Latest

సర్పంచ్ harassment పై ఆశా కార్యకర్త ఫిర్యాదు!
ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన ఓ ఆశా కార్యకర్త – గ్రామ సర్పంచ్ రాజు నాయక్ తనను అనుచితంగా, అవమానకరంగా వేధిస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ఫిర్యాదు చేశారు. "నువ్వు సీఎంకైనా, పీఎంకైనా ఫిర్యాదు చేసినా భయపడేది లేదు" అంటూ హెచ్చరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రాణం తీసిన లారీ పంక్చర్
TG : షాద్‌నగర్ దగ్గర NH-44 హైవేపై ఒక యాక్సిడెంట్ జరిగింది. నాగర్‌కర్నూల్‌కి చెందిన అరుణా భాయ్ (42) హైదరాబాద్ నుంచి రిటర్న్ అవుతుండగా, ముందు వెళ్తున్న లారీ సడన్‌గా పంక్చర్ అయ్యి అదుపు తప్పింది. దానివల్ల వీళ్ల వెహికల్ కూడా కంట్రోల్ తప్పి ఆ లారీని ఢీకొట్టడంతో అరుణా భాయ్ లారీ టైర్ కింద పడి స్పాట్‌లోనే చనిపోయింది. సేమ్ టైమ్‌లో ఆ రూట్‌లో వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి కార్ ఆపి, ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉండేలా చూస్తానని ప్రామిస్ చేశారు.

ప్రతి ఇంట్లో వాడే ఎవరెస్ట్, LG ఇంగువపై నిషేధం
ప్రముఖ మసాలా బ్రాండ్ ఎవరెస్ట్ తయారు చేసే కాంపౌండెడ్ హింగ్ (ఇంగువ) అమ్మకాలపై FSSAI టెంపరరీగా బ్యాన్ చేసింది. ల్యాబ్ టెస్టుల్లో హింగ్ శాంపిల్స్ మిస్‌బ్రాండెడ్, సబ్‌స్టాండర్డ్‌గా తేలడంతో ఈ యాక్షన్ తీసుకుంది. రూల్స్ ప్రకారం హింగ్‌లో ఆల్కహాల్ సాల్యూబుల్ ఎక్స్‌ట్రాక్ట్ మినిమమ్‌గా 5% ఉండాలి. కానీ ఎవరెస్ట్ శాంపిల్స్‌లో ఇది 0% నుంచి 4.4% వరకే రికార్డ్ అయింది. మరోవైపు లాల్జీ గోధూ హింగ్‌లోనూ అధిక స్టార్చ్ ఉన్నట్లు గుర్తించారు. రెండు కంపెనీలను యాక్షన్ ప్లాన్ సమర్పించాలని FSSAI ఆదేశించింది.

రైతు బీమాపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కి వినతి
TG : హనుమకొండ జిల్లా సూరారం గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ BC వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్‌ని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా ప్రెసిడెంట్ హింగే భాస్కర్ కలసి ఒక లెటర్ ఇచ్చారు. రైతు బీమా స్కీమ్‌పై ఫార్మర్స్‌కి ఉన్న డౌట్స్, టెన్షన్స్ గురించి మినిస్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కుటుంబంలో మెయిన్ పర్సన్ చనిపోతే రైతు బీమానే ఆ ఫ్యామిలీకి సపోర్ట్ అని, ఈ స్కీమ్‌ని ఆపకుండా కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్ చేశారు. రైతులకి ఉన్న ఆందోళనలను గవర్నమెంట్ వెంటనే సాల్వ్ చేయాలని మినిస్టర్‌ని కోరారు.

Hydలో మారథాన్ సందడి.. వేలాది మంది రన్నర్స్ రెడీ! 🏃♂️
TG: హైదరాబాద్ మరోసారి రన్నింగ్ ఫీవర్‌లోకి వెళ్లింది. 15వ ఎడిషన్ NMDC హైదరాబాద్ మారథాన్ ఈరోజు గ్రాండ్‌గా జరుగుతోంది. వేలాది మంది రన్నర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్ ఉ. 4:30కి, హాఫ్ మారథాన్ 5:30కి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి స్టార్ట్ అవుతుంది. 10K రన్ ఉ. 7:15కి HITEX నుంచి ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. KBR పార్క్, జూబ్లీహిల్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా రూట్ సాగుతుంది. తరువాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది.
స్కూల్ దగ్గర 20 కుక్కలు.. పిల్లల భద్రతకు డేంజర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు రోడ్డుపై 20కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇదే రోడ్డుపై స్మైల్ కిడ్స్ స్కూల్ ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్మూర్‌లో కుక్కల దాడి ఘటనలు జరిగాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించాలని, కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు, శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికుల డిమాండ్. వీధికుక్కల దాడుల నేపథ్యంలో పిల్లల, వృద్ధుల భద్రత గురించి సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిదన్నారు.

AI స్టోరీటెల్లింగ్‌తో Zee5
తెలుగు ఆడియన్స్ కోసం Zee5 ఓటీటీ మైండ్ బ్లోయింగ్ కంటెంట్ లైనప్ అనౌన్స్ చేసింది. స్టార్ హీరో మూవీస్, ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ సిరీస్‌లతో పాటు కొత్తగా AI టెక్నాలజీతో కూడిన స్టోరీటెల్లింగ్‌ని రాబోయే రోజుల్లో చూపించబోతున్నారు. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, SVCC, ప్రైమ్ షో, షైన్ స్క్రీన్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అంతా Zee5తో కొలాబరేట్ అయ్యాయి. థియేటర్ మూవీస్ డిజిటల్ రైట్స్‌తో పాటు, ప్యూర్ ఓటీటీ ఒరిజినల్స్ పై కూడా ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

పేరెంట్స్‌ని చూసుకోవాల్సిందే : RDO మురళీకృష్ణ
AP : వయసైన పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పిల్లలదే అని గురజాల RDO మురళీకృష్ణ అన్నారు. పేరెంట్స్ తమ ఆస్తులను పిల్లలకు రాసిచ్చేటప్పుడే, ఓల్డేజ్‌లో తమను సరిగ్గా చూసుకోవాలనే కండిషన్‌ని కూడా డాక్యుమెంట్స్‌లో క్లియర్‌గా రాయాలని అడ్వైస్ ఇచ్చారు. డివిజన్ పరిధిలో వృద్ధులు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తుంటే డైరెక్ట్‌గా రెవెన్యూ ఆఫీస్‌కి వచ్చి గానీ, పోస్ట్ ద్వారా గానీ కంప్లయింట్ చేయొచ్చని చెప్పారు. "ముసలితనంలో పేరెంట్స్‌కి సపోర్ట్‌గా నిలవడం ప్రతి ఒక్కరి ప్రైమరీ డ్యూటీ" అని అన్నారు.

పల్లెనిద్ర... గ్రామస్తులకు వార్నింగులు...
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పల్లెనిద్రలో భాగంగా సంతకవిటి మండలం బిల్లాని గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు గ్రామస్థులతో సమావేశమై షాకింగ్ హెచ్చరికలు చేశారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి గొడవలకు పోవద్దని సూచించారు.

అమరావతిలో రోడ్స్ నెక్స్ట్ లెవెల్
AP : అమరావతి E-13 రోడ్డుని ఫుల్ వైడ్ చేయడానికి మంగళగిరి AIIMS ల్యాండ్‌లోని 3.34 ఎకరాలు వాడుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పేసింది. దీనికి రిటర్న్‌గా AIIMS హాస్పిటల్‌కి వేరే చోట 10 ఎకరాలు ఇస్తున్నారు. ఈ E-13 రోడ్డు డైరెక్ట్‌గా NH-16 నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. దీనివల్ల మంగళగిరి - గుంటూరు మధ్య ట్రాఫిక్ ఉండదు, ట్రావెల్ టైమ్ తగ్గి రాకపోకలు స్మూత్‌గా మారిపోతాయి.

ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!
PM నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ఈరోజు (ఆగస్ట్ 30) ఉ. 11 గం.కు టెలికాస్ట్ కానుంది. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఏ అంశాలపై ఫోకస్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. యూత్, హెల్త్, ఎడ్యుకేషన్, నేషన్ డెవలప్‌మెంట్, లోకల్ టాలెంట్ వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే సజెషన్స్ పంపారు. అసలు టాపిక్స్‌ను మోదీ స్పీచ్‌లోనే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్‌తో పాటు <a href="https://newsonair.gov.in/modi-to-share-thoughts-in-mann-ki-baat-broadcast-at-11-am/">AIR News,</a> <a href="https://pmonradio.nic.in/#">PMO,</a> DD News <a href="https://www.youtube.com/watch?v=MaPRwJjksZU">YouTube</a> ఛానళ్లలో లైవ్ చూడొచ్చు.

ఆ భారీ మాఫీ పై నోరు విప్పాల్సిందే... : బిఎస్పీ
ఒక వ్యక్తికి ఏకంగా 22వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిన విషయంపై మోదీ సర్కార్ ఇప్పటికైనా నోరు మెదపాలని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బిఎస్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు అనుముల తుకారం నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పేదలకు వైద్యం, విద్య కోసం నిధులు లేవని చెప్పే ప్రభుత్వం.. వేల కోట్ల వ్యవహారాలపై ఎందుకు మౌనం వహిస్తోంద''ని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో 2K రన్
TG : నాగర్‌కర్నూల్ కల్వకుర్తిలో అథ్లెటిక్స్ అసోసియేషన్ 2K రన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. లోకల్ MLA జెండా ఊపి ఈ రన్‌ని స్టార్ట్ చేశారు. స్కూల్ స్టూడెంట్స్, యూత్ చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. MLA మాట్లాడుతూ "వర్కౌట్స్, ఎక్సర్‌సైజ్‌ని మీ డైలీ లైఫ్‌లో ఒక హాబిట్‌లా మార్చుకోండి, ఫిట్‌గా ఉండటానికి ఇది చాలా ఇంపార్టెంట్" అని అన్నారు. ఈ ఈవెంట్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, మార్కెట్ చైర్‌పర్సన్ మనీలా, CI భీమ్ కుమార్, ఎక్స్ చైర్మన్ సత్యం పాల్గొన్నారు.
చదువుకోవాల్సిన వయసులో బర్ల కాపరిగా..
TG : నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామంలో స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో, ఓ చిన్నోడు చేతిలో స్టిక్ పట్టుకుని బర్రెలను మేపడానికి వెళ్తున్నాడు. బడిబాట పట్టాల్సిన ఏజ్‌లో ఇలాంటి కష్టాలు పడటం చూసి అక్కడి జనాలు చైల్డ్ లేబర్ స్టాప్ చేయడానికి గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తెచ్చినా, విలేజెస్‌లో గ్రౌండ్ రియాలిటీ మారలేదనడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు. ఇప్పటికైనా చైల్డ్ లైన్ ఆఫీసర్లు వెంటనే రెస్పాండ్ అయి, ఆ కిడ్‌కి హెల్ప్ చేసి స్కూల్‌లో జాయిన్ చేయించాలని స్థానికులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

నేటి నుంచి వర్షాల కోసం తిరుమలలో యాగం
AP: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక యాగాలు నిర్వహించనుంది. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కరీరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మహా పూర్ణాహుతితో యాగాలు ముగుస్తాయి. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి, రైతులకు మేలు జరగాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు TTD తెలిపింది.

రోడ్లు, డ్రైనేజీలకు శంఖుస్థాపన
AP : కృష్ణా జిల్లా ఉయ్యూరులో డెవలప్‌మెంట్‌పై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. టౌన్‌లోని 2, 3, 4, 5, 11 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ పనులకి మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు బెటర్ ట్రాన్స్‌పోర్ట్, క్లీన్ సరౌండింగ్స్ ఉండాలంటే రోడ్లు, డ్రైనేజీలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఉయ్యూరును అన్ని రంగాల్లో డెవలప్ చేయడమే తమ టార్గెట్ అని అన్నారు.

నాగర్‌కర్నూల్‌లో Dog అటాక్!
TG : నాగర్‌కర్నూల్ 13వ వార్డులో ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న మాజీ మున్సిపల్ వర్కర్ వంకేశ్వరం రామస్వామిపై రెండు కుక్కలు ఒక్కసారిగా ఎటాక్ చేసి కాలిపై కరిచాయి. దాంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. కుక్కలు పిచ్చిపట్టినట్లు జనాలు కనిపించగానే ఎగబడుతున్నాయని కాలనీ వాసులు టెన్షన్ పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ వెంటనే రెస్పాండ్ అయి ఆ కుక్కలను పట్టుకుని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్రీశైలం నీళ్లపై మాజీ MLA శిల్పా రవి ఫైర్!
AP : వర్షాలు లేక నంద్యాల మిట్నాల గ్రామంలోని నీటి కుంటలు, పట్టణ చెరువులు ఎండిపోయి జనాలు, పశువులు నీళ్ల కోసం తిప్పలు పడుతున్నారని మాజీ MLA శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో ఫుల్లుగా నీళ్లున్నా వదలకుండా ఏపీ, తెలంగాణ సీఎంలు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు చెప్పే మాటలకు, అక్కడ ఉన్న సిట్యుయేషన్‌కు అసలు సంబంధమే లేదని, రెండు రాష్ట్రాలకీ నీళ్లపై ఈక్వల్ రైట్స్ ఉన్నాయని గుర్తుచేస్తూ వెంటనే వాటర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

పెబుల్స్ బే అపార్ట్‌మెంట్‌లో ARP రామప్రభు విజిట్
TG : మియాపూర్ పెబుల్స్ బే అపార్ట్‌మెంట్‌కి నాయకుడు అట్టేపల్లి రామప్రభు వచ్చారు. లోకల్ పీపుల్‌తో డైరెక్ట్ మీటింగ్ పెట్టి, కరెంట్, వాటర్ లాంటి బేసిక్ ఇష్యూస్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. ప్రాబ్లెమ్స్ ఆఫీసులకే లిమిట్ కాకూడదు, గ్రౌండ్ లెవల్‌కి వచ్చి స్పాట్‌లోనే సాల్వ్ చేయడమే మా గోల్ అని చెప్పారు. ఈ ఈవెంట్‌లో అపార్ట్‌మెంట్ వాసులు, ARP టీమ్ మెంబర్స్ చాలామంది పాల్గొన్నారు.

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్.. 10 తులాల బంగారం స్వాధీనం
నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో Febలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరస్థుడు షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ (23)ను నవీపేట్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి, అతడి నుంచి 10,8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా, పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అతడిపై కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

జీతం కోసం కాదు.. జీవితం కోసం Gen Z!
జీతం ఎంత వస్తుందన్నదే ఇప్పుడు జెన్ Zకి ముఖ్యం కాదా? కొత్త తరం ఉద్యోగాల్లో డబ్బుతో పాటు తమకు ఖాళీ సమయం, ప్రశాంతమైన జీవితం, ఎదగడానికి అవకాశం కూడా కావాలని కోరుకుంటోంది. 2026 నౌక్రీ సర్వే ప్రకారం.. ఉద్యోగం ఎంచుకునేటప్పుడు జీతం తర్వాత Work-Life Balanceకే 50% మంది జెన్ Z ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, కెరీర్‌లో ఎదుగుదల కనిపించకపోవడం లాంటి కారణాలతో Job మార్చేందుకు కూడా చాలామంది వెనకాడటం లేదు. ఎక్కువ జీతం కంటే.. జీవితానికి కూడా విలువ ఇస్తున్న తరం ఇది.