Latest

టీనేజ్ స్పెషల్  సాస్  స్టీక్ చిమిచురి-పది నిమిషాల్లో రెడీ
Health· 13 Jun 2026

టీనేజ్ స్పెషల్ సాస్ స్టీక్ చిమిచురి-పది నిమిషాల్లో రెడీ

స్టీక్ చిమిచురి డిష్‌ ఎప్పుడైనా తిన్నారా? ఇది కేవలం 15 నిమిషాల్లో పూర్తయి పోయే సింపుల్ రెసిపీ. కాలమిస్ట్ సమర్ హల్దన్కర్ 16 ఏళ్ల కుమార్తె ఈ సాస్ ను క్షణాల్లో రెడీ చేసేసిందట. అసలు కిచెన్ అంటే పడని ఆ అమ్మాయి తన తండ్రి, చెఫ్ రాసిన వంటల కాలమ్స్ చదువుతూ ఇన్ స్టా గ్రామ్ చూస్తూ ఆడుతూ పాడుతూ ఈ రెసిపీ అద్భుతంగా రెడీ చేసింది.ఫస్ట్ టైమ్ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఎక్స్ పెరిమెంట్ చేసినా అది పెర్‌ ఫెక్ట్ గా రావడంతో ఇన్ స్టాలో ఆమె రీల్ వైరల్ అవుతోంది.

యమ్మీ యమ్మీ  రుచుల కలబోత ఈ కొత్త కాన్సెప్ట్
India· 13 Jun 2026

యమ్మీ యమ్మీ రుచుల కలబోత ఈ కొత్త కాన్సెప్ట్

ప్రస్తుతం మన దేశంలో చెఫ్ ఇన్ రెసిడెన్స్ అనేఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఫేమస్ షెఫ్‌లు తమ సొంత కిచెన్స్ వదిలి, ఇతర నగరాల్లోని పాపులర్ రెస్టారెంట్లతో కొలాబరేట్ అవుతున్నారు. అక్కడ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటూ, తమ ప్రత్యేకమైన వంటకాలతో కస్టమర్లకు సరికొత్త డైనింగ్ అనుభూతిని ఇస్తున్నారు. ఇది కేవలం ఫుడ్ బిజినెస్‌ను పెంచడానికే కాకుండా, భిన్నమైన సంస్కృతులు, వంటకాలపై విస్తృతమైన చర్చ, కల్చరల్ బాండేజ్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతోంది.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు!
Politics· 13 Jun 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు!

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై ₹500 పెరగడంతో 10 గ్రాముల రేటు ఏకంగా ₹1,49,080 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ₹1,36,650 గా ఉంది. ఇక కేజీ వెండిపై ₹5000 పెరగడంతో రేటు ఏకంగా ₹2,70,000 కి చేరింది. ఈ ఊహించని రేట్ల పెరుగుదల చూసి బంగారం కొనాలనుకునే వాళ్లు షాక్‌లో ఉన్నారు.

పిల్లలకి ఆస్తులు ఇవ్వను: ఎలాన్ మస్క్
Politics· 13 Jun 2026

పిల్లలకి ఆస్తులు ఇవ్వను: ఎలాన్ మస్క్

స్పేస్‌ఎక్స్ ఐపీఓతో ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, తన తర్వాత కంపెనీల బాధ్యతలను నేరుగా పిల్లలకు ఇచ్చేది లేదని ఆయన క్లియర్ గా చెప్పారు. కేవలం ఫ్యామిలీ రిలేషన్స్ చూసి ఆస్తులు, లీడర్‌షిప్ అప్పగించడాన్ని తాను సపోర్ట్ చేయనన్నారు. పిల్లలకి ఇంట్రెస్ట్, టాలెంట్ లేనప్పుడు బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ కాదని, కేవలం సామర్థ్యం ఉన్నవారికే తన కంపెనీలను అప్పగిస్తానని మస్క్ స్పష్టం చేశారు.

స్కూల్‌లో బెంచ్‌లు కడిగిన బండి సంజయ్!▶
Politics· 13 Jun 2026

స్కూల్‌లో బెంచ్‌లు కడిగిన బండి సంజయ్!

తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక స్టెప్ తీసుకున్నారు. సిరిసిల్ల టౌన్‌లోని కుసుమ రామయ్య స్కూల్‌ను విజిట్ చేసిన ఆయన, స్వయంగా నీళ్లతో క్లాస్ రూమ్ బెంచ్‌లను కడిగి క్లీన్ చేశారు. స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలకి మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పని చేశారట. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా బండి సంజయ్ ఇలా నార్మల్‌గా బెంచ్‌లు కడగడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రెస్టారెంట్లలో కొత్త ట్రెండ్!
Business· 13 Jun 2026

రెస్టారెంట్లలో కొత్త ట్రెండ్!

ఫుడ్ వరల్డ్‌లో ఇప్పుడు 'షెఫ్ ఇన్ రెసిడెన్స్' అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఉండే టాప్ షెఫ్‌లు తమ కిచెన్స్ వదిలేసి, వేరే ఊళ్లలోని రెస్టారెంట్లకు వెళ్లి కొన్ని రోజులు గెస్ట్ షెఫ్‌లుగా వండుతున్నారు. బెంగళూరు, ముంబై, బ్యాంకాక్ లాంటి సిటీస్ లోని షెఫ్‌లు ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లి సరికొత్త టేస్ట్స్‌తో లోకల్ ఫుడ్ లవర్స్‌కి క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నారు. ఈ సరికొత్త ఫుడ్ కొల్లాబరేషన్స్ ఇంటర్నెట్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు స్పాట్‌డెడ్
Crime· 13 Jun 2026

కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు స్పాట్‌డెడ్

TG: హైదరాబాద్‌లోని అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి టెలికాంకాలనీలో సందీప్‌‌ కారుపై ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది. శనివారం ఉదయం కారుపై పడ్డ చెట్టుకొమ్మలను తొలగించేందుకు సందీప్‌ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. కొమ్మలను లాగుతుండగా పచ్చికొమ్మలు పక్కనే ఉన్న హైవోల్టేజ్ కరెంట్ వైర్లు తగిలాయి. చెట్టుకొమ్మల ద్వారా విద్యుత్ ప్రసారమవ్వడంతో తండ్రీకూతురు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిని కాపాడేందుకు సందీప్‌ భార్య శ్వేత ప్రయత్నించగా, ఆమె కూడా షాక్‌కు గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

రూ.20 కోసం గొడవ.. ఒకరు మృతి
Crime· 13 Jun 2026

రూ.20 కోసం గొడవ.. ఒకరు మృతి

AP: అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో శేఖర్ అనే వ్యక్తి కూరగాయ దుకాణం నిర్వహిస్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు శేఖర్ వద్ద కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. బిల్లు రూ.120 కాగా, యువకులు రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 తిరిగిచ్చాడు. ఇంకా రూ.20 ఇవ్వాలని యువకులు అడగటంతో వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్‌పై యువకులు దాడిచేశారు. గొడవపెద్దిది కావడంతో పక్కనున్న ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర(55) జోక్యం చేసుకుని గొడవ ఆపాలని సర్దిచెప్పాడు. మద్యంమత్తులో ఉన్న యువకులు అతడిపై దాడిచేశారు. చంద్ర కుప్పకూలి మరణించాడు.

సక్సెస్ అంటే ఏంటి?
Motivational· 13 Jun 2026

సక్సెస్ అంటే ఏంటి?

చాలామంది అంబిషన్ అంటే కేవలం పెద్ద జాబ్, మనీ సంపాదించడమే అనుకుంటారు. కానీ అంబిషన్ అంటే కేవలం కెరీర్ మాత్రమే కాదని, ఒక మంచి పేరెంట్‌గా ఉండటం, లైఫ్‌ని ప్రశాంతంగా లీడ్ చేయడం కూడా ఒక అంబిషనే. మన లైఫ్‌లో తీరని కొన్ని అవసరాలే మనల్ని ముందుకు నడిపించే పెద్ద ఆశయాలుగా మారుతాయి. సక్సెస్, హ్యాపీనెస్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి, కేవలం కెరీర్ పరంగానే ఒకరిని జడ్జ్ చేయకూడదు. రియల్ సక్సెస్ అంటే ఏంటి మీ ఒపీనియన్ కింద కామెంట్ చెయ్యండి.

NIMS లో బాలికపై లైంగికదాడికి యత్నం
Crime· 13 Jun 2026

NIMS లో బాలికపై లైంగికదాడికి యత్నం

TG: హైదరాబాద్‌లోని NIMS ఆస్పత్రి ప్రాంగణంలో ఓ బాలికపై లైంగికదాడి యత్నించిన ఘటన కలకలం రేపింది. పంజాగుట్ట నిమ్స్‌ హాస్పిటల్ ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణం జరుగుతుంది. అదే సైటులో ఓ కుటుంబం నిర్మాణ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి బాలికను వారు ఉంటున్న గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు శంభు బండారిగా పోలీసులు గుర్తించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

దేవుడి కోసం వింత పూజ!▶
Viral· 13 Jun 2026

దేవుడి కోసం వింత పూజ!

మహాదేవుడిని చూడాలనే నమ్మకంతో దౌలత్ జీరి జీ మహారాజ్ అనే వ్యక్తి చదువు ఆపేసి, అస్సలు కూర్చోకుండా కేవలం నిలబడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. నిద్రపోయేటప్పుడు కూడా తాడు సాయంతో నిలబడే ఉంటాడట. ఇలా ఐదేళ్లుగా ఉండటం వల్ల కాళ్లకు బ్లడ్ పూల్ అయిపోయి, అవి చెట్టు కాండంలా లావుగా వాచిపోయాయి. హెల్త్ కండిషన్ చాలా డేంజర్‌గా ఉన్నా. తను అనుకున్న 12 ఏళ్ల టార్గెట్ పూర్తి చేయడమే లక్ష్యంగా ఇప్పుడూ అలాగే నిలబడి ఉన్నాడట. వాలంటీర్లు వాటిని క్లీన్ చేస్తూ మందులు రాస్తున్నారు. అయినా సరే ఆయన ఇప్పటివరకు ఆ దేవుణ్ణి చూడలేకపోయారని ఇంటర్నెట్‌లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

ఇంటి పనులు చేస్తూ గంటకు ₹250 సంపాదన!▶
Politics· 13 Jun 2026

ఇంటి పనులు చేస్తూ గంటకు ₹250 సంపాదన!

చెన్నైకి చెందిన ఒక 25 ఏళ్ల హౌస్‌వైఫ్ ఇంటి పనులు చేస్తూనే గంటకు ₹250 సంపాదిస్తోంది. ఆమె తలకు మొబైల్ కట్టుకుని కాఫీ పెట్టడం, బట్టలు మడతపెట్టడం లాంటి పనులను వీడియో తీసి AI కంపెనీలకి పంపిస్తోంది. ఫ్యూచర్‌లో వచ్చే రోబోలకి పనులు నేర్పించడానికి ఈ వీడియోలు యూజ్ అవుతాయి. ఇండియాలో ఇప్పుడు వేలాది మంది ఇలా డైలీ పనులను రికార్డ్ చేస్తూ, ఈ సరికొత్త ఆన్‌లైన్ పార్ట్ టైమ్ జాబ్స్‌తో మనీ సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియా 2-మినిట్ వంటలు నిజమేనా?
News· 13 Jun 2026

సోషల్ మీడియా 2-మినిట్ వంటలు నిజమేనా?

సోషల్ మీడియా రీల్స్‌లో వచ్చే '2 మినిట్స్ క్విక్ రెసిపీస్' చూసి చాలామంది వంట చేయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ రియల్ లైఫ్‌లో ఆ హ్యాక్స్ అస్సలు వర్కవుట్ అవ్వవని ఈ ఆర్టికల్ చెప్తోంది. వీడియోల్లో కేవలం కలపడం మాత్రమే చూపిస్తారు కానీ, వెనకాల జరిగే కూరగాయలు కోయడం, క్లీన్ చేయడం లాంటి అసలు కష్టాన్ని దాచేస్తారు. అందుకే ఈ క్విక్ వంటలు కేవలం వ్యూస్ కోసమే తప్ప, ప్రాక్టికల్‌గా అస్సలు కుదరవని వంట ప్రియులు ఇంటర్నెట్‌లో డిస్కస్ చేస్తున్నారు.

CPI నారాయణ: ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి దానం!
Motivational· 13 Jun 2026

CPI నారాయణ: ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి దానం!

సీపీఐ లీడర్ నారాయణ, ఆయన వైఫ్ ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తమ లైఫ్ టైమ్ సంపాదన, ఆస్తి మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వృద్ధుల సంక్షేమం, వాళ్ల అవసరాల కోసమే ఈ మనీ యూజ్ అవ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. నేటి రాజకీయాల్లో ఇలాంటి నిరాడంబర జీవితం చాలా రేర్ అంటూ పొలిటికల్ పార్టీలకు అతీతంగా అందరూ నారాయణ దంపతులను మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ కపుల్‌కి ‘లాల్ సలాం’ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.

వర్షం అంటే ఇష్టమా?
Motivational· 13 Jun 2026

వర్షం అంటే ఇష్టమా?

వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో. ఇండియన్ మాన్సూన్ అందాలను గుర్తుచేస్తూ స్టీఫెన్ ఆల్టర్ ‘ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రైన్’ అనే ఒక చిన్న బుక్ రాశారు. కేరళ, గోవా, ఉత్తరాఖండ్ అడవుల్లో వర్షం పడేటప్పుడు ఉండే వైబ్స్, ఆ మట్టి వాసన ఎంత బాగుంటాయో ఈ బుక్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొబైల్‌లో రీల్స్ స్క్రోల్ చేయడం ఆపేసి, వర్షంలో ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ బుక్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

కోర్టులోనే విడాకుల పేపర్లు చింపేసిన భార్య!▶
Motivational· 13 Jun 2026

కోర్టులోనే విడాకుల పేపర్లు చింపేసిన భార్య!

విడాకుల కోసం కోర్టుకెళ్లిన ఒక భార్యాభర్తలు మళ్లీ కలిసిపోయిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గొడవల వల్ల విడిపోవాలనుకున్న ఆ కపుల్‌లో. వైఫ్ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హస్బండ్ సపోర్ట్ గా నిలబడ్డాడట. అందుకని మనసు మారిన భార్య, కోర్టు విచారణలో అందరూ చూస్తుండగానే విడాకుల పేపర్లు చింపేసి భర్తను గట్టిగా హగ్ చేసుకుంది. రిలేషన్స్‌లో ఎన్ని గొడవలు ఉన్నా. ఇలాంటి కష్టసమయాల్లో చూపించే ప్రేమే మళ్లీ ఒకటి చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

థియేటర్‌లో సినిమా చూస్తూ ఫోన్ వాడుతున్నారా?
Cinema· 13 Jun 2026

థియేటర్‌లో సినిమా చూస్తూ ఫోన్ వాడుతున్నారా?

ఈ రోజుల్లో థియేటర్లలో సినిమా చూస్తూ చాలామంది ఫోన్లు వాడటం, రీల్స్ స్క్రోల్ చేయడం, పక్కన వాళ్లతో ముచ్చట్లు పెట్టడం పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. దీనివల్ల పక్కన ఉండే ఆడియన్స్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మిస్ అవుతున్నారంటూ మేకర్స్, మూవీ లవర్స్ ఫైర్ అవుతున్నారు. కొంతమంది డైరెక్టర్స్ అయితే, థియేటర్లలో ఫోన్ సిగ్నల్స్ రాకుండా జామర్లు పెట్టాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్తున్నారు. థియేటర్లో కొంచెం పక్కన వాళ్ళని కూడా మైండ్‌లో పెట్టుకోండి అంటూ ఇంటర్నెట్‌లో ఈ టాపిక్ ఫుల్ వైరల్ అవుతోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
News· 13 Jun 2026

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

TG: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుంచి శంషాబాద్ వస్తోన్న ప్రముఖ లుఫ్తాన్స అనే విమానానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ఏ క్షణం అయినా ల్యాండ్ అయ్యేలోపు పేలిపోతుంది అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో భత్రతా సిబ్బంది, అధికారులు అలెర్ట్ అయ్యారు.

మీనాక్షి నటరాజన్ కేసు.. పిటిషన్‌ను నిరాకరించిన నాంపల్లి కోర్ట్
Legal· 13 Jun 2026

మీనాక్షి నటరాజన్ కేసు.. పిటిషన్‌ను నిరాకరించిన నాంపల్లి కోర్ట్

TG: హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రీటర్న్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపడం తమ పరిధిలోకి రాదని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రతినిధుల పేర్లు ఉండడంతో దీనిని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసుకోవాలని శ్రీలతకు న్యాయస్థానం సూచించింది.

వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం
Crime· 13 Jun 2026

వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం

TG: హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని హయగ్రీవ హాస్పిటల్‌లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్‌తో పాటు తుక్కుగూడ శ్రీసాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. వనస్థలిపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు మహిళా పోలీసును డికాయ్‌గా హయగ్రీవ హాస్పిటల్‌కు పంపారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. PCPNDT చట్టం ప్రకారం గర్భంలోని శిశువు లింగాన్ని తెలియజేయడం నేరం.

పదవీ విరమణ వయసు పెంపుపై హైకోర్టు కీలక తీర్పు
TG· 13 Jun 2026

పదవీ విరమణ వయసు పెంపుపై హైకోర్టు కీలక తీర్పు

TG:యూనివర్సిటీల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రిటైర్మెంట్ వయసు నిర్ణయించడం లేదా పెంచడం అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, చట్ట పరిధిని దాటి ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఉన్నత విద్యామండలి పరిధిలోని యూనివర్సిటీల ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయసును 60 నుంచి 65ఏళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం జారీ చేసిన GO 3ని తమకూ వర్తింపజేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు ఈ తీర్పునిచ్చింది.