Latest

యువత గొంతు నొక్కితే BJP పతనం ఖాయం
Politics· 24 Jul 2026

యువత గొంతు నొక్కితే BJP పతనం ఖాయం

TG: యువత గొంతు నొక్కితే BJP రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లాఠీచార్జీలు, కేసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కేనని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుందని, రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి నిలబడటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై బిగ్ రిలీఫ్
News· 24 Jul 2026

పెట్రోల్, డీజిల్‌పై బిగ్ రిలీఫ్

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారానికి కేంద్రం బ్రేక్ వేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన తాజా ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.59, డీజిల్ రూ.103.82గా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం లోకల్ ఇంధన ధరలను యథాతథంగా ఉంచినట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి మోదీ వీడియో
Politics· 24 Jul 2026

అర్ధరాత్రి మోదీ వీడియో

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని సోమవారం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

AI బ్లాక్‌ బోర్డ్‌ను ఆవిష్కరించిన చైనా సంస్థ
Technology· 24 Jul 2026

AI బ్లాక్‌ బోర్డ్‌ను ఆవిష్కరించిన చైనా సంస్థ

షాంఘైలో జరిగిన WAIC 2026లో iFLYTEK సంస్థ AI ఆధారిత బోధనా సాధనమైన AI బ్లాక్‌బోర్డ్‌ను ఆవిష్కరించింది. ఈ డిజిటల్ బోర్డ్ టీచర్ల ప్లేస్‌ను భర్తీ చేయడానికి కాకుండా వారికి సాయపడటానికి రూపొందించారు. ఈ స్మార్ట్ బోర్డు చేతిరాతను సరిదిద్దడం, 3D నమూనాలు చూపించేలా టీచర్లకు ఉపయోగపడుతుంది. వాయిస్ కమాండ్‌లతో కంట్రోల్ చేయడం, ఆటోమేటిక్‌గా పాఠాలను సేవ్ చేయడం లాంటి ఫీచర్లను అందిస్తుంది.

అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులు
AP· 24 Jul 2026

అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులు

AP: విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులను పంపుతున్నట్లు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరి వద్ద కుంకీ ఏనుగులను ఆయన పరిశీలించారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్నారు. ఒడిశాతో చర్చలు జరిపి మరికొన్ని కుంకీలను రప్పించాలని అధికారులను పవన్ ఆదేశించారు.

దిల్లీ మెట్రో బిగ్ అలర్ట్..17 మెట్రో స్టేషన్లు బంద్
News· 24 Jul 2026

దిల్లీ మెట్రో బిగ్ అలర్ట్..17 మెట్రో స్టేషన్లు బంద్

దిల్లీలో వరుసగా మూడో రోజు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ప్రకటించింది. నేడు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, సుప్రీంకోర్ట్, ITO, లోక్ కల్యాణ్ మార్గ్ మొత్తం 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ కొనసాగుతుందని DMRC సమాచారం ఇచ్చింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడు బ్రెయిన్ డెడ్
News· 24 Jul 2026

అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడు బ్రెయిన్ డెడ్

TG: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌కు చెందిన నిత్యానందరెడ్డి(26) అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌ అయ్యాడు. మూడేళ్ల క్రితం MS చదవడానికి అమెరికా వెళ్లిన అతను చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగంలో చేరారు. మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించి మృతి చెందాడు

తెలంగాణలో విద్యాసంస్థలు షట్‌డౌన్
Education· 24 Jul 2026

తెలంగాణలో విద్యాసంస్థలు షట్‌డౌన్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, SFI, AISF, PDSU తదితర సంఘాలు బంద్ నిర్వహించాయి. బంద్ ప్రభావంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, JNTU పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం
News· 24 Jul 2026

‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

AP: రాష్ట్ర భూరికార్డులకు శాశ్వత భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి భూభాగానికి ప్రత్యేక డిజిటల్ ఐడీతో టాంపర్-ప్రూఫ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య
Crime· 24 Jul 2026

సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో PGRS విభాగంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం చిత్తూరు సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో తహసీల్దార్‌గా పనిచేసిన ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒకవైపు దొంగలు..మరోవైపు పనిచెయ్యవు
TG· 24 Jul 2026

ఒకవైపు దొంగలు..మరోవైపు పనిచెయ్యవు

TG: కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను దొంగలు రాత్రి వేళల్లో కేబుళ్లు, ఛార్జింగ్ గన్నులను ఎత్తుకెళ్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పాడుచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెట్టిన 160 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో సగానికి పైగా పనిచేయడం లేదు. చాలాచోట్ల టెక్నికల్ సమస్యలు, మరికొన్ని చోట్ల చోరీలు ఇందుకు కారణం. గూగుల్ మ్యాప్స్ చూసి ఛార్జింగ్ కోసం వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోలీస్ విజన్-2047పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
News· 24 Jul 2026

పోలీస్ విజన్-2047పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

AP: ఏపీ పోలీస్ కేడర్ వ్యూహాత్మక సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు సైబర్ నేరాలు, మహిళలు-పిల్లల భద్రత, అంతర్గత భద్రత, డిజిటల్ పోలీసింగ్‌పై అధికారులతో చర్చించారు. టెక్నాలజీ, పౌర-కేంద్రీకృత, ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఏపీ పోలీస్ విజన్-2047కు స్పష్టమైన లక్ష్యాలతో రోడ్‌ మ్యాప్ రూపొందించాలన్నారు.

మంగళగిరిలో పురాతన గణేశ విగ్రహాలు లభ్యం
AP· 24 Jul 2026

మంగళగిరిలో పురాతన గణేశ విగ్రహాలు లభ్యం

AP: గుంటూరు జిల్లా కాజ గ్రామంలో 1,600 ఏళ్ల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు లభ్యమయ్యాయి. రైతు వెంకట్రామరెడ్డి పొలంలో దున్నుతుండగా నాగలికి తగిలి బయటపడ్డాయి. ఎర్ర ఇసుక రాతితో చేసిన ఈ విగ్రహాలు 3 సెంటీమీటర్లు, మరొకటి 5 సెంటీమీటర్ల ఎత్తు వున్నాయి. వీటితోపాటు 1-4వ శతాబ్దానికి చెందిన రంగుల మట్టిపాత్రల పెంకులు దొరికాయి. పల్నాడు జిల్లా చేజర్ల ఆలయంలోని విగ్రహంలా ఉండే ఈ చిన్న విగ్రహాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చెప్పారు.

అత్యాచారం కేసులో కోర్ట్ సంచలన తీర్పు
TG· 24 Jul 2026

అత్యాచారం కేసులో కోర్ట్ సంచలన తీర్పు

TG: హైదరాబాద్‌ LBనగర్‌లో 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కనుకు మహేశ్‌కు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.4లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2022లో బాలికను బెదిరించి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో పోక్సో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

మోదీ భయపడ్డారు.. ఆ భయం స్పష్టంగా కన్పిస్తుంది
India· 24 Jul 2026

మోదీ భయపడ్డారు.. ఆ భయం స్పష్టంగా కన్పిస్తుంది

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించగా, దానిని రీట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ "డర్ గయా.. ఆయనలో భయం కనిపిస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేసిన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని అన్నారు. యువత ఐక్యతే ప్రభుత్వాన్ని నిర్ణయాలు మార్చేలా చేసిందని పేర్కొన్నారు.

విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు పోస్ట్‌పోన్
Education· 24 Jul 2026

విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు పోస్ట్‌పోన్

TG: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్యారోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు తెలిపారు. జూలై 24 పరీక్షలు మాత్రమే వాయిదా పడగా, మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీక్ష ముగిసినా.. CJP పోరాటం కొనసాగుతుంది
India· 24 Jul 2026

దీక్ష ముగిసినా.. CJP పోరాటం కొనసాగుతుంది

సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష విరమించడం ఊరటనిచ్చిందని CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వీడియో రిలీజ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం వాంగ్‌చుక్ చూపిన ధైర్యాన్ని కొనియాడుతూ, ఆయన ప్రాణాలు దేశానికి ఎంతో విలువైనవని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. దీక్ష ముగిసినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద CJP శాంతియుత నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

CM రేవంత్‌ రెడ్డికి KTR అల్టిమేటం
Politics· 24 Jul 2026

CM రేవంత్‌ రెడ్డికి KTR అల్టిమేటం

TG: గ్లోబరీనా సంస్థ తన బినామీ కంపెనీ అంటూ CM రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లీగల్‌ నోటీసు పంపినట్లు తెలిపారు. 48 గంటల్లో ఆరోపణలను రుజువు చేయాలని, లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా నిజంగా తన బినామీ సంస్థ అయితే అదే కంపెనీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. CCSలో విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.

విద్యార్థులకు ప్రధాని మోదీ భరోసా
India· 24 Jul 2026

విద్యార్థులకు ప్రధాని మోదీ భరోసా

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకొస్తామని, దీనికి సంబంధించిన ప్రత్యేక బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వెల్లడించారు. రీఎగ్జామ్ ద్వారా విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు.

చిన్నారుల ముఖాల్లో కారు తెచ్చిన సంతోషం
Politics· 24 Jul 2026

చిన్నారుల ముఖాల్లో కారు తెచ్చిన సంతోషం

చిన్నారుల అమాయకత్వంలోని ఆనందం ఎంత వెలకట్టినా కొనలేనిది. ఈ వీడియో అందుకో ఉదాహరణ. రోడ్డు పక్కన కారు దగ్గర నిలబడి ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయితో వీడియో కారునే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయి అమాయకంగా కారు ఓనర్‌ని చూసి “మీ కారులో ఎక్కొచ్చా?” అని అడుగుతుంది. కారు యజమాని చిరునవ్వు నవ్వి వాళ్లను కారులోకి ఎక్కించుకున్నాడు. పిల్లల ముఖాల్లోని ఆనందం ఆ వీడియోకు ప్రధాన ఆకర్షణగా మారింది.

గాయం చేశాక మందు రాస్తే లాభం ఏంటి?
News· 24 Jul 2026

గాయం చేశాక మందు రాస్తే లాభం ఏంటి?

నెలన్నర రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తర్వాత ప్రధాని తీరిగ్గా స్పందించారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మండిపడ్డారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు వేయడం వల్ల సమస్య తీరదని, గాయమయ్యాక మందు రాయడం కంటే అసలు గాయమే కాకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే లీక్‌లు జరుగుతున్నాయని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని చెప్పారు.