Latest

ఢిల్లీ నిరసనలలో  పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?
News· 22 Jul 2026

ఢిల్లీ నిరసనలలో పెల్లెట్ గన్స్?.. షాక్ బ్యాటన్లు వాడారా ?

ఢిల్లీలో CJP చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పోలీసుల చర్యల్లో గాయపడిన ఓ నిరసనకారుడికి పెలెట్ గన్ గాయాలు ఉన్నట్లు ది హిందూ కథనం తెలిపింది. శరీరంలోని పెలెట్లలో కొన్ని తొలగించినా, మెడలో ఒకటి ఇంకా ఉందని తెలిపింది. 2024 రైతుల ఆందోళనలు, 2023 మణిపూర్ హింస, 2016 జమ్మూ-కాశ్మీర్ ఘటనల్లో కూడా పెలెట్ గన్స్ వాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు పెలెట్ గన్స్, షాక్ బ్యాటన్లు వాడలేదని ఈ ఆరోపణలను ఖండించారు.

ప్రజాస్వామ్యానికి ఆ రెండూ  అత్యవసరం - నీట్ టాపర్  ఆర్యన్ గుప్తా
News· 22 Jul 2026

ప్రజాస్వామ్యానికి ఆ రెండూ అత్యవసరం - నీట్ టాపర్ ఆర్యన్ గుప్తా

ప్రజాస్వామ్యం లో ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని నీట్ టాప్ ర్యాంకర్ ఆర్యన్ గుప్తా అన్నాడు. సమస్యలపై ప్రశ్నించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్త పరచడం రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులని ఆర్యన్ కామెంట్ చేశాడు. జంతర్ మంతర్ నిరసనలు, ఇతర డెవలప్ మెంట్స్ నేపధ్యంలో ఆర్యన్ చేసిన ఈ కామెంట్లు సామాజికంగా, పొలిటికల్ గా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అనుమానంతో నటి ఆయేషా ఖాన్ అరెస్ట్  !
News· 22 Jul 2026

అనుమానంతో నటి ఆయేషా ఖాన్ అరెస్ట్ !

దురంధర్ మూవీలో నటి ఆయేషా ఖాన్ ను విద్యార్ధుల నిరసనల్లో పాల్గొన్నారన్న అనుమానంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, రోడ్డు పై నిలబడి ఉండగా ఎలాంటి వివరణ లేకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్ వీడియో ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. షరారత్ సాంగ్ తో పాపులర్ అయిన ఆయేషాను ముంబై పోలీసులు వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బెయిల్ పై విడుదలైన జర్నలిస్ట్ కేవిఆర్
TG· 22 Jul 2026

బెయిల్ పై విడుదలైన జర్నలిస్ట్ కేవిఆర్

ఏపీ సీఎం చంద్రబాబుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి అరెస్టయిన తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. 22 రోజుల తర్వాత బెయిల్ రావడంతో అతడు జైలు నుంచి విడుదల అయ్యాడు. గతనెల 30 చంద్రబాబుపై అసభ్యకర కామెంట్లు చేసినందుకు విజయ నగరం జిల్లా బొబ్బిలి పోలీసులు హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో అరెస్ట్ చేసి బొబ్బిలికి తరలించారు.!!

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ
AP· 22 Jul 2026

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి జ్యోతి సుంకర మరణించారు. వైరల్ న్యుమోనియాకు విజయవాడలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆమె కన్నుమూశారు. తన చిన్నతనం నుంచి ఎంతగానో ఆదరించి, తల్లిలా చూసుకున్న తన అక్క ఇక లేదనే వార్తను తట్టుకోలేకపోతున్నానని మెహర్ రమేశ్ భావోద్వేగానికి గురయ్యారు.విషయం తెలిసిన వెంటనే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మెహర్ రమేశ్‌ను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇది పబ్లిసిటీ కోసమా? ఢిల్లీ పోలీసులకు  హై కోర్టు చురకలు
News· 22 Jul 2026

ఇది పబ్లిసిటీ కోసమా? ఢిల్లీ పోలీసులకు హై కోర్టు చురకలు

NEET పేపర్ లీకేజీకి నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' మార్చ్ లో పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌పై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. కేంద్రం తరఫు న్యాయవాది ఇది కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని వాదించగా, కోర్టు దానిని తోసిపుచ్చింది. ఇది విడివిడిగా ఎక్కడో ఒకసారి జరిగిన చిన్న ఘటన కాదని స్పష్టం చేస్తూ కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.

విద్యార్థులపై లాఠీఛార్జ్.. పార్లమెంట్‌లో ఖర్గే ఫైర్!
Politics· 22 Jul 2026

విద్యార్థులపై లాఠీఛార్జ్.. పార్లమెంట్‌లో ఖర్గే ఫైర్!

స్టూడెంట్స్‌పై జరిగిన లాఠీఛార్జ్ పై రాజ్యసభలో ఆపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై హోమ్ మినిస్టర్ హౌస్‌లో క్లారిటీ ఇవ్వాలని, విద్యార్థులకు ప్రధాని మోదీ ఓపెన్‌గా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరగాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ప్రొటెస్ట్ చేస్తున్న MPలు, లీడర్లను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

YCP మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్! 🚨
AP· 22 Jul 2026

YCP మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్! 🚨

YCP మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఇన్వాల్వ్ అయిన తన కుమారుడిని తప్పించేందుకు ప్రయ్నత్నించినారనే ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పలరాజును అరెస్ట్ చేసే టైమ్‌లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఏడ్చారు. కొడుకుని సేవ్ చేసేందుకు ప్రయత్నించి మాజీ మంత్రి అరెస్ట్ అవ్వడం AP పాలిటిక్స్‌లో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

హీరో బాలకృష్ణ హెల్త్ అప్డేట్ అవుట్!
Cinema· 22 Jul 2026

హీరో బాలకృష్ణ హెల్త్ అప్డేట్ అవుట్!

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న 'NBK111' మూవీ షూటింగ్ లో గాయపడ్డ బాలకృష్ణ హెల్త్ అప్డేట్ ను హైదరాబాద్‌ AIG హాస్పిటల్ రిలీజ్ చేసింది. బాలయ్య కాలి కండరంలో రక్తం గడ్డకట్టిందని, ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల సూపర్ విజన్‌లో ఉన్నారని, మెడికల్ టెస్ట్‌లన్నీ కంప్లీట్ అయ్యాక ప్రాపర్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బాలయ్య త్వరగా రికవర్ అవ్వాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

1997 పేపర్ లీక్.. లాఠీ దెబ్బలు తిన్న ధర్మేంద్ర ప్రధాన్!
Politics· 22 Jul 2026

1997 పేపర్ లీక్.. లాఠీ దెబ్బలు తిన్న ధర్మేంద్ర ప్రధాన్!

NEET పేపర్ లీక్ వల్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. అయితే, 1997లో ఒడిశాలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అప్పట్లో ABVP విద్యార్థి నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ భారీ నిరసనలు తెలిపిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెక్రటేరియట్ ముట్టడి సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకప్పుడు పేపర్ లీకులపై పోరాడి లాఠీ దెబ్బలు తిన్న ఆయనే, ఇప్పుడు అదే తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

డిమాండ్లు నెరవేరితేనే దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్!
Education· 22 Jul 2026

డిమాండ్లు నెరవేరితేనే దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్!

NEET పేపర్ లీకేజీపై 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. "నాకు బతకాలని ఉంది, స్టూడెంట్స్ కోసం చాలా చేయాలి" అని పేర్కొంటూనే, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. పేపర్ లీక్ బాధితులకు పరిహారం, విద్యాశాఖ మంత్రి రాజీనామా, పార్లమెంట్‌లో చర్చపై హాస్పిటల్ కి వచ్చి మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రొటెస్ట్ చేసిన వారిపై కేసులు, వేధింపులు ఉండవని కేంద్రం భరోసా ఇవ్వకపోతే తన నిరవధిక దీక్ష కొనసాగుతుందని హెచ్చరించారు.

పోలీసుల లాఠీఛార్జ్‌పై ర్యాప్ సాంగ్ వైరల్!
Politics· 22 Jul 2026

పోలీసుల లాఠీఛార్జ్‌పై ర్యాప్ సాంగ్ వైరల్!

జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ప్రొటెస్ట్‌పై ర్యాపర్ 'గరం కలాకార్' పాడిన ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులపై పోలీసులు, సివిల్ డ్రెస్‌లో ఉన్న గుండాలు ప్రదర్శించిన బలప్రయోగాన్ని, లాఠీఛార్జ్ ప్రయోగాన్ని తన పాట ద్వారా ఆయన తీవ్రంగా నిరసించారు. మీడియా, ప్రభుత్వం ఈ అంశంపై మౌనంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను మోసం చేసిన ఫలితం రాబోయే 2029 ఎన్నికల్లో కనిపిస్తుందని ర్యాపర్ పాటలో హెచ్చరించారు.

ఆరు నెలలైనా ఇక్కడే ఉంటాం- అభిజీత్ దిప్కే
Education· 22 Jul 2026

ఆరు నెలలైనా ఇక్కడే ఉంటాం- అభిజీత్ దిప్కే

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని మోదీ పదవి నుంచి తొలగించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. రైతుల ఉద్యమం (కిసాన్ ఆందోళన్) గెలిచే వరకు ఏడాది పాటు ఎలా సాగిందో, విజయం సాధించే వరకు తమ నిరసన కూడా అలాగే కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ ప్రొటెస్ట్ నెల రోజులు లేదా ఆరు నెలలైనా ఇక్కడే ఉండి కొనసాగిస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆయన మాట్లాడారు.

నిందితులను బానెట్‌కు కట్టిన పోలీసులు..వీడియో VIRAL
Viral· 22 Jul 2026

నిందితులను బానెట్‌కు కట్టిన పోలీసులు..వీడియో VIRAL

మహారాష్ట్రలోని పుణేలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో పట్టుబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు వాహనం బానెట్‌కు కట్టి తీసుకెళ్లినట్లు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు మైనర్లపై కేసు నమోదు చేశారు. పాత గొడవ కారణంగానే బాలుడిపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితులను ఇలా ప్రజల ముందుకు తీసుకురావడంపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా స్పందించలేదు.

‘ప్రేమే కారణమా’..ఫడ్నవీస్ షాకింగ్ రిపోర్ట్!
News· 22 Jul 2026

‘ప్రేమే కారణమా’..ఫడ్నవీస్ షాకింగ్ రిపోర్ట్!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. 2021–2026 మధ్య ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళల్లో 46.32% మంది ప్రేమ సంబంధాల కారణంగానే వెళ్లినట్లు రిపోర్ట్ చెబుతోందని ఆయన తెలిపారు. పురుషుల్లో 32% మంది కుటుంబ సమస్యల కారణంగా ఇల్లు విడిచి వెళ్లినట్లు చెప్పారు. మొత్తం 93% మంది తర్వాత తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించారు.

'మోడీజీ.. ఏమైంది మీకు?'.. రాఖీ సవంత్ ఫైర్..!
Politics· 22 Jul 2026

'మోడీజీ.. ఏమైంది మీకు?'.. రాఖీ సవంత్ ఫైర్..!

దిల్లీలో 'చలో సంసద్' మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి చేయడంపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఓ వీడియో ద్వారా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ వాడటం సరైంది కాదని అన్నారు. 'ఇది ఆపండి. మనం బ్రిటీష్ కాలంలో లేం' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

KU పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు అనౌన్స్
Education· 22 Jul 2026

KU పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు అనౌన్స్

TG: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్‌ తెలిపారు. జూలై 24న జరగాల్సిన ఫార్మ్-డి 4వ సంవత్సరం పరీక్ష జూలై 27కి, ఎంఈడి 4వ సెమిస్టర్ పరీక్ష జూలై 31కి ,జూలై 25న జరగాల్సిన ఫార్మ్-డి 3వ సంవత్సరం, బి.ఫార్మసీ 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27న, బీటెక్ 2వ సెమిస్టర్ పరీక్ష ఆగస్టు 7కి వాయిదా పడ్డాయి. పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని అధికారులు స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ వద్ద  రెజ్లర్ భజరంగ్ పునియా
News· 22 Jul 2026

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ భజరంగ్ పునియా

పరీక్షల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నా చేపడుతోంది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఇందులో పాల్గొని CJPకి మద్దతు తెలిపారు.

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు
AP· 22 Jul 2026

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు

AP: మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన మూడువేల మంది పేద లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ శాశ్వత భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 'మన ఇల్లు–మన లోకేష్' కార్యక్రమ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చామని తెలిపారు. భూమి హక్కు పత్రాలతో లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ మురుగునీటి పారుదల, 24 గంటల తాగునీటి సరఫరా, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

CJP నిర్ణయంపై విజేతా దహియా అసంతృప్తి!
Politics· 22 Jul 2026

CJP నిర్ణయంపై విజేతా దహియా అసంతృప్తి!

CJP నుంచి స్పోక్స్ పర్సన్ గా తనను తొలగించడంపై విజేతా దహియా స్పందించారు. ఈ నిర్ణయంతో తన 'హార్ట్ బ్రేక్' అయిందని, తోటి ఉద్యమకారులే తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో పార్లమెంటు కు ముందు రెండు రోజులు నిరంతరంగా ప్రొటెస్ట్ చేస్తూ కాపలా కాసానని, చివరికి తగిన గుర్తింపు ఇవ్వకుండా తనపై యాక్షన్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. 'మనువాదుల' ఒత్తిడితో, అకౌంటబిలిటీ లేకుండా CJP ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఈ నిర్ణయం మూవ్‌మెంట్‌కు ఉపయోగపడితే మంచిదేనన్నారు.

ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో ప్రమాదం!
Infotainment· 22 Jul 2026

ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో ప్రమాదం!

రోజూ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే 'బిస్‌ఫెనాల్-ఎ'(BPA), థాలేట్స్ రసాయనాలు శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తాయంటున్నారు. ప్లాస్టిక్ బాక్సు మైక్రోవేవ్‌లో వేడి చేసి తినడం, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయడం ద్వారా కెమికల్స్ ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్తాయంటున్నారు. అందుకే ప్లాస్టిక్ వాడకం తగ్గించి గాజు లేదా సిరామిక్ పాత్రలు వాడటం మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు.