Latest

మైనింగ్ అధికారుల పేరుతో దందా
TG· 23 Jul 2026

మైనింగ్ అధికారుల పేరుతో దందా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట టిప్పర్ యజమానులు, డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మైనింగ్ శాఖ అధికారుల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రోడ్లపై టిప్పర్లను అడ్డగించి వేధింపులకు పాల్పడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని, భారీ పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రంగంపై దాదాపు 200 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అధికారుల వేధింపులతో తమ ఉపాధి సంక్షోభంలో పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, తమను కాపాడాలని వారు కోరారు.

విద్యాసంస్థల బంద్ పిలుపు
Education· 23 Jul 2026

విద్యాసంస్థల బంద్ పిలుపు

నీట్, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ, రేపు (ఈ నెల 24న) AP, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బంద్‌లో పాల్గొనాలని కోరాయి. SFI, PDSU, AISF, NSUI తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలపై విచారణ వంటి డిమాండ్లతో బంద్ నిర్వహించనున్నారు.

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి
AP· 23 Jul 2026

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి

AP: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బీటెక్ విద్యార్థి రాకేశ్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్, సుజన్, శ్రీను అనే ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల ముగిసిన తర్వాత జిరాక్స్ షాప్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో గొడవ జరిగిందని, విజయ్ కూల్‌డ్రింక్ బాటిల్‌తో తలపై కొట్టడంతో గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి చేతులతో, కాళ్లతో దాడి చేయడంతో రాకేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

‘పెద్ది’ పోస్టర్‌తో అలిపిరిలో హల్‌చల్
Cinema· 23 Jul 2026

‘పెద్ది’ పోస్టర్‌తో అలిపిరిలో హల్‌చల్

AP: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ మహిళ ‘పెద్ది’ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీవారి క్షేత్రంలో సినిమా, రాజకీయ ప్రచారాలకు TTD కఠిన నిషేధం ఉన్నప్పటికీ పోస్టర్‌తో తిరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిబంధనలు అమల్లో ఉన్నా, భద్రతా సిబ్బంది ఈ ఘటనను అడ్డుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. TTD చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం
TG· 23 Jul 2026

ఢిల్లీ ఘటనపై HYDలో సంఘీభావ కార్యక్రమం

TG: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా ప్రతిఒక్కరూ దేశవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ JAC పిలుపునిచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగే ఈ సంఘీభావ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీయువకులు పాల్గొనాలన్నారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు చేసిన లాఠీచార్జీని, నిర్బంధాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది.

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం
AP· 23 Jul 2026

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం

AP: రాయలసీమలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రైవేట్ కంపెనీలు మోసం చేస్తున్నాయని CPM రాష్ట్ర కార్యదర్శి V. శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీల అగ్రిమెంట్లలో అనేక లొసుగులు ఉన్నాయని, ప్రభుత్వం రైతులకు ఎలాంటి కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం లేదన్నారు. రైతుల భూములను తాకట్టు పెట్టి కంపెనీలు వందల కోట్ల రుణాలు ఎలా పొందుతున్నాయని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వని వ్యవస్థ, పారిశ్రామికవేత్తలకు మాత్రం అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం థర్డ్ పార్టీగా జోక్యం చేసుకుని రైతులకు భద్రత కల్పించి, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు
Crime· 23 Jul 2026

అవినీతి ముత్యం అక్రమాస్తుల చిట్టా బట్టబయలు

తెలంగాణ రెడ్కో DE ముత్యం వెంకటరమణ అవినీతి కేసులో ACB అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు నాలుగు ఫ్లాట్లు, రెండు వాణిజ్య భవనాలు, రూ.52 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కిలోల బంగారం, విలువైన వాహనాలను సీజ్ చేశారు. సోదాల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ACB లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.27.65 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు
AP· 23 Jul 2026

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు

AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. 1996లో పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై ఇంటి నుంచి ముంబయికి వెళ్లిపోయిన రాముడు అనే యువకుడు 30 ఏళ్ల తర్వాత భార్య సుశీల, కుమార్తె సంజనతో కలిసి సొంతూరుకు చేరుకున్నాడు. SIR కోసం తల్లిదండ్రుల వివరాలు అవసరమవడంతో తన పాత ఇంటిని వెతికాడు. రెండురోజులు వెతికిన తర్వాత వాకిట్లో ఉన్న తల్లిని గుర్తించి పిలిచాడు. మొదట గుర్తుపట్టని ఆ తల్లి, అతడు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగానే భావోద్వేగానికి లోనైంది. చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోయింది.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
Politics· 23 Jul 2026

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని, ఆయనను కేంద్ర క్యాబినెట్‌ నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని CM రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణ నుంచే ‘సడక్‌ సే సంసాద్‌’ వరకు పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలపై పోలీసుల దాడిని ఖండించారు. ఈ పోరాటం కాంగ్రెస్‌, BJP మధ్య కాదని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు.

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్
Crime· 23 Jul 2026

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

AP: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి రూ.15 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ AP, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. కడపకు చెందిన ఇద్దరు మహిళలను రూ.55 లక్షల నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

నీట్ నిరసనలతో హీటెక్కిన హైదరాబాద్‌
TG· 23 Jul 2026

నీట్ నిరసనలతో హీటెక్కిన హైదరాబాద్‌

TG: నీట్ పేపర్ లీకేజీ నిరసనలు హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్, BJP నేతలు పరస్పరం ఒకరి రాష్ట్ర కార్యాలయాలను మరొకరు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన BJP నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కాంగ్రెస్ నేతలు BJP ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, కర్రలు, రాళ్లతో దాడులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

గాయాలు రేపుతున్న అనుమానాలు- పెల్లట్ గన్స్ వాడారా?
News· 23 Jul 2026

గాయాలు రేపుతున్న అనుమానాలు- పెల్లట్ గన్స్ వాడారా?

విద్యార్ధుల నిరసనలలో పాల్గొన్న ఓ ఢిల్లీ యువకుడి ఒంటిపై అనేక చిన్న చిన్న గాయలు ఉండటంతో పోలీసులు పెల్లెట్ గన్స్, షాక్ బ్యాటన్స్ వాడారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన "సంసద్ చలో" ర్యాలీ నిరసనలో పాల్గొన్న షేక్ ఇర్షాద్ మన్సూరీ అనే యువకుడికి పెల్లెట్ తరహా గాయాలయ్యాయి. లేడీ హార్డింజ్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి అతడి కంటి కింద ఉన్న గుళ్లను తొలగించారు. అయితే తమ బలగాలు ఎలాంటి పెల్లెట్ గన్లు వాడలేదని ఢిల్లీ పోలీసులు, PIB స్పష్టం చేశాయి. నీట్ సహా ఇతర పరీక్షల సంస్కరణల కోసం చేపట్టిన ఈ ఆందోళనలో 80 మందికి పైగా గాయపడ్డారు.

ఢిల్లీ నిరసనలలో  పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?
News· 23 Jul 2026

ఢిల్లీ నిరసనలలో పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?

ఢిల్లీలో CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పోలీసుల చర్యల్లో గాయపడిన ఓ నిరసనకారుడికి పెలెట్ గన్ గాయాలు ఉన్నట్లు ది హిందూ కథనం తెలిపింది. శరీరంలోని పెలెట్లలో కొన్ని తొలగించినా, మెడలో ఒకటి ఇంకా ఉందని తెలిపింది. 2024 రైతుల ఆందోళనలు, 2023 మణిపూర్ హింస, 2016 జమ్మూ-కాశ్మీర్ ఘటనల్లో కూడా పెలెట్ గన్స్ వాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు పెలెట్ గన్స్, షాక్ బ్యాటన్లు వాడలేదని ఈ ఆరోపణలను ఖండించారు.

జమ్మూలో  వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బిల్డింగ్ !
News· 22 Jul 2026

జమ్మూలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బిల్డింగ్ !

జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి.జమ్మూ కశ్మీర్ లోని బీర్వా కాల్వలోకి ఒక భవనం మొత్తం పేక మేడలా కూలిపోయి కొట్టుకు పోతున్న దృశ్యాలివి. చూస్తుండగానే కళ్ల ముందే సెకన్ల వ్యవధిలో ఈ భవనం కూలి నీటిలో కలిసిపోవడం కలవర పెట్టింది. విడవ కుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు నీటిలో నానిపోయిన భవనాలు కూలిపోయి కొట్టుకుపోతున్నాయి.

జెన్ Z కు  స్విగ్గీ, జుమాటో ఆర్డర్లతో ఢిల్లీ వాసుల ఫుడ్ సప్లయ్ !
News· 22 Jul 2026

జెన్ Z కు స్విగ్గీ, జుమాటో ఆర్డర్లతో ఢిల్లీ వాసుల ఫుడ్ సప్లయ్ !

ఢిల్లీ నిరసనల్లో జెన్ Z కు ఢిల్లీ నలుమూలలనుంచి స్విగ్గీ, జుమాటోల ద్వారా వెల్ విషర్స్ ఫుడ్ సప్లయ్ చేశారు. పెద్ద పెద్ద వ్యాన్లు, ట్రక్కుల్లో ఫుడ్ పార్సిల్స్ ను దింపుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుడ్ అంతటిని ఒక చోట పెట్టి బఫే పద్ధతిలో ఎవరికి కావలసినది వారు తీసుకునేలా అరెంజ్ చేయడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఈవీడియో చూసిన మరికొందరు నెటిజన్లు తమ జెన్ Z ను ఎలా కాపాడుకోవాలో తెలుసునని, తాము కూడా ఫుడ్ పంపుతామంటూ ముందుకొచ్చారు. మరికొందరు వీటి వెనుక విదేశీ శక్తులున్నాయని ప్రభుత్వం అనుమానిస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు.

లాఠీ చార్జిని నిరసిస్తూ ఉద్యమానికి అన్నాహజారే సిద్ధం !
News· 22 Jul 2026

లాఠీ చార్జిని నిరసిస్తూ ఉద్యమానికి అన్నాహజారే సిద్ధం !

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును బలప్రయోగంతో అణచివేయడం సరైన పద్ధతి కాదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తాను స్వయంగా ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి శాంతియుత పరిష్కారం కోరారు. అవినీతి వ్యతిరేక జన్ లోక్‌పాల్ ఉద్యమం, సమాచార హక్కు (ఆర్టీఐ), రైతులు, గ్రామీణాభివృద్ధి వంటి పలు ప్రజా సమస్యలపై గతంలో దేశవ్యాప్తంగా అన్నా హజారే అనేక ఉద్యమాలను లీడ్ చేశారు.

ఢిల్లీ నిరసనలలో  పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?
News· 22 Jul 2026

ఢిల్లీ నిరసనలలో పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?

ఢిల్లీలో CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పోలీసుల చర్యల్లో గాయపడిన ఓ నిరసనకారుడికి పెలెట్ గన్ గాయాలు ఉన్నట్లు ది హిందూ కథనం తెలిపింది. శరీరంలోని పెలెట్లలో కొన్ని తొలగించినా, మెడలో ఒకటి ఇంకా ఉందని తెలిపింది. 2024 రైతుల ఆందోళనలు, 2023 మణిపూర్ హింస, 2016 జమ్మూ-కాశ్మీర్ ఘటనల్లో కూడా పెలెట్ గన్స్ వాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు పెలెట్ గన్స్, షాక్ బ్యాటన్లు వాడలేదని ఈ ఆరోపణలను ఖండించారు.

ప్రజాస్వామ్యానికి ఆ రెండూ  అత్యవసరం - నీట్ టాపర్  ఆర్యన్ గుప్తా
News· 22 Jul 2026

ప్రజాస్వామ్యానికి ఆ రెండూ అత్యవసరం - నీట్ టాపర్ ఆర్యన్ గుప్తా

ప్రజాస్వామ్యం లో ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని నీట్ టాప్ ర్యాంకర్ ఆర్యన్ గుప్తా అన్నాడు. సమస్యలపై ప్రశ్నించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్త పరచడం రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులని ఆర్యన్ కామెంట్ చేశాడు. జంతర్ మంతర్ నిరసనలు, ఇతర డెవలప్ మెంట్స్ నేపధ్యంలో ఆర్యన్ చేసిన ఈ కామెంట్లు సామాజికంగా, పొలిటికల్ గా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అనుమానంతో నటి ఆయేషా ఖాన్ అరెస్ట్  !
News· 22 Jul 2026

అనుమానంతో నటి ఆయేషా ఖాన్ అరెస్ట్ !

దురంధర్ మూవీలో నటి ఆయేషా ఖాన్ ను విద్యార్ధుల నిరసనల్లో పాల్గొన్నారన్న అనుమానంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, రోడ్డు పై నిలబడి ఉండగా ఎలాంటి వివరణ లేకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్ వీడియో ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. షరారత్ సాంగ్ తో పాపులర్ అయిన ఆయేషాను ముంబై పోలీసులు వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బెయిల్ పై విడుదలైన జర్నలిస్ట్ కేవిఆర్
TG· 22 Jul 2026

బెయిల్ పై విడుదలైన జర్నలిస్ట్ కేవిఆర్

ఏపీ సీఎం చంద్రబాబుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయిన తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. 22 రోజుల తర్వాత బెయిల్ రావడంతో అతడు జైలు నుంచి విడుదల అయ్యాడు. గతనెల 30 చంద్రబాబుపై అసభ్యకర కామెంట్లు చేసినందుకు విజయ నగరం జిల్లా బొబ్బిలి పోలీసులు హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో అరెస్ట్ చేసి బొబ్బిలికి తరలించారు.!!

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ
AP· 22 Jul 2026

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి జ్యోతి సుంకర మరణించారు. వైరల్ న్యుమోనియాకు విజయవాడలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆమె కన్నుమూశారు. తన చిన్నతనం నుంచి ఎంతగానో ఆదరించి, తల్లిలా చూసుకున్న తన అక్క ఇక లేదనే వార్తను తట్టుకోలేకపోతున్నానని మెహర్ రమేశ్ భావోద్వేగానికి గురయ్యారు.విషయం తెలిసిన వెంటనే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మెహర్ రమేశ్‌ను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.