Latest
300ఏళ్ల నాటి మెట్ల బావి.. ఎలా ఉందో చూడండి..!
కర్ణాటకలోని బెళగావిలో 300 ఏళ్ల నాటి చారిత్రక మెట్ల బావికి పూర్వవైభవం లభించింది. చెత్తాచెదారంతో నిండిపోయి కనుమరుగైన 80 అడుగుల లోతెన ఈ బావిని 'ప్యాస్ ఫౌండేషన్', స్థానికులు పునరుద్ధ రించారు. అదిల్షాహీ వంశ కాలంలో (15వ శతాబ్దం) నిర్మించిన ఈ బావిలో 53 మెట్లు ఉన్నాయి. ఆకాశం నుంచి చూస్తే ఇది శివలింగం ఆకారంలో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వారసత్వ కట్టడాలను కాపాడడంలో స్థానికులు చూపిన కృషి కి హేట్సాఫ్ చెప్పాల్సిందే.

"వేల మంది భర్తలు" అన్న కామెంట్ రెచ్చగొట్టేదే - ఎంపీ హై కోర్టు
మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన కేసులో కీలక తీర్పునిచ్చింది. భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తి జీవిత ఖైదు శిక్షను కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించింది. గొడవ జరుగుతున్న టైమ్ లో భార్య భర్తతో.. "నాకు నీలాంటి వాళ్లు వేల మంది భర్తలు ఉన్నారు" అంటూ భర్తను తీవ్రంగా రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది. ఆ కామెంట్ వినగానే నిందితుడు తీవ్ర ఆగ్రహంతో, కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడని.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్ కాదని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును 'మర్డర్' (IPC 302) నుండి 'సడన్ ప్రొవొకేషన్ వల్ల జరిగిన హత్య' (IPC 304 పార్ట్-1) గా మారుస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది.

అమర్ నాథ్ యాత్ర- బయల్దేరిన తొలి బ్యాచ్
పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుండి 4,822 మంది భక్తులతో కూడిన ఫస్ట్ బ్యాచ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 259 వెహికల్స్ కాన్వాయ్‌లో బయలుదేరిన ఈ యాత్రికులకు కాశ్మీర్ వ్యాలీ ఎంట్రెన్స్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ 57 రోజుల యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగ నుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మల్టీ-టియర్ సెక్యూరిటీ గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది. 670 కంపెనీల అడిషనల్ పారామిలటరీ ఫోర్సెస్, స్నైపర్స్, డ్రోన్స్, మరియు 24x7 ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ సిస్టమ్‌తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

బెంగళూరు డే కేర్ సెంటర్ ఇన్సిడెంట్ పై సిట్ ఏర్పాటు
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని క్యాంపస్‌లో లిటిల్ బడ్స్ డేకేర్ సెంటర్'లో షాకింగ్ ఇన్సిడెంట్ పై సిట్ ఏర్పాటైంది. సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మాజీ ఉద్యోగి బయటపెట్టిన ఈ వీడియోలలో.. కేర్‌టేకర్లు 2 నుండి 3 ఏళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్ మెషీన్‌లో పెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు కొట్టడం, బాత్‌రూమ్‌లలో పెట్టి లాక్ చేయడం లాంటి క్రూరమైన చేష్టలతో దొరికిపోయారు.

యూరప్‌లో హీట్‌వేవ్‌కు 3,700 మంది బలి!
యూరప్‌లో జూన్ నెలలో నమోదైన రికార్డు స్థాయి హీట్‌వేవ్ వేల ప్రాణాలు తీసింది. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ (హాలండ్) దేశాలలో ఎండల తీవ్రతకు దాదాపు 3,700 మందికి పైగా మరణించారు. క్లైమేట్ చేంజ్ కారణంగానే ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోనే అత్యధికంగా 2,025 మంది చనిపోగా, బెల్జియంలో 1,200 మంది, నెదర్లాండ్స్‌లో 480 మంది ప్రాణాలు కోల్పోయారు. వృద్ధులు, ఒంటరిగా ఉంటున్న వారే ఈ ఎండ దెబ్బకు ఎక్కువగా బలయ్యారు. హాస్పిటల్స్ అన్నీ హీట్-రిలేటెడ్ పేషెంట్లతో నిండిపోగా, పారిస్‌లో బాడీస్‌ను భద్రపరచడానికి మోర్చరీలలో ప్లేస్ లేనంతగా సీన్ దారుణంగా ఉంది.

రెబెల్స్ చేతిలోకి తృణమూల్ పార్టీ ఆఫీస్ !
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో పొలిటికల్ క్రైసిస్ పీక్స్‌కు చేరింది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని సవాలు చేస్తూ.. రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబల్ ఫ్యాక్షన్ గ్రూప్ ఆఫీస్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకుంది. దాదాపు 65 మందికి పైగా ఎమ్యెల్యేల సపోర్ట్ తమకే ఉందని, తామే ‘రియల్ తృణమూల్’ అని రెబల్స్ వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ తిరుగుబాటు వర్గం మమతా బెనర్జీని కాక సీనియర్ నేత అరూప్ రాయ్‌ను పార్టీ ఛైర్మన్‌గా అనౌన్స్ చేసింది. పార్టీ పేరు, 'జంట పువ్వుల' సింబల్ తమకే కేటాయించాలని కూడా రెబల్స్ గ్రూప్ ఈసీని కోరింది.

ఇక్కడ ఒక టాబ్లెట్ కాస్ట్ రూ.35- అమెరికాలో 85,000
ఇండియాలో దొరికే చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ రేట్స్ చూసి ఒక అమెరికన్ లేడీ మైండ్ బ్లాక్ అయింది. యూఎస్‌లో తన బంధువు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వాడే ఒక్కో Revlimid టాబ్లెట్ కాస్ట్ $900 (దాదాపు ₹85,000) ఉంటే, అదే టాబ్లెట్ ఇండియాలో కేవలం ₹35 నుండి ₹300 (కేవలం 30 సెంట్లు) కే దొరుకుతుందని లిజ్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసింది. "అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్ మమ్మల్ని దారుణంగా దోచేస్తోంది.. కానీ ఇండియా మాత్రం తన ప్రజలకు చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లోనే మెడిసిన్స్ అందిస్తోంది" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక వెరైటీ దొంగతనం కేసు వెలుగుచూసింది. ఒక ఇంట్లో పనిమనిషిగా ఉండే విమలా దేవి అనే మహిళ, దాదాపు ఏడాది క్రితం యజమాని ఇంట్లోంచి ₹10 లక్షల వర్త్ గల డైమండ్ నెక్లెస్, గోల్డ్ లాకెట్ దొంగిలించింది. అప్పట్లో ఓనర్ అడిగితే తనేం తీయలేదంటూ బుకాయించింది. కట్ చేస్తే.. రీసెంట్‌గా ఆ పనిమనిషి దొంగిలించిన నగలు వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చేసి వా ట్సాప్ స్టేటస్ పెట్టింది. అది చూసిన ఓనర్ ఫ్రెండ్ వెంటనే అలర్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఓనర్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు విమలా దేవిని అరెస్ట్ చేసి, ఆమె దొంగిలించిన నగలను రికవర్ చేశారు.

దొంగ దొరికి పోయి బట్టలిప్పేస్తానంటూ హై డ్రామా !
రాజస్థాన్‌లోని జైపూర్ ముహానా ఏరియాలో జరిగిన ఒక క్రేజీ దొంగతనం ఇది. ఓ ఇంట్లోకి చొరబడిన మహిళ బెడ్‌రూమ్‌లోని అల్మారా ఓపెన్ చేసి నగలు, క్యాష్ దొంగిలిస్తుండగా.. హౌస్ ఓనర్ తన మొబైల్‌లోని సిసిటివి ఫుటేజ్ ద్వారా లైవ్‌లో చూసేశాడు. వెంటనే అలర్ట్ అయి నైబర్స్ హెల్ప్‌తో ఇంటి మెయిన్ గేటును లాక్ చేసి దొంగ ఉన్న రూమ్ కి వెళ్లాడు. ఓనర్ కి దొరికి పోయిన ఆ లేడీ కిలాడీ మైండ్ బ్లోయింగ్ డ్రామా స్టార్ట్ చేసింది. నేను బట్టలు విప్పేసుకుంటా.. పోలీసులు మిమ్మల్నే పట్టుకుంటారని బెదిరించింది. మొబైల్ లో దానిని రికార్డ్ చేసిన ఓనర్ పోలీసులకు పట్టించాడు.

లేడీ డాక్టర్ పై బీజేపి యువనేత లైంగిక వేధింపులు
మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపి నేత ఏకంగా డాక్టర్ నే లైంగిక వేధింపులకు గురిచేశాడు. సాగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ మహిళా డాక్టర్ పై బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ శ్రీవాస్తవ (అనిల్ పిప్రా) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో, ఆసుపత్రి బయటకు వస్తే తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనపై సాగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పై జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (JUDA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది.

పెండింగ్ లో ఇండస్ వాటర్స్ ట్రిటీ - భారత్
సింధు నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) పాక్ వైఖరి మార్చుకోనంత వరకూ పెండింగ్ లో పెడుతున్నామని భారత్ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదం, జలాల వివాదంపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.దీనిపై పాక్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఒప్పందంలోని నిబంధనలను సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడమే తమ టార్గెట్ అని పాక్ దారికొచ్చే వరకూ తాము తగ్గేది లేదని కేంద్రం పేర్కొంది.ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగేది లేదని, దేశ సార్వభౌమత్వమే తమకు ముఖ్యమని గట్టిగా స్పష్టం చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌పై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్!
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన యాడ్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. కేవలం రూ.99లకే ఈ కంటెంట్ ఉందంటూ కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఇచ్చిన యాడ్స్ ఇండియాలోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయని BBC ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. అసలు ఇలాంటి యాడ్స్‌ను ఎలా అలౌ చేశారంటూ ఇన్‌స్టా ఓనర్ అయిన ‘మెటా’ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఫ్యూచర్‌లో ఇలాంటివి స్టాప్ చేయడానికి ఏం యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పాలని ఆర్డర్ వేసింది.
ఆర్మీ జవాన్ ఎమోషనల్ అప్పీల్!
దేశాన్ని కాపాడే సైనికుడి భూమికే రక్షణ లేకుండా పోయింది. నంద్యాల జిల్లా తమ్మడపల్లికి చెందిన జవాన్ భాష్యం మహేష్. తన 2.38 ఎకరాల భూమిని TDP లీడర్ కంచర్ల శివ, అతని అనుచరులు ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ల్యాండ్ కబ్జాదారుల నుండి తన భూమిని కాపాడాలంటూ ప్రభుత్వానికి, హైయర్ అఫీషియల్స్‌కి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ జవాన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

జర్నలిస్ట్ విషయంలో దిగివచ్చిన పోలీసులు!
ఓటరు లిస్ట్‌లో పేరు లేదనే నెపంతో 'ది టెలిగ్రాఫ్' మాజీ ఎడిటర్ ఆర్. రాజగోపాల్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ను నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నించడంతో కోల్‌కతా పోలీసులు వెంటనే దిగివచ్చారు. ఆయన అప్లికేషన్‌ను పరిశీలించి, రీసెంట్ గా 'పాజిటివ్ వెరిఫికేషన్ రిపోర్ట్' సబ్మిట్ చేశారు. దీంతో వంద రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆయన పాస్‌పోర్ట్ ప్రస్తుతం ప్రింటింగ్ స్టేజ్‌కి వచ్చింది. ఆఫీసర్స్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.

నాల్గు నెలల తర్వాత ఖమేనీ డెడ్ బాడీకి అంత్యక్రియలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్లే ఈ ఆలస్యం జరిగింది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కెమికల్స్ వాడకుండా, ఫోరెన్సిక్ కోల్డ్ స్టోరేజ్‌లో డెడ్ బాడీని ఇన్నాళ్లూ సురక్షితంగా ఉంచారు. ప్రస్తుతం తాత్కాలిక సంధి కుదరడంతో ఐదు నగరాల్లో ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకూ రకరకాల క్రియలు జరుగుతాయి. ప్రధాన నగరాల్లో ప్రార్ధనలు, ప్రజల సందర్శన అనంతరం ఖమేనీ జన్మస్థలమైన మషీద్‌లోని పవిత్ర 'ఇమామ్ రెజా' దర్గాలో 9న తుది అంత్యక్రియలు జరుగుతాయి.
ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!
ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై యాక్టర్ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. AP కూటమి గవర్నమెంట్‌తో పాటు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను మెన్షన్ చేస్తూ, “ప్రశ్నిస్తే చంపేస్తారా?” అంటూ కామెంట్స్ చేశారు. రావణ్‌పై జనసేన కార్యకర్తలు దాడులు చేయడానికి ప్రయత్నించడంపై ఆయన ఫైర్ అయ్యారు. "బిహేవ్ యువర్ సెల్ఫ్.. దేశం చూస్తోంది" అంటూ జనసైనికులకు, కూటమి ప్రభుత్వానికి ప్రకాష్ రాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

భట్టి విక్రమార్క రూట్ మార్చిన SI!
సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ SI గోపాల్‌ను పోలీస్ శాఖ ట్రాన్స్ఫర్ చేసింది. డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రయాణించాల్సిన అసలు రూట్‌ను కాదని, ఆయన కాన్వాయ్‌ను SI వేరే దారి నుండి తీసుకెళ్లడమే ఇందుకు కారణం. SI ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ CM. దీనిపై నేరుగా DGPకి కంప్లయింట్ చేశారు. అలాగే జోనల్-2 IG, సూర్యాపేట SPల నుంచి కూడా వివరణ కోరారు. ఈ వివాదం నేపథ్యంలోనే SI గోపాల్‌పై ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు.
వరంగల్ భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత
TG: వరంగల్ జిల్లాలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ఆధ్వర్యంలో ఇటీవల ప్లాట్ల వేలం పాటలో దాదాపు రూ.50కోట్ల భారీ అవినీతి జరిగిందంటూ BRS నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పి కొట్టారు. స్పందించిన KUDA ఛైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని BRS నాయకులకు సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన BRS నేతలు, మాజీ కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు భద్రకాళి ఆలయానికి వస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

స్కూళ్ల దగ్గర ఈ డ్రింక్ బ్యాన్!
మహారాష్ట్రలో 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల చిన్న పిల్లల ఆరోగ్యం పాడవుతుందనే ఆందోళనలు వ్యక్తమవడంతో అసెంబ్లీలో ఈ నిషేధాన్ని ప్రకటించింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఏడువకు.. అప్పు చేసి కడుతున్నా బ్రో
TG: సాధారణంగా వాహనాల వెనుక 'నన్ను చూసి ఏడవకురా.. నీ ఏడుపే నా ఎదుగుదల' వంటివి చూస్తుంటాం. కానీ ఓ ఇంటి యాజమాని పెట్టిన ఫ్లెక్సీని చూస్తే మాత్రం నవ్వుతారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఓ వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వినూత్నంగా ఫ్లెక్సీ పెట్టారు. ఆశ్చర్యకరంగా ముఖం పెట్టిన బ్రహ్మనందం ఫొటోతో 'అప్పు చేసి కడుతున్నా బ్రో' అనే వాక్యాన్ని జోడించాడు. అటువైపు వెళ్లే వారు ఆగి మరీ ఆ ఫ్లెక్సీని చూసి నవ్వుకుంటున్నారు.
క్షీణిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్!
సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ రోజురోజుకూ క్షీణిస్తుండటంతో అభిజిత్ దీప్కే మరియు ఆయన టీమ్ ఇవాళ ఆయనకు సపోర్ట్‌గా ఉపవాసం ఉంటున్నారు. ఈ సిట్యుయేషన్‌లో అందరం కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరమని అభిజిత్ దీప్కే కాక్రోచెస్ కి పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్‌చుక్ ను ఎంకరేజ్ చేయడానికి, ఈ వన్-డే ఫాస్టింగ్‌లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.