Latest

ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్
Politics· 22 Jul 2026

ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్

దేశంలో యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని, భారత విద్యావిధానాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. విద్యార్థుల మూడు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు
News· 22 Jul 2026

రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు

తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలో యువకులు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ని రావణాసురుడిగా, త్రిషను అమ్మవారిగా చూపిస్తూ బ్యానర్‌ వేశారు. గుడి వేడుకలో సినిమా నటులను దేవుళ్ల రూపంలో చూపించడం సరికాదంటూ అక్కడున్నవాళ్ళందరూ మండిపడ్డారు. బ్యానర్ వేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్
Politics· 22 Jul 2026

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’‌ను పోల్చిన ప్రకాశ్‌రాజ్

దిల్లీలో మొన్న జరిగిన ‘చలో సంసద్’ నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ 'ఇది గతంలోనూ జరిగింది. మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా యువత అధిగమిస్తుంది' అని తన ‘ఎక్స్’లో రాశారు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్. 1930 ఉప్పు సత్యాగ్రహ వీడియోతో 2026 దిల్లీ యువత నిరసనలను పోల్చారు.

సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి
Crime· 22 Jul 2026

సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి

TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది పేలింది. దీంతో లోకేష్(14) తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ
News· 22 Jul 2026

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ

AP: ఏపీలో తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని నటి కాదంబరి జిత్వానీ ఆరోపించారు. సీఐడీ దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఛార్జిషీట్‌లో తనపై అసత్య ఆరోపణలు చేశారని, రూ.4.5 లక్షల డిపాజిట్‌ను రూ.1.32 కోట్లుగా తప్పుగా చూపించారని తెలిపారు. కె.విద్యాసాగర్‌తో ఆర్థిక లావాదేవీలు దశాబ్దం క్రితమే ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదని, బలిపశువుగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!
Politics· 22 Jul 2026

నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!

ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో ఒక తల్లి పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నిన్న చాలా మంది పిల్లల తలలు పగలగొట్టారు కదా.. నా ఇద్దరి పిల్లలని కూడా తీసుకొచ్చాను, వీరిని కూడా కొట్టేయండి" అంటూ ఆవేదనతో ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ, ఆ తల్లి తీవ్రంగా స్పందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్ర మంత్రి ఇన్విటేషన్‌ని రిజెక్ట్ చేసిన స్టూడెంట్స్!
Politics· 22 Jul 2026

కేంద్ర మంత్రి ఇన్విటేషన్‌ని రిజెక్ట్ చేసిన స్టూడెంట్స్!

కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంటికి చర్చలకు రావాలని ఢిల్లీ పోలీస్ ఇచ్చిన ఆహ్వానాన్ని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్ రిజెక్ట్ చేశారు. ప్రైవేట్ ఇళ్లకు చర్చల కోసం వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రులకు మాట్లాడాలని ఉంటే జంతర్ మంతర్ వద్ద ఉన్న ప్రజల మధ్యకే రావాలని డిమాండ్ చేశారు. భద్రతా కారణాలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా న్యూట్రల్ ప్లేస్‌లో కలవడానికి ఓకే చెప్పారు. స్టూడెంట్స్ డిమాండ్స్ నెరవేర్చే నిజమైన ఉద్దేశం ఉంటేనే చర్చలకు రావాలని CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ vs BJP.. జర్నలిస్ట్‌పై రాళ్లదాడి!
Politics· 22 Jul 2026

కాంగ్రెస్ vs BJP.. జర్నలిస్ట్‌పై రాళ్లదాడి!

హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, BJP కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక న్యూస్ రిపోర్టర్‌కి రాయి తగలడంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారింది. గాయపడినప్పటికీ ఆ విలేకరి స్పాట్ నుంచే కవరేజ్ కొనసాగించడం గమనార్హం. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

దేశంలో నిరసనలు జరుగుతున్నా, APలో స్పందన లేదు
Politics· 22 Jul 2026

దేశంలో నిరసనలు జరుగుతున్నా, APలో స్పందన లేదు

AP: YCP నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నీట్, DSC పేపర్ లీకేజీలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా, APలో అలాంటి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. సినిమా బెనిఫిట్ షోల విషయంలో ప్రజలు, యువత చూపే ఉత్సాహం విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్, డీఎస్సీ అంశాలపై ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇప్పటికైనా మౌనం వీడి విద్యార్థుల హక్కుల కోసం గళం వినిపించాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM
TG· 22 Jul 2026

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM

TG: కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో బలహీనపరచాలంటే తన పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేర్లు వేరైనా BRS, BJP రెండూ ఒక్కటేనని విమర్శించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18గంటలు పనిచేసినా నాకు టైమ్ సరిపోవడంలేదన్నారు.

ఇది SP, కాంగ్రెస్, BJP ఇష్యూ కాదు- అఖిలేష్ యాదవ్
Politics· 22 Jul 2026

ఇది SP, కాంగ్రెస్, BJP ఇష్యూ కాదు- అఖిలేష్ యాదవ్

పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలకు మద్దతుగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ BJPపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది SP, కాంగ్రెస్ లేదా BJPకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూ కాదు, దేశంలోని స్టూడెంట్స్ సమస్య" అని స్పష్టం చేశారు. రోడ్లపై ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్, ఆడపిల్లలపై పోలీసులు దారుణంగా దాడి చేస్తుంటే సభలో కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బయట స్టేట్‌మెంట్స్ ఇచ్చే ప్రధాని మోదీ, సభలోకి వచ్చి విద్యార్థుల హక్కులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.

2 రోజులుగా వర్షం లోనే- MP చంద్రశేఖర్ ఆజాద్
Politics· 22 Jul 2026

2 రోజులుగా వర్షం లోనే- MP చంద్రశేఖర్ ఆజాద్

2 రోజులుగా వర్షంలో తడుస్తూ, స్టూడెంట్స్ కి మద్ధతుగా నిరసన కొనసాగిస్తున్న వీడియోను పంచుకుంటూ భీమ్ ఆర్మీ చీఫ్, MP చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. "వర్షపు బొట్టునైనా భరిస్తాం కానీ, అమాయకులపై జరిగే అన్యాయాన్ని అస్సలు సహించం" అని, అన్యాయం చేసినవారు ఎంతటి శక్తిమంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలే తన పోరాటానికి ప్రధాన బలమని చెబుతూ, "జై భీమ్.. జై భారత్" అంటూ తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.

కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
Politics· 22 Jul 2026

కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

TG: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా కరీంనగర్‌లో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు బీజేపీ MP కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగడంతో BJP కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చి, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

సోనమ్ వాంగ్‌చుక్ కు ప్రొటెస్టర్స్ రిక్వెస్ట్!
Politics· 22 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ కు ప్రొటెస్టర్స్ రిక్వెస్ట్!

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 25వ రోజుకు చేరడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, దీక్ష విరమించాలని ప్రొటెస్టర్స్ విజ్ఞప్తి చేశారు. దేశానికి ఆయన సేవలు చాలా అవసరమని అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాంధీ, అంబేడ్కర్ మార్గంలోనే శాంతియుతంగా పోరాటం సాగుతుందని వెల్లడించారు.

కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్‌లో గర్భిణి తరలింపు
TG· 22 Jul 2026

కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్‌లో గర్భిణి తరలింపు

TG: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద డైవెర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ప్రసవం కోసం పేరూరు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వసంతకు నొప్పులు ఎక్కువ కావడంతో ఏటూరునాగారం హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్స్ రిఫర్ చేశారు. రోడ్డు తెగిపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు. అనంతరం అధికారులు ట్రాక్టర్ ఏర్పాటుచేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించారు.

ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారు: రేవంత్‌రెడ్డి
TG· 22 Jul 2026

ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారు: రేవంత్‌రెడ్డి

TG: BJP అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నీట్‌ పేపర్లను బఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్లు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్
News· 22 Jul 2026

పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్

TG: పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని, ఆయన భూములు దాదాపు ఆరేడు ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయని చెప్పారు. మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే ఎఫ్‌టీఎల్ బయట ఉన్నాయని స్పష్టం చేశారు. 'చెరువులో ఫెన్స్ వేయకూడదు. కానీ పవన్ కల్యాణ్‌ చెరువులో ఫెన్స్ వేశారు. అది ఆయన చేసిన తప్పు' అని అన్నారు.

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు
TG· 22 Jul 2026

నిధుల కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామానికి చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు జరిగిన ప్రదేశంలో తాయత్తు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ వంటి పూజా సామగ్రి కనిపించడంతో గుప్తనిధుల కోసం పక్కా ప్రణాళికతో తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడుతున్నారా ?
Health· 22 Jul 2026

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడుతున్నారా ?

మన దేశంలో యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్స్ కొనొద్దని పరిశోధకులు చెప్తున్నారు. ‘ది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ సర్వే’లో ఈ విషయం వెల్లడిస్తూ డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని, దీంతో బాక్టీరియా తన రూపాన్ని మార్చుకుని 'యాంటీబయోటిక్ రెసిస్టెన్స్' అనే ప్రమాదం తీసుకొస్తుందని హెచ్చరించారు.

తల లేకున్నా కాక్రోచ్ బతకగలదు
Education· 22 Jul 2026

తల లేకున్నా కాక్రోచ్ బతకగలదు

కాక్రోచ్(బొద్దింక) ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకోగలవు. తల తెగినా ఇవి వారం రోజులు జీవించగలవు. కాక్రోచ్ నర్వ్ సిస్టం శరీరం అంతటా విస్తరించి ఉండటమే దీనికి కారణం. అందువల్ల బ్రెయిన్ సిగ్నల్స్ లేకపోయినా ఇవి కదలగలవు. వీటి రక్తం ప్రెజర్‌తో ప్రవహించదు. తల తెగినా ఎక్కువ రక్తస్రావం కాదు. శ్వాస తీసుకోవడానికి నోరు, ముక్కు కాకుండా శరీరంపై ఉండే చిన్న రంధ్రాలను ఉపయోగిస్తాయి. అయితే నోరు లేకపోవడం వల్ల తిండి, నీరు లేక చివరకు డీహైడ్రేషన్‌తో చనిపోతాయి.

రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారం అందించాలి
News· 22 Jul 2026

రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారం అందించాలి

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిశారు. పంటల సాగులో రైతులకు ఖర్చులు తగ్గించేలా కేంద్రం సహకారమందించాలని అచ్చెన్నాయుడు కోరారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.