← Back to news

జూన్-ఆగస్ట్‌ మధ్య ఎల్ నినో ఎంట్రీ.. WMO అలర్ట్

By aravinda nyayapati· 3 Jun 2026
జూన్-ఆగస్ట్‌ మధ్య ఎల్ నినో ఎంట్రీ.. WMO అలర్ట్

ఎండల వేడికి ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని వెయిట్ చేస్తున్న వారికి ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గట్టి షాకిచ్చింది. ఫసిఫిక్ మహా సముద్రంలో జూన్-ఆగస్టు మధ్య ఎల్‌నినో ఏర్పడే అవకాశం 80% ఉందని తాజాగా స్పష్టం చేసింది. దాని ప్రభావం నవంబర్ వరకు కొనసాగే అవకాశం 90%కు పైగా ఉందని WMO తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గడం, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే IMD ఈ ఏడాది వర్షం అంచనాను 90%కు తగ్గించింది. దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.

More in General