Latest

గవర్నమెంట్ స్కూళ్లలో AI టెక్నాలజీ
AP విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు నమోదు కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడానికి, హాజరు పారదర్శకతకు, కచ్చితత్వానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

కాన్సాస్ వరదల్లో AP యువకుడు మృతి
AP: అమెరికాలోని కాన్సాస్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్(32) గల్లంతయ్యాడు. అతడి డెడ్‌బాడీ తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం ఉన్నత విద్య (MS) కోసం అమెరికా వెళ్లిన వెంకటేశ్, చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆస్తి కోసం తండ్రినే నమ్మించి మోసం చేశారు
TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన ఏనిగ ఎల్లారెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపైనే ఆయన ఆధారపడి జీవిస్తున్నాడు. ఎల్లారెడ్డికి ముగ్గురు కూతుర్లు పాశం లక్ష్మమ్మ, చిదుముల్ల మల్లేశ్వరి, కుంట్ల సునీత తమ భర్తలతో కలిసి తండ్రిని నూతనకల్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వృద్ధాప్య రక్షణ కల్పిస్తామని నమ్మించి ఆయనకు తెలియకుండానే సంతకాలు చేయించుకుని భూమిని తమ పేర్లపై మార్పిడి చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఆరోపించారు. కన్నకూతుర్లే తనను మోసం చేశారని, తిరిగి నా పేరిట పాస్‌బుక్ ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

వాయిస్ మెసేజ్‌తో ప్రభుత్వానికి ఫిర్యాదు
AP: ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై CM సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, దీని కోసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని, నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే మూడు నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.

6 నెలల్లో 78 కేసులు.. ACB రికార్డ్
AP: రాష్ట్రంలో ACB దూకుడు పెంచింది. జనవరి నుంచి జూన్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 78కి పైగా కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. నెలకు పదికి తగ్గకుండా ACB అధికారులు ట్రాప్ కేసులు నమోదు చేస్తున్నారు. ఆరు నెలల్లో 13 మంది అవినీతి అధికారులను అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో ప్రజల్ని పీడించే అవినీతి ఆఫీసర్స్‌కు చెక్ పెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ACB DG అతుల్ సింగ్ ప్రజలకు సూచించారు.

భట్టి బిగ్ అనౌన్స్‌మెంట్.. ఉద్యోగులకు రిలీఫ్
TG: ఉద్యోగులు, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత నెలలో మొదటి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా మరో రూ.2 వేల కోట్లను విడుదల చేసినట్లు, దీంతో రూ.4వేల కోట్ల చెల్లింపు పూర్తియిందని భట్టి స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPS) బకాయిలను వందశాతం చెల్లించామన్నారు.

రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదు
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కరించలేదని AP రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని కానీ, ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందనలేదని ఫైరయ్యారు. ఆరు నెలలకోసారి పెరగాల్సిన DAను రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే, PRC కమిషన్‌ను ఇప్పటివరకు నియమించలేదన్నారు.

ప్రాజెక్టులు వెలవెల.. సాగునీటిపై ఆందోళన
AP: రాష్ట్రంలోని గోదావరి, కృషా నదుల పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాల్లోకి జూన్ నెల దాటుతున్నా నీటి ప్రవాహాలు పెద్దగా రాలేదు. మిగతా ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. దీంతో వాటి పరిధిలో ఉన్న ఆయకట్టుకు జులైలో వివిధ తేదీల్లో సాగునీటి విడుదల ప్రణాళికలపై పునరాలోచన తప్పేలా లేదు. గత ఏడాది రాష్ట్రంలోని వివిధ జలాశయాల్లో ఈ పాటికి 564.39 TMCల నీటి నిల్వలుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 416 TMCలే ఉన్నాయి. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో గత సంవత్సరం 524 TMCల నీటి నిల్వలుంటే.. ప్రస్తుతం 381.33 TMCలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: రేపటి నుంచే 'రైతు భరోసా' క్యాష్ క్రెడిట్!
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన 'రైతు భరోసా' ఫండ్స్ రేపటి నుంచే డిస్ట్రిబ్యూట్ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌తో ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. ఎకరాకు రూ. 6,000 చొప్పున అమౌంట్‌ను డైరెక్ట్‌గా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు.
రోడ్డు పక్కన పకోడీలు తింటే అంతేనా!
కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఒక బండి దగ్గర కొన్న పకోడీలు తిని ఒకేసారి 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పకోడీలు తిన్న కొద్దిసేపటికే వాంతులు, కడుపునొప్పితో జనాలు ఇబ్బంది పడ్డారు. బాధితులందరినీ వెంటనే కాకినాడ లోకల్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్‌తో ఆ ఏరియాలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్!
దాదాపు వందేళ్ల తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోకి క్రికెట్ రీ-ఎంట్రీ ఇస్తోంది. మెన్, ఉమెన్ కేటగిరీల్లో కేవలం 6 జట్లు మాత్రమే ఆడతాయని ICC అనౌన్స్ చేసింది. వరల్డ్ కప్ సెమీస్ చేరడంతో భారత మహిళల టీమ్ ఆల్రెడీ ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయిపోయింది. ఇక మెన్ టీమ్ ప్రస్తుత టాప్ ర్యాంకింగ్స్ చూస్తే, వాళ్ల ఎంట్రీ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. హోస్ట్ కంట్రీగా అమెరికా డైరెక్ట్‌గా ఆడుతుంది, మిగిలిన ఒక్క సీటు కోసం 2027లో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగుతాయి.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. శాలరీ నుండి 1.5% కట్!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (EHS) ఫండ్ కోసం అందరూ తమ బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్ నుంచి తప్పనిసరిగా 1.5% కాంట్రిబ్యూట్ చేయాలని జీవో ఇచ్చింది. ఈ హెల్త్ స్కీమ్‌ను మరింత బలోపేతం చేయడానికి, ఉద్యోగుల మెడికల్ అవసరాలను ఈజీగా తీర్చడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి నెలా శాలరీ/పెన్షన్ నుండి ఈ అమౌంట్ కట్ అవుతుంది.

అయోధ్య విరాళాల కేసులో బిగ్ అప్‌డేట్!
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు కోర్టు జులై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రామాలయ విరాళాల లెక్కింపు బాధ్యతల్లో ఉన్న వీరు. భారీగా అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే SIT అధికారులు వీరి ఇళ్ల నుంచి రూ.79.85 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కొందరు బ్యాంక్ ఎంప్లాయ్స్ పాత్రపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు ఈ కేసుపై తక్షణ విచారణ జరపాలని వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది.

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు!
విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సోమవారం ACP ఆఫీస్‌లో లొంగిపోయారు. సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేయడంలో వీరిద్దరిదే కీలక పాత్ర అని నిర్ధారించిన విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పటికే వీరిని సస్పెండ్ చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న వీరు తాజాగా పోలీసులకు దొరికారు. ఇదే కేసులో కృష్ణలంక CI నాగరాజును SIT అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

నెక్స్ట్ NTR మూవీ త్రివిక్రమ్‌తోనే..
జూనియర్ NTR ఫ్యాన్స్‌కి ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేయబోతున్నట్లు ట్విట్టర్ (X) లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్. అండ్ వన్స్ అగైన్ విత్ త్రివిక్రమ్" అంటూ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఇప్పుడే ఎక్సైట్ అవుతున్నారు.

ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్..
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మెడికల్ చెకప్స్ కోసం ముంబై వెళ్లారు. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. షోల్డర్ కండరాలు చిట్లిపోవడంతో టెస్టుల కోసం ఆయన భార్యతో కలిసి అక్కడి కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌కు వెళ్లారు. ఓల్డ్ మూవీస్ షూటింగ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ల ఎఫెక్ట్ వల్ల ఈ నొప్పి ఎక్కువైందని తెలుస్తోంది. డాక్టర్ల రిపోర్ట్స్ వచ్చాక సర్జరీ అవసరమా లేదా అనేది తెలుస్తుంది.

AP జెన్‌కోలో AEE ఉద్యోగాలు..
గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న Btech స్టూడెంట్స్‌కి AP జెన్‌కో (APGENCO) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. జూన్ 30 నుంచి జులై 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.

అరకు సీట్లన్నీ జనసేనకేనా? నాగబాబు ఓపెన్ స్టేట్‌మెంట్!
రాబోయే ఎలక్షన్స్ లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ MLC నాగబాబు అనౌన్స్ చేశారు. కేవలం గిరిజన ప్రజల బాగు కోసమే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారని ఆయన క్లియర్ చేశారు. అరకు ఏరియా డెవలప్‌మెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్‌తో ఉన్నారని, రాబోయే రోజుల్లో అక్కడ జనసేన గెలవడం ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

హత్యకు అరగంట ముందే ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!
పుణె బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నవంబర్‌లో పెళ్లి ఇష్టం లేక సియా గోయల్, జూన్ 18న కేతన్‌ను కొండపై నుంచి తోసి చంపేసింది. హత్యకు అరగంట ముందు ఆమె తన ప్రియుడు చేతన్‌తో సీక్రెట్ కాల్ మాట్లాడినట్లు సీడీఆర్ (CDR) ద్వారా పోలీసులు కనుగొన్నారు. కేతన్ ఉన్న లొకేషన్‌ను ప్రియుడికి చెప్పడానికే ఈ కాల్ చేసింది. డిజిటల్ ఎవిడెన్స్ దాచడానికి వీరిద్దరూ 3 నెలల సోషల్ మీడియా చాట్స్ కూడా డిలీట్ చేశారు.

65 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష!
పుణెలో 3 ఏళ్ల చిన్నారిపై రేప్ అండ్ మర్డర్‌కి పాల్పడిన 65 ఏళ్ల భిమ్‌రావ్ కాంబ్లేకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఇన్సిడెంట్‌ను 'అత్యంత అరుదైన కేసు'గా జడ్జి పేర్కొన్నారు. మే 1న నిందితుడు బాలికను పశువుల షెడ్డులోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. గతంలోనూ ఇతనిపై పోక్సో (POCSO) కేసులు ఉన్నాయి. జూన్ 25న నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు, తాజాగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.
మూవింగ్ క్యాబ్‌లో బాంబ్ బ్లాస్ట్!
కర్ణాటకలోని తుమకూరు సమీపంలో NH-48పై ప్రయాణిస్తున్న క్యాబ్‌లో ఒక దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన మాజీ లవర్ ని కిడ్నాప్ చేసి, కారులోనే కత్తితో దాడి చేయడమే కాకుండా బాంబ్ పేల్చాడు. అయితే నిందితుడు బాంబ్ పేల్చే టైమ్‌లో అలర్ట్ అయిన క్యాబ్ డ్రైవర్, వెంటనే కారు ఆపి తీవ్రంగా గాయపడిన ఆ మహిళను బయటకు లాగాడు. వారు బయటకు వచ్చిన కొద్దిసేపటికే కారు భారీగా బ్లాస్ట్ అవ్వడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడిన మహిళను హాస్పిటల్‌కి తరలించారు. ప్రెజెంట్ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.