Latest

భారీగా పెరిగిన యాపిల్ ఐ ప్యాడ్లు, మ్యాక్ బుక్ ల రేట్లు
Technology· 26 Jun 2026

భారీగా పెరిగిన యాపిల్ ఐ ప్యాడ్లు, మ్యాక్ బుక్ ల రేట్లు

యాపిల్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ చిప్‌ల కొరత భారాన్ని మోయలేక యాపిల్ సంస్థ తన మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) మోడళ్ల ధరలను భారత్‌లో భారీగా పెంచేసింది. మోడల్‌ను బట్టి ధరలు రూ. 10,000 నుండి ఏకంగా రూ. 1,00,000 వరకు పెరిగాయి.

భారీగా పెరిగిన యాపిల్ ఐ ప్యాడ్లు, మ్యాక్ బుక్ ల రేట్లు
Technology· 25 Jun 2026

భారీగా పెరిగిన యాపిల్ ఐ ప్యాడ్లు, మ్యాక్ బుక్ ల రేట్లు

యాపిల్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ చిప్‌ల కొరత భారాన్ని మోయలేక యాపిల్ సంస్థ తన మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) మోడళ్ల ధరలను భారత్‌లో భారీగా పెంచేసింది. మోడల్‌ను బట్టి ధరలు రూ. 10,000 నుండి ఏకంగా రూ. 1,00,000 వరకు పెరిగాయి.

కమర్షియల్ ఎల్‌పీజీ పై ఆంక్షల ఎత్తివేత !
News· 25 Jun 2026

కమర్షియల్ ఎల్‌పీజీ పై ఆంక్షల ఎత్తివేత !

ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం! పశ్చిమాసియా (Middle East) సంక్షోభం క్రమంగా సర్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, ఇంధన సరఫరాపై ఒత్తిడి తగ్గింది. ఈ నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపార సముదాయాలకు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.గత కొన్ని రోజులుగా ఇంధన కొరత భయాలతో విధించిన పరిమితులను ఎత్తివేయడంతో, వ్యాపార రంగంలో గ్యాస్ కొరత సమస్య తీరనుంది.

యూపీలో బానిస కార్మికులుగా ఉన్న 12 మందికి విముక్తి
News· 25 Jun 2026

యూపీలో బానిస కార్మికులుగా ఉన్న 12 మందికి విముక్తి

ఉత్తరప్రదేశ్‌లోని ఒక డిస్పోజబుల్ ప్లేట్ల ఫ్యాక్టరీలో 12 మందిని బానిస కార్మికులుగా బంధించి పని చేయించారని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో వారిని తీసుకెళ్లి, ఫోన్లు లాక్కొని, నెలల తరబడి బలవంతంగా పని చేయించారని చెప్పారు. జీతం అడిగినా, బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు.

క్రికెట్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ స్పెషల్ డే ఈరోజు !
Sports· 25 Jun 2026

క్రికెట్ ఫ్యాన్స్ కి వెరీ వెరీ స్పెషల్ డే ఈరోజు !

క్రికెట్ లవర్స్ కి చరిత్రలో ఎమోషనల్ డే ఈ రోజు.. గుర్తుందా ? 43 ఏళ్ల క్రితం హర్యానా హరికేన్ కపిల్ దేవ్ సారధ్యంలో ఫస్ట్ టైమ్ ఇండియా వాల్డ్ కప్ గెలిచింది. నిజంగా అది హిస్టారికల్ విన్.. లండన్ లార్డ్స్ గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్ మనకి, వెస్ట్ ఇండీస్ కి జరిగింది. ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ వాల్డ్ కప్ మనకి వెరీ వెరీ స్పెషల్.. అప్పట్లో వెస్టిండీస్ చాలా బలమైన టీమ్.. అలాంటి టీమ్ మీద గెలవడం నిజంగా ఛాలెంజింగ్ టాస్క్.

అధికారుల అండతోనే బుక్ బిజినెస్: TGVP
TG· 25 Jun 2026

అధికారుల అండతోనే బుక్ బిజినెస్: TGVP

TG: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్‌లో కొనసాగుతున్న పుస్తకాల వ్యాపారంపై తెలంగాణ విద్యార్థి పరిషత్(TGVP) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు అండదండలు ఉన్నాయని, వారి పోద్బలంతో ఇష్టరాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని TGVP నాయకులు మీసాల నగేష్ ఆరోపించారు. బోధన్ MEO నాగయ్యను తాము కలిసి సమస్యను విన్నవిస్తే పుస్తకాల విక్రయాలను అడ్డుకునే అధికారం తమకులేదని సమాధానం చెప్పారన్నారు. DEO అశోక్‌ను తాము ఫోన్‌లో సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకపోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.

నరసింహ, రాఘవన్ మిక్స్‌తో రజినీ కొత్త సినిమా!
Cinema· 25 Jun 2026

నరసింహ, రాఘవన్ మిక్స్‌తో రజినీ కొత్త సినిమా!

తలైవా రజినీకాంత్ తదుపరి చిత్రం మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో కూడిన ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ చిత్రాలైన ‘నరసింహ’ (మాస్ అండ్ స్టైల్), ‘రాఘవన్’ (ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్) కలయికగా ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. "రజినీకాంత్ మార్క్ అదిరిపోయే మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు సీటు అంచున కూర్చోబెట్టే సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది.

పెద్దిలో రాం చరణ్ గాయంపై చిరు ఎమోషనల్
Politics· 25 Jun 2026

పెద్దిలో రాం చరణ్ గాయంపై చిరు ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌పై ఫైట్ సీక్వెన్స్ చేస్తూ కంటికి గాయం చేసుకున్న రోజంతా మెగాస్టార్ చిరంజీవి నరకం చూశారట! షూటింగ్ స్పాట్ నుండి వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ మెగా ఫ్యామిలీని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. "నాకు ఆ ఫోటో చూడగానే గుండె ఆగినంత పనైంది. చరణ్ కంటి చూపుకు ఏం కాలేదని డాక్టర్లు చెప్పే వరకు ఊపిరి పీల్చుకోలేదు" అని చిరు నాటి భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో ‘గూండా’ సినిమా కోసం ఇలాగే ప్రాణాలకు తెగించి డూప్ లేకుండా హై-రిస్క్ స్టంట్స్ చేసిన రోజులను ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చరణ్ డెడికేషన్‌ను చూసి గర్వపడు తున్నానన్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏమిటో తెలుసా?
Health· 25 Jun 2026

ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏమిటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా జనాలు అత్యధికంగా తినే పండు ఏంటో తెలుసా? ఇంకేముంది మన 'అరటిపండు' (Banana)! తక్కువ ధర, ఇయర్ మొత్తం దొరకడం, ఇంకా ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల దీనికి వరల్డ్‌లోనే విపరీతమైన డిమాండ్ ఉంది. బాడీలో బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సూపర్ గా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే ఈ అరటిపండ్ల ప్రొడక్షన్‌లో మన ఇండియానే ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మన తర్వాత చైనా, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. సో, రోజుకో బనానా తినేసి హెల్తీగా ఉండండి.

SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు
Local· 25 Jun 2026

SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గురువారం దళిత నిరుద్యోగ యువత రిలే నిరాహార దీక్షకు దిగారు. పారదర్శకత లేకపోవడం, అనర్హులకు రాజకీయ సిఫార్సులతో కేటాయింపులు చేయడం వంటి కారణాల వల్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న SC కాంప్లెక్స్‌లోని 34 దుకాణాలను అర్హులైన పేద దళితులకు ఇవ్వడంలో మొండిచేయి చూపారని, నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిందని వారు ఫైరయ్యారు.

అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గుడివాడ
Politics· 25 Jun 2026

అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గుడివాడ

AP: విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో CM చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన సీఎం మరొకరు లేరని ఫైరయ్యారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక CI చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సాయికృష్ణ హత్య ప్రభుత్వ హత్య. ఇది ఒక CI చేసిన హత్య కాదు. DGP, DG, ACP అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావు, CBIతో విచారణ జరగాలన్నారు.

ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ
Crime· 25 Jun 2026

ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ

TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ATM క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న సంతోష్‌నగర్ SBI ATMలో కస్టోడియన్లు, గన్‌మెన్ నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17లక్షలు ఉన్న బ్యాగ్‌తో పరారయ్యాడు. డ్రైవర్ శ్రీనివాస్ కనిపించకపోవడం, బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బైక్‌పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్ధారించారు.

అవును నేను గుంపు మేస్త్రీనే: రేవంత్ రెడ్డి
TG· 25 Jun 2026

అవును నేను గుంపు మేస్త్రీనే: రేవంత్ రెడ్డి

TG: నేను గుంపు మేస్త్రీనే.. అలా అన్నందుకు చాలా మంది నన్ను అవహేళన చేశారని CM రేవంత్ రెడ్డి అన్నారు. గుంపుమేస్త్రీ అని అందరూ హేళన చేసినా నేను బాధపడను, ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పనిచేస్తుంటారన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి 14బ్యాంకులతో ప్రభుత్వం MOUలు కుదుర్చుకుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సమావేశంలో CM పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వచ్చిందంటే.. అది ఉద్యోగుల వల్లేనని విశ్వసిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో భూ కంపాలపై ముందే అలర్ట్ లు !
Technology· 25 Jun 2026

ఆండ్రాయిడ్ ఫోన్లలో భూ కంపాలపై ముందే అలర్ట్ లు !

ఒక్క మోడ్రన్ సెల్ ఫోన్ ఉంటే చాలు భూ కంపం గురించి ముందే ఎలర్ట్ పొందచ్చు.. వెనిజులాలో జరిగిందిదే.. భూకంపంరాడానికి కొన్ని సెకన్ల ముందు అక్కడి స్మార్ట్ ఆండ్రాయిడ్ మోడ్రన్ ఫోన్స్ అన్నింటికీ గూగుల్ అలర్ట్ ఇచ్చింది.స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ‘యాక్సిల రోమీటర్’ సెన్సార్ల ద్వారా భూకంప ప్రాథమిక తరంగాలను ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ పసిగట్టింది. ప్రకంపనలు తీవ్రంగా మారకముందే గూగుల్ అక్కడి ప్రజలకు ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు పంపింది. టెక్నాలజీతో విపత్తులను ముందే ఊహించి ప్రాణాలు కాపాడు కోవచ్చు. మరి మీ ఫోన్ లో ఈ టెక్నాలజీ ఉందా? జస్ట్ చెక్ ఇట్ .

అసెంబ్లీలో అడుగు పెట్టడానికి స్టాలిన్ స్ట్రాటజీ !
Politics· 25 Jun 2026

అసెంబ్లీలో అడుగు పెట్టడానికి స్టాలిన్ స్ట్రాటజీ !

తమిళనాడు అసెంబ్లీలో నటుడు, రాజకీయ నేత విజయ్ చేసిన విమర్శల తర్వాత, డీఎంకే (DMK) అధినేత స్టాలిన్ మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2026 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో స్టాలిన్ ఊహించని ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో, ఒక ఉపఎన్నిక (Bypoll) ద్వారా తిరిగి సభలోకి ప్రవేశించి రాజకీయంగా పుంజుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వెనిజులాలో వరుస భూ కంపాలు- 164 మంది మృతి!
News· 25 Jun 2026

వెనిజులాలో వరుస భూ కంపాలు- 164 మంది మృతి!

వెనిజులాను వెంట వెంటనే కొన్ని సెకన్ల పాటు కుదిపేసిన రెండు భూ కంపాలు ఆ ప్రాంతాన్ని స్మశానం గా మార్చేశాయి. ముఖ్యంగా తీర ప్రాంతమైన లాగువైరా ఇప్పుడు శవాల కుప్పగా మారిపోయింది. ఎటుచూసినా కుప్పకూలిన భవనాలే. టాప్ హోటల్స్ సైతం నేల కూలాయి. మకుటో ఏరియాలో టాప్ హోటెల్, టూరిస్టులకు పరిచయమైన హోటల్ అడ్వర్ట్ నామ రూపాలు లేకుండా ధ్వంసమైంది.కేవలం హోటల్ బేస్ మెంట్ మాత్రం మిగిలింది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు.. ఇప్పటి వరకూ 164 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. భూకంపం రావొచ్చని ముందే గూగుల్ అలర్ట్ చేసింది.

ఎయిర్ టాక్సీలకు హెల్త్ సెక్టర్ టాప్ ప్రియారిటీ !
Technology· 25 Jun 2026

ఎయిర్ టాక్సీలకు హెల్త్ సెక్టర్ టాప్ ప్రియారిటీ !

దేశంలో ఎయిర్ ట్యాక్సీ (eVTOL) కంపెనీలు తమ సేవలను ప్రారంభించడానికి 'హెల్త్‌కేర్' రంగాన్ని మెయిన్ లాంచ్ పాడ్‌గా ఎంచుకుంటున్నాయి. అత్యవసర వైద్య సేవలు, ఎయిర్ అంబులెన్స్, అవయవాల రవాణా వేగవంతం చేయడం కోసం పలు ప్రముఖ ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్లతో ఇవి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కాబట్టి కమర్షియల్ ప్రయాణాల కంటే ముందే, హెల్త్ కేర్ రంగంలో ఈ ఎయిర్ ట్యాక్సీలు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.

విజయ్- త్రిష రిలేషన్ పై విపక్షాల సెటైర్లు
Politics· 25 Jun 2026

విజయ్- త్రిష రిలేషన్ పై విపక్షాల సెటైర్లు

తమిళనాడు సీఎం విజయ్ పై ప్రతిపక్షాల పర్సనల్ అటాక్స్ ఆగడం లేదు. విజయ్ బర్త్ డేకు త్రిష మెసేజ్ పోస్ట్ చేసిన ఫోటో షేర్ చేయడంపై విపక్షాలు గ్యాస్ లీకై మనుషులు చనిపోతే బర్త్ డే ఫంక్షన్లా అంటూ విమర్శిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా శివగంగై జిల్లా కారైకుడి కార్పొరేషన్ సమావేశంలో ఒక స్వతంత్ర మహిళా కౌన్సిలర్ మరింత రచ్చ లేపింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి, గొడవలు జరగకుండా ఉండడానికి త్రిషనే కారణమని... కాబట్టి ప్రభుత్వ కార్యాలయంలో మిగతా నాయకులతో పాటు త్రిష ఫోటో (portrait) కూడా పెట్టాలి అని డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆస్తమా మందుతో కేన్సర్ క్యూర్- సైంటిస్టుల  రిసెర్చ్ సక్సెస్
News· 25 Jun 2026

ఆస్తమా మందుతో కేన్సర్ క్యూర్- సైంటిస్టుల రిసెర్చ్ సక్సెస్

ఆస్తమా నివారణకు వాడే ఒక చౌకైన టాబ్లెట్, క్యాన్సర్ కణాల ‘అదృశ్య ముసుగు’ను (ఇన్విజిబిలిటీ క్లోక్) తొలగించగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కణితులు (Tumours) తమను తాము కాపాడుకోవడానికి ఉపయోగించే 'CysLTR1' అనే మాలిక్యులర్ మార్గాన్ని 'సింగులేర్' (Singulair) వంటి ఆస్తమా మందులు అడ్డుకుంటున్నట్లు ప్రయోగాల్లో తేలింది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి, దాడి చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవానికి దారితీయవచ్చు.

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
Education· 25 Jun 2026

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!

తెలంగాణ విద్యాశాఖ టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఈ నెల 5 నుండి 12వ తేదీ వరకు జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు స్టేట్ వైడ్ చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ bse.telangana.gov.in లో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్‌తో పాటు డిజిటల్ మార్క్స్ మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాసైన స్టూడెంట్స్ ఇక వెంటనే ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు.

ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్!
Technology· 25 Jun 2026

ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్!

UIDAI ఆధార్ కార్డ్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. నెక్స్ట్ మంత్ 1 నుండి డిసెంబర్ 31 వరకు (6 నెలల పాటు) ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఫీజు ఉండదని అనౌన్స్ చేసింది. మామూలుగా దీనికోసం రూ.75 ఫీజు వసూలు చేస్తారు, కానీ ఈ 6 నెలలు అది ఫ్రీ! ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసుకుంటే అప్‌డేట్స్ అన్నీ ఇన్స్టంట్‌గా వస్తాయని UIDAI చెప్పింది. అయితే, ఈ ఉచిత సేవ కేవలం మొబైల్ యాప్ ద్వారా చేసుకునే వాళ్ళకే వర్తిస్తుంది, గుర్తుంచుకోండి.