Latest

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం▶
AP· 26 Jun 2026

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం

AP: నెల్లూరు బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండుగతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కోర్కెలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ప్రసిద్ధ స్వర్ణాల చెరువు ఘాట్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. AP ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదురోజుల పాటు వివిధ రకాల సంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి. పండుగ ప్రారంభమైన తొలిరోజే దాదాపు 3లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్..  క్షణాల్లో కాలిబూడిదైన దుకాణాలు
AP· 26 Jun 2026

షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లో కాలిబూడిదైన దుకాణాలు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం సమీపంలోని మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు క్షణాల్లోనే కూరగాయల మార్కెట్ అంతటా వ్యాపించి 40కి పైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. మార్కెట్లోని ఒక షాపులో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులకు చెందిన వస్తువులు, నగదు, కూరగాయల నిల్వలు అగ్నికి ఆహుతి కావడంతో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

తాడిపత్రిలో టెన్షన్.. పోలీసుల హైఅలర్ట్ !
Politics· 26 Jun 2026

తాడిపత్రిలో టెన్షన్.. పోలీసుల హైఅలర్ట్ !

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో YSRCP నేత కేశవరెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో YSRCP నాయకులు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మరోవైపు TDP నేత, మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనకు అనుమతిలేదని, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకుని ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకుంది.

భూ భారతి ఆపరేటర్లకు అందని జీతాలు
TG· 26 Jun 2026

భూ భారతి ఆపరేటర్లకు అందని జీతాలు

TG: భూ భారతి పోర్టల్‌లో పని చేస్తున్న ఆపరేటర్లకు(ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌) 15 నెలలుగా జీతాలు లేవు. జిల్లా కేంద్రంగా కలెక్టర్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిత్యం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్న ఆపరేటర్లకు జీతాలు అందకపోడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలనెలా ఇంటి ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తున్నదంటున్నారు.

బంగారం చూసినా మనసు మారలేదు
News· 26 Jun 2026

బంగారం చూసినా మనసు మారలేదు

AP: బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ ఓ వివాహం నిమిత్తం తిరుమలకు వచ్చారు. వివాహ వేడుక అనంతరం తన ఫ్యామీలితో కలిసి తిరుపతిలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేశారు. రూ.45లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచి బెంగళూరుకు వెళ్లిపోయారు. బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గరుడాద్రి హోటల్ వద్దకు వెళ్లి విచారించగా క్యాషియర్ శశి హ్యాండ్ బ్యాగ్‌ను వారికి అప్పగించారు. వివాహానికి సంబంధించిన విలువైన నగలు దొరక్కపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లమని బాధితుడు తెలిపాడు.

మత్తులో రచ్చ.. బారికేడ్లతో పట్టుకున్న పోలీసులు
Local· 26 Jun 2026

మత్తులో రచ్చ.. బారికేడ్లతో పట్టుకున్న పోలీసులు

TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మద్యంమత్తులో DCM డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. గుండాలమిట్ట ప్రాంతంలో వేగంగా వెళ్తున్న DCM బొగ్గులారీని, అనంతరం ఓ హోంగార్డుకు చెందిన కారును ఢీకొట్టింది. డీసీఎం ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంతో వెళ్లాడు. డీసీఎం డోర్ భాగాలు, ఇనుప కడ్డీలు కింద వేలాడుతూ ఉండగా రమణమ్మ అనే మహిళకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ తప్పించుకున్నాడు. నేరేడుచర్ల పోలీసులు బైపాస్ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటచేసి అడ్డుకున్నారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

చిన్నారి మిస్సింగ్ కేసు.. వీడిన కుక్క మృతి మిస్టరీ
AP· 26 Jun 2026

చిన్నారి మిస్సింగ్ కేసు.. వీడిన కుక్క మృతి మిస్టరీ

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క మృతిపై సస్పెన్స్ వీడింది. పెంపుడు కుక్క ఎలాంటి విష ప్రయోగానికి గురికాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసులో కుక్కను ఎవరైనా కావాలనే చంపేసి ఉంటారనే కోణంలో సాగిన అనుమానాలకు బ్రేక్ పడింది. మిస్సైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.

డ్యూటీలో ఉండగానే కుప్పకూలిన ఫైర్ ఆఫీసర్
Local· 26 Jun 2026

డ్యూటీలో ఉండగానే కుప్పకూలిన ఫైర్ ఆఫీసర్

TG: ​ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న MD షఫీ విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన ఇచ్చోడలో డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిబద్ధతతో పనిచేసే అధికారి విధుల్లో ఉండగానే ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల తోటి అగ్నిమాపక సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

గోల్డ్‌మెన్ సూర్యభాయ్ అరెస్టు
Crime· 26 Jun 2026

గోల్డ్‌మెన్ సూర్యభాయ్ అరెస్టు

TG: తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో గోల్డ్‌మెన్ సూర్యభాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. CM రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు తాను అత్యంత సన్నిహితుడినని నమ్మించి, విదేశీ బంగారం పేరిట లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సూర్యకుమార్ ఒంటి నిండా కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ గోల్డ్‌మెన్ సూర్యభాయ్‌గా సోషల్ మీడియా, TV ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

త్రి ఇడియట్స్ కి సీక్వెల్  వస్తోందా?
Cinema· 26 Jun 2026

త్రి ఇడియట్స్ కి సీక్వెల్ వస్తోందా?

బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘3 ఇడియట్స్’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. తాజాగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్ర సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆ ముగ్గురు మిత్రుల (ఆమిర్, మాధవన్, శర్మన్ జోషి) పాత్రలు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాయనే కోణంలో కథను డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సరైన కథ కుదిరితేనే ఈ సీక్వెల్ పట్టాలెక్కుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. సో త్రీ ఇడియట్స్ సీక్వెల్ రెడీ అవుతోందన్నమాట

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
Crime· 26 Jun 2026

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్ గచ్చిబౌలి AMB మాల్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్‌ను, హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న స్కూటీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. స్కూటీ నడిపిన శ్రీకాంత్, వెనుక కూర్చున్న విఠల్ ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

టిఫిన్ తింటుండగా ఊహించని షాక్
Local· 26 Jun 2026

టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

TG: వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన బేతి రాజు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వడ పార్సల్‌ తీసుకుని ఇంటికి వెళ్లాడు. వడ తినబోతుండగ బల్లి కనిపించింది. షాక్‌కు గురైన రాజు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. హోటల్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పగా.. హోటల్‌ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడినట్లు తెలిపాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌనిక సారథ్యంలో కాశీబుగ్గలోని సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌లో నిర్వహణ సరిగా లేకపోవడం, సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. రూ.10వేల జరిమానా విధించి, హోటల్‌ను సీజ్‌ చేశారు.

రూ.2 కోట్ల ఎర్రచందనం డంప్ గుట్టురట్టు
Crime· 26 Jun 2026

రూ.2 కోట్ల ఎర్రచందనం డంప్ గుట్టురట్టు

AP: అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌పై చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి జయరాం సహా ముగ్గురిని అరెస్టు చేశారు. జయరాం ఇంటి సమీపంలో నిల్వ చేసిన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన ఒక కారును సీజ్ చేశారు. శేషాచలం అడవుల్లో కూలీల ద్వారా చెట్లను నరికించి, వాటిని అనంతపురంలో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

మొహరం ఉత్సవంలో అపశృతి▶
Local· 26 Jun 2026

మొహరం ఉత్సవంలో అపశృతి

TG: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నిర్వహించిన మొహరం ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సవారి బంగ్లా ప్రారంభోత్సవం సందర్భంగా టపాసులు కాల్చడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు సవారిపై ఉన్న కాగితపు పూలకు తాకి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పీర్లను కిందపడేసి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సవారిపై ఉన్న వస్త్రాలు దగ్ధమయ్యాయి.

పేదలకు ఇకపై  ఒక్కొక్కరికి 7 కేజీల రేషన్?
India· 26 Jun 2026

పేదలకు ఇకపై ఒక్కొక్కరికి 7 కేజీల రేషన్?

కేంద్ర ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ విషయంలో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. అంత్యోదయ అన్న యోజన (AAY) పథకం కింద లబ్ధిదారులకు ఇకపై ప్రతి వ్యక్తికీ 7 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఒక కుటుంబానికి గరిష్టంగా 35 కిలోల వరకు రేషన్ లభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత పేద కుటుంబాలకు మరింత సమర్థవంతంగా పౌరసరఫరాల ప్రయోజనాలను చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.

మాచర్ల సమీపంలో ఘోర రోడ్ యాక్సిడెంట్
Crime· 26 Jun 2026

మాచర్ల సమీపంలో ఘోర రోడ్ యాక్సిడెంట్

AP: పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి పామురు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ACB దాడులు.. కోట్ల ఆస్తుల గుట్టురట్టు !
Crime· 26 Jun 2026

ACB దాడులు.. కోట్ల ఆస్తుల గుట్టురట్టు !

TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత ఇంట్లో ACB అధికారులు రైడ్స్ చేశారు. ఏక కాలంలో ఆమె నివాసంతోపాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మూడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదును గుర్తించినట్టు ACB సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధుశర్మ పేర్కొన్నారు. సోదాల్లో పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

కమర్షియల్ ఎల్‌పీజీ పై ఆంక్షల ఎత్తివేత !
News· 26 Jun 2026

కమర్షియల్ ఎల్‌పీజీ పై ఆంక్షల ఎత్తివేత !

ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం! పశ్చిమాసియా (Middle East) సంక్షోభం క్రమంగా సర్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, ఇంధన సరఫరాపై ఒత్తిడి తగ్గింది. ఈ నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపార సముదాయాలకు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.గత కొన్ని రోజులుగా ఇంధన కొరత భయాలతో విధించిన పరిమితులను ఎత్తివేయడంతో, వ్యాపార రంగంలో గ్యాస్ కొరత సమస్య తీరనుంది.

ఆకాశ మార్గంలో మెడిసిన్ డెలివరీ
AP· 26 Jun 2026

ఆకాశ మార్గంలో మెడిసిన్ డెలివరీ

AP: ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా ఆర్డర్‌ చేసిన మందులు ఆకాశ మార్గాన వేగంగా ఇంటికి డెలివరీ చేయనున్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మధ్య తేలికపాటి హెల్త్‌కేర్‌, కమర్షియల్‌ సరుకులు రవాణా చేసేందుకు వీలుగా బెంగళూరుకు చెందిన ఏరో స్పేస్‌ కంపెనీ ఎయిర్‌బౌండ్‌తో రాష్ట్ర డ్రోన్‌ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రోజుకు 10,000 డ్రోన్ల ద్వారా అమరావతి ప్రాంతంలో హెల్త్‌ కేర్‌, తేలికపాటి వాణిజ్య సరుకులను డెలివరీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్‌ డెలివరీ నెట్‌వర్క్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో BRS శకం ముగిసింది: TPCC ఛీప్
Politics· 26 Jun 2026

తెలంగాణలో BRS శకం ముగిసింది: TPCC ఛీప్

తెలంగాణలో BRS శకం ముగిసిందని.. వంద సీట్లతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ లంబాడీలకు ST రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న 'ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర'ను ఆయన HYD గాంధీభవన్‌లో జెండాఊపి ప్రారంభించారు. పేదల గుండెల్లో ఇందిరాగాంధీ చిరస్మరణీయంగా నిలిచిపోయారని, SC, ST, BC, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుందని పేర్కొన్నారు.

ప్రతిరోజూ గంట అదనంగా పనిచేయాలి: CM రేవంత్
TG· 26 Jun 2026

ప్రతిరోజూ గంట అదనంగా పనిచేయాలి: CM రేవంత్

TG: రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగులకు ఉచితంగా రూ. కోటి ప్రమాద బీమా కల్పించేందుకు 16 బ్యాంకులతో MOU కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించి వసూలు చేసే బాధ్యత మీదే అని CM పిలుపునిచ్చారు. 'ఉద్యోగులుగా మీరేం అడుగుతారో నాకు తెలుసు.. కొత్త PRCని అమలు చేస్తామని మేం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు.