Latest

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!▶
AP· 9 Jun 2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

మినిస్టర్ నారా లోకేష్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రమాదానికి రెస్పాన్సిబిలిటీగా స్టీల్ ప్లాంట్ CMDని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చనిపోయిన కార్మికుల ఫ్యామిలీస్‌కి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలంటూ లోకేష్‌ను నిలదీశారు. కార్మిక సంఘాల నినాదాలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ ముట్టడి.. TRS నాయకుల అరెస్ట్
Politics· 9 Jun 2026

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ ముట్టడి.. TRS నాయకుల అరెస్ట్

TG: ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి వచ్చిన TRS నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్‌మెంట్!
AP· 9 Jun 2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్‌మెంట్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ భారీ సాయం ప్రకటించారు. చనిపోయిన వారి ఫ్యామిలీస్‌కి రూ.25 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు, చనిపోయిన వారి ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇస్తామని.. రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్లు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చని పవన్ హామీ ఇచ్చారు.

బాబోయ్.. వాటర్ ట్యాంకులో పాముల కుప్ప▶
Viral· 9 Jun 2026

బాబోయ్.. వాటర్ ట్యాంకులో పాముల కుప్ప

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్‌లోకి నీళ్లు వెళ్లడం లేదు. యజమానులు అండర్‌గ్రౌండ్‌లోని ట్యాంక్ మూత తీసి చూశారు. షాక్..! ఏకంగా 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం అటవీ శాఖ సిబ్బందిని పిలిచింది. వాళ్లు వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి అడవిలో వదిలేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్!▶
AP· 9 Jun 2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీరియస్‌గా గాయపడిన బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కిమ్స్ హాస్పిటల్‌లో విజిట్ చేశారు. బాధితులను, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ని కలిసి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వాళ్ల హెల్త్ కండిషన్ మరియు హాస్పిటల్‌లో ఇస్తున్న ట్రీట్‌మెంట్ డీటెయిల్స్‌పై డాక్టర్లతో మాట్లాడారు. మెడికల్ ట్రీట్‌మెంట్ ఖర్చంతా గవర్నమెంటే చూసుకుంటుందని, అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ఈ విజిట్‌లో మినిస్టర్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా పవన్ వెంటే ఉన్నారు.

రూ.110 కోసం దారుణ హత్య
Crime· 9 Jun 2026

రూ.110 కోసం దారుణ హత్య

TG: హైదరాబాద్ లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జైప్రకాష్‌ దేశ్‌ముఖ్‌ హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేస్తాడు. మోండామార్కెట్‌ ప్రాంతంలో జైప్రకాశ్‌ దేశ్‌ముఖ్‌కు తుకారాంగేట్‌కు చెందిన దాబీ వినోద్‌, అడ్డగుట్టకు చెందిన మక్కల మోహన్‌ పరిచయమయ్యారు. జైప్రకాష్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బు, ఫోన్‌ దోచుకునే ప్రయత్నంలో జైప్రకాష్ ప్రతిఘటించడంతో రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, ఫోన్‌ దోచుకుని పరారయ్యారు.

"చేతిపై పవనిజం పేరు కాలిపోయింది.." వైజాగ్ బాధితులు ఫైర్!▶
AP· 9 Jun 2026

"చేతిపై పవనిజం పేరు కాలిపోయింది.." వైజాగ్ బాధితులు ఫైర్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల ఫ్యామిలీస్ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. "ఎలక్షన్స్ ముందు వచ్చి 'నేనున్నా' అంటూ భరోసా ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎక్కడికి పోయారు?" అంటూ కన్నీళ్లతో నిలదీస్తున్నారు. "చేతిపై 'పవనిజం' అని రాసుకున్న పేరు కూడా కాలిపోయింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద పబ్లిక్ కూడా పవన్‌ను క్వశ్చన్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: హాస్పిటల్‌లో బాధితుడి ఎమోషనల్ వర్డ్స్!▶
AP· 9 Jun 2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం: హాస్పిటల్‌లో బాధితుడి ఎమోషనల్ వర్డ్స్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన ఒక కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్‌గా ఉంది. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, అతను తన వాళ్లకు చెప్పిన మాటలు అందరినీ కలిచివేస్తున్నాయి. "తమ్ముడిని బాగా చదివించు.. నువ్వు కూడా బాగా చదువుకో.. అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకో" అంటూ ఆ బాధితుడు ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

విశాఖ ఉక్కు ప్రమాదం.. భయానక వాస్తవాలు
AP· 9 Jun 2026

విశాఖ ఉక్కు ప్రమాదం.. భయానక వాస్తవాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి కారణం ఉక్కు ద్రవం లీకు కావడం. ద్రవ ఉక్కు ఉష్ణోగ్రత ఎంత ప్రమాదమో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ప్రమాద సమయంలో సుమారు 150టన్నుల ద్రవఉక్కు 1,540 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతతో లాడిల్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఉష్ణోగ్రత సాధారణ అగ్ని ప్రమాదాలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ. మనిషి చర్మం 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకే తీవ్రగాయాలకు గురవుతుంది. 100 డిగ్రీల వద్ద నీరు మరిగిపోతుంది. కానీ ఉక్కు కరిగే స్థాయి 1,500 డిగ్రీలకుపైగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో శరీరంపై పడితే బతికే అవకాశం ఉండదు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై లోకేష్ ఫైర్!▶
News· 9 Jun 2026

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై లోకేష్ ఫైర్!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు నిలదీశారు. దీంతో అక్కడ కాసేపు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. లీడర్ల ప్రవర్తనపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఎందుకు అరుస్తున్నారు? నేను ఇక్కడ చనిపోయిన వారి ఫ్యామిలీస్‌తో మాట్లాడుతున్నాను. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా" అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

అత్యాచారం.. పోక్సో కేసు నమోదైనా చర్యల్లేవు..?
Crime· 9 Jun 2026

అత్యాచారం.. పోక్సో కేసు నమోదైనా చర్యల్లేవు..?

TG: ఖమ్మం పట్టణంలో 12ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసిన కామాంధుడు భవనం పైనుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను హాస్పిటల్‌కు తరలించారు. బాలిక కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్‌లో ఉంటున్న వ్యక్తే లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఈ నెల 6వ తేదీనే జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ
Crime· 9 Jun 2026

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలే ఆభరణాలతో పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబాయి వెళ్లి తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో తమకు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడం, మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: KA పాల్
AP· 9 Jun 2026

ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: KA పాల్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ డిమాండ్ చేశారు. CM చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కుమార స్వామి తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. రూ. 10వేల కోట్ల నష్టాలతో స్టీల్ ప్లాంట్ నడుస్తోందని, నిధులు లేకనే భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

డెడ్‌బాడీలను గుర్తించడానికి నాలుగురోజులు
AP· 9 Jun 2026

డెడ్‌బాడీలను గుర్తించడానికి నాలుగురోజులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. నిన్న రాత్రి నుంచి కేజీహెచ్‌లోనే డెడ్‌బాడీలను భద్రపరచగా.. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలను మాత్రమే వారి కుటుంబసభ్యులు గుర్తించారు. భానుకుమార్, రమణ డెడ్‌బాడీలను కుటుంబసభ్యులు గుర్తించగా.. మిగతా వారు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారని కేజీహెచ్ డాక్టర్లు తెలిపారు. కుటుంబసభ్యులు పోలీసుల సమక్షంలో తమవారిని గుర్తుపడితే డీఎన్ఏ టెస్టులు చేస్తామని, ఆ రిపోర్టులు వచ్చేందుకు మరో నాలుగురోజుల సమయం పడుతుందని తెలిపారు.

అవును ఇది రోడ్డే.. కంకర వేసి రోడ్డు మరిచారు
Local· 9 Jun 2026

అవును ఇది రోడ్డే.. కంకర వేసి రోడ్డు మరిచారు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తోడేళ్లగడ్డ గ్రామంలో కంకర వేసి రోడ్డు వేయడం మరిచారు. గతంలో ఉన్న మట్టి రోడ్డుపైనే కేవలం కంకర పరిచి అధికారులు చేతులు దులుపుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి బీటీ రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో చిన్నపాటి వర్షానికే కంకర కొట్టుకుపోయి రోడ్డు గుంతలు, బురదమయంగా మారుతోంది. ఈ గుంతల రోడ్డుపై అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు విలేజ్‌లోకి రాలేని దుస్థితి ఏర్పడింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
AP· 9 Jun 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం గురించి పూర్తి సమాచారం ప్రజలకు, సంబంధిత సంస్థలకు చేరవేసేందుకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తన కార్యాలయంలో 24x7 కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. గాయపడిన వారికి సంబంధించిన వివరాల కోసం కంట్రోల్‌రూమ్ ఫోన్ నెంబరు 08912590100, 08912590102కి కాల్ చెయ్యవచ్చు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
AP· 9 Jun 2026

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఫైర్ యాక్సిడెంట్‌లో 9మంది మృతి చెందగా, మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి పదిలక్షల చొప్పున అందిస్తామని స్పష్టంచేశారు.

లవ్‌మ్యారేజ్.. జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
TG· 8 Jun 2026

లవ్‌మ్యారేజ్.. జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ

TG : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన నవీన్ ఓ యువతిని గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ECIL ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులపెద్దల అనుమతి లేకుండా చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా సంఘానికి చెల్లించాలని సంఘం పెద్దలు తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించనందుకు తమను కుల బహిష్కరణ చేశారని నవీన్ తల్లిదండ్రులు డొంకెన్ మంజుల, నర్సింలు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ
Crime· 8 Jun 2026

దొరికిన కాడికి దోచి.. చెరువులో చేపలు లూటీ

TG: మృగశిర కార్తె సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండా వాసులు పెద్దఎత్తున కురవి పెద్దచెరువు వద్దకు తరలివచ్చారు. చెరువులో చేపల వేటకు దిగారు. భారీగా వలలు, గాలాలు వేసి చేపలను పట్టుకున్నారు. వలలు లేని వారు.. చీరలు, లుంగీలలో దొరికిన కాడికి చేపలను దోచుకున్నారు. విషయం సొసైటీ సభ్యులకు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. చెరువు వద్ద ఉంచిన 60బైక్‌లను, వలలు సీజ్ చేసి 14మందిని అరెస్ట్ చేశారు.

గుడ్‌న్యూస్..  ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ కోర్సులు
Education· 8 Jun 2026

గుడ్‌న్యూస్.. ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ కోర్సులు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఐటిడిఏ పరిధిలో ST యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులకు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ITDA అధికారులు తెలిపారు. కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, సోలార్ పంప్ టెక్నీషియన్, గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ వంటి కోర్సులను అందించనున్నారు. మూడనెలల పాటు నిర్వహించే ఈ కోర్సులు పూర్తిగా ఉచితంగా ఉండటమే కాకుండా హాస్టల్, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తిచేసిన ఎస్టీ అభ్యర్థులు అర్హులు.

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ
Crime· 8 Jun 2026

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన పిల్లలు.. చివరికీ

TG: మల్కాజిగిరి PS పరిధి మౌలాలి RTC కాలనీకి చెందిన మారుతి సుతార్ రైల్వేఉద్యోగి. అతని పెన్షన్ బెనిఫిట్స్‌పై కన్నేసిన భార్య గంగాభాయి, కొడుకు కిషన్ సుతార్, కూతురు ప్రాపుల్లా మర్డర్‌కు ప్లాన్ చేశారు. మారుతి సుతార్‌కు విషాన్ని అన్నంలో కలిపి పెట్టడంతో మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని మాయం చేసేందుకు ముక్కలు ముక్కలుగా చేసి బకెట్‌లో వేస్తుండగా తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో కోర్టు కిషన్ సుతార్(47), ప్రాపుల్లా(36)లకు ఉరిశిక్ష, గంగాభాయి(65)కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.