Latest

బంగ్లాదేశ్ చైనా వైపు మొగ్గు: భారత్‌తో సామరస్యం కోరుతూ
చరిత్రాత్మకంగా దక్షిణాసియా నాయకుల తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎంచుకోవడం ఆనవాయితీ. అయితే పదవీ చ్యుత బంగ్లాదేశ్ నేత షేక్ హసీనాతో దిల్లీ కొనసాగించిన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెహ్మాన్ చైనా పర్యటనను దిల్లీకి పంపిన రాజకీయ సందేశంగా భారత్‌లో కొందరు చూస్తున్నారు. భారత్‌తో సామరస్యం కోరుతూనే చైనా వైపు మొగ్గు చూపుతున్న బంగ్లాదేశ్ వైఖరి చర్చనీయాంశమైంది.

జనగాంలో విషాదం.. 20 పేజీల సూసైడ్ నోట్ కలకలం
TG: 20పేజీల సూసైడ్ నోట్ రాసి రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన రూ.10,77,528, 21నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదు. పలువురు బంధువులు కూడా తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, తను తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయోధ్య రామ్ మందిర్‌లో CCTVలో దొరికిపోయిన స్టాఫ్!
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసులో SIT కీలక ఆధారాలు సేకరించింది. టెంపుల్‌లో విరాళాలు లెక్కించే కొందరు స్టాఫ్ మెంబర్స్ కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లరను తమ బూట్లు, జేబుల్లో దాచిపెడుతూ CCTV కెమెరాలకు దొరికిపోయారు. నిందితులు దాదాపు 70 సార్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. అక్కడ సెక్యూరిటీ, డాక్యుమెంటేషన్ లో ఉన్న లోపాలను వాడుకుని ఈ స్కామ్ కి పాల్పడ్డారు. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ ఐదేళ్ల అకౌంట్స్ ని అధికారులు పునః పరిశీలన చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో విషాదం.. ఉద్యమ నేత ఇకలేరు
TG: భువనగిరి మాజీ MLA, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి నర్సింహారెడ్డి(83) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రజాచైతన్య వేదిక వ్యవస్థాపకుడిగా, గోదావరి జలాల సాధన ఉద్యమ నేతగా, మూసీ పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఆయన మృతి పట్ల CM రేవంత్ రెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

పోస్టర్ కాదు.. మొబైల్ మ్యాజిక్!
సినిమా పోస్టర్లు ఇప్పుడు థియేటర్ గోడల కోసం కాదు.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల కోసం డిజైన్ అవుతున్నాయి. వేగంగా స్క్రోల్ చేసే ప్రేక్షకుల దృష్టిని క్షణాల్లో ఆకర్షించేలా బోల్డ్ గ్రాఫిక్స్, అనిమే స్టైల్, కొరియన్ విజువల్ టచ్‌కు ప్రాధాన్యం పెరిగింది. AA23, సామవర్తి, డ్యూడ్ పోస్టర్లు ఈ ట్రెండ్‌కు ఉదాహరణలు. పోస్టర్‌తో ఆగకుండా టైటిల్ లోగోలు, మ్యూజిక్ ఆర్ట్, సోషల్ మీడియా కంటెంట్ వరకు ఒకే విజువల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తూ సినీ ప్రమోషన్ కొత్త రూపం దాల్చుతోంది.

గురుకులంలో ర్యాగింగ్ కలకలం
TG: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత బాలికను కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గుర్తుపట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. క్యాప్ కడుపులోకి వెళ్లడంతో విద్యార్థిని ఎస్‌వోకు సమాచారం అందించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్స్ క్యాప్‌ను బయటకు తీశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు.

తిరుమల బస్సులు బంద్
AP: తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ AC బస్సులను అలిపిరి డిపోలో నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన చేశారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని, 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. తిరుమలకు నడిచే ఎలక్ట్రిక్ AC బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు వలన రాబోయే రోజుల్లో APSRTC ప్రైవేటీకరణ వైపు వెళ్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

టెన్షన్ టెన్షన్.. 10వ రోజుకి చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష ఈరోజుతో 10వ రోజుకి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ లో ఆయన హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా మారింది. ప్రస్తుతం ఆయన బ్లడ్ ప్రెజర్ (BP) 102/61 కి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 68 కి పడిపోయాయి. ఈ 10 రోజుల్లో ఆయన ఏకంగా 7.3 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. ఆయన హెల్త్ కండిషన్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

APలో కొత్త స్కీమ్: పిల్లలు ఉంటే క్యాష్ గిఫ్ట్!
AP గవర్నమెంట్ సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పేరెంట్స్‌కి రూ.5 వేల క్యాష్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు పిల్లలు ఉన్న మూడు జంటలను సెలెక్ట్ చేసి ఈ మనీ ఇస్తారు. అలాగే ఫస్ట్ చైల్డ్ కి, సెకండ్ చైల్డ్ కి మధ్య కనీసం రెండేళ్ల గ్యాప్ మెయింటైన్ చేసిన వారికి కూడా రూ.5 వేల రివార్డ్ ఇస్తారు. దీనిపై అవేర్‌నెస్ పెంచేందుకు ఈనెల 11 నుంచి 18 వరకు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.

సూసైడ్ కేసులో ట్విస్ట్.. CI నాగరాజుపై అట్రాసిటీ కేసు
AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రాంతికుమార్ సూసైడ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ CI నాగరాజుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలకంగా మారింది. తన చావుకు CI నాగరాజు కారణమని, ఆయన పెట్టిన టార్చర్ భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని క్రాంతికుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఆధారాల పరిశీలన అనంతరం, అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేసులో చేర్చారు. CIపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మహిళల కెరీర్‌కి బ్రేక్ అసలు రీజన్ ఇదే ?
దేశంలోని పెద్ద నగరాల్లో మహిళలు ఉద్యోగాలకు దూరమవడానికి చైల్డ్‌కేర్, ఇంటి పనులే మెయిన్ రీజన్స్. హౌరాలో 83%, సూరత్‌లో 81% మంది ఇదే రీజన్ చెప్పగా, హైదరాబాద్‌లో ఈ శాతం 58% గా ఉంది. మరోవైపు 16% మంది హయ్యర్ స్టడీస్ కోసం, 10% మంది హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్స్ వదిలేశారు. అలాగే జాబ్స్ క్వాలిటీ పెరిగినా, మహిళల శాలరీ పురుషుల కంటే యావరేజ్‌గా 23% తక్కువగానే ఉండటం గమనార్హం.

భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య
TG: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్‌కల్‌కు చెందిన ప్రశాంత్(35), సంధ్య దంపతులు. ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిన ప్రశాంత్ గతనెల 27న తిరిగి వచ్చాడు. సంధ్యకు అనిల్‌తో వివాహేతర సంబంధముంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని న్యాల్‌కల్ వాసి బంటితో సంధ్య ప్లాన్ వేసింది. మద్యం తాగించి భర్తను దాబా పైనుంచి తోసేశారు. కానీ ప్రశాంత్ గాయాలతో బయటపడడంతో హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య, అతని చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్ క్లీనర్(హార్పిక్)ను ఎక్కించింది. ప్రశాంత్ కన్నుమూశాడు. పోలీసులు సంధ్య, బంటి, అనిల్‌ను అరెస్ట్ చేశారు.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!
ఇంటర్నేషనల్ రీజన్స్ వల్ల దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు ఉదయం 10 గంటల టైమ్‌కి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,360 తగ్గి రూ.1,45,260 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.1,250 తగ్గి రూ.1,33,150 గా ఉంది. మార్కెట్ లో ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

విశాఖ తీరంలో టెన్షన... 48గంటలు గడిచినా ఆచూకీ లేదు
AP: విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి తెలిపారు. మత్య్సకారులు 4వ తేదీ రాత్రి సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. 48గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. అదేరోజు కర్రి చిన్నా అనే మత్య్సకారుడిని చైనా షిప్ వాళ్లు సురక్షితంగా రక్షించారని చెప్పారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. 4 షిప్పులు, 2 హెలికాప్టర్లతో రిస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుందని DIG స్పష్టం చేశారు.

అక్రమాస్తుల కేసులో DSPకి షాక్
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ACB అధికారులు, కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఆయన తన పలుకుబడిని ఉపయోగించి అరెస్ట్ నుంచి తప్పంచుకుంటున్నారని, ACB అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అక్రమాస్తుల కేసులో DSPకి రిమాండ్
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ప్రాంతాల్లో ACB అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించారు. దీంతో ఆయన్ను ACB అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లోని 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం నేరం. అయితే అసైనీల వద్ద ఉండాల్సిన భూమిలో 12 ఎకరాలు ఇటీవల ఓ రియల్టర్ చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ప్రభుత్వ భూమి అనే పెద్ద నోటీసు బోర్డు కూడా ఉండేది. ఇటీవల బోర్డు తీసేసి పట్టా భూమిగా మార్చేశారు. రూ.200 కోట్ల విలువైన భారీ భూకుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

ధరణి పోర్టల్‌లో బిగ్ స్కామ్
TG: ధరణి పోర్టల్ ద్వారా భూ యజమానులకు తెలియకుండానే భూములు ఇతరుల పేర్లపైకి మారడం కలకలం సృష్టిస్తోంది. ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూదోపిడీపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమం వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.

ధరణి స్కామ్‌లో అధికారులకు నోటీసులు
TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమాలపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాతిపదికన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీచేశారు.

ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు.. APకి కరువు ముప్పు
AP: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. వర్షాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. గ్లోబల్ వార్మింగ్, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు పడిపోవడమే కాక.. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.810 TMCలు కాగా.. ప్రస్తుతం 42.213 TMCలే ఉన్నాయి. నిరుడు వరదలు పోటెత్తడంతో ఇదే సమయానికి దాదాపు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. 3.95 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం నీటి ప్రవాహం లేక వెలవెల బోతుంది.

APకి మరో మెగా సోలార్ ప్రాజెక్ట్
AP: రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. NTPC అనుబంధ సంస్థ NTPCREL (ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్) ఈ సోలార్ ప్రాజెక్ట్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనుంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి.హీరేహల్ మండలంలోని కనేకల్, రాయదుర్గం గ్రామాల పరిధిలో ప్రాజెక్టు స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్ట్ దేశంలో NTPC నిర్మించే నాలుగో భారీ ప్రాజెక్టు. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది.