'రక్తానికి రక్తం'.. ట్రంప్ ఫ్యామిలీ టార్గెట్‌గా ఇరాన్ బ్యానర్లు!

అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు పీక్స్‌కి చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పెట్టిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వైట్ హౌస్ కాలిపోతున్నట్లు బ్యాక్‌డ్రాప్ పెట్టి.. ట్రంప్, ఆయన భార్య మెలానియా, పిల్లల ఫొటోలను శవపేటికలపై ముద్రించారు. దానిపై పర్షియన్ లాంగ్వేజ్‌లో 'రక్తానికి రక్తం' అని రాశారు. ఇరాన్ కి చెందిన ఒక మీడియా సంస్థ ఈ హోర్డింగ్స్ పెట్టడంతో అంతర్జాతీయంగా టెన్షన్స్ మరింత పెరిగాయి.


