Latest

ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను ట్రేస్ చేసేందుకు ట్రంప్ కొత్త ఐడియా...
అమెరికా వైట్‌హౌస్ "Aliens.gov" పేరుతో ఒక వినూత్నమైన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మొదటిచూపులో ఇది గ్రహాంతరవాసుల (Aliens) గురించిన సీక్రె అది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల (illegal immigrants) గురించిన వెబ్‌సైట్. స్పేస్ థీమ్‌తో, విచిత్రమైన గ్రీన్ కలర్ టెక్స్ట్‌తో డిజైన్ చేసిన ఈ సైట్‌లో అక్రమ వలసదారుల అరెస్ట్‌లను ట్రాక్ చేసే మ్యాప్ కూడా ఉంది. "వారు మన మధ్యే తిరుగుతున్నారు, కానీ ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు" అంటూ రాసుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఈ "ఇన్వేషన్" గురించి నిజాలు ధైర్యంగా చెబుతున్నారని వెబ్‌సైట్ పేర్కొంది.
హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్స్‌కి జాబ్స్!
హైడ్రాలో జాబ్స్ రావడంతో 16 మంది ట్రాన్స్‌జెండర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్లంతా "హైడ్రా ఈగల్ టీమ్" పేరుతో స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు. అమీన్‌పూర్, మాదాపూర్‌లలో గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ ప్రొటెక్ట్ చేయడంలో వీళ్లు కీ రోల్ ప్లే చేస్తున్నారు. సొసైటీలో రెస్పెక్ట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చాయని.. బెగ్గింగ్ వదిలేసి ఎంతో రెస్పాన్సిబిలిటీగా డ్యూటీ చేస్తున్నామని ప్రౌడ్‌గా చెప్పారు.

అరెస్ట్ భయం.. ఇండియా వదిలి పారిపోతున్న బంగ్లాదేశీయులు!
పశ్చిమ బెంగాల్‌లో కొత్త గవర్నమెంట్ రావడంతో అరెస్ట్ భయంతో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు వెనక్కి వెళ్తున్నారు. వారు ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యారో కొందరు మీడియాకు చెప్పారు. ఏజెంట్లకు ₹7 వేల నుండి ₹20 వేల వరకు ఇచ్చి, చీకట్లో నదులు దాటి సరిహద్దులు దాటామని చెప్పారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ హెల్ప్ తో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకుని, ఇక్కడి స్కీమ్స్ ద్వారా మనీ కూడా పొంది ఓట్లు వేసినట్లు ఒప్పుకున్నారు.

హైకోర్టులకు సుప్రీం స్ట్రిక్ట్ ఆర్డర్స్.. జడ్జిమెంట్స్ ఇక ఫాస్ట్!
హైకోర్టుల్లో జడ్జిమెంట్లు లేట్ అవ్వడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసు హియరింగ్ పూర్తయ్యాక 3మంత్స్ లోపే ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఒకవేళ జడ్జీలు ఈ టైమ్ ఫాలో అవ్వకపోతే, ఆ కేసును వేరే బెంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆర్డర్ వేసింది. ఇక బెయిల్ వస్తే నెక్స్ట్ డే నే ఖైదీలను రిలీజ్ చేయాలి. మెయిన్ జడ్జిమెంట్ కాపీని 7 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం కంపల్సరీ అని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

పిడుగుపాటుకు దూడలు మృతి
TG: జోగులాంబగద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో పిడుగుపాటుకు రెండు దూడలు మృతి చెందాయి. ఫ్రైడే మార్నింగ్ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి సద్దలోనిపల్లి విలేజ్‌లో పిడుగు పడడంతో రైతు బంట్రోతు కుశలన్నకు చెందిన రెండు కోడె దూడలు మృతి చెందాయి. రెండు దూడల విలువ రూ. 1.50,000 ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

కహూతా ప్లాన్ అంటే ఏంటి? ఇందిర ఎందుకు వద్దన్నారు?
భారత్ 1974లో అణు పరీక్ష ("స్మైలింగ్ బుద్ధ") చేసిన తర్వాత, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో "మేము గడ్డి తిని అయినా సరే అణుబాంబు తయారుచేస్తాం" అని ప్రతిజ్ఞ చేశారు. 1980ల నాటికి పాకిస్తాన్ శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ ఆధ్వర్యంలో కహుతాలో న్యూక్లియర్ బాంబ్ తయారీకి దగ్గరగా వచ్చేసింది. దీనిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్, భారత్ కలిసి ఒక ప్లాన్ వేశాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలువచ్చి, అక్కడ ఫ్కుయల్ నింపుకుని రాడార్లకు చిక్కకుండా కహుతా అణు కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేయడం ఈ ప్లాన్. అయితే పాక్ ఎదురు దాడికి భయపడి లాస్ట్ మినిట్ లో ఇందిరాగాంధీ వద్దన్నారు.

డీకే కి కర్ణాటక సీఎం పదవిపై అస్ట్రాలజర్ ఏం చె్ప్పాడంటే...
కర్ణాటక సీఎం పీఠం డి.కె. శివకుమార్‌కి అంత ఈజీగా రాలేదు. సొంత పార్టీలోనే వ్యతిరేకులు, సిద్దరామయ్య కనపడని రాజకీయాలు, పార్టీ పరంగా తలెత్తిన సవాళ్లు, ఒక్కోసారి కుదరని సయోధ్య... ఇలా సీఎం కాలేనేమోనని ఆయన చాలాసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేశారని ఆయన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ చెప్పారు. తాను ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి గైడెన్స్ ఇచ్చానని, శివకుమార్ పోరాట పటిమ వల్లే ఇప్పుడు అనుకున్నది జరిగిందని అన్నారు. ముళ్ల బాట లాంటి ఈ పదవిని జాగ్రత్తగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తూ నిర్వహించాలని ఆయనకు సూచించారు.

కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి
AP: కరెంట్ షాక్‌తో ఓ చిన్నారి చనిపోయింది. విజయవాడ జక్కంపూడి వైఎస్సాఆర్ కాలనీకి చెందిన ఏసుబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె మాధవి (5) కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటుంది. అక్కడే ఓపెన్ చేసి ఉన్న కరెంట్ మీటర్ బాక్స్‌లను పట్టుకోవడంతో కరెంట్ షాక్‌తో బాలిక చనిపోయింది. గమనించిన స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

డికే శివకుమార్ కు కర్ణాటక సీఎం పోస్ట్ వెనక అంత జరిగిందా?
కర్ణాటక సీఎం పీఠం డి.కె. శివకుమార్ కి దక్కడం అంత ఈజీగా అవలేదు. సొంత పార్టీలో అంతర్గత శత్రువులు, సిద్ద రామయ్య ఎత్తుకి పై ఎత్తులు వేసే నైజం...ఒక దాని తర్వాత ఒకటిగా తలెత్తిన సవాళ్లు అన్నింటినీ అధిగమించి ఇప్పుడు సీఎం పీఠం డీకే ఎక్కబోతున్నారు. సీఎం కాలేనేమోనని ఆయన చాలాసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేశారని ఆయన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ చెప్పారు. తాను ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి గైడెన్స్ ఇచ్చానని, శివకుమార్ పోరాట పటిమ వల్లే ఇప్పుడు అనుకున్నది జరిగిందని అన్నారు. ముళ్ల బాట లాంటి ఈ పదవిని జాగ్రత్తగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తూ నిర్వహించాలని ఆయనకు సూచించారు.

ఉపాధి పనుల్లో వింత ఘటన.. బయటపడ్డ సాఫ్ట్‌వేర్ లోపం
TG: ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించాడు. ఉపాధి పనులకు వెళ్లిన శ్రీనివాస్ ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో ఫోటో తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోటో తీసుకోలేదు. చివరికి గడ్డం, మీసాలను పోలినట్లు నల్లని బొగ్గు కలర్ వేసుకున్నాడు. తలపై ఓ మహిళ జుట్టును వేసుకోగా ఫేస్ రికగ్నేషన్ యాప్ వెంటనే ఫోటో తీసుకుంది. హమ్మయ్య అంటూ శ్రీనివాస్ ఉపాధి పనుల్లో పాల్గొన్నాడు.

నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్‌డెడ్
TG: నేషనల్ హైవేపై జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు బొలెరో వాహనంలో ప్రయాణిస్తుండగా, వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మల్లపల్లి వద్ద అతివేగంగా వచ్చిన లారీ బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

భారత మామిడిపై జపాన్ నిషేధం .. ఎందుకంటే
భారత మామిడిపండ్ల దిగుమతిని జపాన్ నిలిపివేసింది. 20 ఏళ్ల తర్వాత ఆల్ఫోన్సో, కేసర్, లాంగ్రా, బంగినపల్లి వంటి ఇండియన్ మామిడిపండ్ల దిగుమతులను జపాన్ స్టాప్ చేసింది. ఇటీవల భారత్ నుంచి వెళ్లిన మామిడి షిప్‌మెంట్లలో ప్రమాదకరమైన ఫ్రూట్ ఫ్లైస్ అంటే పళ్లపై ఉండే క్రిమి కీటకాలు ఉన్నట్లు అక్కడి ఆహార భద్రతా అధికారులు గుర్తించడమే దీనికి కారణం. క్వాలిటీ విషయంలో జపాన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. ఏప్రిల్-జూన్ పీక్ సీజన్‌లో ఈ బ్యాన్ రావడంతో భారత్ ఎగుమతిదారులకు భారీ నష్టం తప్పేలా లేదు.
వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో శరవేగంగా కంచె నిర్మాణం
దేశ రక్షణకు కీలకమైన WB సరిహద్దుల్లోని 600 Acrను BSFకు ఇవ్వాలని నిర్ణయించిన అక్కడి GOVT 142.79 ఎకరాలను అప్పగించింది. ఈ భూముల్లో BSF కంచె నిర్మాణ పనుల్ని చేపట్టింది. కూచ్ బీహార్, జల్పాయ్ గురి, డార్జిలింగ్, ఉత్తర&దక్షిణ దినాజ్పుర్, మాల్దా, ముషీరాబాద్, నాడియా, 24 పరగణాలలో పనులు కొనసాగిస్తోంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అధిగమిస్తూ BSF, CRPF పనులు కొనసాగిస్తున్నాయి.

బస్‌స్టేషన్‌లో చోరీ.. 24 అవర్స్‌లో రికవరీ
TG: మెదక్ జిల్లా రామాయంపేట బస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీస్‌లు 24 అవర్స్‌లో ఛేదించారు. కర్ణాటక స్టేట్‌కు చెందిన ఇద్దరు మహిళ నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేత కాలే, శిల్పా వేలును రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట సీఐ సైదా నాయక్ తెలిపారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన SI బాలరాజు, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

ఎవరూ ఆవులను బలి ఇవ్వొద్దు: ముస్లిం లీడర్స్
TG: జాతీయ పక్షి నెమలి మాదిరిగానే ఆవును కూడా నేషనల్ యానిమల్‌గా ప్రకటించాలని చేగుంటలోని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. గురువారం బక్రీద్ ఫెస్టివల్ సందర్భంగా చేగుంట టౌన్‌లోని ఈద్గాలో ముస్లిం సోదరులు శాంతియుత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!
పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పర్సన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దేశంలో పెట్రోల్ రేషన్ విధించాలని ఆయన కోరారు. పేద, మధ్య తరగతి వాళ్లకు ఒక రేటు, ధనవంతులకు మరొక రేటుతో పెట్రోల్ అమ్మాలని చెప్పారు. ముఖ్యంగా ఆడి లాంటి లగ్జరీ కార్లలో వచ్చేవాళ్లకు ఎక్కువ రేటుకు, చిన్న కారు లేదా బైకుల మీద వచ్చేవారికి తక్కువ రేటుకే పెట్రోల్ ఇవ్వాలంటూ ఆయన చేసిన ఈ ప్రపోజల్ అందరినీ ఆలోచింప చేస్తుంది.
దంచికొట్టిన వాన.. ఉక్కపోత నుండి ఢిల్లీవాసులకు భారీ ఊరట!
తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వాన పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్, గురుగ్రామ్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ ముందే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

నేషనల్ పాలిటిక్స్ కి పోను. స్టేట్ లోనే ఉంటా- సిద్ద రామయ్య !!
నేషనల్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. స్టేట్ లోనే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటానంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. డి.కె శివకుమార్ ను ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు సీఎంగా నియమించడంతో సిద్దు తప్పుకున్నారు. అయితే రాజ్య సభ సీట్ రాహుల్ ఆఫర్ చేయగా తనకు నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని స్మూత్ గా రిజెక్ట్ చేశారు. కానీ సిద్దరామయ్య ఏజ్ ను, ఆయన పాలన తీరు కూడా పెద్ద ఎఫెక్టివ్ గా లేదనే ఉద్దేశం కూడా కాంగ్రెస్ హై కమాండ్ కు ఉంది. అందుకే ఆయన్ను తప్పించారు. స్టేట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటాననడం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జర్నలిస్టుల క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోయిన జనసేన లీడర్స్!
తెలంగాణ సీనియర్ జర్నలిస్టుల, యాక్టివిస్టులపై జనసేన లీడర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో తెలంగాణ జర్నలిస్టులు ఆ పార్టీ లీడర్ ను చుట్టుముట్టి గట్టిగా క్వశ్చన్ చేశారు. వారు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక, ఆ పార్టీ లీడర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన videos ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బాంబేలో సల్మాన్, ఇక్కడ చరణ్.. నాకు ఇద్దరూ భాయ్ లే !!
సినిమా కోసం బాడీని మార్చడమంటే మామూలు విషయం కాదు అంటున్నారు సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.'సుల్తాన్', 'దంగల్' చిత్రాల్లో సల్మాన్, అమీర్ ఖాన్‌లను రెజ్లర్స్‌గా మార్చిన సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.. ఇప్పుడు రామ్ చరణ్‌ను అప్కమింగ్ మూవీ 'పెద్ది' కోసం ఒక రేంజ్ 'క్రాస్ఓవర్ అథ్లెట్'గా రెడీ చేస్తున్నారు. "చరణ్ చాలా డిసిప్లిన్డ్. తెల్లవారుజామున 4 గంటలకే నన్ను నిద్ర లేపుతాడు" అని రాకేష్ చెప్పారు. అంతేకాదు, "బాంబేలో నాకు సల్మాన్ భాయ్ ఎలాగో.. సౌత్‌లో చరణ్ నాకు అలా 'భాయ్'తో సమానం" అంటూ వాళ్ల బాండింగ్‌ని షేర్ చేసుకున్నారు.
KTR పేరులో NTR పేరు ఉంది. దాన్ని మారుస్తారా?
ప్రెస్ క్లబ్ లో సాగర్ అనే ఆక్టర్ మాట్లాడుతూ KTR పేరులోనే తారక రామారావు ఉందని, మరి ఆ పేరును కూడా మారుస్తారా అని క్వశ్చన్ చేశారు. NTR విగ్రహాలు పెడుతున్నారంటూ కొందరు గొడవలు చేస్తున్నారని.. కానీ BRS టైమ్‌లో ఇన్ని విగ్రహాలు పెడుతుంటే అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అడిగారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ కోసం మీరు పోరాడే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని యూత్‌కి గైడ్ అనుకుంటున్నారు కానీ, ఇంత లో లెవెల్‌కి దిగజారుతారని అస్సలు అనుకోలేదు, అంటూ సాగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.