Latest

అల్లు అర్జున్ స్పెషల్ వీడియో కాల్.. ఆ చిన్నారి ఎవరంటే?▶
Motivational· 20 Jun 2026

అల్లు అర్జున్ స్పెషల్ వీడియో కాల్.. ఆ చిన్నారి ఎవరంటే?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రద్ధ అనే చిన్నారి, అల్లు అర్జున్‌తో మాట్లాడాలని ఆశపడింది. ఈ విషయం తెలుసుకున్న ఒక NGO టీమ్ ఆయనను కాంటాక్ట్ చేయగా, బన్నీ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ చిన్నారికి వీడియో కాల్ చేసి స్పెషల్‌గా మాట్లాడారు. ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఆ పాప ఫేస్‌లో హ్యాపీనెస్ తెచ్చారు. చిన్నారి కోరికను తీర్చి, ధైర్యం చెప్పిన బన్నీ తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్
Crime· 20 Jun 2026

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

AP: తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ APSP మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌, రాజమహేంద్రవరం మహిళా PSలో వంశీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వంశీ తన తండ్రికి ఫోన్‌ చేసి తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?
Motivational· 20 Jun 2026

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?

మహిళా భాగస్వామి కంటే మగవారే పైచేయిగా ఉండాలనే రూల్ వెనుక పితృస్వామ్య (patriarchy) ఆలోచనలు ఉన్నాయి.5,000 ఏళ్ల క్రితం ఇద్దరూ సమానమే అయినా, కాలక్రమేణా మగవారిలో అభద్రతాభావం పెరిగింది. డేటింగ్ యాప్స్‌లో పురుషులు హైట్ అబద్ధం చెప్పడం, వైఫ్ ఎక్కువ సంపాదిస్తే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం దీనికి నిదర్శనం. అమెరికాలో 16% మంది భార్యలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బ్రిటన్ రాణి భర్త ఆల్బర్ట్ కూడా 'నేను ఇంట్లో కేవలం భర్తను, యజమానిని కాదు' అని బాధపడ్డారు. నిజానికి మహిళలు ఎక్కువ హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదించినా అది చాలా నార్మల్! మనసుతో భాగస్వామిని ఎంచుకుంటేనే రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి.

పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు
Crime· 20 Jun 2026

పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కోరుకొండ బాబురావు, కోరుకొండ కృష్ణమూర్తి కుటుంబాలు, తదితరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్న కూలర్‌ లోవోల్టెజ్‌తో పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది
Crime· 20 Jun 2026

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సైనీ(30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఫాంహౌస్‌లోకి చిన్న కట్లపాము రావడంతో చేతితో పట్టుకొని మొహిద్దీన్ అందరినీ భయపెట్టాడు. పాము కుడిచేతి వేలును నోటితో గట్టిగా పట్టుకొంది. కరుస్తోందని పక్కనున్నవారు చెప్పినా తనకు ఏంకాదని చెప్పాడు. శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మొహిద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

పిల్లలతో ఒబామా.. ఈ క్యూట్ వీడియో చూశారా?▶
Motivational· 20 Jun 2026

పిల్లలతో ఒబామా.. ఈ క్యూట్ వీడియో చూశారా?

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన వైఫ్ మిషెల్లీతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్‌లో కొత్తగా ఓపెన్ చేసిన 'చికాగో పబ్లిక్ లైబ్రరీ' బ్రాంచ్‌ని వీరు విజిట్ చేశారు. అక్కడ కొంతమంది కిడ్స్‌కి బుక్స్ చదివి వినిపించారు. ఈ లైబ్రరీ కేవలం బుక్స్ చదవడానికే కాకుండా, జనాలు ఒకరినొకరు కలుసుకుని కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్‌గా మారుతుందని ఒబామా చెప్పారు.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు!
Business· 20 Jun 2026

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,600 తగ్గి రూ.1,45,850 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.1,33,690 కి పడిపోయింది. రేట్లు బాగా తగ్గాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో
Crime· 20 Jun 2026

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఊరందరు నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి చేపల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్‌తో పాటు క్లీనర్ గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో బొలెరో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. వాహనంలో ఉన్న చేపల లోడ్ రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది.

అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం
Crime· 20 Jun 2026

అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం

TG: రాయదుర్గం ఇండ్ల బస్తీలో నివసించే కంచమీది గోవర్ధన్(23) అదే బస్తీకి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని(21)ని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో కక్ష పెట్టుకున్నాడు. విద్యార్థిని కుటుంబం తమ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటోంది. అతడు తెల్లవారుజామున 4 గంటలకు పక్కింటిపైకెక్కి ఆమె ఇంట్లోకి కత్తితో వచ్చాడు. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ ఉన్మాదిని పట్టుకుని బంధించి పోలీసులకు అప్పగించారు. జులాయిగా తిరిగే నిందితుడు అమెజాన్‌లో కత్తి తెప్పించుకున్నాడని, హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో
Education· 20 Jun 2026

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో

తెలంగాణలో విద్యను బలోపేతం చేసేందుకు CM రేవంత్ రెడ్డి కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యార్థులకు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా సేవలను అందించేందుకు వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవలను అధికారికంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి CM ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారానే ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, SSC సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించారు. త్వరలోనే అటెండెన్స్, స్కాలర్‌షిప్‌లు, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

కూతుళ్లే కొడుకులయ్యారు !
AP· 20 Jun 2026

కూతుళ్లే కొడుకులయ్యారు !

AP: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ(52) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగించే సత్యనారాయణకు మతిస్థిమితం లేని భార్య సత్యవతి ఉంది. మానసిక దివ్యాంగురాలైన సత్యవతికి సరైన వైద్యం అందక మతిస్తిమితం కోల్పోయింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు ఉన్నారు. అనారోగ్యంతో వాళ్ల నాన్న చనిపోవడంతో కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు.

అత్యాచారం కేసులో రిటైర్డ్ ఉద్యోగికి  21ఏళ్ల జైలుశిక్ష
Crime· 20 Jun 2026

అత్యాచారం కేసులో రిటైర్డ్ ఉద్యోగికి 21ఏళ్ల జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన వూసా వెంకటనారాయణ(84) రిటైర్డ్ ఉద్యోగి. హైదరాబాద్‌లోని చైతన్యపురి PS పరిధిలో స్థిరపడ్డాడు. ఆయన 2023లో మతిస్థిమితం సరిగాలేని ఓ బాలికకు బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు వెంకటనారాయణకు 21ఏళ్ల జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధించింది.

గాంధీ సరోవర్‌కు కేంద్ర రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్
TG· 20 Jun 2026

గాంధీ సరోవర్‌కు కేంద్ర రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83ఎకరాల భూములిచ్చేందుకు రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. వర్కింగ్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రక్షణశాఖ డిసిషన్‌పై CM రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మూసీ అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకున్నామన్నారు. నిరంతరం మంచినీటి ప్రవాహంతో మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తామని, పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM స్పష్టం చేశారు.

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: చంద్రబాబు
AP· 20 Jun 2026

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: చంద్రబాబు

AP: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చేస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సాయికృష్ణ తల్లి, కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్
AP· 20 Jun 2026

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్

AP: పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ 24% SL అనే గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల AP రాష్ట్ర వ్యవసాయశాఖ 60రోజులపాటు గడ్డిమందును నిషేధిస్తూ జారీ చేసిన GOను సవాల్‌ చేస్తూ ఫెర్టిలైజర్స్‌, సీడ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పారాక్వాట్‌ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో నాగిరెడ్డి హైకోర్టును కోరారు. గవర్నమెంట్ ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ట్రంప్ కు ఇచ్చి పడేసిన మెలోనీ !
World· 20 Jun 2026

ట్రంప్ కు ఇచ్చి పడేసిన మెలోనీ !

జీ7 సదస్సులో ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడినట్లు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫైర్ అయ్యారు. తానెప్పుడు ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడలేదని, బతిమాలుకోలేదని, ఆఖర్మ తనకు పట్టలేదని అన్నారు. ట్రంప్ కు ఇలా మాట్లాడటం మామూలేనని మండి పడ్డారు. తాను గానీ, తన దేశం కానీ ఎవరి ముందూ ఇలాంటి చిల్లర వ్యవహారాల కోసం తల వంచమని, ప్రాధేయపడబోమని మెలోని స్పష్టం చేశారు. ట్రంప్ కామెంట్లు తమ ప్రధాని పరువు తీసేలా ఉన్నాయంటూ ఇటలీ ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

కృష్ణలంక CI నాగరాజుపై హత్యానేరం కేసు
Crime· 20 Jun 2026

కృష్ణలంక CI నాగరాజుపై హత్యానేరం కేసు

AP: రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా CI నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక PSలోనే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా (IO) ACP దైవప్రసాద్‌ను, CP రాజశేఖరబాబు నియమించారు. వారు కృష్ణలంకలోని తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. సుమారుగా 2 గంటలపాటు వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు.

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి
TG· 20 Jun 2026

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి

TG: భూసమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్‌, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

100 మంది అంబేడ్కర్లు రావాలి: CM రేవంత్‌ రెడ్డి
Politics· 20 Jun 2026

100 మంది అంబేడ్కర్లు రావాలి: CM రేవంత్‌ రెడ్డి

TG: ఆనాడు ఒక్క అంబేడ్కర్‌ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేడ్కర్లు రావాలని, ఆ శక్తి మీలో ఉందని విద్యార్థులకు CM రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న 27.50 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్‌’ పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కిట్ల పంపిణీని హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

ఊబకాయులకు గుడ్ న్యూస్ ఈ జ్యూస్ !
Health· 20 Jun 2026

ఊబకాయులకు గుడ్ న్యూస్ ఈ జ్యూస్ !

శరీరంలో వాపులు తగ్గడానికి టమాటో, సోయాబీన్ దివ్యౌ షధంగా పనిచేస్తాయని రిసెర్చ్ లు చెబుతున్నాయి. టమాటో, సోయాబీన్ జ్యూస్ ని నెల్లాళ్లపాటు తాగిన వారిని పరిశీలించినప్పుడు ఈ మార్పు బయటపడింది.టమాటోలో ఉండే లైకోపీన్ ఇందుకు కారణమని గుర్తించారు. అలాగే సోయాబీన్స్ లోని ఐసో ఫ్లేవన్స్ కూడా ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని ఒహయో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ న్యూస్ షేర్ చేశారు. సో వాపులున్నవారు, ఊబకాయులు కూడా ఈ జ్యూస్ తాగితే మంచిది.

యోగా డే ఏర్పాట్లపై బాబా రాం దేవ్ తో చంద్రబాబు భేటీ▶
AP· 19 Jun 2026

యోగా డే ఏర్పాట్లపై బాబా రాం దేవ్ తో చంద్రబాబు భేటీ

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యోగా గురువు బాబా రామ్‌దేవ్ , పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన బాబా రామ్‌దేవ్, బాలకృష్ణన్ సీఎం ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వారితో యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి చర్చించారు.