Latest

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 19 Jul 2026

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మంజుల(23) మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చారని, దానికి రియాక్షన్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
AP· 19 Jul 2026

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలంలో పంటల పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ పంటలను పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు. పంటల ఎదుగుదల, వర్షాభావ ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్
Education· 19 Jul 2026

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్

TG: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అటెండెన్స్‌ జిల్లాల వారీగా అనుహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా 93.47 శాతం హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కొమురంభీం, ఖమ్మం, ములుగు జిల్లాలు కూడా 80 శాతానికి పైగా హాజరుతో మెరుగైన ఫలితాలు నమోదు చేశాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేవలం 52.69 శాతం హాజరుతో చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తక్కువ అటెండెన్స్ నమోదు అయింది. అభివృద్ధి చెందిన జిల్లాల్లో హాజరు తగ్గడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం
AP· 19 Jul 2026

శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం

AP: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దు
Jobs· 19 Jul 2026

నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దు

TG: నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు BRSకు లేదని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. BRS హయాంలో 16 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఏనాడు పరామర్శించలేదు, పట్టించుకోలేదన్నారు. స్వార్థం కోసం, నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 30వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్
Education· 19 Jul 2026

జీరో అడ్మిషన్లు.. విచారణలో షాకింగ్ ట్విస్ట్

TG: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా తుంగుతర్తి మండలం బండరామారం ZP హైస్కూల్ HMతో పాటు నలుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా లేకపోవడంతో కలెక్టర్, DEO విచారణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపించేలా ఉపాధ్యాయులే ప్రోత్సహించినట్లు, పాఠశాల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించినట్లు గుర్తించారు. రికార్డుల నిర్వహణలో లోపాలు, అధికారుల ఆదేశాల ఉల్లంఘన కూడా బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడబోమని, బాధ్యులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం
Jobs· 19 Jul 2026

ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తాం

తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందిస్తామని CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందించిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు.

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AP· 19 Jul 2026

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. విశాఖ నుంచి భోగాపురానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రహదారుల్లో 4 పూర్తయ్యాయి. విమాన ప్రయాణికుల కోసం RTC 20 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేయగా, తొలి విడతలో 3 బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గురుద్వారా, వుడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెంలో ప్యాసింజర్ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

నదుల అనుసంధానంతో కరువుకు చెక్
AP· 19 Jul 2026

నదుల అనుసంధానంతో కరువుకు చెక్

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 48 శాతం వర్షాభావం నమోదైనా సాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 450 TMCల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి రూ.50 వేల కోట్ల విలువైన పంటలను కాపాడామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానంతో కరువు సమస్యను అధిగమిస్తామన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ ఆగస్ట్ 1న
News· 18 Jul 2026

భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెనింగ్ ఆగస్ట్ 1న

భొగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది.ఆగస్టు ఒకటిన ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు ఓపెన్ కాబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్టుపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ విషయం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని, ఎయిర్ పోర్టులు, టూరిజం ప్రాజెక్టులు, పోర్టులు, హైవేలు, ఇండస్ట్రీలతో ఉత్తరాంధ్ర అన్ స్టాపబుల్ గా దూసుకు పోవాలని సీఎం అన్నారు.

ఏపీలో ఒమిక్రాన్  RF.5వేరియంట్ - మంత్రి
News· 18 Jul 2026

ఏపీలో ఒమిక్రాన్ RF.5వేరియంట్ - మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపింది. వాటి ఫలితాలు ఇప్పుడు అందాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు.

పదేళ్లుగా 152 ఎగ్జామ్ పేపర్స్ లీక్- రాహుల్ గాంధీ
News· 18 Jul 2026

పదేళ్లుగా 152 ఎగ్జామ్ పేపర్స్ లీక్- రాహుల్ గాంధీ

దేశంలో గత పదేళ్లలో ఏకంగా 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. డెహ్రాడూన్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఈ లీకేజీల వల్ల కోట్లాది మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కొందరు గుత్తాధిపత్యం చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టం తేవాలని, విద్యార్థుల కష్టానికి తగిన న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

గౌరవంగా తప్పుకోండి- ధర్మేంద్రకు ప్రముఖుల లేఖ
News· 18 Jul 2026

గౌరవంగా తప్పుకోండి- ధర్మేంద్రకు ప్రముఖుల లేఖ

నీట్-యూజీ సహా పలు జాతీయ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'గౌరవప్రదంగా రాజీనామా చేయాలి' అని కోరుతూ దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పరీక్షల లీకేజీలు, అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించడానికి, ఈ పరీక్షల సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

సోనం వాంగ్ చుక్ కు ఇరోమ్ షర్మిల మద్దతు !
News· 18 Jul 2026

సోనం వాంగ్ చుక్ కు ఇరోమ్ షర్మిల మద్దతు !

సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మణిపూర్ హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల మద్దతు ప్రకటించారు. మార్పు కోసం చేసే ఈ పోరాట బాధ్యత కేవలం వాంగ్‌చుక్ ఒక్కరిదే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ ఒక్క నిరసనకారుడూ అమరవీరుడు కాకూడదన్న షర్మిల, ప్రజలంతా భారీగా తరలివచ్చి ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వం దిగివస్తుందని స్పష్టం చేశారు.

తనను దీక్షా స్థలికి పంపాలంటూ సోనమ్ పట్టు !
Politics· 18 Jul 2026

తనను దీక్షా స్థలికి పంపాలంటూ సోనమ్ పట్టు !

విద్యా మంత్రి రాజీనామా కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఈ రోజుతో 21వ రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ ఉదయం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించగా తనను తిరిగి జంతర్ మంతర్ పంపాలని ఆయన మొండిపట్టు పట్టారు. నీట్-యూజీ అక్రమాలపై కేంద్ర మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ జూన్ 28 నుండి ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. మద్దతుదారులు జూలై 20న పార్లమెంట్ మార్చ్‌ను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు.

పుష్ప 2 సుకుమార్ కు  నేషనల్ అవార్డ్ !
Cinema· 18 Jul 2026

పుష్ప 2 సుకుమార్ కు నేషనల్ అవార్డ్ !

జాతీయ చలన చిత్ర అవార్డుల 72వ వేడుకలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండింది. స్టార్ హీరో అల్లూ అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డైరక్టర్ సుకుమార్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (ఒరిజినల్) అవార్డు దక్కింది.అలాగే పుష్ప 2 మూవీ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్ శర్మ, దీపాలీ సూర్ లకు జాతీయ పురస్కారం లభించింది.

ఇరాన్ ప్రభుత్వానికి అతివాద శక్తుల వార్నింగ్ !
World· 18 Jul 2026

ఇరాన్ ప్రభుత్వానికి అతివాద శక్తుల వార్నింగ్ !

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత అక్కడ అధికారం కోసం యుద్ధం మొదలైంది. US తో శాంతి చర్చలు జరుపుతున్న అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశీ మంత్రిలను అక్కడి తీవ్రవాద శక్తులు టార్గెట్ చేస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో దేశ నాయకులను "ద్రోహులు" అని నిందిస్తూ రాళ్లు రువ్వారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాకపోవడంతో, అధ్మ్యక్షుడు అతని బృందం రాజకీయ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని హార్డ్‌లైనర్స్ ఆరోపిస్తున్నారు. "ప్రెసిడెంట్ గారూ, మా కండిషన్స్ వినకపోతే మా బ్లేడ్ మీ మెడపై ఉంటుంది" అంటూ కొందరు బహిరంగంగానే బెదిరింపులు చేస్తుండటంతో ఇరాన్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.

మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !
Crime· 18 Jul 2026

మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !

మీరట్ లో ఒక షాకింగ్ మర్డర్ ప్లాన్ బయటపడింది. దామిని అనే మహిళ తన భర్త అతుల్ పవార్ కి పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక బెడ్‌పై విష పూరిత పాము ని వదిలి కరిపించింది. ఈ క్రైమ్‌లో ఆమెకి తన లవర్ , స్కూల్ డ్రైవర్ తుషార్ హెల్ప్ చేశాడు. ₹20 లక్షల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేయడం, తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేయడమే వీరి మెయిన్ మోటివ్. అయితే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ,మొబైల్ రికార్డ్స్ పరిశీలించగా వీరికుట్ర బయటపడటంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భార్యా భర్తలిద్దరూ హస్తినాపూర్ లో కిడ్స్ ప్లే స్కూల్ ని నడుపుతున్నారు.

ఏపీలో ఐదు రోజులు పాటు తేలిక పాటి వర్షాలు
News· 18 Jul 2026

ఏపీలో ఐదు రోజులు పాటు తేలిక పాటి వర్షాలు

APలో రానున్న 5 రోజులు మేఘావృతమైన వాతావరణం, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ తెలిపింది. 'కోస్తాంధ్ర తీరం వెంబడి 40-50KMPH వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల,పోలవరం,కృష్ణ,NTR, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే ఆస్కారముంది' అని వాతావరణ శాఖ చెబుతోంది.

నా కుటుంబానికి పెద్దన్న అందెశ్రీ: CM రేవంత్
Politics· 18 Jul 2026

నా కుటుంబానికి పెద్దన్న అందెశ్రీ: CM రేవంత్

నా జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను కవి అందెశ్రీ గారు నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఒకసారి ఆయన రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీని కలిసినప్పుడు, ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఎవరైనా వస్తారా అని ఎదురుచూశానని, ఈరోజు రేవంత్ ఆ నమ్మకాన్ని కలిగించాడంటూ తన ఆవేదనను పంచుకున్నారని గుర్తుచేశారు. అందెశ్రీ కేవలం కవి, గాయకుడు మాత్రమే కాదని, తనకు ఆత్మబంధువని, తన కుటుంబంలో పెద్దన్న లాంటివారని CM రేవంత్ రెడ్డి భావోద్వేగంగా చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'రక్తానికి రక్తం'.. ట్రంప్ ఫ్యామిలీ టార్గెట్‌గా ఇరాన్ బ్యానర్లు!
World· 18 Jul 2026

'రక్తానికి రక్తం'.. ట్రంప్ ఫ్యామిలీ టార్గెట్‌గా ఇరాన్ బ్యానర్లు!

అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు పీక్స్‌కి చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పెట్టిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వైట్ హౌస్ కాలిపోతున్నట్లు బ్యాక్‌డ్రాప్ పెట్టి.. ట్రంప్, ఆయన భార్య మెలానియా, పిల్లల ఫొటోలను శవపేటికలపై ముద్రించారు. దానిపై పర్షియన్ లాంగ్వేజ్‌లో 'రక్తానికి రక్తం' అని రాశారు. ఇరాన్ కి చెందిన ఒక మీడియా సంస్థ ఈ హోర్డింగ్స్ పెట్టడంతో అంతర్జాతీయంగా టెన్షన్స్ మరింత పెరిగాయి.