Latest

నిందితులను బానెట్‌కు కట్టిన పోలీసులు..వీడియో VIRAL
Viral· 22 Jul 2026

నిందితులను బానెట్‌కు కట్టిన పోలీసులు..వీడియో VIRAL

మహారాష్ట్రలోని పుణేలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో పట్టుబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు వాహనం బానెట్‌కు కట్టి తీసుకెళ్లినట్లు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు మైనర్లపై కేసు నమోదు చేశారు. పాత గొడవ కారణంగానే బాలుడిపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే నిందితులను ఇలా ప్రజల ముందుకు తీసుకురావడంపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా స్పందించలేదు.

‘ప్రేమే కారణమా’..ఫడ్నవీస్ షాకింగ్ రిపోర్ట్!
News· 22 Jul 2026

‘ప్రేమే కారణమా’..ఫడ్నవీస్ షాకింగ్ రిపోర్ట్!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. 2021–2026 మధ్య ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళల్లో 46.32% మంది ప్రేమ సంబంధాల కారణంగానే వెళ్లినట్లు రిపోర్ట్ చెబుతోందని ఆయన తెలిపారు. పురుషుల్లో 32% మంది కుటుంబ సమస్యల కారణంగా ఇల్లు విడిచి వెళ్లినట్లు చెప్పారు. మొత్తం 93% మంది తర్వాత తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించారు.

'మోడీజీ.. ఏమైంది మీకు?'.. రాఖీ సవంత్ ఫైర్..!
Politics· 22 Jul 2026

'మోడీజీ.. ఏమైంది మీకు?'.. రాఖీ సవంత్ ఫైర్..!

దిల్లీలో 'చలో సంసద్' మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి చేయడంపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఓ వీడియో ద్వారా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ వాడటం సరైంది కాదని అన్నారు. 'ఇది ఆపండి. మనం బ్రిటీష్ కాలంలో లేం' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

KU పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు అనౌన్స్
Education· 22 Jul 2026

KU పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు అనౌన్స్

TG: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్‌ తెలిపారు. జూలై 24న జరగాల్సిన ఫార్మ్-డి 4వ సంవత్సరం పరీక్ష జూలై 27కి, ఎంఈడి 4వ సెమిస్టర్ పరీక్ష జూలై 31కి ,జూలై 25న జరగాల్సిన ఫార్మ్-డి 3వ సంవత్సరం, బి.ఫార్మసీ 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27న, బీటెక్ 2వ సెమిస్టర్ పరీక్ష ఆగస్టు 7కి వాయిదా పడ్డాయి. పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని అధికారులు స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ వద్ద  రెజ్లర్ భజరంగ్ పునియా
News· 22 Jul 2026

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ భజరంగ్ పునియా

పరీక్షల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నా చేపడుతోంది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఇందులో పాల్గొని CJPకి మద్దతు తెలిపారు.

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు
AP· 22 Jul 2026

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు

AP: మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన మూడువేల మంది పేద లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ శాశ్వత భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 'మన ఇల్లు–మన లోకేష్' కార్యక్రమ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చామని తెలిపారు. భూమి హక్కు పత్రాలతో లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ మురుగునీటి పారుదల, 24 గంటల తాగునీటి సరఫరా, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

CJP నిర్ణయంపై విజేతా దహియా అసంతృప్తి!
Politics· 22 Jul 2026

CJP నిర్ణయంపై విజేతా దహియా అసంతృప్తి!

CJP నుంచి స్పోక్స్ పర్సన్ గా తనను తొలగించడంపై విజేతా దహియా స్పందించారు. ఈ నిర్ణయంతో తన 'హార్ట్ బ్రేక్' అయిందని, తోటి ఉద్యమకారులే తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో పార్లమెంటు కు ముందు రెండు రోజులు నిరంతరంగా ప్రొటెస్ట్ చేస్తూ కాపలా కాసానని, చివరికి తగిన గుర్తింపు ఇవ్వకుండా తనపై యాక్షన్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. 'మనువాదుల' ఒత్తిడితో, అకౌంటబిలిటీ లేకుండా CJP ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ఈ నిర్ణయం మూవ్‌మెంట్‌కు ఉపయోగపడితే మంచిదేనన్నారు.

ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో ప్రమాదం!
Infotainment· 22 Jul 2026

ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో ప్రమాదం!

రోజూ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే 'బిస్‌ఫెనాల్-ఎ'(BPA), థాలేట్స్ రసాయనాలు శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తాయంటున్నారు. ప్లాస్టిక్ బాక్సు మైక్రోవేవ్‌లో వేడి చేసి తినడం, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయడం ద్వారా కెమికల్స్ ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్తాయంటున్నారు. అందుకే ప్లాస్టిక్ వాడకం తగ్గించి గాజు లేదా సిరామిక్ పాత్రలు వాడటం మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు.

టంగ్ స్లిప్ అయిన తెలంగాణ సీఎం
TG· 22 Jul 2026

టంగ్ స్లిప్ అయిన తెలంగాణ సీఎం

TG: పబ్లిక్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. ‘సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేశారు’ అన్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో VIRALగా మారింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో UPA కూటమి విజయం సాధించిన తర్వాత సోనియా గాంధీ PM పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్‌ను PM అభ్యర్థిగా ఎనుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయ్యారు కానీ ప్రధాని ఎప్పుడు కాలేదు. రేవంత్ రెడ్డి మాటలు ఈ వాస్తవాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు..ఏది బెస్ట్?
Education· 22 Jul 2026

తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు..ఏది బెస్ట్?

తారు, కాంక్రీట్ రోడ్లు రెండూ వేర్వేరు అవసరాలకు పనికొస్తాయి. తారు రోడ్లు తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తవుతాయి. ప్రయాణం సాఫీగా ఉంటుంది. అందుకే వీటిని హైవేలపై వేస్తారు. అయితే వర్షాలకు ఇవి త్వరగా పాడవుతాయి. కాంక్రీట్ రోడ్లు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఎక్కువ కాలం వచ్చేలా ఉంటాయి. నీరు నిలిచినా పాడవవు కాబట్టి వీటిని గ్రామాల్లో ఎక్కువగా నిర్మిస్తారు. కానీ కాంక్రీట్ రోడ్ల తయారీకి ఖర్చు, సమయం ఎక్కువ పడుతుంది. రద్దీ, వాతావరణాన్ని బట్టి ఇంజినీర్లు ఏ రోడ్డు వేయాలో నిర్ణయిస్తారు.

దేవాదులలో మోటర్ల సంఖ్య పెంపు
News· 22 Jul 2026

దేవాదులలో మోటర్ల సంఖ్య పెంపు

TG: రైతుల నుంచి వ్యతిరేకత రావటంతో ఇప్పటివరకు ఐదు మోటర్లతో నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో ప్రభుత్వం తొమ్మిది మోటర్లను ప్రారంభించింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం సమ్మక్క సాగర్‌కు 40,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 38,410 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. అధికారులు 1,790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
AP· 22 Jul 2026

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో విమానయాన రంగం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఈ విమానాశ్రయం టూరిజం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలను పెంచి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని చంద్రబాబు తన 'ఎక్స్' అకౌంట్‌లో తెలిపారు.

PMకి ఫ్లైట్ టికెట్, మంత్రికి రిజైన్ లెటర్ రెడీ!
Education· 22 Jul 2026

PMకి ఫ్లైట్ టికెట్, మంత్రికి రిజైన్ లెటర్ రెడీ!

NEET పేపర్ లీక్ ఇష్యూపై స్టూడెంట్స్ కొత్తగాగా ప్రొటెస్ట్ చేశారు. ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించలేకపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి ఒక ‘Resignation Letter’ రెడీ చేశారు, ఆ పేపర్ మీద ఆయన ఒక సంతకం లేదా వేలిముద్ర వేయాలని డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్ ఇష్యూపై సైలెంట్‌గా ఉన్న ప్రధాని మోదీ కోసం ఢిల్లీ నుంచి ఇంపాల్‌కి ఓ ఫ్రీ ‘Flight Ticket’ డిజైన్ చేశారు. Tax Payers మనీతోనే ఈ టికెట్ అంటూ స్టూడెంట్స్ సెటైర్లు వేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు..ట్రాఫిక్ జామ్
Politics· 22 Jul 2026

కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు..ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘లోక్‌భవన్’ ముట్టడికి పిలుపునిస్తే, బీజేపీ లీడర్లు 'గాంధీ భవన్' వైపు దూసుకొచ్చి ముట్టడించడానికి ట్రై చేశారు. దీంతో నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపూల్ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడడంతో బండ్లు ఆగిపోయి జనాలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రెండు పార్టీల లీడర్లు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్..రూ.5,000 జరిమానా
Infotainment· 22 Jul 2026

పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్..రూ.5,000 జరిమానా

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్‌ను సెప్టెంబర్ 30 నాటికి నమోదు చేసుకోకపోతే రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రేబిస్ వ్యాధి లేకుండా చేయడం, జంతువుల హెల్త్ డీటెయిల్స్ తెలుసుకోవడాని ఇది అవసరమని చెప్పింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000, రెన్యూవల్ ఫీజు రూ.500గా అధికారులు నిర్ణయించారు. 3 నెలల వయసులోనే మొదటి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించి వివరాలు నమోదు చేయాలన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్
Politics· 22 Jul 2026

ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్

దేశంలో యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని, భారత విద్యావిధానాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. విద్యార్థుల మూడు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు
News· 22 Jul 2026

రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు

తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలో యువకులు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ని రావణాసురుడిగా, త్రిషను అమ్మవారిగా చూపిస్తూ బ్యానర్‌ వేశారు. గుడి వేడుకలో సినిమా నటులను దేవుళ్ల రూపంలో చూపించడం సరికాదంటూ అక్కడున్నవాళ్ళందరూ మండిపడ్డారు. బ్యానర్ వేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్
Politics· 22 Jul 2026

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్

దిల్లీలో మొన్న జరిగిన ‘చలో సంసద్’ నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ 'ఇది గతంలోనూ జరిగింది. మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా యువత అధిగమిస్తుంది' అని తన ‘ఎక్స్’లో రాశారు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్. 1930 ఉప్పు సత్యాగ్రహ వీడియోతో 2026 దిల్లీ యువత నిరసనలను పోల్చారు.

సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి
Crime· 22 Jul 2026

సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి

TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది పేలింది. దీంతో లోకేష్(14) తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ
News· 22 Jul 2026

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ

AP: ఏపీలో తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని నటి కాదంబరి జిత్వానీ ఆరోపించారు. సీఐడీ దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఛార్జిషీట్‌లో తనపై అసత్య ఆరోపణలు చేశారని, రూ.4.5 లక్షల డిపాజిట్‌ను రూ.1.32 కోట్లుగా తప్పుగా చూపించారని తెలిపారు. కె.విద్యాసాగర్‌తో ఆర్థిక లావాదేవీలు దశాబ్దం క్రితమే ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదని, బలిపశువుగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!
Politics· 22 Jul 2026

నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!

ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో ఒక తల్లి పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నిన్న చాలా మంది పిల్లల తలలు పగలగొట్టారు కదా.. నా ఇద్దరి పిల్లలని కూడా తీసుకొచ్చాను, వీరిని కూడా కొట్టేయండి" అంటూ ఆవేదనతో ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ, ఆ తల్లి తీవ్రంగా స్పందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.