Latest

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌కు టీమ్ ఇండియా టూర్
Sports· 28 Jul 2026

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌కు టీమ్ ఇండియా టూర్

సెప్టెంబర్ మొదటి వారంలో బంగ్లాదేశ్‌లో టీమ్ ఇండియా పర్యటించే అవకాశం ఉంది. దీనికోసం రెండు దేశాల క్రికెట్ బోర్డులు చర్చలు జరుపుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి అనుమతి వస్తేనే ఈ టూర్ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ ఈ టూర్ ఓకే అయితే, అఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన సిరీస్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఢాకా, చిట్టగాంగ్‌లలో వన్డే, టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని BCCI అనుకుంటోంది. గతంలో రెండు దేశాల మధ్య రాజకీయ గొడవల వల్ల సిరీస్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ
India· 28 Jul 2026

కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన శాఖ పథకం ద్వారా తన పొలానికి రూ.99 లక్షల సబ్సిడీ పొందారు. చౌదరి 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దోసకాయ సాగు చేస్తున్నారు.2025లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ‘హార్టికల్చర్ పంటల ఉత్పత్తి, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా వాణిజ్య హార్టికల్చర్ అభివృద్ధి’ పథకం కింద ఆమోదించిన 467 ప్రాజెక్టులలో ఇదీ ఒకటి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సబ్సిడీని ఆయన తిరిగి ఇచ్చేసినట్టు పార్లమెంటులో మరో మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ చెప్పారు.

మెటా, గూగుల్‌పై గడ్కరీ కేసు
Politics· 28 Jul 2026

మెటా, గూగుల్‌పై గడ్కరీ కేసు

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP), E20 కార్యక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని బాంబే హైకోర్టును కోరారు. మెటా, గూగుల్, ఎక్స్ తదితర సంస్థలపై దావా వేసేందుకు బాంబే హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. తప్పుడు, కల్పిత, పరువు నష్టం కలిగించే AI వీడియోలు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని ఆయన దావాలో కోరారు.

'Gen-Alpha' తిరుగుబాటు!
Education· 28 Jul 2026

'Gen-Alpha' తిరుగుబాటు!

UP ఫతేపూర్‌లోని సర్వోదయ ఇంటర్ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్కూళ్లో తాగడానికి మంచి నీళ్లు లేవని, టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవని 'Gen-Alpha' కిడ్స్ అంబేద్కర్ ఫోటోలు చేతపట్టి ఆందోళన చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసినా, పిల్లలు తమ హక్కుల కోసం ఇలా పోరాడడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తు కామెంట్స్ పెడుతున్నారు.

పోలీసుల నుంచి రక్షణ కావాలి-మహ్మద్ జునైద్
India· 28 Jul 2026

పోలీసుల నుంచి రక్షణ కావాలి-మహ్మద్ జునైద్

దిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థుల ఆకలి తీర్చిన మహ్మద్ జునైద్ మాలిక్‌ పోలీసుల నుంచి తనకూ, తన కుటుంబానికీ రక్షణ కావాలని సుప్రీం కోర్టుకెక్కారు. నిరసనకారులకు ఆహారం పెడుతున్న తనను పోలీసులు నిర్భందించి బెదిరించారని పిటిషన్లో చెప్పారు. ఘజియాబాద్ పోలీసులు అతని తండ్రినీ, ఇతర కుటుంబ సభ్యుల్ని వేధించారన్నారు. జంతర్ మంతర్లో CJP ఆందోళనకు తొలి రోజు నుంచే జునైద్ ౩ పూటలా ఆహారం అందించారు. జునైద్ లేకపోతే ఈ ప్రొటెస్ట్ సాఫీగా జరిగేది కాదని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అనేక సార్లు చెప్పారు.

ఐఐటీ మద్రాస్ కొత్త కూలింగ్ టెక్నాలజీ
Technology· 28 Jul 2026

ఐఐటీ మద్రాస్ కొత్త కూలింగ్ టెక్నాలజీ

IIT మద్రాస్ రీసెర్చర్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు వేడెక్కకుండా సరికొత్త కూలింగ్ టెక్నాలజీ కనిపెట్టారు. 'ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్' అనే డిజైన్ ద్వారా ఎలక్ట్రిక్ వస్తువుల వేడిని ఈజీగా కంట్రోల్ చెయ్యొచ్చు. దీన్ని రాగికి బదులు అల్యూమినియంతో తయారు చేశారు. దీని వల్ల బరువు తగ్గింది. వేడిని తగ్గించే సామర్థ్యం 20% పెరిగిందని IIT మద్రాస్ ప్రకటించింది. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో EV, ఏరోస్పేస్, డేటా సెంటర్లకు బాగా ఉపయోగపడుతుందనేది అంచనా.

బైక్ పట్టుకున్న ప్రియురాలిని లాక్కెళ్లి...
Viral· 28 Jul 2026

బైక్ పట్టుకున్న ప్రియురాలిని లాక్కెళ్లి...

ఐదేళ్ల ప్రేమ తర్వాత "ఇక పెళ్లి చేసుకుందాం" అని అడిగిందట ఆ అమ్మాయి. కానీ ఆ ఒక్క మాటతో మొదలైన గొడవ.. చివరికి రోడ్డుపైనే వైరల్ వీడియోగా మారింది. బీహార్‌లోని రాజ్‌గిర్లో బైక్‌పై వెళ్లిపోతున్న అబ్బాయిని ఆపేందుకు ఆమె బైక్‌ను పట్టుకుందని.. అయినా అతను ఆపకుండా ముందుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్మాయిని దాదాపు 100 మీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని అడ్డుకున్నారు.

'జన నాయగన్' డిలీటెడ్ సీన్స్ అవుట్!
Cinema· 28 Jul 2026

'జన నాయగన్' డిలీటెడ్ సీన్స్ అవుట్!

CM విజయ్ నటించిన మూవీ 'జన నాయగన్' ఫ్యాన్స్‌కి డైరెక్టర్ H. వినోద్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. సినిమా ఫైనల్ వర్షన్ నుండి తొలగించిన 6 డిలీటెడ్ సీన్స్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో 2 కామెడీ, 2 యాక్షన్, 2 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వచ్చే వారం నుండి ఇవి అందుబాటులోకి రానున్నాయి. అయితే థియేట్రికల్ రన్‌టైమ్ ఆల్రెడీ 3 గంటలు దాటడంతో, వీటిని థియేటర్లలో కలుపుతారా లేక యూట్యూబ్‌లో వదులుతారా అనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ₹200 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.

అంతర్జాతీయ సౌకర్యాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం
News· 28 Jul 2026

అంతర్జాతీయ సౌకర్యాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం

AP: ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మోడ్రన్ హంగులతో నిర్మించిన టెర్మినల్ భవనం, విశాలమైన రన్‌వే, ప్రయాణికులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

CJP ఎఫెక్ట్: లోకేష్ రాజీనామాకు YSRCP డిమాండ్
Politics· 28 Jul 2026

CJP ఎఫెక్ట్: లోకేష్ రాజీనామాకు YSRCP డిమాండ్

AP: ఏపీలో జరిగిన DSC పెద్ద స్కాం అని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలనీ, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి ఎస్వీ యూనివర్సిటీ ముందు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. CJP ఆందోళన ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక,డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విద్యార్థులు ఉగ్రవాదులా?: అరవింద్ కేజ్రివాల్
India· 28 Jul 2026

ఈ విద్యార్థులు ఉగ్రవాదులా?: అరవింద్ కేజ్రివాల్

‘బీహార్‌లో విద్యార్థులపై AK-47 బుల్లెట్లు కాల్చారు. ఈ విద్యార్థులు ఉగ్రవాదులా?’ అంటూ దిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్ బీజేపీపై మండిపడ్డారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బీహార్‌లో ఒకప్పుడు “Vacate the throne, for the people are coming” అనే నినాదం మారుమోగిపోయిందని మోదీకి గుర్తు చేస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. విద్యార్థులతో చెలగాటమాడొద్దని అన్నారు.

ప్రొటెస్టర్లపై విరుచుకుపడ్డ కంగనా రనౌత్!
Politics· 28 Jul 2026

ప్రొటెస్టర్లపై విరుచుకుపడ్డ కంగనా రనౌత్!

దేశంలో జరుగుతున్న GenZ నిరసనలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రొటెస్ట్‌లకు సంబంధించిన రీల్స్, అందులో వాడిన భాష అసహ్యకరంగా ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతికి నిలయమైన భారత్‌లో తమను తాము కాకరోచ్ అని పిలుచుకుంటూ అలానే ప్రవర్తిస్తున్నారంటూ, అసలు వీరిని ఎవరు పెంచుతున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మీ ఓపీనియన్ కామెంట్ చేయండి.

భార్యను ఉరితీసి వీడియో తీసిన భర్త
Crime· 28 Jul 2026

భార్యను ఉరితీసి వీడియో తీసిన భర్త

భార్యను హత్య చేస్తూ ఆ దృశ్యాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాతక ఘటన కర్ణాటకలో జరిగింది. బాగల్‌కోట్‌కు చెందిన ప్రవీణ్ భార్య భాగ్యశ్రీ(23)పై అనుమానంతో ఆమెను ఉరివేసి చంపాడు. ఆ వీడియోను స్నేహితులకు కూడా పంపాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బాగా చూసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన ప్రవీణ్ అదే రోజే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

వావ్..అంతరిక్షంలో యోగా అదుర్స్!
Technology· 28 Jul 2026

వావ్..అంతరిక్షంలో యోగా అదుర్స్!

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) Astronaut సోఫీ అడెనోట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని డెయిలీ లైఫ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అడెనోట్ మైక్రోగ్రావిటీలో తన యిన్ యోగా రొటీన్‌ను చూపించారు. అంతరిక్షంలో తేలుతూ ఎలా యోగా చేయాలో అందులో వివరించారు. రోజూ యోగా చేయడం అడెనోట్‌కు అలవాటు. ఆ అలవాటును స్పేస్‌లో కూడా ఆమె విజయవంతంగా కొనసాగించారు.

విద్యార్థులపై లాఠీచార్జ్‌పై సుప్రీం సీరియస్!
Legal· 28 Jul 2026

విద్యార్థులపై లాఠీచార్జ్‌పై సుప్రీం సీరియస్!

నీట్ పేపర్ లీక్‌పై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తూ.. బాధ్యులెంతటివారైనా చట్టం ఊరుకోదని హెచ్చరించింది. అటు గాయపడిన పోలీసుల భద్రత, రక్షణ పరికరాలపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపింది.

సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్!
AP· 28 Jul 2026

సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్!

సాయికృష్ణ బాడీ ఇంకా దొరకలేదని, CI నాగరాజును విజయవాడ సిట్ ఆఫీస్‌లోనే విచారించాలని సుప్రీంకోర్టు క్లియర్‌గా చెప్పింది. రాజమండ్రి జైలులోనే విచారించాలనడం కుదరదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలని తెలిపింది. విచారణను CCTV, వీడియోగ్రఫీ మానిటరింగ్‌లోనే చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CI నాగరాజును 7 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.

న్యూయార్క్ సిటీలో భారీగా చెట్ల పెంపకం
General· 28 Jul 2026

న్యూయార్క్ సిటీలో భారీగా చెట్ల పెంపకం

న్యూయార్క్ అనగానే ఎత్తైన బిల్డింగులు, రద్దీగా ఉండే ట్రాఫిక్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అక్కడ ఎవరికీ తెలియకుండానే అద్భుతమైన మార్పు జరుగుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పచ్చదనం విలువ ఇప్పుడు అందరికీ బాగా అర్థమవుతోంది. అందుకే అక్కడి అధికారులు చెట్ల పెంపకాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, 2040 సంవత్సరం నాటికి సిటీలో 30% గ్రీనరీ ఉండేలా టార్గెట్ పెట్టుకున్నారు.

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: చంద్రబాబు
News· 28 Jul 2026

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: చంద్రబాబు

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులపై రైతుల్లో అవగాహన కల్పించడంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి ఆయా శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హీరోపై ప్రేమ ఓకే.. కానీ ఇంత రిస్క్ అవసరమా..?
Viral· 28 Jul 2026

హీరోపై ప్రేమ ఓకే.. కానీ ఇంత రిస్క్ అవసరమా..?

హీరో సినిమా రిలీజ్ అంటే సెలబ్రేషన్ ఓకే... కానీ థియేటర్‌లోనే ఫైర్‌క్రాకర్స్ కాల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. విజయ్ నటించిన 'జన నాయకన్' షో సందర్భంగా బెంగళూరులోని ఓ థియేటర్‌లో అభిమానులు ఫైర్‌క్రాకర్స్ పేల్చిన వీడియో వైరల్ కావడంతో "ఇది ఫ్యాన్ ఎమోషనా..? లేక డేంజరస్ ట్రెండా?" అనే చర్చ మళ్లీ మొదలైంది.. ఫ్యాన్స్‌కు ఇవి ఎమోషన్స్ కావచ్చు.. కానీ థియేటర్‌లో ఉన్న వందల మంది సేఫ్టీ కూడా అంతే ముఖ్యం కదా! అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ (AICC) ఫోకస్
Politics· 28 Jul 2026

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ (AICC) ఫోకస్

TG: దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆర్గనైజేషన్ కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ సంస్థాగత కార్యక్రమాలు, సంఘటన్ సృజన్ అభియాన్ (SSA) కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. తెలంగాణలో ఈ కార్యక్రమాల అమలును కే.సీ. వేణుగోపాల్ అభినందించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

అమర్‌నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!
News· 28 Jul 2026

అమర్‌నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా కంగన్ దగ్గర అమర్‌నాథ్ యాత్రికుల బస్సు యాక్సిడెంట్‌కు గురైంది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. పక్కనే ఉన్న నదిలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 39 మందికి గాయాలయ్యాయి. <a href="https://x.com/manojsinha_/status/2081942282987811197?s=20">ఎల్జీ మనోజ్ సిన్హా</a> స్పందిస్తూ, గాయపడిన వారికి మెరుగైన మెడికల్ ట్రీట్‌మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.