Latest

ఇక్కడ కుళ్ళిపోయిన ముక్కలతో పచ్చళ్లు!
వరంగల్ కాశీబుగ్గలో పోలీసులు ఒక అక్రమ పచ్చడి (Pickle) యూనిట్‌పై దాడి చేసి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అస్సలు క్లీన్‌గా లేని ఒక ఇంట్లో కుళ్లిపోయిన టమోటాలు, మామిడికాయలు, నిమ్మకాయలతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. అక్కడ ఉన్న రూ.2.25 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. ఈ ఇల్లీగల్ బిజినెస్ నడుపుతున్న అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి బ్రాండ్ లేని, ఇకనుండి లోకల్ పచ్చళ్లను కొని హెల్త్ పాడుచేసుకోకుండ జాగ్రత్తగా ఉండండి.

సికింద్రాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్!
సికింద్రాబాద్‌లో గురువారం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫేమస్ స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న సూర్య కిరణ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నుండి దట్టమైన పొగ, మంటలు రావడంతో చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకుని మంటలను కంట్రోల్ చేశారు. బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళను అధికారులు సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని డౌట్ పడుతున్నారు. గతంలో స్వప్నలోక్‌లో కూడా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఆ ఇంటి నిండా కొండచిలువలు!
చైనాలో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒంటరిగా ఉంటున్న గువో అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. అసలు విషయం ఏంటంటే, ఒక అడవిలో వింత పాము కనిపించడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పాముల బ్రీడింగ్ కోసం హీటర్లు వాడతారని తెలిసి, ఆ ఏరియాలో కరెంట్ బిల్స్ చెక్ చేశారు. గువో ఇంటికి విపరీతంగా కరెంట్ బిల్ రావడంతో డౌట్ వచ్చి రైడ్ చేశారు. తీరా తలుపులు తీసి చూస్తే వందల కొద్దీ కొండచిలువలు కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. 2014 నుండి అక్రమంగా పాములను పెంచి అమ్ముతున్న తనని పోలీసులు అరెస్ట్ చేసి, పాములను జూకి షిఫ్ట్ చేశారు.

ఓటర్ల అలర్ట్: నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే స్టార్ట్!
తెలంగాణలో ఓటర్ల లిస్ట్ పక్కాగా రెడీ చేయడానికి గవర్నమెంట్ నేటి నుంచి జులై 24 వరకు స్టేట్ వైడ్ ఇంటింటి సర్వేను స్టార్ట్ చేస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్ల దగ్గరికి BLOలు వచ్చి ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారు. జులై 31న ముసాయిదా లిస్ట్ రిలీజ్ చేసి, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆగస్టు 30 వరకు తీసుకుంటారు. ఫైనల్‌గా అక్టోబర్ 1న కొత్త ఓటర్ల లాస్ట్ జాబితాను అనౌన్స్ చేస్తారు. ఓటున్న ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో అలర్ట్‌గా ఉండడం ముఖ్యం!

నకిలీ మందులకు కేంద్రం చెక్!
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెడిసిన్స్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, యాంటీ-క్యాన్సర్ మందులు, యాంటిమైక్రోబియల్స్, NDPS డ్రగ్స్‌ను ఇకపై QR కోడ్ ట్రేస్‌బిలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. నకిలీ మందులకు చెక్ పెట్టడానికే ఈ సిస్టమ్ తెస్తున్నారు. జూలై 2027 నుంచి వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై, అలాగే జూలై 2028 నుంచి యాంటిబయోటిక్స్ మెడిసిన్స్ పై ఈ QR కోడ్ ఖచ్చితంగా ఉండాలి.

HYD శివారులో దేశంలోనే తొలి 'డేటా సెంటర్ సిటీ
HYDను అగ్రగామి డిజిటల్ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి 'డేటా సెంటర్ సిటీ' ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో 1500 ఎకరాల్లో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన భారీ విద్యుత్, నీటి అవసరాల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో శుద్ధి చేసిన మురుగునీటిని సరఫరా చేయనున్నారు. CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేస్తున్నారు.

వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల అప్లికేషన్లు: తెలంగాణ
తెలంగాణ గవర్నమెంట్ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఫుల్ స్పీడ్‌గా వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగానే నెక్స్ట్ మంత్ నుంచే కొత్త అప్లికేషన్లు తీసుకోవాలని బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తూనే.. అర్హత లేని వాళ్ళను లిస్ట్ నుండి తీసేయడానికి ఒక కొత్త సిస్టమ్‌ను తెస్తోంది. ఇకపై పెన్షన్ అమౌంట్ డైరెక్ట్‌గా బెనిఫిషియర్స్ బ్యాంక్ అకౌంట్లలోనే పడిపోతుంది.

గూగుల్‌లో 'హత్య' పాఠాలు!
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారించగా.. కేతన్‌ను ఎలా చంపాలో చాలా రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో రకరకాలుగా సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పక్కా ప్లాన్‌తో జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్‌ను లోయలోకి తోసి చంపేశారు. అంతేకాదు, వీరిద్దరూ గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకుని, 238 గంటల పాటు మర్డర్ ప్లాన్ గురించే డిస్కస్ చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా తేలింది. ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్, సెర్చ్ హిస్టరీనే ఇప్పుడు నిందితులను బుక్ చేసింది.

9th క్లాస్ సిలబస్‌లో ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌పై BJP ఫైర్!
9వ తరగతి సోషల్ స్టడీస్ సిలబస్‌లో 1975 నాటి 'జాతీయ ఎమర్జెన్సీ' చాప్టర్‌ను NCERT చేర్చింది. ఈ నిర్ణయాన్ని BJP స్వాగతించగా, ప్రతిపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై BJP అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 1975 జూన్ 25 దేశ చరిత్రలోనే చీకటి రోజు అని, ఇందిరా గాంధీ అధికారాన్ని వాడుకుని ఎమర్జెన్సీ విధించారని, మీడియాపై ఆంక్షలు పెట్టి ఆఖరికి ఆల్ ఇండియా రేడియో నుండి కిషోర్ కుమార్ పాటలను కూడా తొలగించారని విమర్శించారు. అప్పటి నిజాలు నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం
AP: నెల్లూరు జిల్లా మనుబోలు వద్దనున్న నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. గూడూరు రూరల్ మండలం చెన్నూరుకు చెందిన కూలీలు మనుబోలు మండలం వీరంపల్లిలోని ఓ రొయ్యల కేంద్రం ప్రాసెస్ యూనిట్‌లో పనిచేసేందుకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్‌లో బిగ్ స్కామ్ !
TG: పేదలకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని భారీ మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ స్కామ్‌లో ఏడుగురు నిందితులను గుర్తించగా వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజ్‌గిరి DCP శ్రీధర్ తెలిపారు. గతంలో GHMCలో పనిచేసి, ప్రస్తుతం కలెక్టరేట్‌లోని అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ ముఠా 100మంది నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించారు.

ఒకే ఫ్రేమ్‌లో AP, తెలంగాణ, కర్ణాటక CMలు.. రీజన్ ఇదే!
తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ జరిగింది. కర్ణాటకలోని హోస్పేట్‌లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కేంద్రమంత్రి CR పాటిల్‌తో పాటు కర్ణాటక, AP, తెలంగాణ CMలు కలిసి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు 17వ గేటును కేంద్రమంత్రి CR పాటిల్, 18వ గేటును కర్ణాటక CM, 19వ గేటును AP CM, అలాగే 20వ గేటును తెలంగాణ CM ప్రారంభించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రమంత్రి ఒకే వేదికపైకి వచ్చి ఈ కొత్త గేట్లను లాంచ్ చేయడం విశేషం.

BIG BOSSలో ఛాన్స్ ఇవ్వాలని SI రిక్వెస్ట్
AP: నంద్యాల జిల్లా గడివేముల పోలీస్‌స్టేషన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న నాగార్జునరెడ్డి BIG BOSS సీజన్-10లో తనకు కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలని విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విధి నిర్వహణలో కఠినంగా ఉండే SI నాగార్జునరెడ్డి, ఇంట్లో మాత్రం పక్కా ఫ్యామిలీ మెన్. తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే తాను వీడియో చేస్తున్నట్లుగా స్వయంగా వెల్లడించారు. తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే BIG BOSSకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారులు అంగీకరిస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ టైం.. సుప్రీంకోర్టుకు లేడీ బాస్!
భారత న్యాయవ్యవస్థలో రాబోయే ఎనిమిదేళ్లలో (2025-2033) కీలక మార్పులు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టుకు కాబోయే తదుపరి 8 మంది ప్రధాన న్యాయమూర్తుల (CJI) లిస్ట్ వచ్చేసింది. ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతుండగా, ఆ తర్వాత జస్టిస్ విక్రమ్ నాథ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే ఈ లిస్ట్‌లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే. 2027 సెప్టెంబర్‌లో జస్టిస్ B.V. నాగరత్న ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు. వీరితో పాటు జస్టిస్ P.S. నరసింహ, J.B. పార్దివాలా, K.V. విశ్వనాథన్, జాయ్‌మల్య బాగ్చీ, విపుల్ పంచోలి ఈ లైన్‌లో ఉన్నారు.

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు!
గృహిణులకు బ్యాడ్ న్యూస్! రెండు వారాల గడువులోనే మార్కెట్‌లో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎండ తీవ్రత వల్ల లోకల్ పంటలు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తోంది. ధర్మవరం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో పచ్చిమిర్చి రూ.40 నుండి రూ.80 కి, మునక్కాయలు రూ.90 కి చేరాయి. క్యారెట్, బీట్‌రూట్ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్‌తో ఆల్రెడీ ఆయిల్ ధరలు పెరగ్గా, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా పెరగడంతో బడ్జెట్ తలకిందులైందని జనాలు జనాలు ఆందోళన చెందుతున్నారు. కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందట.

ఫ్రీ ఫైర్ ఫ్రెండ్‌షిప్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు 8, 9 తరగతులు చదువుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన వీరు తమ కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లలో ఫ్రీఫైర్ ఆడటం మొదలుపెట్టారు. గేమ్‌లో ఒకేసారి 4 నుంచి 16 మంది గ్రూప్‌గా కలిసి ఆడేందుకు వీలుండటంతో ఆట మధ్యలో వీరికి బిహార్‌కు చెందిన అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తుల మాయమాటలు నమ్మిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి రైలులో బిహార్‌కు బయల్దేరారు. పోలీసులు IP అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా APలోని ఏలూరు వద్ద వారిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు!
ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లా పర్సాఖుర్ధా గ్రామంలో ఒక రేంజ్ హై-డ్రామా జరిగింది. దీనదయాళ్ అనే వ్యక్తి ఫుల్‌గా తాగేసి, ఏకంగా 11,000 వోల్టుల కరెంట్ స్తంభం ఎక్కి వైర్లపై ఉయ్యాల ఊగాడు. దీంతో టెన్షన్ పడ్డ గ్రామస్తులు బీతౌలి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పవర్ సప్లై ఆపించారు. గంటల కొద్దీ కష్టపడి అతన్ని కిందకి దించారు. షాకింగ్ ఏంటంటే.. అతను స్తంభం ఎక్కడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందే పవర్ కట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చిన్నారి జాను మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే?
చిన్నారి జాను మిస్ అయి 19 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ టైమ్‌లో ఒక జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఈస్ట్ డైరెక్షన్ వైపు తీసుకెళ్లారని, ఇంటికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో పాప సేఫ్‌గా ఉందని ఆయన ప్రెడిక్ట్ చేశారు. అంతేకాదు, జూలై నుండి సెప్టెంబర్ నెలల మధ్యలో జాను మళ్లీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌లో మొదటి IT టవర్ ఇక లేదు!
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న మొదటి IT టవర్ ఇక లేదు. 1987లో ఇక్కడ అమెరికాకు చెందిన 'ఇంటర్ గ్రాఫ్ కన్సల్టింగ్' అనే ఫస్ట్ MNC కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్‌గా ఈ బిల్డింగ్ కింద ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ సంపు బాగా దెబ్బతింది. దీంతో బిల్డింగ్ సేఫ్టీ కాదని భావించిన మేనేజ్‌మెంట్. దాన్ని కూల్చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. దీంతో హైదరాబాద్ IT ప్రస్థానంలో ఒక ల్యాండ్‌మార్క్ బిల్డింగ్ కనుమరుగవుతోంది.

కారులో మంటలు.. క్షణాల్లో బతికి బయటపడ్డ ఏడుగురు
TG: ఖమ్మం - దేవరపల్లి నేషనల్ హైవేపై వేంసూరు వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్తోన్న కారు ముందు టైరు పేలి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. లింగంపాలెం ఎగ్జిట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఏడుగురు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది
TG: నల్గొండలోని తెలంగాణ కాలనీలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అక్సర (11) లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది కూతురేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్‌తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీ సుఫారీ హత్య చేయించినట్లు గుర్తించారు.