Latest

సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!
Local· 30 Aug 2026

సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!

పోలవరం జిల్లా కూనవరం కోతుల గుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి (పల్లూరు గ్రామం) ఆదివారం మృతి చెందింది. శనివారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమెను కోతులగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరిగి హాస్టల్కు తీసుకురాగా తెల్లవారుజామున ఆరోగ్యం మరింత క్షీణించడంతో భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

SBIలో 9,124 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి!
Jobs· 30 Aug 2026

SBIలో 9,124 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్ సపోర్ట్ &amp; సేల్స్) పోస్టులకు <a href="https://sbi.bank.in/webfiles/uploads/files_2627/08/JA_2026_Detailed_Advt_Eng.pdf">నోటిఫికేషన్‌</a> విడుదలైంది. మొత్తం 9,124 పోస్టులు ఉండగా, 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 1,444 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈనెల 31తో అప్లికేషన్స్ ముగుస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) పూర్తిచేసిన వారు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్‌, OBC, EWS కాండిడేట్స్‌కు ఫీజు రూ.750 ఉంటుంది. SC/ST/PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/">Click </a>చేయండి.

విజయసాయిరెడ్డి ఆరోపణలకు సజ్జల కౌంటర్.. ‘అటెన్షన్ కోసమే’
AP· 30 Aug 2026

విజయసాయిరెడ్డి ఆరోపణలకు సజ్జల కౌంటర్.. ‘అటెన్షన్ కోసమే’

AP: మాజీ MP విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు. విజయసాయి తన సొంత కారణాలతోనే YCPని వీడారని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారిపై జగన్ ఎప్పుడూ నెగటివ్‌గా మాట్లాడలేదన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయి చేసిన కామెంట్స్ దారుణమన్నారు. 'నిజంగా జగన్ ఆలా చేసి ఉంటే.. విజయసాయినే మార్చేవాళ్లు కదా' అని కౌంటర్ ఇచ్చారు. అటెన్షన్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ తనకు నెం.1 స్థానం ఇచ్చారని విజయసాయి చెప్పడం కూడా సరికాదన్నారు.

మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..
Local· 30 Aug 2026

మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..

మైదుకూరు ZPHS (boys) లో శనివారం తెలుగు భాషా, క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ గోశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ – "తెలుగు భాషలో ప్రావీణ్యం సాధించినప్పుడే ఇతర భాషల్లో కూడా పట్టు సాధించగలర''ని అన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘనంగా నివాళి అర్పించారు.

ట్రోల్స్ వస్తున్నా తగ్గేదేలే
Entertainment· 30 Aug 2026

ట్రోల్స్ వస్తున్నా తగ్గేదేలే

హీరో యష్ , గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో వయొలెన్స్, రొమాంటిక్ సీన్స్, మహిళల క్యారెక్టరైజేషన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ఏమాత్రం వసూళ్లపై పడలేదు. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 254.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

దేవుడికి వెండి ప్లేటు.. ఇలాంటి దాతృత్వం మరెక్కడైనా?
Local· 30 Aug 2026

దేవుడికి వెండి ప్లేటు.. ఇలాంటి దాతృత్వం మరెక్కడైనా?

పల్నాడు దాచేపల్లి బట్రుపాలెంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు రూ.2.50 లక్షల విలువైన 1 కిలో వెండి ప్లేటుని విరాళంగా అందజేశారు. కోలా కుమారస్వామి రెడ్డి, నారాయణమ్మ దంపతులు, వారి కుమారుడు వెంకట నరసింహారెడ్డి, తులసి దంపతులు స్వామివారికి నైవేద్యం కోసం ఈ ప్లేటును సమర్పించారు. అయితే, భక్తి, సంప్రదాయాలను గౌరవిస్తూనే – ఇలాంటి దాతృత్వం "మొదట సమాజం, తర్వాత ఆలయం" అనే ధోరణిని ప్రోత్సహిస్తే, ప్రభుత్వ స్కూళ్లు,, ఆసుపత్రులు, తాగునీటి కేంద్రాలు బాగుపడతాయని, ఇలా కూడా ఆలోచన చేయాలని పరిశీలకులు అంటున్నారు.

ఫీజుల పెంపును వెంటనే వెనక్కి తీసుకోండి: PAAP డిమాండ్
Local· 30 Aug 2026

ఫీజుల పెంపును వెంటనే వెనక్కి తీసుకోండి: PAAP డిమాండ్

APలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS ఫీజులను 10%, PG ఫీజులను 15% పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జివోను విత్‌డ్రా చేసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) డిమాండ్ చేసింది. ఇప్పటికే ఉన్న ఫీజులతోనే మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ తిప్పలు పడుతున్నాయని, ఈ పెంపుతో మరింత బర్డెన్ పడుతుందని తెలిపింది. పేరెంట్స్, స్టూడెంట్స్ తో మాట్లాడి ఫీజులు డిసైడ్ చేయాలని, లేకపోతే స్టేట్ వైడ్‌గా ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాల తనిఖీ
Local· 30 Aug 2026

పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాల తనిఖీ

నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జోన్ పరిధిలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దూడల్ని బలి తీసుకున్న కుక్కలు.. లైట్లు లేవు!
Local· 30 Aug 2026

దూడల్ని బలి తీసుకున్న కుక్కలు.. లైట్లు లేవు!

పల్నాడు నకరికల్లు గుండ్లపల్లిలో వీధి కుక్కల బెడద తారాస్థాయికి చేరింది. కుమ్మరి బజార్లో కుక్కలు దూడలపై దాడి చేయడంతో 2 దూడలు మృతి చెందాయి. గత నెల రోజులుగా వీధి లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో శునకాల సంచారం పెరిగిందని, ప్రజలు, పశువులు ప్రమాదంలో పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లపల్లి మాత్రమే కాదు మొత్తం ఏపీలోలోనే కుక్క కాటు కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 2,44,914 కేసులు నమోదైతే, గుంటూరులో 18,040, బాపట్లలో 8,742, పల్నాడులో 4,186 నమోదయ్యాయి.

గుంతలతో పల్నాడు రోడ్డు
Local· 30 Aug 2026

గుంతలతో పల్నాడు రోడ్డు

పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి తంగేడు వెళ్లే 17 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు భారీ గుంతలతో ఉందని ప్రజలు తెలిపారు. తెలంగాణ వైపు వెళ్లే ఈ రూట్‌లో గుంతల వల్ల బైక్‌లు, కార్లు వెళ్లడం ఇబ్బందిగా ఉందంటున్నారు. రోజూ ట్రావెల్ చేసే వాళ్లు యాక్సిడెంట్స్ అవుతాయేమోనని భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ఆ రోడ్డు రిపేర్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

‘Lake America’పై కెనడా కౌంటర్.. భారీ సైన్‌తో ట్రంప్‌కు షాక్!
International· 30 Aug 2026

‘Lake America’పై కెనడా కౌంటర్.. భారీ సైన్‌తో ట్రంప్‌కు షాక్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘Lake Ontario’ను ‘Lake America’గా మార్చాలని ఆదేశించడంపై కెనడా నేతలు ఫైర్ అవుతున్నారు. ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ కెనడా తీరంలో నిన్న భారీ సైన్‌బోర్డును ఏర్పాటు చేసి.. ‘Lake Ontario.. Now and Always’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ పదవి ముగిసిన తర్వాత కూడా ఈ సరస్సును ‘Lake Ontario’గానే పిలుస్తారని ఫోర్డ్ అన్నారు. మానిటోబా ప్రీమియర్ వాబ్ కినూ కూడా ట్రంప్ నిర్ణయాన్ని పాత రాక్ బ్యాండ్ ట్రిక్‌తో పోల్చి సెటైర్ వేశారు.

కుటుంబ కలహాలకు బలి.. చివరి చూపుకొచ్చి చావు
Local· 30 Aug 2026

కుటుంబ కలహాలకు బలి.. చివరి చూపుకొచ్చి చావు

AP : గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీలో దారుణ హత్య జరిగింది. సూర్యాపేటలో పాత సామాన్ల వ్యాపారం చేసే పెండ్ర చిన్న (55) అనే వ్యక్తి, తన బాబాయ్ మత్తయ్య చనిపోవడంతో చివరి చూపు చూసేందుకు గుంటూరు వచ్చాడు. ఫ్యామిలీ గొడవల వల్ల అక్కడికొచ్చిన దుండగులు అతడిపై పదునైన కత్తులతో దాడి చేయడంతో చిన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ICICI Bankలో జాబ్ ఛాన్స్!💼
Jobs· 30 Aug 2026

ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ICICI Bankలో జాబ్ ఛాన్స్!💼

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ICICI Bank Probationary Officer Program మంచి ఛాన్స్. ఈ పోస్టుకు 0–2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, ఏదైనా డిగ్రీ/గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి. జాబ్ లొకేషన్ Across India. సెలెక్ట్ అయిన వారికి 2 నెలల క్లాస్‌రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ టైమ్‌లో నెలకు రూ. 18,000 స్టైపెండ్ ఇస్తారు. ప్రోగ్రామ్ పూర్తయ్యాక రూ. 5 లక్షల నుంచి CTCతో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఈ జాబ్‌కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మరిన్ని వివరాల కోసం <a href="https://www.icicicareers.com/CareerApplicant/Career/job-details/2547189">ICICI Careers</a> వెబ్‌సైట్‌లో చుడండి.

కొత్త కంటెంట్‌తో థియేటర్లని షేక్ చేస్తున్న టాలీవుడ్
Entertainment· 30 Aug 2026

కొత్త కంటెంట్‌తో థియేటర్లని షేక్ చేస్తున్న టాలీవుడ్

2 నెలల్లోనే 6 తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచి థియేటర్లకి మళ్లీ కళ తీసుకొచ్చాయి. సమంత 'మా ఇంటి బంగారం' నుంచి మొదలై లేనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి సినిమాలతో థియేటర్లలో జనాలు ఫుల్ సందడి చేస్తున్నారు. OTT టైమ్‌లో కూడా ఆడియన్స్ థియేటర్లకి వచ్చి హిట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రొటీన్ మాస్ ఫార్ములా పక్కనపెట్టి కొత్త కంటెంట్‌తో సినిమాలు తీస్తే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ సక్సెస్ రూట్ ప్రూవ్ చేసింది.

గుత్తిలో పల్లె ఉమా స్మృతిలో ఘన నివాళి!
Local· 30 Aug 2026

గుత్తిలో పల్లె ఉమా స్మృతిలో ఘన నివాళి!

అనంతపురం గుత్తి శ్రీ సాయి క్యాంపస్‌లో ఆదివారం పల్లె ఉమా 8వ వర్ధంతి నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వెంకటేశ్వర్లు రెడ్డి, PRR MBA కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డా. సింధూర చేతుల మీదుగా రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాళ్లు మాట్లాడుతూ – "పల్లె ఉమా స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేటి సమాజంలో బలమైన ఆయుధం విద్య, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి" అని పిలుపునిచ్చారు.

పగటి వెలుగుల్లోనూ లైట్లు.. ఇది వ్యర్థమే!
Local· 30 Aug 2026

పగటి వెలుగుల్లోనూ లైట్లు.. ఇది వ్యర్థమే!

పల్నాడు దాచేపల్లి డివైడర్ల మీద స్ట్రీట్ లైట్లు – పగలు కూడా వెలుగుతున్నాయి! సాయంత్రం ఆన్ చేసి ఉదయం ఆఫ్ చేయకపోవడమే కారణం. సూర్యుడు వచ్చేసినా లైట్లు మాత్రం ఆగట్లేదు – ఇది విద్యుత్ వృథా, ప్రజా డబ్బుకు భారం. "ఇలా పావు రోజు లైట్లు వెలిగిస్తే, పంచాయతీ కరెంట్ బిల్లు పెరిగి చివరికి మనమే కట్టుకోవాల్సి వస్తుంది" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు వృథా మాత్రమే కాదు – పగటి వేళ లైట్లు వెలిగిస్తే ఆ ఎక్స్ట్రా లోడ్‌ పడి ఇళ్లల్లో TVలు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు కాలిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు.

గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ఇవాళ రేట్లు ఇవే!
Infotainment· 30 Aug 2026

గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ఇవాళ రేట్లు ఇవే!

<a href="https://www.goodreturns.in/silver-rates/hyderabad.html">Good Returns</a> వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉ. 9 గం. సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,58,240 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,45,050గా ఉంది. విజయవాడలోనూ ఇదే గోల్డ్ రేట్లు ఉన్నాయి. సిల్వర్ విషయానికి వస్తే రెండు నగరాల్లోనూ కిలో రేట్ రూ. 2,60,000గా నమోదైంది. ఈ రేట్లు రోజులో మారే అవకాశం ఉంది. జ్యువెలరీ కొనే సమయంలో GST, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉండొచ్చు. అయితే బంగారం కొనేవారు ఎప్పటికప్పుడు రేట్లను చెక్ చేసుకోవడం బెటర్.

గామాలపాడులో  వర్షాల కోసం బోనాలు
Local· 30 Aug 2026

గామాలపాడులో వర్షాల కోసం బోనాలు

పల్నాడు దాచేపల్లి గామలపాడులో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. వర్షాభావ భీతితో ఊరి మహిళలు ముత్యాలమ్మకు బోనాల ఉత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య బోనాలు తలపై ఎత్తుకుని, ఆలయానికి ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. పచ్చని పంటలు, కడుపునిండా వర్షం – ఇదే భక్తుల కోరిక. ముత్యాలమ్మ ఆశీస్సులతో పాటు, వాతావరణ శాస్త్రజ్ఞుల సూచనలు, వ్యవసాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటే అందరూ సుభిక్షంగా ఉంటారని, అనవసరంగా అప్పుల పాలవ్వరని స్థానికులు చెబుతున్నారు.

నేపాల్‌లో వరద విలయం.. 734కి చేరిన మృతుల సంఖ్య!
International· 30 Aug 2026

నేపాల్‌లో వరద విలయం.. 734కి చేరిన మృతుల సంఖ్య!

నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటివరకు 734 మంది చనిపోగా, మరో 2,500 మంది ఆచూకీ తెలియడం లేదు. మిస్ అయినవారిలో ఇండియన్స్, విదేశీయులు కూడా ఉన్నారు. 4,400 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను నేపాల్‌కు తీసుకెళ్లారు. భారత్ 5 రోజుల్లో 68.5 టన్నుల రిలీఫ్ గూడ్స్‌ను పంపింది. మరో 11 టన్నులతో నాలుగో విమానం నేపాల్‌కు వెళ్లింది. రోడ్లు, బ్రిడ్జిలు, నీరు, పవర్ సిస్టమ్స్ భారీగా దెబ్బతిన్నాయి.

తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు
Local· 30 Aug 2026

తంగెడ మేజర్ కాలువలో చుక్క నీరు లేదు

AP : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ దగ్గర ఉన్న మేజర్ కాలువలో వాటర్ లేక డ్రై అయిపోయింది. నాగార్జునసాగర్ రైట్ కెనాల్ నుంచి వచ్చే ఈ వాటర్‌తో వందల ఎకరాలకి సాగునీరు అందుతుంది. వర్షాలు లేక కాలువ ఎండిపోవడంతో పంటలు దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు. ఆఫీసర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి కాలువకి నీళ్లు రిలీజ్ చేసి తమ పంటలను సేవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

వాటర్ ప్లాంట్ల చుట్టూ ఈగలు.. ఆ నీళ్లు మంచివేనా?
Local· 30 Aug 2026

వాటర్ ప్లాంట్ల చుట్టూ ఈగలు.. ఆ నీళ్లు మంచివేనా?

జగిత్యాల జిల్లా గ్రామాల్లోని కొన్ని వాటర్ ప్లాంట్లు – నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయా? శుభ్రమైన తాగునీరు అందించాల్సిన ప్లాంట్ల పరిసరాలే అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు, దోమలు తిరగడం – ఆందోళన కలిగిస్తోంది. నీటి నాణ్యత పరీక్షలు, పరిశుభ్రత, ప్లాంట్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతున్నదనీ, కనీసం క్లోరినేషన్ రికార్డులు కూడా సక్రమంగా లేవని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.