Latest

నీట్ లీక్‌పై మోదీ క్షమాపణ చెప్పాలి
TG: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భువనగిరిలో మాట్లాడిన ఆయన, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆరోపించారు. గత 12ఏళ్లలో 152సార్లు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇది BJP ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

💸 కరెన్సీలో భారీ మార్పు
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు RBI కసరత్తు ప్రారంభించింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకురానుండగా, విజయవంతమైతే ఇతర నోట్లకూ విస్తరించనుంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఒక్కో నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

CJP నిరసనలపై సుప్రీంకోర్టు ట్విస్ట్
CJP విద్యార్థుల నిరసనలపై దిల్లీలో జరిగిన పోలీసు చర్యల విషయంలో సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిందన్న వార్తలపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని, అయినా కోర్టు విచారణకు నిరాకరించినట్లు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రీని పరిశీలించగా ఈ కేసుకు సంబంధించి ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.

పోటాపోటీగా నినాదాలు.. నర్సంపేటలో ఉద్రిక్తత
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్, BJP శ్రేణులు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కాకతీయ తోరణం వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడికి చేరుకున్న BJP నాయకులు ప్రతినిరసన చేపట్టడంతో ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ వాగ్వాదం తోపులాటకు దారితీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గుజరాత్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వల్సాద్ జిల్లా ఉంబెర్‌గావ్ తాలూకాలో 16 గంటల్లోనే 1,100 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 600 మి.మీకి పైగా వర్షం కురవగా సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ప్రైసెస్ ఇలా ఉన్నాయి!
భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం యూటర్న్ తీసుకుని భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330కి, 22 క్యారెట్ల రేటు రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరింది. అలాగే వెండి కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,40,000గా ఉంది. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి రేట్స్ చేంజ్ అయ్యే చాన్స్ ఉన్నందున కొనేముందు లైవ్ ప్రైస్ చెక్ చేయడం బెటర్.

మెటర్నిటీ సెలవులపై కోర్టు నిర్ణయం
తక్కువ సమయంలోనే రెండోసారి ప్రసవం జరిగిన మహిళలకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. రెండు కాన్పుల మధ్య ఇన్ని రోజులు గ్యాప్ ఉండాలన్న రూల్ ఏదీ చట్టంలో లేదని చెప్పింది. ఏడాదిన్నరలోనే రెండోసారి సెలవు అడిగిన ఒక నర్సుకు పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పని తెలిపింది. ఆమెను మళ్లీ సెలవులకు అప్లికేషన్ పెట్టుకొమని చెప్పి, దానికి అధికారులను అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు వినతిపత్రం
TG: ఆర్మీకి చెందిన కబ్జా చేసిన భూమిని కాపాడాలని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ జైసింగ్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని ఆర్మీకి చెందిన భూమిలో ఆక్రమణల గురించి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

కడప బాలికల కళాశాల వద్ద హైటెన్షన్
AP: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ RSF నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కళాశాలలోకి ప్రవేశించేందుకు యత్నించగా, వన్‌టౌన్ SI ప్రదీప్ ఆధ్వర్యంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కళాశాల వద్ద టెన్షన వాతావరణం నెలకుంది.

మంత్రి రాజీనామాతో సమస్యలు తీరవు
AP: నీట్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన నిందితులకు కఠిన శిక్షలు పడాలని, కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారమైతేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 'లీప్' యాప్‌ను రూపొందించామని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక మంత్రి రాజీనామా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, వ్యవస్థలో అవసరమైన సంస్కరణలపై సూచనలు వస్తే చర్చించి అమలు చేస్తామన్నారు.
CJP నిరసనలో యువతికి పీరియడ్స్
CJP విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ యువతికి పీరియడ్స్ రావడంతో ఆమె ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అక్కడున్న కొందరు యువకులు, ఓ యువతి శానిటరీ ప్యాడ్, టిష్యూ పేపర్లు అందించి ఆమెకు సాయం చేశారు. ఈ విషయాన్ని ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో పంచుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో వైరల్‌గా మారగా.. పీరియడ్స్‌ను సహజంగా చూడడం, అవసరమైన సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చిన యువతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కేక్ కటింగ్‌లు వద్దు..సేవా కార్యక్రమాలే మేలు: KTR
TG: తన 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించుకున్నారు. దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, పేపర్ లీకేజీలపై ఆందోళన చేస్తున్న యువతకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్‌లు, బొకేలపై అనవసర ఖర్చులు చేయవద్దన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

నీట్ బాధితులకు మద్దతుగా కేటీఆర్
TG: నీట్ పేపర్ లీకేజీలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'Justice for Students..Fight, Fight, Fight..' అంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను బలాత్కారంగా అణచివేయలేరని, బాధితులకు న్యాయం జరిగే వరకు BRS పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

💸 కరెన్సీలో భారీ మార్పు
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు RBI కసరత్తు ప్రారంభించింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకురానుండగా, విజయవంతమైతే ఇతర నోట్లకూ విస్తరించనుంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఒక్కో నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

'ఆజాదీ' పాట వైరల్..ఎందుకంటే?
దేశంలో జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు, యువత తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఆకలి, వివక్ష, అవినీతి నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ సాగే ఈ 20 సెకన్ల 'ఆజాదీ' ర్యాప్ పాటను నినాదంగా వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్‌లో దీనికి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట విద్యార్థుల ఉద్యమానికి శక్తిగా నిలుస్తోంది.

KTRకు కాంగ్రెస్ బర్త్‌డే కానుక
TG: మాజీ మంత్రి KTR బర్త్ డే సందర్భంగా కానుకగా రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నబియ్యాన్ని పంపించింది. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 25కిలోల బియ్యాన్ని KTR పేరుతో HYDలోని తెలంగాణ భవన్‌కు ర్యాపిడో ద్వారా పంపించారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల KTR ఓ నిరుపేద కుటుంబం ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ప్రతి నెలా ఇలాగే సన్నబియ్యం పంపేందుకు సిద్ధమని చెప్పారు.

USFI నేతల అరెస్ట్.. కరీంనగర్‌లో ఉద్రిక్తత
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ కరీంనగర్‌లో MP బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు USFI నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి నాయకులను కరెంట్ ఆఫీస్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడులు ప్రజాస్వామ్య విరుద్ధమని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన వారినే అరెస్టు చేయడం అన్యాయమని నాయకులు ఫైరయ్యారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సూసైడ్ నోట్ రాసి ఏఎన్‌ఎం ఆత్మహత్య
AP: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సాయి చందన ప్రియ(27) సచివాలయంలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. సచివాలయంలో లభించిన సూసైడ్ నోట్‌లో తండ్రి వైద్యం కోసం తన ఇన్సూరెన్స్ అమౌంట్‌ను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సరోజ్(20), సావిత్రి(19), సంతోష్(18) ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తమ కెమెరామెన్ వికాస్‌ను గుడిలో పెళ్లాడారు. ఫ్యామిలీ వేర్వేరు పెళ్లిళ్లు చేయాలని చూడటంతో, ఇలా చేశామన్నారు. స్థానిక హిందూ సంస్థలు సనాతన ధర్మానికి విరుద్ధమని అభ్యంతరం చెప్పినా.. ‘ఆ రోజుల్లో రాజులు ఎంతోమందిని పెళ్లిళ్లు చేసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మాకెందుకు?’ అంటూ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే బాలకృష్ణకు మోకాలి సర్జరీ
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘NBK 111’ సినిమా షూట్‌లో గాయమైంది. తొడ కండరాన్ని మోకాలి చిప్పకు కలిపే కణజాలం చిట్లడంతోపాటు ఇరువైపులా గాయాలు అయినట్లు డాక్టర్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు మూడు గంటల పాటు ఆయన ఎడమ మోకాలికి సర్జరీ చేశారు. దెబ్బతిన్న భాగాలను బాగు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ గౌతమ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు.
పార్టీ మారడం లేదు.. BRSలోనే ఉంటా
TG: BRSను వీడి మరో పార్టీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని మేడ్చల్ MLA, మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారడం లేదని, BRSలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో KTR జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. తనపై అభిమానంతో ఓ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం బాధ కలిగించిందని, అతడిని గుర్తించి తప్పకుండా కలుస్తానని చెప్పారు.