Latest

అమెరికాతో శాంతి ఒప్పందం క్యాన్సిల్- ఇరాన్
Politics· 18 Jul 2026

అమెరికాతో శాంతి ఒప్పందం క్యాన్సిల్- ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు మళ్లీ ముదిరాయి. అమెరికాతో గత నెలలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నట్లు ఇరాన్ అనౌన్స్ చేసింది. ఇకపై ఆ రూల్స్ ఏవీ పాటించబోమని క్లియర్ గా చెప్పింది. అమెరికానే ముందుగా ఒప్పందాన్ని బ్రేక్ చేసిందని ఇరాన్ అంటోంది. రీసెంట్ గా హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై దాడులు జరగడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత వారం అమెరికా ఇరాన్ పై దాడులు చేయగా, ఇరాన్ కూడా అమెరికా మిలిటరీ స్థావరాలపై మిసైల్స్ ప్రయోగించింది.

ఇక ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు.. మోదీ కూడా దిగిపోవాలి!
Politics· 18 Jul 2026

ఇక ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు.. మోదీ కూడా దిగిపోవాలి!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న CJP (కాక్‌రోచ్ జనతా పార్టీ) నిరసనల్లో సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ జాయిన్ అయ్యారు. NEET పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు కేవలం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే డిమాండ్ చేశామని, కానీ ఇప్పుడు ఈ పోరాటం సిస్టమ్ మొత్తానికి వ్యతిరేకంగా మారుతోందని ఆయన అన్నారు. దేశ యువత భవిష్యత్తును కాపాడటం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ కి పిగ్గీ బ్యాంక్‌తో వచ్చిన చిన్నారి!
Education· 18 Jul 2026

జంతర్ మంతర్ కి పిగ్గీ బ్యాంక్‌తో వచ్చిన చిన్నారి!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న వారికి సపోర్ట్ గా ఒక చిన్నారి తన పిగ్గీ బ్యాంక్ (గల్లా పెట్టె) తో అక్కడికి చేరుకుంది. దేశ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న వారికి తన చిన్న చిన్న పొదుపు మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆకట్టుకుంది. సహాయం ఎంత అనేది కాదు, మన ఉద్దేశం ఎలాంటిదనేదే ముఖ్యం అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఒక చిన్న పాప దేశం కోసం తన వంతు బాధ్యత నెరవేరుస్తుంటే, మనమంతా ఇంకెంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలో కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బెస్ట్ తెలుగు సినిమాగా 'కమిటీ కుర్రోళ్లు'..
Cinema· 18 Jul 2026

బెస్ట్ తెలుగు సినిమాగా 'కమిటీ కుర్రోళ్లు'..

కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. 2024 సంవత్సరానికి గాను ఇచ్చిన ఈ అవార్డ్స్ లో 'కమిటీ కుర్రోళ్లు' మూవీ 'బెస్ట్ తెలుగు ఫిల్మ్' అవార్డ్ గెలుచుకుంది. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్. 1990ల నాటి విలేజ్ మెమొరీస్, పల్లెటూరి వాతావరణాన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపించిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ లెవెల్ లో క్రేజీ రికార్డ్ కొట్టింది.

మమ్ముట్టికి నేషనల్ అవార్డ్!
Cinema· 18 Jul 2026

మమ్ముట్టికి నేషనల్ అవార్డ్!

రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 'ఆర్టికల్ 370' కి బెస్ట్ మూవీ అవార్డ్ వచ్చింది. 'భ్రమయుగం' సినిమాలో యాక్ట్ చేసిన మమ్ముట్టి, అలాగే కార్తీక్ ఆర్యన్ ఇద్దరికీ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. 'ఆర్టికల్ 370' హీరోయిన్ యామీ గౌతమ్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కింది. 'అమరన్' సినిమా తీసిన రాజ్‌కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు.

ఢిల్లీ పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అభిజిత్ దీప్కే ప్లాన్!
Politics· 18 Jul 2026

ఢిల్లీ పోలీసుల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అభిజిత్ దీప్కే ప్లాన్!

సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించినా, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. యువత గొంతు నొక్కేందుకు ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున క్రాక్‌డౌన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు అందరూ తరలివచ్చి రాత్రిపూట కాపలా ఉండాలని పిలుపునిచ్చారు. జూలై 20న జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు చేపట్టే శాంతియుత మార్చ్‌ను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో తరలిరావాలని అభిజిత్ పిలుపునిచ్చారు.

ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో సుక్క రాంనర్సయ్య!
Politics· 18 Jul 2026

ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల్లో సుక్క రాంనర్సయ్య!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా తెలంగాణ నుండి సామాజిక కార్యకర్త, సింగర్ సుక్క రాంనర్సయ్య అక్కడికి వెళ్లారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన NEET పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అక్రమంగా తరలించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల యువత, రాజకీయ నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.

హాస్పిటల్‌పై అనుమానాలున్నాయి- సోనమ్ వాంగ్‌చుక్ భార్య
Politics· 18 Jul 2026

హాస్పిటల్‌పై అనుమానాలున్నాయి- సోనమ్ వాంగ్‌చుక్ భార్య

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రకారం సోనమ్ వాంగ్‌చుక్ పొటాషియం లెవెల్ నిన్న 4.3 ఉంటే, ఈరోజు ఒక్కసారిగా 2.9కి పడిపోయిందని ఆయన భార్య గీతాంజలి ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ల్యాబ్‌లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదని, బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. హాస్పిటల్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయని, వెంటనే డిశ్చార్జ్ చేయాలని కోరినా రెండు గంటలుగా స్పందన లేదని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.

స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ జాబ్ కి రిసైన్ చేసిన UPSC ఆఫీసర్!
Education· 18 Jul 2026

స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ జాబ్ కి రిసైన్ చేసిన UPSC ఆఫీసర్!

దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీలు, నీట్ (NEET) పరీక్ష అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ 2018 బ్యాచ్ మాజీ UPSC (IES) ఆఫీసర్ ప్రేమపాల్ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఆరేళ్ల ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు జరిగే మార్చ్‌లో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నడిబొడ్డున 20 అడుగుల భారీ కొండచిలువ!
Local· 18 Jul 2026

హైదరాబాద్ నడిబొడ్డున 20 అడుగుల భారీ కొండచిలువ!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని KBR నేషనల్ పార్క్‌లో శనివారం ఉదయం వాకర్స్‌కు ఒక భారీ కొండచిలువ (Python) కనిపించి ఆశ్చర్యపరిచింది. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ భారీ సర్పం.. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుకుంటూ వెళ్తుండటంతో అక్కడున్న వారు కాసేపు భయాందోళనకు, మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ భారీ కొండచిలువ రోడ్డు దాటుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ అర్బన్ ఫారెస్ట్‌లో వన్యప్రాణుల జీవవైవిధ్యానికి ఈ ఘటనే నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.

పెద్ద చదువులు చదివినా తల్లిదండ్రులే పోషించాలా?
Education· 18 Jul 2026

పెద్ద చదువులు చదివినా తల్లిదండ్రులే పోషించాలా?

"తెలంగాణలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను ఇంకా తల్లిదండ్రులే పోషించాలా? ఇదేం విద్యా విధానం?!" అని డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ప్రశ్నించింది. ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ పట్టభద్రులవుతున్నా, కేవలం 25% మందికే ఉద్యోగాలొస్తున్నాయని మండిపడింది. విద్యా సంక్షోభం, ప్రైవేట్ కాలేజీల అక్రమాలపై జూలై 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో DATA రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ముఫ్ఫఖం జా కాలేజీలో ప్రొఫెసర్ల అక్రమ తొలగింపులను ఖండిస్తూ, ప్రైవేట్ కాలేజీల విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేసింది.

నాయకులు దేశాన్ని అమ్మేశారు- ఆర్మీ సోల్జర్
Politics· 18 Jul 2026

నాయకులు దేశాన్ని అమ్మేశారు- ఆర్మీ సోల్జర్

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కి మాజీ సైనికుడు అను రాజ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు దేశం గురించి పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారని ఆయన విమర్శించారు. విదేశాల్లో ఉంటూనే అభిజీత్ దీప్కే కేవలం ఐదు రోజుల్లోనే ఈ పార్టీని క్రియేట్ చేసి పెద్ద విజయం సాధించారని అభినందించారు. దేశాన్ని కాపాడుకోవడానికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరూ ఈ పార్టీలో చేరాలని పిలుపునిస్తూ, యూత్ కి సెల్యూట్ చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

జంతర్ మంతర్ వద్ద గర్జించిన అభిజీత్ దీప్కే!
Politics· 18 Jul 2026

జంతర్ మంతర్ వద్ద గర్జించిన అభిజీత్ దీప్కే!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ నుండి సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించిన తర్వాత యాక్టివిస్ట్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం, తలవంచం" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యల కంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే మోదీ ప్రభుత్వానికి ఎక్కువ అనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. సోనమ్ సార్‌ను పోలీసులు నేరస్థుల్లా కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, తమ గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు.

తాగునీటిని వృథా చేస్తే చర్యలుంటాయి: జలమండలి
TG· 18 Jul 2026

తాగునీటిని వృథా చేస్తే చర్యలుంటాయి: జలమండలి

TG: తాగునీటిని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 33లోని ఒక భవనం దగ్గర తాగునీటితో ఇంటిముందు నీటితో కడుగుతూ వృథా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఇంటి ఓనర్‌కు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. మరోసారి నీటిని వృథా చేస్తే డ్రైనేజీ కనెక్షన్లను నిలిపివేయడంతోపాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు ఖండిస్తున్నా- రాహుల్ గాంధీ
Politics· 18 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు ఖండిస్తున్నా- రాహుల్ గాంధీ

జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడాన్ని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. మోదీ గవర్నమెంట్ అసత్యం, హింస అనే సిద్ధాంతాలపై నడుస్తోందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నీట్ పేపర్ లీక్స్, పెరిగిపోతున్న ఎడ్యుకేషన్ కాస్ట్స్, స్టూడెంట్స్ సూసైడ్స్ లాంటి సీరియస్ ఇష్యూస్ పై విద్యార్థుల గొంతును ఏ శక్తీ నొక్కలేదని ట్వీట్ చేశారు. స్టూడెంట్స్ కి, వారిని నమ్మేవాళ్లకి ఎంతటి బలప్రయోగమైనా అడ్డుపడలేదని, తాము వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు నీట్ ఎగ్జామ్ పాస్
Education· 18 Jul 2026

ఒకే కుటుంబంలో ముగ్గురు నీట్ ఎగ్జామ్ పాస్

బిహార్‌లోని సహర్సా జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సిబ్లింగ్స్ నీట్‌-యూజీ 2026 ఎగ్జామ్‌లో ప్రతిభ చాటారు. రజనీశ్‌(3,122), ప్రహ్లాద్(26,751), సాక్షి(9,672) ర్యాంకులు సాధించారు. వీరి తండ్రి రోహిత్ ఆనంద్ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖరీదైన కోచింగ్‌కు వెళ్లలేక, చిన్న సెంటర్‌లోనే వాళ్లు చదివారు. రోజూ క్రమశిక్షణతో చదువుకుంటూ ఈ విజయం అందుకున్నట్లు తెలిపారు.

మామ మర్మాంగం కోసిన కోడలు
Viral· 18 Jul 2026

మామ మర్మాంగం కోసిన కోడలు

చాలాకాలంగా తనను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న మామపై ఓ కోడలు తన ప్రతాపం చూపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 23 ఏళ్ల మహిళ మామ మర్మాంగాన్ని కోసేసింది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. వేధింపులు విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పింది.

గవర్నమెంట్ డాక్టర్లకు వాంగ్‌చుక్ కౌంటర్!
Politics· 18 Jul 2026

గవర్నమెంట్ డాక్టర్లకు వాంగ్‌చుక్ కౌంటర్!

గవర్నమెంట్ డాక్టర్లు సోనమ్ వాంగ్‌చుక్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడానికి ట్రై చేసినప్పటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దానిపై ఆయన స్పందిస్తూ.. "నాకు ఎలాంటి జబ్బు లేదు, ఇది నేను సొంతంగా ఎంచుకున్న ఉపవాసం. నార్మల్ పర్సన్‌కి, ఉపవాసం ఉండే వ్యక్తికి తేడా ఉంటుంది" అని డాక్టర్లతో అన్నారు. కాగా, సోనమ్ వాంగ్‌చుక్ లేదా ఆయన ఫ్యామిలీ పర్మిషన్ లేకుండానే గవర్నమెంట్ ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌కు తరలించిందని ఆయన భార్య ఆరోపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అన్నా హజారే సీరియస్ వార్నింగ్!
Politics· 18 Jul 2026

వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అన్నా హజారే సీరియస్ వార్నింగ్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చేస్తున్న పోరాటంపై అన్నా హజారే రియాక్ట్ అయ్యారు. నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు తరలించడంపై ఆయన మాట్లాడారు. 20 రోజులుగా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న లీడర్ల విషయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపాలని, ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారం వీడి, నిరసనకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని అన్నా హజారే ఒక వీడియో స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.

అభిజిత్ దీప్కే పై ఇంక్ ఎటాక్.. మహిళ అరెస్ట్! 🚨
Politics· 18 Jul 2026

అభిజిత్ దీప్కే పై ఇంక్ ఎటాక్.. మహిళ అరెస్ట్! 🚨

ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రొటెస్ట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్టూడెంట్స్ తరపున ఫైట్ చేస్తున్న అభిజిత్ దీప్కే పై ఒక మహిళ సిరా (ఇంక్) చల్లింది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆ మహిళను వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయమే మరో లీడర్ సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జంతర్ మంతర్ నుండి సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. ఈ వరుస ఇన్సిడెంట్స్ తో జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్ నెలకొంది.

చలో జంతర్ మంతర్ కేజ్రీవాల్ పిలుపు?
Politics· 18 Jul 2026

చలో జంతర్ మంతర్ కేజ్రీవాల్ పిలుపు?

రీసెంట్‌గా నీట్ పేపర్ లీకేజ్, CBSE ఎగ్జామ్ సిస్టమ్‌లో జరుగుతున్న స్కామ్స్ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనమవుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ దారుణమైన సిస్టమ్‌ని మార్చడానికి సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారని, ఇప్పుడు మనం వాయిస్ రైజ్ చేయకపోతే, రేపు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఇంట్లో కూర్చోకుండా, అందరూ యునైట్ అయి జంతర్ మంతర్ రావాలని పిలుపునిచ్చారు.