ఈ విద్యార్థులు ఉగ్రవాదులా?: అరవింద్ కేజ్రివాల్

‘బీహార్‌లో విద్యార్థులపై AK-47 బుల్లెట్లు కాల్చారు. ఈ విద్యార్థులు ఉగ్రవాదులా?’ అంటూ దిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రివాల్ బీజేపీపై మండిపడ్డారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బీహార్‌లో ఒకప్పుడు “Vacate the throne, for the people are coming” అనే నినాదం మారుమోగిపోయిందని మోదీకి గుర్తు చేస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. విద్యార్థులతో చెలగాటమాడొద్దని అన్నారు.


