"వేల మంది భర్తలు" అన్న కామెంట్ రెచ్చగొట్టేదే - ఎంపీ హై కోర్టు

మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన కేసులో కీలక తీర్పునిచ్చింది. భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తి జీవిత ఖైదు శిక్షను కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించింది. గొడవ జరుగుతున్న టైమ్ లో భార్య భర్తతో.. "నాకు నీలాంటి వాళ్లు వేల మంది భర్తలు ఉన్నారు" అంటూ భర్తను తీవ్రంగా రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది. ఆ కామెంట్ వినగానే నిందితుడు తీవ్ర ఆగ్రహంతో, కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడని.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్ కాదని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును 'మర్డర్' (IPC 302) నుండి 'సడన్ ప్రొవొకేషన్ వల్ల జరిగిన హత్య' (IPC 304 పార్ట్-1) గా మారుస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది.



