Latest

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్స్!
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. "కోట్లలో బకాయిలు ఉంటే కాలేజీల మేనేజ్‌మెంట్ ఎలా సాధ్యం? స్టూడెంట్స్ నుండి ఫీజులు వసూలు చేయొద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ఇస్తారు?" అని ప్రశ్నించింది. రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫండ్స్ గందరగోళంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫైనల్ డేట్ చెప్పాలంటూ హైకోర్టు ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

నేడు కింగ్ ఆఫ్ పాప్ వర్ధంతి
అద్భుతమైన గాత్రంతో, విభిన్నమైన లైవ్ డాన్స్ స్టెప్స్‌తో సంగీత ప్రపంచంలో రాజుగా ఏలిన మైకేల్ జాక్సన్ వర్ధంతి. ఈరోజు. ఎంతో కృషితో ఆయన సృష్టించిన సిగ్నేచర్ 'మూన్‌వాక్' స్టెప్, సరికొత్త కాన్సెప్ట్ వీడియోలు అప్పట్లో ఒక సంచలనం. లైవ్‌గా పాడుతూ విభిన్నమైన నృత్యం చేయడం కేవలం ఆయనకే సాధ్యమైంది. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆ మ్యూజిక్ క్వాలిటీ నేటి జనరేషన్‌కు కూడా బలంగా కనెక్ట్ అవుతూ ఎప్పటికీ అజరామరంగా నిలుస్తోంది.

షాకింగ్.. హాస్టల్లో ఇంటర్ స్టూడెంట్ డెలివరీ!
హైదరాబాద్ గోల్కొండలోని ఒక మైనారిటీ హాస్టల్లో అమానవీయ ఘటన జరిగింది. ఒక ఇంటర్ స్టూడెంట్ హాస్టల్ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపై ఏడుపు వినపడకుండా ముక్కు, నోరు నొక్కేయడంతో శిశువు చనిపోయింది. అనంతరం మృతదేహాన్ని థర్డ్ ఫ్లోర్ నుండి కిందకు విసిరేసింది. ప్రిన్సిపాల్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. మేనబావ వల్లే గర్భం దాల్చినట్లు ఆమె ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం సెర్చ్ చేస్తున్నారు.

ఫకీరు వేషంలో వచ్చి నగదు కొట్టేశాడు
AP: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి నగదును అపహరించాడు. పూజలు చేయాలని చెప్పి బయటకు పంపి ఇంట్లోకి చొరబడ్డ దొంగ రూ.50 వేల నగదును దోచుకెళ్లాడు. బాధితురాలు కాశింభీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,40,130 కాగా. 22 క్యారెట్ల రేటు రూ.1,28,450 గా ఉంది. అటు సిల్వర్ రేట్ కూడా తగ్గి కిలో వెండి రూ.2,30,000 కి పడిపోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

20రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ.. తల్లి ఆస్పత్రిపాలు
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ 20 రోజులు దాటినా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, బిడ్డ దూరమవడంతో జ్ఞానేశ్వరి తల్లి భవానికి తీవ్రమైన దిగులుతో మంచాన పడ్డారు. నిద్ర, ఆహారం లేక ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చిన్నారి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్నీ వదిలిపెట్టకుండా ముమ్మరంగా గాలిస్తున్నారు.

మనవరాలి మరణం తట్టుకోలేక నానమ్మకు గుండెపోటు
TG: జనగాం పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రియాన్షి (18 నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీళ్ల సంపులో పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని బయటకు తీసి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మనవరాలి మృతితో ఏడుస్తూ నానమ్మ మారబోయిన నాగమ్మ (65) గుండెపోటుకు గురై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో అంబేడ్కర్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అవనిగడ్డ డిపోలో బస్సులు నిలిపివేత
AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెచ్చిన ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల RTC సిబ్బంది, మహిళా ప్రయాణికుల మధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మహిళా ప్రయాణికులు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సు సర్వీసులను నిలిపివేశారు. డిపో గేటు వద్దే నిరసనకు దిగడంతో వందలాది మంది ప్రయాణికులు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు బస్టాండ్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై కొందరు మహిళలు దాడులు చేస్తున్నారని, తమకు కనీస రక్షణ కరువైందని వాపోయారు.

జనసేనలో మరణించిన నేతకు పదవి
AP: జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో తప్పులు దొర్లాయి. నెలరోజుల క్రితమే మరణించిన ఒక నాయకుడికి నూతన కమిటీలో పదవి కేటాయించడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలానికి చెందిన జనసేన నాయకుడు కుంకుమ కిరణ్‌కుమార్ గతనెలలో మరణించారు. ఆయన మృతి పట్ల మే 22న జనసేన సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన అనంతపురం పార్లమెంట్ నిర్మాణ కమిటీ లీస్ట్‌లో కిరణ్‌కుమార్ పేరును, ఫోటోను సభ్యుడిగా చేర్చారు.

ప్రమాదకరంగా RDS ఆనకట్ట.. పనులు గుర్తించాలి: రేవంత్ రెడ్డి
TG: తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని CM రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో TG, AP, కర్ణాటక నీటి వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును పటిష్ఠం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, RDS, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై CM సమీక్ష నిర్వహించారు. RDS(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను గుర్తించాలని కోరారు.

ఆకలి లేకపోయినా తింటే.. ఆ ప్రాబ్లమ్స్ పక్కా!
చాలా మంది ఆకలి లేకపోయినా కేవలం టైమ్ అయిందనే కారణంతో ఫుడ్ తినేస్తుంటారు. అయితే ఇలా టైమ్ చూసి తినడం కంటే, బాడీ ఇచ్చే ఆకలి సిగ్నల్స్ బట్టే తినాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఆకలి లేనప్పుడు తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌పై ప్రెజర్ పడి అజీర్ణం, గ్యాస్, వెయిట్ గెయిన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని మీల్స్ పూర్తిగా స్కిప్ చేయకూడదు, దీనివల్ల షుగర్ లెవెల్స్ దెబ్బతింటాయి. ఆకలి తక్కువగా ఉన్నప్పుడు పండ్లు, సలాడ్స్, మజ్జిగ లాంటి లైట్ ఫుడ్స్ తీసుకోవడం బెస్ట్. ఒకవేళ డైలీ అసలు ఆకలి వేయకపోతే మాత్రం లివర్ ప్రాబ్లమ్స్ లేదా హార్మొనల్ ఇంబాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి డాక్టర్‌ను కలవడం మంచిది.

హెల్తీ బ్రెయిన్ కోసం వ్యాయామం తప్పనిసరి !
మిడిల్ ఏజ్ లో మనం చేసుకునే అలవాట్లు తదనంతర కాలంలో మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హెల్త్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.మధ్య వయస్సులో (40 నుండి 60 ఏళ్ల లోపు) క్రమం తప్పకుండా చేసే శారీరక వ్యాయామం మెదడు ఆరోగ్యానికి అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడక, రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి ఆక్సిజన్ అందుతుంది. ఇది జ్ఞాపకశక్తి క్షీణించకుండా కాపాడటమే కాకుండా అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.

మీ మెదడు పని తీరును ఇలా కాపాడుకోండి !
మధ్య వయస్సులో రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) నియంత్రణలో ఉంచుకోవడం మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంది. అధిక రక్తపోటు మెదడులోని సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. కాబట్టి గుండెకు మేలు చేసే మెడిటరేనియన్ తరహా ఆహారం (ఆకుకూరలు, పండ్లు, నట్స్) తీసుకోవడం, సరైన నిద్రపోవడం మరియు ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా మెదడు పనితీరును దశాబ్దాల పాటు కాపాడుకోవచ్చు.

గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!
గుడ్లు హెల్త్ కి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా గుడ్లతో పాటు సోయా పాలు లేదా నాన్వెజ్ అస్సలు తీసుకోకూడదు. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్‌పై భారం పడి అసిడిటీ, అలసట వస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటూ టీ తాగడం వల్ల, టీలోని పదార్థాల కారణంగా గుడ్డులోని ప్రొటీన్స్‌ని బాడీ గ్రహించలేదు. దీనికి తోడు గుడ్లు తిన్న వెంటనే అరటిపండ్లు లేదా ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే గుడ్లను ఎప్పుడూ కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది.

హ్యూమనాయిడ్ రోబోల తయారీలో చైనా రికార్డ్
ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల (మానవరూప రోబోలు) తయారీలో చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. గ్లోబల్ మార్కెట్‌లో దాదాపు 85% రోబోలను చైనా కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. తక్కువ ధర, పటిష్టమైన సప్లై చైన్ ,ప్రభుత్వ భారీ పెట్టుబడుల మద్దతుతో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలను వెనక్కి నెట్టి చైనా ఈ రంగంలో స్పష్టమైన లీడ్‌ను దక్కించుకుంది. రాబోయే రోజుల్లో గృహ అవసరాలు, పారిశ్రామిక రంగాల్లో వీటిని భారీగా వాడాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయకండి !
ఆఫీస్ లో గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. ఒకే పోజ్ లో గనక మీరు కూర్చుంటే డిస్క్ సమస్యలతో పాటు, రక్త ప్రసరణ సమస్యలు, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా వస్తాయని వైద్యులు వార్న్ చేస్తున్నారు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు నేలపై పూర్తిగా ఆనేలా ఉండాలి. అలాగే మన వెన్నెముక కుర్చీ బ్యాక్ కి ఆనుకుని నిటారుగా ఉండాలి.ప్రతీ అరగంటకు లేచి రెండు, మూడు నిమిషాలు (micro breaks) అటూ ఇటూ నడవాలి. కూర్చున్న చోటే కాళ్లను స్ట్రెచ్ చేయడం, మడమలు తిప్పడం లాంటివి చేయాలి. కాలు మీద కాలు వేసుకు కూర్చుంటే రక్త ప్రసరణ సమస్యలతో పాటు, బీపీ పెరుగుతుంది.

హీట్ వేవ్ తో మూతబడిన ఈఫిల్ టవర్ !
తీవ్రమైన వడగాల్పుల (హీట్‌వేవ్) కారణంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'ఈఫిల్ టవర్' జూన్ 23న నిర్ణీత సమయం కంటే ముందే మూసివేయబడింది. పారిస్‌లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో పర్యాటకులు, అక్కడి సిబ్బంది ఆరోగ్యం మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పారిస్ నగరం ఈ తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతోంది.

నెగటివ్ థాట్స్ కి చెక్ చెప్పేందుకు ఇలా చేయండి !
నెగటివ్ థాట్స్ తో సతమతమవుతున్నారా? అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఆ వ్యతిరేక ఆలోచనలనుంచి మీరు బయట పడతారు. అవేంటంటే మీలో నెగటివ్ థాట్స్ ఎందుకు , ఎలా, ఎప్పుడు వస్తున్నాయో గుర్తించండి. మీ ఆలోచనలకు కాస్త దూరం జరిగి వాటిని అబ్జర్వ్ చేస్తూండండి. అలాగే ఈ పరిస్థితి నాకే ఎందుకు వచ్చింది? లేదా రావాలి అనే ఆలోచననుంచి దీనినుంచి నేనెలా బయటపడాలి అనే అంశంపై దృష్టి పెట్టండి. ఈ సమస్యనుంచి బయట పడటానికి ప్రతీరోజు ఒక నిర్ణీత టైమ్ పెట్టుకుని ఆ టైమ్ లో మాత్రమే దాని గురించి ఆలోచించండి.అలాగే మీకు ఎదురవుతున్న అనుభవాలను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని పేపర్ పై పెట్టండి.

కరువు సీమలో బంగారు పంట
AP: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గని ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా పేరొందిన జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ బంగారం ఉత్పత్తిని CM చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా తొలి సంవత్సరం 400కిలోలు, రెండో సంవత్సరం వేయి కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. ఇందుకోసం 405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. జొన్నగిరి మైన్ ద్వారా సుమారు 700 మందికి ఉపాధి దొరుకనుంది.

గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!
గుడ్లు హెల్త్ కి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా గుడ్లతో పాటు సోయా పాలు లేదా నాన్వెజ్ అస్సలు తీసుకోకూడదు. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్‌పై భారం పడి అసిడిటీ, అలసట వస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటూ టీ తాగడం వల్ల, టీలోని పదార్థాల కారణంగా గుడ్డులోని ప్రొటీన్స్‌ని బాడీ గ్రహించలేదు. దీనికి తోడు గుడ్లు తిన్న వెంటనే అరటిపండ్లు లేదా ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే గుడ్లను ఎప్పుడూ కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!
బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు (జూన్ 24) తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.2,000 తగ్గి, రూ.1,44,330కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300గా ఉంది. ఇక సిల్వర్ అయితే ఏకంగా రూ.5,000 తగ్గి, కిలో వెండి ధర రూ.2,49,900 కి పడిపోయింది. షాపింగ్ ప్లాన్ చేసుకునే వాళ్లకి ఇది బెస్ట్ టైమ్. Note: ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.