Latest

నేపాల్‌లో వరద విలయం.. 734కి చేరిన మృతుల సంఖ్య!
International· 30 Aug 2026

నేపాల్‌లో వరద విలయం.. 734కి చేరిన మృతుల సంఖ్య!

నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటివరకు 734 మంది చనిపోగా, మరో 2,500 మంది ఆచూకీ తెలియడం లేదు. మిస్ అయినవారిలో ఇండియన్స్, విదేశీయులు కూడా ఉన్నారు. 4,400 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను నేపాల్‌కు తీసుకెళ్లారు. భారత్ 5 రోజుల్లో 68.5 టన్నుల రిలీఫ్ గూడ్స్‌ను పంపింది. మరో 11 టన్నులతో నాలుగో విమానం నేపాల్‌కు వెళ్లింది. రోడ్లు, బ్రిడ్జిలు, నీరు, పవర్ సిస్టమ్స్ భారీగా దెబ్బతిన్నాయి.

తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు
Local· 30 Aug 2026

తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు

AP : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ దగ్గర ఉన్న మేజర్ కాలువలో వాటర్ లేక డ్రై అయిపోయింది. నాగార్జునసాగర్ రైట్ కెనాల్ నుంచి వచ్చే ఈ వాటర్‌తో వందల ఎకరాలకి సాగునీరు అందుతుంది. వర్షాలు లేక కాలువ ఎండిపోవడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు. ఆఫీసర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి కాలువకి నీళ్లు రిలీజ్ చేసి తమ పంటలను సేవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

వాటర్ ప్లాంట్ల చుట్టూ ఈగలు.. ఆ నీళ్లు మంచివేనా?
Local· 30 Aug 2026

వాటర్ ప్లాంట్ల చుట్టూ ఈగలు.. ఆ నీళ్లు మంచివేనా?

జగిత్యాల జిల్లా గ్రామాల్లోని కొన్ని వాటర్ ప్లాంట్లు – నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయా? శుభ్రమైన తాగునీరు అందించాల్సిన ప్లాంట్ల పరిసరాలే అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు, దోమలు తిరగడం – ఆందోళన కలిగిస్తోంది. నీటి నాణ్యత పరీక్షలు, పరిశుభ్రత, ప్లాంట్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతున్నదనీ, కనీసం క్లోరినేషన్ రికార్డులు కూడా సక్రమంగా లేవని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు.. కిలో ఎంతంటే? 🍗
Infotainment· 30 Aug 2026

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు.. కిలో ఎంతంటే? 🍗

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మార్కెట్‌ను బట్టి మారుతున్నాయి. అందుబాటులో ఉన్న తాజా రేట్ డేటా ప్రకారం, తెలంగాణలో కిలో రా చికెన్ సుమారు రూ. 170, స్కిన్‌లెస్ రూ. 210, బోన్‌లెస్ రూ. 220గా ఉంది. ఏపీలో రా చికెన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 190, బోన్‌లెస్ రూ. 220 వరకు ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ రేట్లు షాప్‌ను బట్టి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. వీకెండ్ డిమాండ్‌తో రేట్లలో చిన్న మార్పులు కనిపిస్తున్నాయి.

రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ కల నెరవేరింది: పూర్ణ
Entertainment· 30 Aug 2026

రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ కల నెరవేరింది: పూర్ణ

సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో యాక్ట్ చేయడం నా బిగ్గెస్ట్ డ్రీమ్, అది నెరవేరింది అని పూర్ణ (షామ్నా కాసిమ్) చెప్పారు. జైలర్-2లోని 'ఆలా బోలేలో' సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. "కుర్చీ మడతపెట్టి సాంగ్‌ టైమ్‌లో డెలివరీ అయి 4 మంత్స్ అవ్వడంతో వెయిట్ పెరిగాను, బాడీషేమింగ్ ట్రోల్స్ వస్తాయేమోనని టెన్షన్ పడ్డా, కానీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారని" పూర్ణ తెలిపారు. మదర్ అయ్యాక సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నా, డ్యాన్స్‌ని మాత్రం ఎప్పటికీ వదిలేదే లేదని అన్నారు.

ఆ పక్షి అంతరించి పోయింది
International· 30 Aug 2026

ఆ పక్షి అంతరించి పోయింది

ఒకప్పుడు హవాయి దీవుల అడవుల్లో ప్రత్యేకమైన కిలకిల స్వరాలతో సందడి చేసిన హవాయి ఓఓ (Hawaiian ʻōʻō) పక్షి ఇప్పుడు భూమిపై లేదు. చివరిసారిగా 1934లో కనిపించిన ఈ పక్షి, ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఇది అంతరించిపోయిన జాతిగా గుర్తించబడింది. బయట ప్రాంతాల నుంచి హవాయికి తీసుకువచ్చిన ఎలుకలు, పిల్లులు, ముంగిసలు స్థానిక పక్షుల గుడ్లు, పిల్లలను చంపేశాయి. దోమల ద్వారా వ్యాపించిన ఏవియన్ మలేరియా, ముఖ్యంగా చెట్లను కొట్టి భారీ స్థాయిలో అడవులను నాశనం చేయడం కూడా ఈ పక్షి మాయం కావడానికి కారణం అయ్యింది.

ఆఫీస్ లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా మారే టిప్స్
Infotainment· 30 Aug 2026

ఆఫీస్ లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా మారే టిప్స్

ఆఫీస్ ఫార్మల్ వేర్ బోర్ కొడుతోందా? స్టైలిష్‌గా కనిపించడానికి ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్ స్వాతి జోగ్ కొన్ని టిప్స్ చెప్పారు.మంచి కలర్ కాంట్రాస్ట్‌లు ట్రై చేయడం, మోడ్రన్ ప్రింట్స్ అండ్ చెక్స్ షర్ట్స్ వేసుకోవడం వల్ల క్లాసీ లుక్ వస్తుంది. హ్యాండ్ స్లీవ్స్‌ని మోచేతి కిందకి నీట్‌గా ఫోల్డ్ చేసి, మంచి వాచ్ యాడ్ చేస్తే మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. షర్ట్ పాకెట్‌లో కేవలం ఒక పెన్ మాత్రమే ఉంచాలని, ఎక్కువ ఐటెమ్స్ పెట్టి లుక్ పాడుచేసుకోవద్దని అన్నారు.

ఉజ్బెకిస్థాన్‌కు మోదీ.. ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై చర్చలు
National· 30 Aug 2026

ఉజ్బెకిస్థాన్‌కు మోదీ.. ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై చర్చలు

PM నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ టూర్‌లో భాగంగా తాష్కెంట్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి అక్కడికి చేరుకున్న మోదీ ఈరోజు ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. సిటీలోని ఫేమస్ బిల్డింగ్స్, ముఖ్యంగా హిల్టన్ హోటల్‌ను విజిట్ చేశారు. ఇండియన్ సాంగ్స్‌తో పాటు బాలీవుడ్, కథక్, అండిజాన్ కల్చరల్ పెర్ఫార్మెన్స్‌లతో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చారు. అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో బైలేటరల్ చర్చల్లో ఇండియా-ఉజ్బెకిస్థాన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్, ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ సహా కీలక అంశాలపై ఫోకస్ చేయనున్నారు.

కాలువ పనులకు రూ.10 లక్షలు..
Local· 30 Aug 2026

కాలువ పనులకు రూ.10 లక్షలు..

ఫరూక్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామీణాభివృద్ధిలో భాగంగా అయ్యవారిపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. "పారిశుధ్యమే లక్ష్యం – కాలువలు బలంగా ఉంటేనే ఊరు పరిశుభ్రంగా ఉంటుంది" అంటూ ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సర్పంచ్ harassment పై ఆశా కార్యకర్త ఫిర్యాదు!
Local· 30 Aug 2026

సర్పంచ్ harassment పై ఆశా కార్యకర్త ఫిర్యాదు!

ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన ఓ ఆశా కార్యకర్త – గ్రామ సర్పంచ్ రాజు నాయక్ తనను అనుచితంగా, అవమానకరంగా వేధిస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ఫిర్యాదు చేశారు. "నువ్వు సీఎంకైనా, పీఎంకైనా ఫిర్యాదు చేసినా భయపడేది లేదు" అంటూ హెచ్చరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రాణం తీసిన లారీ పంక్చర్
Crime· 30 Aug 2026

ప్రాణం తీసిన లారీ పంక్చర్

TG : షాద్‌నగర్ దగ్గర NH-44 హైవేపై ఒక యాక్సిడెంట్ జరిగింది. నాగర్‌కర్నూల్‌కి చెందిన అరుణా భాయ్ (42) హైదరాబాద్ నుంచి రిటర్న్ అవుతుండగా, ముందు వెళ్తున్న లారీ సడన్‌గా పంక్చర్ అయ్యి అదుపు తప్పింది. దానివల్ల వీళ్ల వెహికల్ కూడా కంట్రోల్ తప్పి ఆ లారీని ఢీకొట్టడంతో అరుణా భాయ్ లారీ టైర్ కింద పడి స్పాట్‌లోనే చనిపోయింది. సేమ్ టైమ్‌లో ఆ రూట్‌లో వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి కార్ ఆపి, ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉండేలా చూస్తానని ప్రామిస్ చేశారు.

ప్రతి ఇంట్లో వాడే ఎవరెస్ట్, LG ఇంగువపై నిషేధం
National· 30 Aug 2026

ప్రతి ఇంట్లో వాడే ఎవరెస్ట్, LG ఇంగువపై నిషేధం

ప్రముఖ మసాలా బ్రాండ్‌ ఎవరెస్ట్‌ తయారు చేసే కాంపౌండెడ్ హింగ్‌ (ఇంగువ) అమ్మకాలపై FSSAI టెంపరరీగా బ్యాన్ చేసింది. ల్యాబ్‌ టెస్టుల్లో హింగ్‌ శాంపిల్స్‌ మిస్‌బ్రాండెడ్, సబ్‌స్టాండర్డ్‌గా తేలడంతో ఈ యాక్షన్‌ తీసుకుంది. రూల్స్ ప్రకారం హింగ్‌లో ఆల్కహాల్‌ సాల్యూబుల్‌ ఎక్స్‌ట్రాక్ట్ మినిమమ్‌గా 5% ఉండాలి. కానీ ఎవరెస్ట్‌ శాంపిల్స్‌లో ఇది 0% నుంచి 4.4% వరకే రికార్డ్ అయింది. మరోవైపు లాల్జీ గోధూ హింగ్‌లోనూ అధిక స్టార్చ్‌ ఉన్నట్లు గుర్తించారు. రెండు కంపెనీలను యాక్షన్‌ ప్లాన్‌ సమర్పించాలని FSSAI ఆదేశించింది.

రైతు బీమాపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కి వినతి
Local· 30 Aug 2026

రైతు బీమాపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కి వినతి

TG : హనుమకొండ జిల్లా సూరారం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ BC వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్‌ని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా ప్రెసిడెంట్ హింగే భాస్కర్ కలసి ఒక లెటర్ ఇచ్చారు. రైతు బీమా స్కీమ్‌పై ఫార్మర్స్‌కి ఉన్న డౌట్స్, టెన్షన్స్ గురించి మినిస్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కుటుంబంలో మెయిన్ పర్సన్ చనిపోతే రైతు బీమానే ఆ ఫ్యామిలీకి సపోర్ట్ అని, ఈ స్కీమ్‌ని ఆపకుండా కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్ చేశారు. రైతులకి ఉన్న ఆందోళనలను గవర్నమెంట్ వెంటనే సాల్వ్ చేయాలని మినిస్టర్‌ని కోరారు.

Hydలో మారథాన్ సందడి.. వేలాది మంది రన్నర్స్ రెడీ! 🏃‍♂️
TG· 30 Aug 2026

Hydలో మారథాన్ సందడి.. వేలాది మంది రన్నర్స్ రెడీ! 🏃‍♂️

TG: హైదరాబాద్‌ మరోసారి రన్నింగ్ ఫీవర్‌లోకి వెళ్లింది. 15వ ఎడిషన్‌ NMDC హైదరాబాద్ మారథాన్ ఈరోజు గ్రాండ్‌గా జరుగుతోంది. వేలాది మంది రన్నర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్ ఉ. 4:30కి, హాఫ్ మారథాన్ 5:30కి నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి స్టార్ట్ అవుతుంది. 10K రన్ ఉ. 7:15కి HITEX నుంచి ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. KBR పార్క్, జూబ్లీహిల్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా రూట్ సాగుతుంది. తరువాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది.

స్కూల్ దగ్గర 20 కుక్కలు.. పిల్లల భద్రతకు డేంజర్
Local· 30 Aug 2026

స్కూల్ దగ్గర 20 కుక్కలు.. పిల్లల భద్రతకు డేంజర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు రోడ్డుపై 20కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇదే రోడ్డుపై స్మైల్ కిడ్స్ స్కూల్ ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్మూర్‌లో కుక్కల దాడి ఘటనలు జరిగాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించాలని, కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు, శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికుల డిమాండ్. వీధికుక్కల దాడుల నేపథ్యంలో పిల్లల, వృద్ధుల భద్రత గురించి సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిదన్నారు.

AI స్టోరీటెల్లింగ్‌తో Zee5
Entertainment· 30 Aug 2026

AI స్టోరీటెల్లింగ్‌తో Zee5

తెలుగు ఆడియన్స్ కోసం Zee5 ఓటీటీ మైండ్ బ్లోయింగ్ కంటెంట్ లైనప్ అనౌన్స్ చేసింది. స్టార్ హీరో మూవీస్, ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ సిరీస్‌లతో పాటు కొత్తగా AI టెక్నాలజీతో కూడిన స్టోరీటెల్లింగ్‌ని రాబోయే రోజుల్లో చూపించబోతున్నారు. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, SVCC, ప్రైమ్ షో, షైన్ స్క్రీన్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అంతా Zee5తో కొలాబరేట్ అయ్యాయి. థియేటర్ మూవీస్ డిజిటల్ రైట్స్‌తో పాటు, ప్యూర్ ఓటీటీ ఒరిజినల్స్ పై కూడా ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

పేరెంట్స్‌ని చూసుకోవాల్సిందే :  RDO మురళీకృష్ణ
Local· 30 Aug 2026

పేరెంట్స్‌ని చూసుకోవాల్సిందే : RDO మురళీకృష్ణ

AP : వయసైన పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పిల్లలదే అని గురజాల RDO మురళీకృష్ణ అన్నారు. పేరెంట్స్ తమ ఆస్తులను పిల్లలకు రాసిచ్చేటప్పుడే, ఓల్డేజ్‌లో తమను సరిగ్గా చూసుకోవాలనే కండిషన్‌ని కూడా డాక్యుమెంట్స్‌లో క్లియర్‌గా రాయాలని అడ్వైస్ ఇచ్చారు. డివిజన్ పరిధిలో వృద్ధులు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తుంటే డైరెక్ట్‌గా రెవెన్యూ ఆఫీస్‌కి వచ్చి గానీ, పోస్ట్ ద్వారా గానీ కంప్లయింట్ చేయొచ్చని చెప్పారు. "ముసలితనంలో పేరెంట్స్‌కి సపోర్ట్‌గా నిలవడం ప్రతి ఒక్కరి ప్రైమరీ డ్యూటీ" అని అన్నారు.

పల్లెనిద్ర... గ్రామస్తులకు వార్నింగులు...
Local· 30 Aug 2026

పల్లెనిద్ర... గ్రామస్తులకు వార్నింగులు...

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పల్లెనిద్రలో భాగంగా సంతకవిటి మండలం బిల్లాని గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు గ్రామస్థులతో సమావేశమై షాకింగ్ హెచ్చరికలు చేశారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి గొడవలకు పోవద్దని సూచించారు.

అమరావతిలో రోడ్స్ నెక్స్ట్ లెవెల్
Local· 30 Aug 2026

అమరావతిలో రోడ్స్ నెక్స్ట్ లెవెల్

AP : అమరావతి E-13 రోడ్డుని ఫుల్ వైడ్ చేయడానికి మంగళగిరి AIIMS ల్యాండ్‌లోని 3.34 ఎకరాలు వాడుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పేసింది. దీనికి రిటర్న్‌గా AIIMS హాస్పిటల్‌కి వేరే చోట 10 ఎకరాలు ఇస్తున్నారు. ఈ E-13 రోడ్డు డైరెక్ట్‌గా NH-16 నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. దీనివల్ల మంగళగిరి - గుంటూరు మధ్య ట్రాఫిక్ ఉండదు, ట్రావెల్ టైమ్ తగ్గి రాకపోకలు స్మూత్‌గా మారిపోతాయి.

ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!
National· 30 Aug 2026

ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!

PM నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్‌ ఈరోజు (ఆగస్ట్ 30) ఉ. 11 గం.కు టెలికాస్ట్ కానుంది. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఏ అంశాలపై ఫోకస్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. యూత్, హెల్త్, ఎడ్యుకేషన్, నేషన్ డెవలప్‌మెంట్, లోకల్ టాలెంట్ వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే సజెషన్స్ పంపారు. అసలు టాపిక్స్‌ను మోదీ స్పీచ్‌లోనే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్‌తో పాటు <a href="https://newsonair.gov.in/modi-to-share-thoughts-in-mann-ki-baat-broadcast-at-11-am/">AIR News,</a> <a href="https://pmonradio.nic.in/#">PMO,</a> DD News <a href="https://www.youtube.com/watch?v=MaPRwJjksZU">YouTube</a> ఛానళ్లలో లైవ్ చూడొచ్చు.

ఆ భారీ మాఫీ పై నోరు విప్పాల్సిందే... : బిఎస్పీ
Local· 30 Aug 2026

ఆ భారీ మాఫీ పై నోరు విప్పాల్సిందే... : బిఎస్పీ

ఒక వ్యక్తికి ఏకంగా 22వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిన విషయంపై మోదీ సర్కార్ ఇప్పటికైనా నోరు మెదపాలని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బిఎస్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు అనుముల తుకారం నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పేదలకు వైద్యం, విద్య కోసం నిధులు లేవని చెప్పే ప్రభుత్వం.. వేల కోట్ల వ్యవహారాలపై ఎందుకు మౌనం వహిస్తోంద''ని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.