనిధి స్టాలిన్

కావేరి నదిపై మెకదాతు ఆనకట్ట నిర్మించడానికి కర్ణాటకకు తమిళనాడు అనుమతి అవసరం లేదని కేంద్రం ఇచ్చిన సమాధానంపై తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. తన అధికారం కాపాడుకోవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. కర్ణాటకలో తన సినిమా వసూళ్లు దెబ్బతింటాయనే భయంతో Sofa Model సీఎంగా వ్యవహరిస్తున్నారని తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

జూరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్.. శ్రీశైలానికి వరద
News· 28 Jul 2026

జూరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్.. శ్రీశైలానికి వరద

TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 30,700 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. భీమా నది నుంచి వరద చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

భార్య హత్య.. లైవ్‌లో చూపించిన భర్త!
Crime· 28 Jul 2026

భార్య హత్య.. లైవ్‌లో చూపించిన భర్త!

కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య భాగ్యశ్రీని కర్రతో బాది, దుపట్టాతో ఉరేసి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, ఉరికి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న భార్యను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి లైవ్‌లో చూపించాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, పోలీసులు వచ్చేసరికి భాగ్యశ్రీ చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌కు టీమ్ ఇండియా టూర్
Sports· 28 Jul 2026

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌కు టీమ్ ఇండియా టూర్

సెప్టెంబర్ మొదటి వారంలో బంగ్లాదేశ్‌లో టీమ్ ఇండియా పర్యటించే అవకాశం ఉంది. దీనికోసం రెండు దేశాల క్రికెట్ బోర్డులు చర్చలు జరుపుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి అనుమతి వస్తేనే ఈ టూర్ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ ఈ టూర్ ఓకే అయితే, అఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన సిరీస్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఢాకా, చిట్టగాంగ్‌లలో వన్డే, టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని BCCI అనుకుంటోంది. గతంలో రెండు దేశాల మధ్య రాజకీయ గొడవల వల్ల సిరీస్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ
India· 28 Jul 2026

కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన శాఖ పథకం ద్వారా తన పొలానికి రూ.99 లక్షల సబ్సిడీ పొందారు. చౌదరి 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దోసకాయ సాగు చేస్తున్నారు.2025లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ‘హార్టికల్చర్ పంటల ఉత్పత్తి, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా వాణిజ్య హార్టికల్చర్ అభివృద్ధి’ పథకం కింద ఆమోదించిన 467 ప్రాజెక్టులలో ఇదీ ఒకటి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సబ్సిడీని ఆయన తిరిగి ఇచ్చేసినట్టు పార్లమెంటులో మరో మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ చెప్పారు.

మెటా, గూగుల్‌పై గడ్కరీ కేసు
Politics· 28 Jul 2026

మెటా, గూగుల్‌పై గడ్కరీ కేసు

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP), E20 కార్యక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని బాంబే హైకోర్టును కోరారు. మెటా, గూగుల్, ఎక్స్ తదితర సంస్థలపై దావా వేసేందుకు బాంబే హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. తప్పుడు, కల్పిత, పరువు నష్టం కలిగించే AI వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని ఆయన దావాలో కోరారు.

'Gen-Alpha' తిరుగుబాటు!
Education· 28 Jul 2026

'Gen-Alpha' తిరుగుబాటు!

UP ఫతేపూర్‌లోని సర్వోదయ ఇంటర్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్కూళ్లో తాగడానికి మంచి నీళ్లు లేవని, టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవని 'Gen-Alpha' కిడ్స్ అంబేద్కర్ ఫోటోలు చేతపట్టి ఆందోళన చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసినా, పిల్లలు తమ హక్కుల కోసం ఇలా పోరాడడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తు కామెంట్స్ పెడుతున్నారు.