Latest
పరవాడ ఫార్మాసిటీలో ఫైర్ యాక్సిడెంట్.. ఇద్దరు సజీవదహనం
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫార్మాసిటీలోని సౌత్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులూ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

తండ్రి లేని ఆడపిల్లలకు అండగా నిలిచిన కలెక్టర్
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం విలేజ్‌కు చెందిన పిచ్చిక సత్యనారాయణ ఇటీవల పక్షవాతంతో బాధపడుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య పూర్తిగా మానసిక దివ్యాంగురాలు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. తండ్రి మరణంతో ఆడ బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తల్లికి దివ్యాంగ పెన్షన్ రూ.15వేలు ఇప్పించాలని, ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం చేయాలని వారు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇన్వెస్టర్లు రాడానికి మూడు S లే కారణం - నారా లోకేష్
పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గు చూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)...ఈ మూడే మా విజయ రహస్యాలు అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అమరావతి, ఏఐ, క్వాంటమ్ వాలీ ఈ ఆలోచనలన్నీ చంద్రబాబువేనని తాను కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తున్నానని అన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావంతోనే పనిచేస్తున్నామని లోకేష్ అన్నారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించగలగడం తమ గొప్పతనమేనన్నారు, రిపబ్లిక్ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడిం

చీకటి GOలతో కార్మికుల పొట్టకొట్టొద్దు
AP: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధిదీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14రకాల సేవలను ప్రైవేట్‌పరం చేసేందుకు AP ప్రభుత్వం రెడీ అవడంపై కార్మికులు ఫైరవుతున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. AP మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి GOలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందన్నారు.

విజయవాడకు బుడమేరు తరహా ముప్పు.. స్థానికుల్లో ఆందోళన
విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో అక్రమ మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాల్వగట్లు బలహీనపడి వరదముప్పు పొంచి ఉందనే టెన్షన్ మొదలైంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో కాల్వగట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారినపడే ప్రమాదముంది. APIIC అవసరాల కోసం పోలవరం కాల్వ 167.040 KM వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు పరిమితంగా పగటిపూట చేపట్టాలి. రేయింబవళ్లు వేలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు.

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. 12మంది భారతీయులు మృతి
ఖతార్‌లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 13మంది మృతి చెందారు. వారిలో 12 మంది భారతీయులేనని నిర్ధారణ అయింది. పేలుడు తీవ్రతకు 66మంది గాయపడ్డారు. వారిలో ఖతార్, భారత్, పాక్ సహా పలు దేశాలవారు ఉన్నారు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఈ గ్యాస్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ఖతార్ ఆపేసింది. తాజాగా కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించగా గ్యాస్ సరఫరా ప్లాంట్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

లింక్డ్‌ఇన్ మేకోవర్ - ఉద్యోగాల వేటలో కొత్త ట్రెండ్:
లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవడం (మేకోవర్) ద్వారా అభ్యర్థులు త్వరగా ఉద్యోగాలు పొందుతున్నారు. కేవలం సాధారణ సమాచారానికే పరిమితం కాకుండా.. ప్రొఫెషనల్ హెడ్‌షాట్ ఫోటో, నైపుణ్యాలను ప్రతిబింబించే హెడ్‌లైన్, ఏఐ (AI) సాయంతో రాసిన ఆకట్టుకునే సమ్మరీలతో కూడిన ప్రొఫైల్స్ రిక్రూటర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి స్మార్ట్ మార్పులు అభ్యర్థుల ప్రొఫైల్ విజిబిలిటీని పెంచి, ఇంటర్వ్యూ అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి.

క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ఓ భరోసా
TG: క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ఓ భరోసా అని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం హాస్పిటల్ రెండున్నర దశాబ్దాలపాటు సేవలను అందిచడం గొప్ప విషయమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

మతిమరుపు సమస్యకు ఇలా చెక్ పెట్టండి !
మెదడును చురుగ్గా ఉంచేందుకు మధ్య వయస్సులో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఎంతో అవసరం. పజిల్స్ పూరించడం, కొత్త భాష నేర్చుకోవడం, సంగీత వాయిద్యాలు వాయించడం లేదా కొత్త అలవాట్లను పెంపొందించుకోవడం వంటివి మెదడులోని నరాల కణాల మధ్య సరికొత్త Neural Networks ఏర్పరుస్తాయి. ఈ 'మెంటల్ జిమ్నాస్టిక్స్' వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.

పాలమూరులో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులను తయారుచేసే యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకాల్లో భాగంగా బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ 2వ యూనిట్‌ను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటు నిమిత్తం సర్వే నిర్వహించిన బ్రహ్మోస్ బృందం.. ఆ ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. రక్షణశాఖ లఖ్‌నవూ (UP)లో మొదటి యూనిట్ ఏర్పాటు చేయగా మహబూబ్‌నగర్‌లో రెండో యూనిట్.

రికార్డులు కొల్ల గొడుతున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్
హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటి వరకూ రూ.77 కోట్లకు పైగానే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, దర్శకుడు అందరూ కొత్త వారే అయినా కానీ ప్రేక్షకుల మనసును మాత్రం దోచేశారు. సమాజంలో నిజ జీవితాలకు ఈ కథ దగ్గరగా ఉండటంతో ఎక్కువమందికి కనెక్ట్ అయ్యింది. ఒక మనిషి మీద ప్రేమ హద్దులు దాటి చివరకు సమస్యగా మారితే ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు.

మాకు న్యాయం చేయండి- ఔట్ సోర్సింగ్ టీచర్ల నిరసన
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పది, పదిహేనేళ్లుగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మెగా డీఎస్సీ కారణంగా తమ ఉపాధి కోల్పోయామని, గురుకుల బైలాస్‌కు విరుద్ధంగా తమ పోస్టులను డీఎస్సీలో విలీనం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియామకాలకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, లేకపోతే కాంట్రాక్టు విధానంలోకి తీసుకోవాలని లేదా రెగ్యులర్ చేసి మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

రామమందిర నిర్వహణ లోపాల మయం- సిట్ దర్యాప్తులో వెల్లడి
అయోధ్య రామమందిర విరాళాల చోరీ, అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) పలు కీలక లోపాలను గుర్తించింది. నగదు లెక్కింపు, ఉద్యోగుల నియామకం, భద్రతా తనిఖీలలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ పేర్కొంది. నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ పాటించకపోవడం, సీసీటీవీ (CCTV) కెమెరాల నిఘాలో లోపాలు ఉండటం వల్ల దొంగతనాలకు ఆస్కారం కలిగిందని దర్యాప్తులో తేలింది. ఈ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సిట్ సమర్పించనుంది.

ఇకపై ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కాఫ్ సిరప్ ల అమ్మకం
దేశంలో 2,000 పైగా కాఫ్ సిరప్ బ్రాండ్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, వాటి నాణ్యత ,భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలుషిత సిరప్‌ల వల్ల ఎదురవుతున్న ఆరోగ్య ప్రమాదాలు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'ఓవర్-ది-కౌంటర్' (OTC) విక్రయాలను నిషేధించింది. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఫార్మసీలు వీటిని విక్రయించాలి. అలాగే, ముడిసరుకుల నాణ్యతను ట్రాక్ చేయడానికి క్యూఆర్ (QR) కోడ్ విధానాన్ని, తప్పనిసరి బ్యాచ్ టెస్టింగ్‌ను నిబంధనలుగా తెచ్చింది.

వాట్సప్ సీఈఓ గా ఇండియన్ !
వాట్సాప్ మాతృసంస్థ 'మెటా', ప్రముఖ ఇండియన్ ఫిన్ టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) లో దాదాపు రూ. 9,500 కోట్లు ($900 మిలియన్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా, క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓ (గ్లోబల్ హెడ్) గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక భారతీయ వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌కు నాయకత్వం వహించడం విశేషం.

స్టాక్ రేస్ లో ఏపీని దాటి దూసుకు పోతున్న బెంగాల్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల (ఇన్వెస్టర్ల) సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించి పశ్చిమ బెంగాల్ వేగంగా దూసుకుపోతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) గణాంకాల ప్రకారం, బెంగాల్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాలు ,క్రియాశీల ఇన్వెస్టర్ల సంఖ్య ఏపీ కంటే వేగంగా పెరిగింది. పారిశ్రామిక వృద్ధి, పెరుగుతున్న ఆర్థిక అవగాహన , యువత షేర్ మార్కెట్ వైపు అట్రాక్ట్ కావడం వల్ల బెంగాల్ ఈ రేసులో ముందంజలో నిలిచింది.

మీరు వాడే కారం పొడి కల్తీదా? ఇంట్లోనే ఇలా గుర్తించండి!
ఈ రోజుల్లో పాలు, కూరగాయలతో పాటు కారంలోనూ సుడాన్ రెడ్ లాంటి హానికర కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలతో దీన్ని కనిపెట్టవచ్చు. గ్లాస్ నీటిలో కారం వేసినప్పుడు నీరు బాగా ఎర్రగా మారినా, చేతితో రుద్దినప్పుడు రంగు బలంగా అంటుకున్నా అది కల్తీనే. అలాగే కారంలో నిమ్మరసం కలిపినప్పుడు బుడగలు వస్తే అందులో వాషింగ్ సోడా ఉన్నట్లు అర్థం. స్వచ్ఛమైన కారానికి సహజమైన ఘాటు, లేత ఎరుపు రంగు ఉంటాయి. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా నమ్మకమైన బ్రాండ్స్ వాడటం మంచిది.
బాలయ్య గురుంచి కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ‘NBK111’ లో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రెస్ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటూ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. బాలయ్యతో కలిసి యాక్ట్ చేయాలనేది తన డ్రీమ్ అని, అది ఇప్పుడు నిజమైందని అన్నారు. షూటింగ్ సెట్స్‌లో బాలయ్య ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుందని, ఈ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కాజల్ చెప్పారు.
వర్షంలో సచిన్ టెండూల్కర్ ఆటలు.. వీడియో వైరల్!
సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన ఒక లేటెస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వర్షం పడుతుండగా సచిన్ బయటకు వచ్చి, వర్షంలో తడుస్తూ తన పెంపుడు కుక్కతో కలిసి సరదాగా ఆడుకున్నారు. ఆ బాల్‌ని అటు ఇటు విసురుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే సచిన్. ఇలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్యూట్ వీడియోకి తెగ లైక్స్ కొడుతున్నారు.

నిట్ట నిలువుగా చీలిన శివసేన- ఆరుగురు ఎంపీల జంప్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు తెరదించుతూ, ఉద్ధవ్ థాకరే వర్గం తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు సోమవారం సాయంత్రం ముంబైలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు. దాంతో మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీ గా ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం గుర్తింపు పొందింది. యాంటి డిఫెక్షన్ లా ముప్పు నుంచి వీరు తప్పించుకున్నట్లే. నియోజక వర్గాలకు నిధుల కొరత కారణంగానే షిండే వర్గంలోకి మారామని ఫిరాయించిన ఎంపీలు తెలిపారు. ఉద్ధవ్ వర్గం ఇప్పుడు మైనారిటీలో పడిపోయింది.
దువ్వాడ శ్రీనివాస్ కోసం మాధురి ధర్నా.. శ్రీకాకుళంలో టెన్షన్!
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందు దువ్వాడ శ్రీనివాస్ కోసం మాధురి ధర్నాకు దిగారు. AP మంత్రి అచ్చెన్నాయుడు చేసిన రూ.75 కోట్ల ధాన్యం కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు టార్గెట్ చేసి హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. తప్పును ప్రశ్నించడం నేరమా అంటూ పోలీసులను నిలదీశారు. దువ్వాడ శ్రీనివాస్‌కు సపోర్ట్‌గా ఆమె పోలీస్ స్టేషన్ ముందే కూర్చోవడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ధర్నాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.