పవన్ పై కేసులు పెట్టమని వైఎస్ అన్నారన్నది నిజం కాదు ః కేవీపీ

వైఎస్ పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రెస్పాండ్ అయ్యారు. వైఎస్ కు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ ఎన్నడూ పవన్ పై కేసులు పెట్టలేదని అన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కేవీపీ అన్నారు. అధికారి చెప్పింది నిజమైతే టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా ఎన్జీఓ కు రూ. 10 కోట్లు ఇస్తానని కేవీపీ సవాల్ విసిరారు. వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయినా ఇంకా ఆయనపై అర్ధం లేని ఆరోపణలు చేయడం అవివేకమని కేవీపీ అన్నారు. ఈమేరకు పవన్ కు కేవీపీ లెటర్ రాశారు.


