రూ.2 కోట్ల ఎర్రచందనం డంప్ గుట్టురట్టు

AP: అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌పై చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి జయరాం సహా ముగ్గురిని అరెస్టు చేశారు. జయరాం ఇంటి సమీపంలో నిల్వ చేసిన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన ఒక కారును సీజ్ చేశారు. శేషాచలం అడవుల్లో కూలీల ద్వారా చెట్లను నరికించి, వాటిని అనంతపురంలో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.



