← Back to news

రెబెల్స్ చేతిలోకి తృణమూల్ పార్టీ ఆఫీస్ !

By DS· 3 Jul 2026· BEngal
రెబెల్స్ చేతిలోకి తృణమూల్ పార్టీ ఆఫీస్ !

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో పొలిటికల్ క్రైసిస్ పీక్స్‌కు చేరింది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని సవాలు చేస్తూ.. రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబల్ ఫ్యాక్షన్ గ్రూప్ ఆఫీస్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకుంది. దాదాపు 65 మందికి పైగా ఎమ్యెల్యేల సపోర్ట్ తమకే ఉందని, తామే ‘రియల్ తృణమూల్’ అని రెబల్స్ వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ తిరుగుబాటు వర్గం మమతా బెనర్జీని కాక సీనియర్ నేత అరూప్ రాయ్‌ను పార్టీ ఛైర్మన్‌గా అనౌన్స్ చేసింది. పార్టీ పేరు, 'జంట పువ్వుల' సింబల్ తమకే కేటాయించాలని కూడా రెబల్స్ గ్రూప్ ఈసీని కోరింది.

More in Politics