Latest

సముద్రాల రక్షణకోసం- బ్రిగింగ్ బ్యాక్ ద బ్లూ
World· 26 Jun 2026

సముద్రాల రక్షణకోసం- బ్రిగింగ్ బ్యాక్ ద బ్లూ

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల దెబ్బతింటున్న సముద్ర పర్యావరణాన్ని (Marine Ecosystem) కాపాడుకునేందుకు అంతర్జాతీయంగా ‘బ్రింగింగ్ బ్యాక్ ద బ్లూ’ అనే ప్రత్యేక ఉద్యమం ఊపందుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడం, అంతరించిపోతున్న సముద్ర జీవులను రక్షించడం మరియు బ్లూ ఎకానమీని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. సముద్రాల సహజత్వాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి.

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ  ప్రత్యేక ప్రతినిధిగా నిర్మాత
Politics· 26 Jun 2026

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నిర్మాత

'కేవీఎన్ ప్రొడక్షన్స్' అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ కె. నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సీఎం విజయ్ సర్కార్ నియమించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ను కేవీఎన్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు. గతంలో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓగా పనిచేసిన వెంకట్, చార్టర్డ్ అకౌంటెంట్‌గాను మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ నియామకంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈ బామ్మ గారి దేశ భక్తికి హేట్సాఫ్ !▶
Motivational· 26 Jun 2026

ఈ బామ్మ గారి దేశ భక్తికి హేట్సాఫ్ !

బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ మాతృభూమిపై ప్రేమతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ తీసుకున్న ఆమె ఇప్పుడు తన శేషజీవితాన్ని పుట్టిన గడ్డపైనే గడపాలని నిర్ణయించుకున్నారు. 'నా చివరి శ్వాస ఇక్కడే విడవాలి. అంత్యక్రియలు సొంత ఊర్లోనే జరగాలి' అంటూ తనకు త్వరగా భారత పౌరసత్వం ఇవ్వాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఈ వృద్ధురాలి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

త్రిష రూ.3 కోట్ల నెక్లెస్.. వైరల్ అవుతున్న లుక్!
Cinema· 26 Jun 2026

త్రిష రూ.3 కోట్ల నెక్లెస్.. వైరల్ అవుతున్న లుక్!

నటి త్రిష తాజాగా ఓ ఈవెంట్‌లో ధరించిన డైమండ్ నెక్లెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రముఖ డిజైనర్ బ్రాండ్‌కు చెందిన ఈ నెక్లెస్‌తో త్రిష ఎంతో రాయల్ లుక్‌లో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మొదటి  టీ -20లోనే భారత్  ఓటమి !
Sports· 26 Jun 2026

మొదటి టీ -20లోనే భారత్ ఓటమి !

క్రికెట్ అభిమానులకు ఇదొక ఊహించని షాక్! నేడు (జూన్ 26, 2026) బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కి దిగిన ఐర్లాండ్ 20ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ 18 ఓవర్లకే 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 20 బంతుల్లో 50 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఒక్కరే లీడింగ్ లో నిలిచారు.

టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్
Crime· 26 Jun 2026

టూర్ పేరుతో గంజాయి స్మగ్లింగ్.. స్టూడెంట్స్ అరెస్ట్

TG: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఐదుగురు యువకులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ , బీ ఫార్మసీ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదుగురు స్నేహితులు పర్యాటకం మాటున వెళుతూ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద 16కిలోల గంజాయి డ్రైపొడిని పట్టుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం నుంచి తెలంగాణలోని కోదాడకు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అస్వక్, మహమ్మద్ హఫీజ్‌ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజుగా గుర్తించారు.

తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదు
Politics· 26 Jun 2026

తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికింది. కానీ ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే తులం బంగారం కాదు కదా.. కనీసం తులం ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైరయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన BRS నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. BRS కార్యకర్తలు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

వేటకొడవళ్లతో RTC డ్రైవర్‌పై అటాక్
Crime· 26 Jun 2026

వేటకొడవళ్లతో RTC డ్రైవర్‌పై అటాక్

AP: అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో RTC డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వరదాయపల్లె విలేజ్‌కు చెందిన వెంకటనారాయణ రోజూ మాదిరిగానే శుక్రవారం డ్యూటీకి వెళ్లాడు. పెద్దపప్పూరులో బస్సు ఎక్కిన దుండగులు డ్రైవర్‌పై ఒక్కసారిగా వేటకొడవళ్లతో విచక్షరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ వెంకటనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆయన్ను అనంతపురం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా!
News· 26 Jun 2026

రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా!

అయోధ్య రామాలయ నిర్మాణ నిధుల దుర్వినియోగం వివాదంలో రామ్ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా తన పదవిని వీడారు. గత కొంతకాలంగా ఆలయ నిధుల సేకరణ, భూముల కొనుగోలు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా పెద్ద దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ ప్రతిష్ఠ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వీరిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ AI బుడతడి కి  ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ లో ఆఫీస్
Politics· 26 Jun 2026

ఈ AI బుడతడి కి ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ లో ఆఫీస్

వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ ఆలోచనలు మాత్రం ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ అంత ఎత్తులో ఉన్నాయి. ఆ అబ్బాయే జైనమ్ జైన్. ఈ తరం జనరేషన్‌కు ఆదర్శంగా నిలుస్తూ, ఇంత చిన్న వయసులోనే ఒక సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్‌ ను స్థాపించాడు. అంతేకాదు, దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా భవనంలో తన కంపెనీ కోసం ఒక సొంత ఆఫీస్‌ను కూడా పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 6 ఏళ్ల వయసు నుంచే బిజినెస్ మెళకువలు, టెక్నాలజీపై పట్టు సాధించిన జైనమ్.. పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ 'వండర్ కిడ్' సాధించిన విజయం ఇప్పుడు గ్లోబల్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్.

ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవాళ్లు ప్రిగ్నెంట్ అయితే !
Health· 26 Jun 2026

ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవాళ్లు ప్రిగ్నెంట్ అయితే !

మయోసైటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాధి తీవ్రత కనీసం 6 నెలల పాటు అదుపులో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. గర్భం దాల్చడానికి ముందే రుమటాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించి, వాడుతున్న మందుల్లో పిండానికి హాని చేయని మార్పులు చేయించుకోవాలి. ఇలాంటి కేసులను 'హై-రిస్క్'గా పరిగణిస్తారు కాబట్టి, క్రమం తప్పకుండా చెకప్స్ చేయించు కుంటూ, బీపీ మరియు శిశువు ఎదుగుదలను నిరంతరం చెక్ చేయించుకోవాలి.

మయోసైటిస్‌ను జయించి.. తల్లవుతున్న సమంత!
Cinema· 26 Jun 2026

మయోసైటిస్‌ను జయించి.. తల్లవుతున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే తల్లి కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఆమె 'మయోసైటిస్' అనే తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ కష్ట కాలం నుండి కోలుకుని, ఇప్పుడు ఆమె గర్భం దాల్చడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మయోసైటిస్ వంటి కండరాల బలహీనతను కలిగించే వ్యాధి ఉన్నప్పటికీ.. సరైన చికిత్స, పట్టుదలతో సమంత హెల్తీ ప్రెగ్నెన్సీ వైపు అడుగులు వేయడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కింగ్ చార్లెస్ గుడ్‌బై!
World· 26 Jun 2026

బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కింగ్ చార్లెస్ గుడ్‌బై!

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏకంగా £12.9 మిలియన్ల (సుమారు రూ. 140 కోట్లకు పైగా) ఆదాయపు పన్ను చెల్లించినట్లు రాయల్ అకౌంట్స్ అధికారికంగా వెల్లడించాయి. మరోవైపు, కింగ్ చార్లెస్ , రాణి కెమిల్లా దంపతులు లండన్‌లోని ప్రసిద్ధ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నివసించకూడదని నిర్ణయించు కున్నట్లు రాయల్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో భారీ ఎత్తున మరమ్మతులు (రినోవేషన్స్) జరుగుతున్నాయి. పనులు పూర్తయినప్పటికీ, వారు అక్కడికి మారే ఉద్దేశంలో లేరని, ప్రస్తుతం నివసిస్తున్న'క్లారెన్స్ హౌస్' (Clarence House) లోనే శాశ్వతంగా ఉండబోతున్నారని సమాచారం.

డ్రగ్స్ వ్యతిరేక మారథాన్ లో సీఎం విజయ్ !
Politics· 26 Jun 2026

డ్రగ్స్ వ్యతిరేక మారథాన్ లో సీఎం విజయ్ !

తమిళనాడు ముఖ్యమంత్రి, 'జననాయగన్' విజయ్ తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యప రిచారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం (ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్) సందర్భంగా చెన్నైలో నిర్వహించిన 'స్టార్ట్ రన్, స్టాప్ డ్రగ్స్' మారథాన్‌ను ఆయన ప్రారంభించారు. కేవలం జెండా ఊపి ఊరుకోకుండా, 53 ఏళ్ల వయసులోనూ విజయ్ స్వయంగా రంగంలోకి దిగి 6 కిలోమీటర్ల దూరం పూర్తిగా పరిగెత్తారు. మంత్రులు, వేలాది మంది వాలంటీర్లతో కలిసి సీఎం స్వయంగా మారథాన్‌లో పాల్గొనడంతో ఈ యాంటీ-డ్రగ్స్ అవగాహన కార్యక్రమం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

'ఆపరేషన్ సింధూర్' అమరవీరుల పేర్లు విడుదల!
News· 26 Jun 2026

'ఆపరేషన్ సింధూర్' అమరవీరుల పేర్లు విడుదల!

'ఆపరేషన్ సింధూర్' పోరాటంలో మరణించిన ఆరుగురు భారత సైనికుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా తొలిసారి విడుదల చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీర జవాన్ల పేర్లను దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) వద్ద శిలాఫలకాలపై శాశ్వతంగా లిఖించనున్నారు. అమరులైన ఆ హీరోలు ఎవరంటే -గన్‌మ్యాన్ దేవేంద్ర సింగ్ , నాయక్ సుఖ్విందర్ సింగ్, లాన్స్ నాయక్ గురుతేజ్ సింగ్, సిపాయి హర్‌ప్రీత్ సింగ్, రైఫిల్‌మ్యాన్ కుల్దీప్ సింగ్,సిపాయి మన్‌ప్రీత్ సింగ్. వారి త్యాగాన్ని స్మరిస్తూస్మరిస్తూ దేశం మొత్తం వారికి ఘన నివాళులు అర్పిస్తోంది.

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు
TG· 26 Jun 2026

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణా రావు పదవీ కాలం ముగిశాక ఈ నియామకం అమల్లోకి వస్తుంది. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు ఇప్పటి వరకూ కేంద్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా 15 ఏళ్లకు పైగానే డెప్యుటేషన్ లో ఉన్నారు. వచ్చేది ఎన్నికల టైమ్ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పథకాల అమలు, ప్రచారం ముఖ్సం కాబట్జటి సంజయ్ జాజు నే ఎంపిక చేసింది.

భారీ బడ్జెట్  మూవీలన్నీ రెండు భాగాలేనా?
Cinema· 26 Jun 2026

భారీ బడ్జెట్ మూవీలన్నీ రెండు భాగాలేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. మొదట ఈ సినిమాను ఒకే భాగంగా అనుకున్నప్పటికీ, కథా పరిధి పెద్దది కావడంతో దీన్ని కూడా రెండు భాగాలుగా తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇటీవలే తారక్ సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేశారట. ఈ భారీ ప్రాజెక్ట్‌లో అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ రెండు భా గాలుగా వస్తే అభిమానులకు పండగే!

రాజమౌళి 'వారణాసి' రెండు భాగాలుగా?
Cinema· 26 Jun 2026

రాజమౌళి 'వారణాసి' రెండు భాగాలుగా?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే తదుపరి చిత్రం 'వారణాసి' రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో, అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో వచ్చిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాల తరహాలోనే ఈ భారీ కథను కూడా రెండు భాగాలుగా చూపించేలా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ఒకే భాగం (స్టాండ్‌అలోన్) చిత్రమని స్పష్టం చేశారు. మరి తాజా ప్రచారంలో ఎంతవరకు నిజముందో .

ప్రియాంక చోప్రా 'హాలీవుడ్' జర్నీ!
Cinema· 26 Jun 2026

ప్రియాంక చోప్రా 'హాలీవుడ్' జర్నీ!

బాలీవుడ్‌ను ఏలిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ తాను ఇంకా "బిగినింగ్ స్టేజ్" లోనే ఉన్నానని, ఆశించిన స్థాయిలో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్లు దక్కలేదని ఓపెన్ అయింది. హిందీ సినిమాల్లో చేసిన రేంజ్ పర్ఫార్మెన్స్‌కు, అక్కడి పాత్రలకు చాలా గ్యాప్ ఉందని వాపోయింది. అందుకే కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాకుండా, మెరుగైన అవకాశాల కోసం సొంతంగా ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ రూట్ మార్చుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

డ్రగ్స్‌ వద్దు బ్రో: సీఎం చంద్రబాబు
AP· 26 Jun 2026

డ్రగ్స్‌ వద్దు బ్రో: సీఎం చంద్రబాబు

AP: అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌ ద్వారా తన సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమే అన్నారు. ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ బారినపడ్డ వారికి సహాయం అందించి..పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

CEO అంటూ నిత్య పెళ్లికొడుకు డ్రామా !
Crime· 26 Jun 2026

CEO అంటూ నిత్య పెళ్లికొడుకు డ్రామా !

AP: గుంటూరులోని పాండురంగానగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుకు భార్య, పిల్లలున్నారు. గతంలో ఓ పత్రికలో పనిచేసిన సాంబశివరావు విలాసాలకు అలవాటుపడి మోసాల బాట పట్టాడు. పత్రికా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించి కేసులు పెట్టింది. అయినా ఆయన అదే సంస్థకు CEOనని ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తన వివరాలు పోస్టు చేసేవాడు. పలువురి మహిళల నుంచి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేశాడు. బ్యాగులో ఎప్పుడూ పెళ్లి వస్త్రాలు, బాసికాలు సిద్ధంగా ఉంచుకునేవాడని పోలీసులు తెలిపారు. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.